భీమన్న సేవలో కాశీవిశ్వనాథ మందిర్ అర్చకులు
వేములవాడ: వేములవాడ భీమేశ్వరస్వామిని మంగళవారం కాశీవిశ్వనాథ మందిర్ ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ జోషి దర్శించుకున్నారు. వేములవాడకు చేరుకున్న ఆయనకు విప్ ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలపై వేధింపుల నియంత్రణ కమిటీలు
సిరిసిల్ల: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నియంత్రణ చట్టం–2013ను పక్కాగా అమలు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం కోరారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తోపాటు భారీ జరిమానా విధిస్తామన్నారు. మహిళలను ముట్టుకోవడం, అనవసరంగా తాకాలనుకోవడం, శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరడం, ఆశించడం లైంగికపరమైన మాటలు మాట్లాడటం, లైంగిక సంబంధ చిత్రాలు చూపించడం ఈ చట్టం కింద నేరాలుగా పరిగణించబడి క్రిమినల్ చర్యలతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తారని హెచ్చరించారు. మహిళలు పని చేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి సమాచారం ఇవ్వాలన్నారు. కమిటీ వెంటనే విచారణ చేపట్టి, బాధితులకు కావాల్సిన సహకారం అందిస్తుందన్నారు.
రైతులు జాగ్రత్తగా ఉండాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాక పరిసర ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సూచించారు. మంగళవారం గ్రామస్తులతో మాట్లాడారు. రేపాక పక్కనున్న కోహెడ, బస్వాపూర్ గుట్టల ప్రాంతాల్లో పులి సంచారం ఉందని, రైతులు రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లవద్దని, పశువులను ఇళ్ల వద్దే కట్టేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలో టాంటాం వేయించి ప్రజలందరికీ పులి సంచారం తెలిసేలా చేయాలన్నారు. ఫారెస్ట్ అధికారులు శ్రావణ్‌కుమార్, సిబ్బంది, సర్పంచ్ కథ మల్లేశం పాల్గొన్నారు.
భీమన్న సేవలో కాశీవిశ్వనాథ మందిర్ అర్చకులు
భీమన్న సేవలో కాశీవిశ్వనాథ మందిర్ అర్చకులు


