అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. సిరిసిల్ల మున్సి పల్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం తని ఖీ చేశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్ప టి నుంచి ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. రూ.26.70 లక్షల నగదు, 85.695 లీట ర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. 127 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.
సిరిసిల్లక్రైం: ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అధికంగా సొమ్ము తీసుకెళ్తున్న వారిపై పోలీ సుల నిఘా తీవ్రమైంది. దీనిలో భాగంగా గు రువారం జిల్లాలో పోలీసులు చేపట్టిన తని ఖీల్లో రూ.4లక్షల నగదు పట్టుబడింది. సిద్దిపే ట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన పురుమడ్ల వెంకట్‌రెడ్డి తన కారులో వస్తున్నా డు. ఈక్రమంలో సిరిసిల్ల శివారులోని మానేరు బ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీ లు చేపట్టారు. తనిఖీల్లో ఎస్‌ఎస్‌ఈ టీమ్ ఇన్‌చార్జి శ్రీకాంత్ పంచుల సమక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. గురువారం ఎల్‌ఎండీకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా 150 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరులో నీటిమట్టం 24.755 టీఎంసీలకు చేరింది.
గంభీరావుపేట(సిరిసిల్ల): వేసవి సమీపిస్తుండడంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి షర్ఫొద్దీన్ సూచించారు. గంభీరావుపేట మండల పరిషత్‌లో గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటికొరత ఉన్న గ్రామాలను, కాలనీలను గుర్తించాలన్నారు. ఎంపీడీవో రాజేందర్, అధికారులు సుమలత, రాము, పావని, జయసుధ, ఎంపీవో సుధాకర్, ప్రేమ్‌చందర్, వేణు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీలో ఓటర్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ఎ.ఏ.ఖదీర్‌పాషా తెలిపారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మున్సిపల్ ఆఫీస్‌లో ఓటర్ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు పట్టణంలోని లాడ్జీలు, సత్రాల ధరలు పెంచొద్దని ము న్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ ప్రకటనలో కోరారు. లాడ్జ్ ధరలు పెంచి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహాశివరాత్రికి రూ.1.96 కోట్లతో పనులు
వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు రూ.1.96కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఈవో రమాదేవి గురువారం తెలిపారు. ఉప ఆలయాలు, ఆర్చిగేట్లకు రంగులు, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, తాత్కాలిక క్యూలైన్లు, స్నానాల కోసం షవర్లు, పార్కింగ్ ఏరియాలో టాయిలెట్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అద్దె ప్రాతిపదిక నీటిట్యాంకర్లు, ఇనుప బారీకేడ్లు, భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు, సీసీ కెమెరాల బిగింపు, మినీబస్సుల అలంకరణ, నాంపల్లి ఆలయం వద్ద తాత్కాలిక లైట్లు తదితర పనులు చేయనున్నట్లు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి


