● బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తం
సిరిసిల్ల క్రైం: పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, అదే సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసి, ఒకరిపై ఒకరు దాడులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


