మత్తు కోసం ఏవిల్‌ ఇంజెక్షన్లు ! | - | Sakshi
Sakshi News home page

మత్తు కోసం ఏవిల్‌ ఇంజెక్షన్లు !

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

మత్తు కోసం ఏవిల్‌ ఇంజెక్షన్లు !

మత్తు కోసం ఏవిల్‌ ఇంజెక్షన్లు !

మద్యం పట్టివేత

చెట్లపొదల్లో వెలుగుచూసిన సిరంజీలు, ఆంపుల్స్‌

ముస్తాబాద్‌ (సిరిసిల్ల): యువత మత్తు కోసం రోజుకో మార్గాన్ని కనిపెడుతున్నారు. తక్కువ ధరకు లభించే ఇంజెక్షన్లు తీసుకుంటూ మత్తులో జోగుతున్నారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ న్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండల కేంద్రం శివారులో తెర్లుమద్ది, బందనకల్‌ గ్రామాల మధ్య చెట్ల పొదల్లో వాడి పడేసిన సిరంజిలు, ఆంపుల్స్‌ కవర్లు ప్రత్యక్షమయ్యాయి. ఫిజీషియన్‌ సమక్షంలోనే ఇచ్చే ఈ ఇంజెక్షన్లు ఇలా ఆరుబయట, చెట్లపొదల్లో పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మత్తు కోసమే వాడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలోనే మత్తు కోసం దగ్గు మందు తాగేవారు. మత్తు కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సిరిసిల్ల క్రైం: మున్సిపల్‌ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి తరలిస్తున్న మద్యంను సిరిసిల్ల టౌన్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. పట్టణంలోని సుభాష్‌నగర్‌ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేయగా.. రూ.19,008 విలువైన మద్యం, బైక్‌, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దార్నం అరుణ, దార్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున వైన్స్‌, రాచమల్లు రాముపై కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement