చోరీ కేసులో నిందితుల అరెస్ట్
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. ఈనెల 7న దొంగలు వరదవెల్లికి చెందిన కొంకటి తిరుపతి ఇంటి తాళం పగులగొట్టి వెండి పూజా వస్తువులు ఎత్తుకెళ్లారు. అనంతరం బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా నిందితుల్లో ఒకరు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కంచు శివశంకర్, సిరిసిల్ల సంజీవయ్యనగర్‌కు చెందిన వ్యక్తి, ప్రస్తుతం వేములవాడ సుభాష్‌నగర్‌లో ఉంటున్న సామల్ల బాలకిషన్‌గా గుర్తించారు. ఇద్దరిని మంగళవారం కొదురుపాక చౌరస్తాలో పట్టుకున్నారు. వారి నుంచి 30 తులాల వెండి ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరలించినట్లు సీఐ వివరించారు. త్వరగా కేసు ఛేదించిన ఎస్సై రమాకాంత్, ప్రింగర్ ప్రింట్ ఎస్సై క్రాంతి, సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేశ్‌ను సీఐ తదితరులు అభినందించారు.


