మర్తనపేటలో గొర్రైపె చిరుత దాడి | - | Sakshi
Sakshi News home page

మర్తనపేటలో గొర్రైపె చిరుత దాడి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

మర్తనపేటలో గొర్రైపె చిరుత దాడి

మర్తనపేటలో గొర్రైపె చిరుత దాడి

కోనరావుపేట/చందుర్తి(వేములవాడ): మండలంలోని మర్తనపేటలో చిరుతదాడి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం మేకను చంపిన ఘటన మరువకముందే మళ్లీ దాడి చేయడంతో గొర్లకాపరులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఏశ కనకయ్య, ఎగుర్ల రమేశ్‌ తమ గొర్లను తీసుకుని చింతగుండుచెరువు ప్రాంతంలోని మేతకు వెళ్లారు. చిరుతపులి దాడి చేసి రెండు మేకలను ఎత్తుకెళ్లింది.

వరుసదాడులతో భయం

మర్తనపేటలో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడి చేయడంతో గొర్లకాపరులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం మరిమడ్లలో ఓ పందిపై దాడి చేసింది. అంతకుముందు శివంగాలపల్లి, వట్టిమల్ల గ్రామాల్లో దాడిచేసిన సంఘటనలు ఉన్నాయి. చిరుతపులి వరుస దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ చూపి చిరుత బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

దేవుని తండా శివారులో మేకలపై చిరుత దాడి

చందుర్తి మండలం దేవునితండా శివారులోని అటవీ ప్రాంతంలో మేకలపై చిరుత బుధవారం దాడి చేసింది. నూనవత్‌ గోపాల్‌కు చెందిన మేకలపై చిరుత దాడి చేసింది. ఒక మేకను తినగా, మరో రెండు మేకలను గాయపర్చిందని గోపాల్‌ వాపోయాడు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తండావాసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement