కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం

Feb 10 2026 8:06 AM | Updated on Feb 10 2026 8:06 AM

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ/వేములవాడరూరల్‌: అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో పనులు చేయకుండా పడావుపడ్డ పనులను పట్టాలెక్కించానన్నారు. రాజన్న ఆలయం, పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈనెల 11న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

బైక్‌పై తిరిగి.. డోలు వాయించి

విప్‌ ఆది శ్రీనివాస్‌ పార్టీ నాయకులతో కలిసి గల్లీల్లో బైక్‌పై తిరిగి ప్రచారం చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. విలీన గ్రామం శాత్రాజుపల్లిలో కార్నర్‌ మీటింగ్‌ సందర్భంగా డోలు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement