బాగా పని చేశారు
● మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఖాయం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు బాగా పనిచేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సారార్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం 28 వార్డుల అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పట్టణంలో తిరిగిన సమయంలో చాలా సమస్యలు గుర్తించామని, వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి
క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 16 నుంచి 19 వరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సౌజన్యంతో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ఉపాధ్యక్షుడు కోళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అజ్మీర రాందాస్, ఈసీ మెంబర్ మైలారం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ ఉన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్–సిరిసిల్ల ఆర్టీసీ బస్సు నామాపూర్ మీదుగా నడిపే సర్వీస్‌ను గురువారం ప్రారంభించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డికి గ్రామస్తులు చేసిన విజ్ఞప్తితో ఆర్టీసీ అధికారులు స్పందించి, సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ కొమురయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజుకు రైతుల రిలే నిరాహార దీక్ష
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11(ఆర్డీ3 ఎల్‌ఎం6) కాలువ పనులు పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం మూడో రోజుకు చేరాయి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీపేట, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి సహా 12 గ్రామాల రైతులు దీక్షలో పాల్గొన్నారు. 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు.
కోతులను పట్టేందుకు విరాళాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని కోతులను ఊరు దాటించేందుకు ఇంటికి రూ.250 చొప్పున ఇవ్వాలని ఇప్పటికే గ్రామసభలో తీర్మానించారు. ఈమేరకు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మాదిగ సంఘం తరఫున అధ్యక్షుడు ఎల్లయ్య గురువారం రూ.50వేలను సర్పంచ్ ఎలగందుల నర్సింలుకు అందజేశారు. గ్రామానికి చెందిన శ్రీవేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు, రైతు చర్చా మండలి అధ్యక్షుడు గుండం సుధాకర్‌రెడ్డి తమ కులస్తుల తరఫున రూ.50వేలు, యాదవ సంఘం తరఫున
రూ.12,250 నగదును ఆ సంఘం అధ్యక్షుడు బొల్లు భూమయ్య సర్పంచ్‌కు అందించారు.
బాగా పని చేశారు
బాగా పని చేశారు
బాగా పని చేశారు


