కార్మికులే కీలకం!
వేములవాడలో బీడీ కార్మికులు
ఓటర్లు ఇలా..
ఓటర్లు కార్మికులు కార్మికులు
● నేత, బీడీకార్మికుల చుట్టూ నేతల ప్రదక్షిణలు ● గెలుపోటముల నిర్ణేతలు వీరే.. ● రెండు మున్సిపాలిటీల్లో ప్రభావం
సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో నేతల గెలుపోటములను నేత, బీడీకార్మికులు శాసించే స్థాయిలో ఉన్నారు. కార్మికక్షేత్రంగా పేరొందిన సిరిసిల్లలో నేతకార్మికులు, బీడీ కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉండగా, ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో బీడీకార్మికులు, బీసీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పురపోరులో బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలను మార్చడంలో కార్మికులు కీలకంగా మారారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు కార్మికుల ఇళ్లకు క్యూ కట్టారు.
సిరిసిల్లలో అన్ని వార్డుల్లోనూ...
సిరిసిల్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోను నేతకార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేయగా.. ఐదు గ్రామాలు మినహా చంద్రంపేట, రాజీవ్‌నగర్‌లోనూ పవర్‌లూమ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పవర్‌లూమ్స్ నడిపే నేతకార్మికులు ఉండడంతో వాళ్ల ఓట్లు కీలకంగా మారాయి. పట్టణంలో మొత్తం ఓటర్లు 81,959 మంది ఉండగా నేతకార్మిక కుటుంబాలవి 36,093 ఓట్లు, బీడీ కార్మికులవి 23,811 ఓట్లు ఉన్నాయి. నేతకార్మికులతోపాటు బీడీ కార్మికులు ప్రభావం చూపనుండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు వారి ఇళ్లకు వెళ్లి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిరిసిల్లలో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ ఉండడంతో ప్రతీసారి ఎన్నికల ఫలితాలను వారే శాసిస్తారు.
కార్మికుల సమస్యలే ఎజెండాగా...
రెండు మున్సిపాలిటీల్లో కీలకమైన కార్మికుల ఓట్ల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా వారి సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేశారు. సిరిసిల్లలో బీడీకార్మిక ఆస్పత్రి ప్రతిపాదనలోనే ఉండగా, వేములవాడ శివారులోని బీడీ కార్మిక ఆస్పత్రి పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతుంది. నేతకార్మికులు ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అద్దె ఇంటి సమస్యలు నేత, బీడీకార్మికులను వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకంపై కార్మికులు కోటి ఆశలు పెట్టుకున్నారు. బీడీ, నేతకార్మికులకు ఆసరా పెన్షన్ వస్తుండగా ఇంకా కొందరికి రావడం లేదు. దీంతో పెన్షన్ల కోసం క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మున్సిపాలిటీలో మొ త్తం 40,877 మంది ఓటర్లు ఉండగా.. బీసీ ఓటర్లు 25,771 మంది, 11,028 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు మున్నూరుకాపు సామాజికవర్గం ఇక్కడ ప్రభావం చూపే శక్తిగా ఉంది.
మున్సిపాలిటీ మొత్తం బీడీ నేత
సిరిసిల్ల 81,959 23,811 36,093
వేములవాడ 40,877 11,028 –
బరిలో ఇలా..
మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు
సిరిసిల్ల 39 170
వేములవాడ 28 113
కార్మికులే కీలకం!
కార్మికులే కీలకం!


