లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
● ఆరుగురు ప్రయాణికులు, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
● బోల్తా పడ్డ యూరియా లారీ
పగిలిన ఆర్టీసీ బస్సు అద్దాలు
బోల్తా పడ్డ యూరియా లారీ
శంకరపట్నం: తాడికల్ గ్రామంలో శనివారం యూరియా లారీ, ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొంది. ప్రయాణికులు, స్థానికుల వివరాల ప్రకారం.. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్‌తో వస్తున్న లారీ వెనుక హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు 70 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తోంది. తాడికల్‌కు చేరుకున్న క్రమంలో యూరియా లారీని ఇసుక లారీ ఢీకొట్టిడంతో యూరియా లారీ బోల్తా పడింది. యూరియా లారీ వెనకాల వస్తున్న హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సును సైతం ఇసుక లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యూరియా లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారమందించారు. ఆలస్యం కావడంతో ఆటోలో కొందరిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని 108 వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరించారు.
తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ


