సుస్థిరం.. రామగుండం
రామగుండం: శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా.. రామగుండం ప్రాంతంలో పర్యటించారని, ఆయన అడుగుజాడలతో జలఊటలు ఏర్పడ్డాయని, అవే రామునిగుండాలు కావడంతో దీనికి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ముడిసరుకుల లభ్యతతో విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మారింది. విద్యుత్ రంగంలో దేశవ్యాప్త ఖ్యాతి గడిచింది. భిన్నవర్గాల ఓటర్ల సమ్మేళనంగానూ అవతరించింది. రామగుండంలో ఒకే రైల్వేస్టేషన్ ఉన్నా.. గోదావరిఖనిలో పోలీస్ కమిషరేట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. వాటిపేరు రామగుండంపైనే ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం రామగుండం అంటేనే గుర్తింపు లభిస్తుంది.
మద్యం పట్టివేత
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని భావనరుషినగర్‌లో రామగిరి దిలీప్ అక్రమంగా రూ.4,537 విలువ గల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. అతడి నుంచి మద్యం సీసాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.


