జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్స్
సిరిసిల్ల: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన 7వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి బి.బేలా గోల్డ్‌మెడల్‌తో పాటు మరో రెండు పతకాలు సాధించారు. అజ్మీర్‌లో ఫిబ్రవరి 2న జరిగిన పోటీల్లో బేలా ఐదు కిలోమీటర్ల నడక పోటీలో గోల్డ్ మెడల్, 500 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్, వెయ్యి మీటర్ల పరుగుపందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. 40–44 ఏళ్ల గ్రూప్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. స్పోర్ట్స్ డ్రెస్‌ను బహుమతిగా అందించారు. బేలాను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి బొడ్డు నారాయణ, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ అభినందించారు.


