కమలం పైచేయి | - | Sakshi
Sakshi News home page

కమలం పైచేయి

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

కమలం

కమలం పైచేయి

క్యాంప్‌నకు వెళ్లిన బీజేపీ అభ్యర్థులు

న్యూస్‌రీల్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మిశ్రమ ఫలితం 9 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ జోరు రాయికల్‌, మెట్‌పల్లి, కరీంనగర్‌లో కాషాయం హవా సిరిసిల్ల, జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌ సత్తా మూడు చోట్ల హంగ్‌, ఆధిపత్య పార్టీలకే అవకాశం జగిత్యాలలో స్వతంత్రుల విజయం ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ పెద్దపల్లిలో నాలుగు పురపాలికలు హస్తగతం

క్యాంప్‌నకు వెళ్లిన బీజేపీ అభ్యర్థులు
వేములవాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో 28 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 8 సీట్లు కై వసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లారు.
కార్పొరేషన్‌లో
మున్సిపాలిటీల్లో

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పట్టణాల ఓటర్లు వైవిధ్య తీర్పునిచ్చారు. బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీకి అధిక స్థానాలు కట్టబెట్టి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను రెండు చోట్ల ముందంజలో నిలబెట్టారు. మూడు చోట్ల బీజేపీకి అధికస్థానాలు అప్పగించి అనూహ్య ఫలితాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉండగా.. 9 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీలు, కరీంనగర్‌ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ కాంగ్రెస్‌ వశమైంది. ధర్మపురి మున్సిపాలిటీని హస్తం క్లీన్‌స్వీప్‌ చేసింది. జగిత్యాలలో స్వతంత్రులు అధికస్థానాలు గెలిచి జోరుమీదున్నారు.

● 66 డివిజన్లు ఉన్న స్మార్ట్‌సిటీ కరీంనగర్‌లో 30స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్‌ పీఠం బీజేపీ వశమవడం నల్లేరు మీద నడకలా ఉంది. దీనికితోడు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం మూడు ఎక్స్‌ అఫిషియో ఓట్లు వీరికి తోడుగా ఉన్నాయి. ఇప్పటికే పదిమంది వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని కేంద్ర సహాయమంత్రి సంజయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

● చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులకు కాంగ్రెస్‌ 10స్థానాలు కై వసం చేసుకుంది. 30 వార్డులున్న హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 16 స్థానాలతో కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. జమ్మికుంటలో 30 సీట్లకు 12 స్థానాలు బీఆర్‌ఎస్‌, 10 సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. బీజేపీ నలుగురు, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్‌ఎస్‌కి ఆధిక్యమున్నా.. చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠగానే ఉంది. బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో గులాబీ పార్టీ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.

● 60 డివిజన్లు ఉన్న రామగుండం కార్పొరేషన్‌లో 38 స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీఆర్‌ఎస్‌ 13, బీజేపీ 01 స్థానంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా మొత్తంలో మంథని, సుల్తానాబాద్‌, పెద్దపల్లి మున్సిపాలిటీలను కూడా ఇదే తరహాలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

● రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 స్థానాలకు 27 సీట్లు గెలుచుకుని బీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 06, బీజేపీ 05 స్థానాల్లో తరువాతి స్థానాల్లో నిలిచాయి. వేములవాడలో 28 సీట్లకు 13 స్థానాల్లో హస్తం విజయకేతనం ఎగరేసింది. ఇక్కడ బీజేపీ 08 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 5, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు.

జగిత్యాలలో స్వతంత్రుల హవా

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలకు గాను 23 కాంగ్రెస్‌ గెలుచుకుంది. 23 మందిలో ఏడుగురు జీవన్‌రెడ్డి వర్గీయులు కాగా, 16 మంది సంజయ్‌ వర్గీయులు. 15 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. మొత్తం మీద 18 చోట్ల సంజయ్‌ వర్గీయులు, 17 చోట్ల జీవన్‌రెడ్డి వర్గీయలు గెలుపొందారు. వీరి మధ్య సయోధ్యకు చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ 06, బీఆర్‌ఎస్‌ 04, ఎంఐఎం 02 సీట్ల చొప్పున అభ్యర్థులు గెలిచారు. 33 స్థానాలున్న కోరుట్లలో కాంగ్రెస్‌ 18 సీట్లు సాధించి మున్సిపాలిటీని వశపరరచుకుంది. 26 స్థానాలున్న మెట్‌పల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలతో బీజేపీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. 12 స్థానాలున్న రాయికల్‌లో 5 చోట్ల బీజేపీ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఽ15 స్థానాలు ధర్మపురిలో 15 స్థానాలు కాంగ్రెస్‌ కై వసం చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది.

హంగ్‌ అయినా ఆధిపత్య పార్టీలకే

మెట్‌పల్లి, రాయికల్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 26 స్థానాలున్న మెట్‌పల్లిలో 03 సీట్లతో కాంగ్రెస్‌ మూడోస్థానంలో నిలవగా.. 12 సీట్లున్న రాయికల్‌లో బీఆర్‌ఎస్‌తో సమానంగా 03 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. ఈ రెండుచోట్ల బీజేపీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక 30 సీట్లున్న జమ్మికుంటలో 12 బీఆర్‌ఎస్‌ గెలచుకుంది. 10 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో ప్లేసులో నిలిచింది. నలుగురు స్వతంత్రులు, నలుగురు బీజేపీ అభ్యర్థులు కీలకమయ్యారు. ఇక్కడా బీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సిరిసిల్ల : 39

బీఆర్‌ఎస్‌ : 27

కాంగ్రెస్‌ : 06

బీజేపీ : 05

స్వతంత్రులు : 01

వేములవాడ : 28

కాంగ్రెస్‌ : 13

బీజేపీ : 08

బీఆర్‌ఎస్‌ : 05

స్వతంత్రులు : 02

కమలం పైచేయి1
1/5

కమలం పైచేయి

కమలం పైచేయి2
2/5

కమలం పైచేయి

కమలం పైచేయి3
3/5

కమలం పైచేయి

కమలం పైచేయి4
4/5

కమలం పైచేయి

కమలం పైచేయి5
5/5

కమలం పైచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement