చెట్టుకు ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ వ్యాన్
మల్లాపూర్: మండలంలోని ఒబులాపూర్ శివారు ఎల్లమ్మ ఆలయ సమీపంలో మెట్‌పల్లి నుంచి విద్యార్థులతో వస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ చెట్టును ఢీకొంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో ఘటన చోటుచేసుకుంది. వ్యాన్ స్వల్పంగా ధ్వంసమైంది. ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. సాయంత్రం స్కూల్ ముగిశాక విద్యార్థులతో ఇళ్లకు బయలుదేరిన వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో బస్సు ముందు వరుసలో కూర్చున్న రెండో తరగతి విద్యార్థి గడ్డం అనీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని అంబులెన్స్‌లో మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.


