సమన్వయం అవసరం | - | Sakshi
Sakshi News home page

సమన్వయం అవసరం

Feb 6 2026 7:32 AM | Updated on Feb 6 2026 7:32 AM

సమన్వ

సమన్వయం అవసరం

సమన్వయం అవసరం ప్లాస్టిక్‌ను నిషేధించాలి మురికినీరు పాతబస్టాండ్‌కు వస్తుంది అభివృద్ధిలో ముందుంచాలి

రోడ్ల వెంట చెట్ల విషయంలో సెస్‌, మున్సిపల్‌ అధికారుల్లో సమన్వయం లోపించింది. చెట్లు పెరిగి విద్యుత్‌ తీగలను తాకుతున్నాయి. వాటిని ముట్టుకుంటే షాక్‌ వస్తుందని తొలగిస్తే.. అధికారులు ఇబ్బందులు పెడుతుండ్రు. ఇరు శాఖల అఽధికారులు చెట్లు విషయంలో బాధ్యతగా ఉండాలి.

– కముటాల రాఘవేందర్‌

పట్టణంలో ప్లాస్టిక్‌ నిషేధం నూరుశాతం కొనసాగించాలి. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వస్తువులు వాడి డ్రైనేజీల్లో పడేస్తున్నారు. దీంతో డ్రైనేజీల్లో నీరు ప్రవాహం లేక మురుగు రోడ్లపై పారుతుంది. శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. పట్టణంలో గ్రీనరీని పెంచాలి. కొత్త పాలకవర్గం నిజాయితీ తో అభివృద్ధి చేపట్టాలి. – గుండెల్లి రవీందర్‌

సిరిసిల్లలోని ప్రధాన డ్రైనేనీ నీరు పాతబస్టాండు ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడి ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంతో వర్షాకాలంలో కాలనీలు, వ్యాపారం సంస్థలు మునిగిపోతున్నాయి. పట్టణం మొత్తంగా అన్ని వార్డుల్లో నూరుశాతం వసతులు కల్పించాలి. ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. – నంగునూరి శ్రీకాంత్‌

పట్టణం అభివృద్ధి పథంలో ముందుండాలంటే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవాలి. ఒక్క రోజు జరిగే లబ్ధికి చూసుకోవద్దు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండే వారినే ఎన్నుకోవాలి. మంచినీటి సరఫరాలో సమస్య తీర్చాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. – గెంట్యాల గోపి

సమన్వయం  అవసరం
1
1/3

సమన్వయం అవసరం

సమన్వయం  అవసరం
2
2/3

సమన్వయం అవసరం

సమన్వయం  అవసరం
3
3/3

సమన్వయం అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement