సమస్య తలెత్తకుండా చర్యలు
కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి సరఫరా, సమస్యలపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తాం. తద్వారా లోపాలపై స్పష్టత వస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తాం. సర్వే ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటాం.
– బి.శైలజారాణి, ఎంపీడీవో రామగిరి
తాగునీటి ఇబ్బందులు రానివ్వం
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదే శించాం. మిషన్ భగీరథతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులు ఈనెల ఒకటి నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
సమస్య తలెత్తకుండా చర్యలు


