పదేళ్లలో గాలికొదిలేసిన పనులు చేస్తున్నా
● గతంలో వేములవాడను పట్టించుకోలేదు ● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పదేళ్లుగా గాలికి వదిలేసిన పనులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో ముందుకు తీసుకెళ్తూ.. వేములవాడను వెన్నెలవాడగా మార్చేందుకు కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 1 నుంచి 28వ వార్డు వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వేములవాడలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కౌన్సిలర్లను తమ పార్టీకి ఇస్తే వేములవాడను టెంపుల్‌సిటీగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే సీఎం రేవంత్‌రెడ్డితో కొట్లాడి నిధులు తీసుకొస్తానన్నారు. వారు గెలిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది మీరు ఆలోచించాలని కోరారు. పదేళ్లు అధికా రంలో ఉండి మూలవాగు బ్రిడ్జి కూడా కట్టలేదన్నా రు. రాజన్నగుడిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే మురుగుకాలువలో వేసినట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


