హోరెత్తిన డిజిటల్‌ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన డిజిటల్‌ ప్రచారం

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

హోరెత్తిన డిజిటల్‌ ప్రచారం

హోరెత్తిన డిజిటల్‌ ప్రచారం

వేములవాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం ఈసారి సోషల్‌మీడియాలో హోరెత్తింది. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ ఆకట్టుకునేలా వీడియోలు చేసి సోషల్‌మీడియాలో వదిలారు. వీరు.. వారు.. అనే తేడా లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారానికి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుకున్నారు. తమ వార్డులో చేయబోయే పనులు తెలుపుతూ యూట్యూబ్‌లో షార్ట్‌ వీడియోలను రిలీజ్‌ చేశారు. మరికొందరు తమ వార్డు పరిధిలోని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ట్రెండింగ్‌ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా వీడియోలు చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ ప్రచార పద్ధతులూ మారుతున్నాయి. నిన్నటి వరకు వీధివీధి ప్రచారం, గోడలపై వాల్‌పోస్టర్లే ప్రధాన ఆయుధాలైతే ఇప్పుడు అభ్యర్థులు మొబైల్‌ స్క్రీన్‌నే ప్రచారవేదికగా మార్చేశారు. వాట్సాప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌ పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మున్సి పల్‌ ఎన్నికలకు డిజిటల్‌ రంగు పులుముకుంది.

వార్డుకో గ్రూపు

ప్రతీ వార్డుకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు, రోజుకో వీడియో, గంటకో పోస్టు ఓటరిని నేరుగా కలవాల న్న ప్రయత్నంలో సోషల్‌మీడియాను వేదికగా చేసుకున్నారు. ‘నా పని చూడండి.. నా మాట వినండి’ అంటూ అభ్యర్థులు స్వయంగా వీడియోల్లో దర్శనమిస్తున్నారు. కొందరైతే కుటుంబసభ్యులతో కలిసి రీల్స్‌ తీస్తూ స్థానిక గ్రూప్‌లలో ప్రచారం చేస్తున్నా రు. ఇక రాజకీయ విమర్శలకు సైతం సోషల్‌మీడియానే వేదికగా నిలుస్తుంది. ఒకప్పుడు సభల్లోనే వినిపించిన హామీలు ఇప్పుడు స్టేటస్‌లుగా మారి ఓటర్ల చేతిలోని మొబైల్‌పోన్లలో కనిపిస్తున్నాయి.

రీల్స్‌లో హామీలు

యువ ఓటర్లే టార్గెట్‌

ట్రెండింగ్‌ సాంగ్స్‌తో ప్రజల్లోకి..

వీడియోలతో విజన్‌ చూపుతుండ్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement