మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తరు
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్‌పార్టీకే ఓటు వేయాలని మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరుకాపు భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగతో కలిసి మాట్లాడారు. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయత్వాన్ని బలపర్చాలని రామకృష్ణ కోరారు. సామాజిక న్యాయం, దళిత వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు అందే భవాని, కవ్వంపల్లి రవి, కూడెల్లి ప్రవీణ్ కుమార్, సప్పి పోశయ్య, ఎలుకంటి జనార్దన్, బొడ్డు రాములు, కృష్ణపెల్లి రాజలింగం, జంగాపల్లి రాజనర్సు, చిలుక రాజేశ్, తాటిపల్లి బాబు, గాలి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.


