విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉన్నందున విజయోత్సవాలకు అనుమతి లేదని ఎస్పీ మహేశ్ బీ గీతే స్పష్టం చేశారు. ఐదుగురు కంటే ఎక్కువగా గుమికూడొద్దని, ర్యాలీలు తీయడం, సభలు, బైక్‌ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఫంక్షన్‌హాళ్లలో సమావేశాలు ఏర్పాటు చేయడం నిషేధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేములవాడ: బీజేపీ నిజాయితీతో పని చేస్తుందని.. ఇందుకు ఈరోజు జరిగిన ఘటనే ఉదాహరణ అని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విప్, బీఫామ్‌లు తమకిచ్చినప్పటికీ నిజాయితీతో తిరిగి వాళ్లకు అప్పగించామన్నారు. తాము వాటిని తిరిగి ఇవ్వకుంటే మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక వాయిదా పడేదని పేర్కొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి హైస్కూల్ విద్యార్థులు ఎండ్ర సంజన, పిల్లి అక్షిత రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పావని, పీఈటీ సాన బాబు తెలిపారు. ఈనెల 16 నుంచి 19 వరకు వేములవాడ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి యూత్ వాలీబా ల్ పోటీలలో వీరు పాల్గొంటారని తెలిపారు.
వేములవాడ: మున్సిపల్‌లో సగం సీట్లు కూడా గెలువలేని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన నరాల శేఖర్‌కు వైస్‌చైర్మన్ పదవి ఆశచూపి వారి పార్టీలోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ చైర్మన్, కౌన్సి లర్ రామతీర్థపు మాధవి ఆగ్రహం వ్యక్తం చేశా రు. వేములవాడలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో వైస్‌చైర్మన్ పదవికి ఎవరూ అర్హులే లేనట్లుగా వాళ్లను అవమానించారన్నారు. 10 నుంచి 20 ఓట్ల తేడాతో తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఐదుగురు ఓడిపోయారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ఉన్నతాధికారుల సూచనల మేరకు కరీంనగర్ ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి మంగళవారం నుంచి నీటి విడుదల పెంచనున్నట్లు ఇంజినీరింగ్ అధికా రులు సోమవారం ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా ఎల్‌ఎండీకి 500 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తుండగా.. నేటి నుంచి 2,500 క్యూసెక్కుల వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నా రు. ప్రాజెక్టు దిగువ మానేరునదిలో ఉన్న మో టార్లు తొలగించాలని కోరారు. పోలీసు, రెవె న్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.
పిల్లి అక్షిత
ఎండ్ర సంజన
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు


