పురపాలకం | - | Sakshi
Sakshi News home page

పురపాలకం

Feb 17 2026 7:20 AM | Updated on Feb 17 2026 7:20 AM

పురపా

పురపాలకం

వేములవాడపై కాంగ్రెస్‌ జెండా

సిరిసిల్లలో చైర్‌పర్సన్‌గా రెండోసారి జిందం కళ

వేములవాడలో చైర్మన్‌గా పుల్కం రాజు

ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లు

వేములవాడ

సిరిసిల్ల

కొలువుదీరిన

వేములవాడలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్లు రాజు, శేఖర్‌

సిరిసిల్లలో విజయోత్సవ ర్యాలీలో చైర్‌పర్సన్‌ జిందం కళ, కౌన్సిలర్లు

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు సిరిసిల్ల, వేములవాడల్లో నూతన పాలకవర్గాలు సోమవారం పాలకవర్గాలు కొలువుదీరాయి. కార్మికక్షేత్రంలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక లాంఛనంగానే జరిగింది. వేములవాడలో మ్యాజిక్‌ ఫిగర్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేరుకోకపోవడంతో ఇద్దరు ఇండిపెండెంట్లు, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఒకరు ఆ పార్టీలో చేరడంతో వేములవాడపై కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. సోమవారం జరిగిన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఎక్స్‌ అఫిషియో ఓటు వేశారు. రెండు మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి.

రెండోసారి జిందం కళ

సిరిసిల్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా జిందం కళ రెండోసారి ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా దార్ల సందీప్‌ ఎన్నికయ్యారు. సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌లో 39 స్థానాలు ఉండగా.. 27 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. కౌన్సిలర్లతో సిరిసిల్ల ఆర్డీవో, ఎన్నికల అధికారి సీహెచ్‌.వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశానికి ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. నిర్ణీత సమయం ప్రకారం ఆర్డీవో సీహెచ్‌.వెంకటేశ్వర్లు ఒకటో వార్డు మొదలుకుని 39 వార్డుల వరకు గెలిచిన అభ్యర్థులను వేదికపైకి పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. స్వతంత్ర అభ్యర్థి బొల్గం వైష్ణవి ఒక్కరే ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేయగా, మిగతా వారు తెలుగులో చేశారు.

ఏకగ్రీవమైన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్లు

చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు ఆర్డీవో సీహెచ్‌.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్‌గా జిందం కళ పేరును 25వ వార్డు కౌన్సిలర్‌ బింగి రామాంజనేయులు ప్రతిపాదించగా.. 9వ వార్డు కౌన్సిలర్‌ దొంతినేని కళ్యాణి బలపరిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికై న 27 మందితోపాటు స్వతంత్ర అభ్యర్థి బొల్గం వైష్ణవి చేతులెత్తి మద్దతు తెలపడంతో జిందం కళ ఎన్నికై నట్లు ప్రకటించారు. వైస్‌చైర్మన్‌ స్థానానికి దార్ల సందీప్‌ను 21వ వార్డు కౌన్సిలర్‌ ఎలుక వెంకటేశం ప్రతిపాదించగా.. 27వ వార్డు అభ్యర్థి గెంట్యాల శ్యామల బలపరిచారు. వైస్‌చైర్మన్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి బొల్గం వైష్ణవి మద్దతు తెలపకపోగా బీఆర్‌ఎస్‌కు చెందిన 27 మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు తెలిపారు. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ ఆరుగురు కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్లతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్లకు ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మున్సిపల్‌ ఆఫీస్‌లో ఉండి ప్రమాణ స్వీకారాన్ని పర్యవేక్షించారు.

రెండు రికార్డులు

సిరిసిల్ల మున్సిపల్‌ చరిత్రలో గతంలో లేని విధంగా ఫలితాలు రావడంతో బీఆర్‌ఎస్‌ తరఫున రెండు రికార్డులు నమోదయ్యాయి. వరుసగా మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేసింది. మున్సిపాలిటీ 38 ఏళ్ల చరిత్రలో జిందం కళ రెండోసారి పదవి చేపట్టారు.

