స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల, వేములవాడలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల సందర్శన
సిరిసిల్ల/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ కోరారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడలోని పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఎస్‌ఈసీ నిబంధనలకు మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించామని తెలిపారు.
మొబైల్‌కు అనుమతి లేదు
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ నెల 13న సిరిసిల్ల, వేములవాడ సినారే కళామందిర్‌లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్‌కుమార్, తహసీల్దార్లు మహేశ్‌కుమార్, జయంత్‌కుమార్, నోడల్ అధికారులు జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసాచారి, భారతి, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు.


