కాంగ్రెస్‌ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

Feb 6 2026 7:32 AM | Updated on Feb 6 2026 7:32 AM

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

బల్దియాలను కైవసం చేసుకోవాలి

మున్సిపాలిటీలకు నిధులిచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే

గుమ్లాపూర్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

సభతో హస్తంలో నూతనోత్తేజం

తరలివచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/చొప్పదండి:

రీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్‌ప్లాంట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది.

పట్టం కట్టి.. పనులు చేయించుకోండి

అనంతరం వేదిక మీదకు వచ్చిన సీఎం రేవంత్‌ బీజేపీ–బీఆర్‌ఎస్‌ల బంధంపై నిప్పులు చెరిగా రు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778కోట్లు ఇచ్చామన్నా రు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్‌ కార్పొరేషన్‌కు రూ.1,489కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్‌ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ పట్టణంలోని యావర్‌ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. రోడ్డు విస్తరించి, యంగ్‌ ఇండియా స్కూల్‌ ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడు తూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనల్ని చూసి కేంద్రం కూడా కులగణనకు తలవంచిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని కోరారు. కరీంనగర్‌లోని కేబుల్‌ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్‌ ఫ్రంట్‌, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు.

● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోర డం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

● మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో 8 సీట్లలో గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టా లని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజలకు మధ్యకు వస్తోందన్నారు.

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడు తూ.. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు.

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మా ట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చొ ప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. రూ.240కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్‌ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాలకు నిధులతోపాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు టీటీడీ రూ.35కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కోరారు. విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, విజ యరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement