కోతులు పోవాలి
మురికి తొలగాలి..
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలో మురికినీటి సమస్య పరిష్కారం కావాలి.. కోతుల బెడద తొలగిపోవాలి.. కుక్కలతో భయం..భయంగా బతుకుతున్నాం.. ఇక ట్రాఫిక్ సమస్య చెప్పలేనిదిగా ఉంది.. చిన్నపాటి వర్షానికి పట్టణాన్ని వరద ముంచెత్తుతోంది.. అంటూ పట్టణ ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సమస్యలపై గురువారం స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో డిబేట్ నిర్వహించింది. పలువురు పట్టణ పౌరులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం ఎత్తారు. సిరిసిల్ల పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి.. ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలపై గొంతు విప్పారు. నిజాయితీ పాలన అందించే నాయకత్వం.. పట్టణాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసే దూరదృష్టి గల నాయకులనే ఎన్నుకుంటామని చెప్పారు. సిరిసిల్ల ప్రజలు చెప్పిన ఎజెండా అంశాలు వారి మాటల్లోనే..
ట్రాఫిక్ సమస్య తీరాలి
నిజాయితీ పాలన రావాలి
ఇది సిరిసిల్ల ప్రజల
ఎజెండా
‘సాక్షి’ డిబేట్‌లో
పట్టణ పౌరులు
కోతులు పోవాలి