అలక..ఆగ్రహం

చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్లుగా జిందం కళ, దార్ల సందీప్‌లను బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేయడంతో సొంత పార్టీ కౌన్సిలర్లు కొందరు అలకబూనారు. చైర్‌పర్సన్‌ పదవి ఆశించి భంగపడిన దార్నం అరుణ కన్నీటి పర్యంతమయ్యారు. వైస్‌చైర్మన్‌గా తన పేరు ఖరారు చేశామని అధిష్టానం చెప్పగా.. సమయానికి తన పేరును తొలగించారంటూ బుర్ర నారాయణగౌడ్‌ మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి, సీఐలు కస్వరాజు కృష్ణ, మొగిలి, ఐదుగురు ఎస్సైల పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లు చేశారు.

వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ మున్సిపల్‌లో 28 వార్డులకు 13 స్థానాలను కాంగ్రెస్‌, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌తో కలుపుకుని 16 మందికి బలం చే కూరగా.. ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఓటుతో 17కు చేరింది. మున్సి పల్‌ చైర్మన్‌గా పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌గా నరాల శేఖర్‌లను ఎన్నుకున్నారు. ఆర్డీవో రాధాభాయి ఆధ్వర్యంలో ముందుగా 28 మంది కౌ న్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, మాజీ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి తమ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలా మద్దతునిస్తారని ప్రశ్నిస్తుండగా ఆమె మైక్‌ను అధికారులు కట్‌ చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ చెందిన నలుగురు కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు.

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు ఆర్డీవో రాధాభాయి నోటిఫికేషన్‌ ఇచ్చారు. 24 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే హాజరుకావడంతో కోరం సరి పోగా.. ఎన్నికను ప్రారంభించారు. చైర్మన్‌ పదవికి పుల్కం రాజు పేరును ఇప్పపూల మమత ప్రతిపాదించగా, తూం మధు బలపరిచారు. బీజేపీ నుంచి కుమ్మరి శంకర్‌ను కొండ్లెపు చిన్నముత్యం ప్రతిపాదించగా, బోనాల సాగరిక బలపరిచారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా.. పుల్కం రాజుకు 17 ఓట్లు, కుమ్మరి శంకర్‌కు 8 ఓట్లు వచ్చాయి. పుల్కం రాజు చైర్మన్‌గా ఎన్నికై నట్లు ఆర్డీవో ప్రకటించారు. వైస్‌చైర్మన్‌ పదవికి నరాల శేఖర్‌ను ఇండిపెండెంట్‌ కౌన్సి లర్‌ కుమ్మరి శిరీష ప్రతిపాదించగా, ఎల్ల శ్రీని వాస్‌ బలపరిచారు. బీజేపీ నుంచి కుమ్మరి శంకర్‌ను కొండ్లెపు చిన్నముత్యం ప్రతిపాదించగా, వంగల శ్రీనివాస్‌ బలపరిచారు. నరాల శేఖర్‌కు 17 ఓట్లు, కుమ్మరి శంకర్‌కు 8 ఓట్లు రావడంతో నరాల శేఖర్‌ ఎన్నికై నట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం చైర్మన్‌గా పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌గా నరాల శేఖర్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్‌ సీల్డ్‌ కవర్‌ బీజేపీ క్యాంపునకు

క్యాంపు నుంచి బయలుదేరి వేములవాడకు చేరుకుంటున్న బీజేపీ కౌన్సిలర్లకు కాంగ్రెస్‌కు చెందిన సీల్డ్‌ కవర్‌ ఇచ్చేశారు. తర్వాత గ్రహించిన ఆ పార్టీ నాయకులు బీజేపీ కౌన్సిలర్లు వస్తున్న వాహనాన్ని వెంబడించి ఆ సీల్డ్‌ కవర్‌ను తిరిగి తీసుకున్నారు. ఈ అంశం కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లలో చర్చనీయాంశమైంది.

పురపాలకం1
1/5

పురపాలకం

పురపాలకం2
2/5

పురపాలకం

పురపాలకం3
3/5

పురపాలకం

పురపాలకం4
4/5

పురపాలకం

పురపాలకం5
5/5

పురపాలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement