నేడు తేలనున్న భవితవ్యం
ఓట్లు సిబ్బంది
● నిఘా నీడలో ఓట్ల లెక్కింపు ● రెండు రౌండ్లలో ఫలితాలు
మున్సిపాలిటీ వార్డులు టేబుళ్లు రౌండ్లు సిరిసిల్ల 39 39 02
వేములవాడ 28 28 02
సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ ముగియగా.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈమేరకు జిల్లా అధి కారులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో సినారె కళామందిరాల్లో ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సాయుధ పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు సాగనుంది.
రెండు రౌండ్లలో లెక్కింపు
రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. సిరిసిల్లలో 39 టేబుళ్లు, వేములవాడలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. సిరిసిల్లలో ఒక్కో వార్డులో సగటున 1500 ఓట్లు ఉండగా.. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. వేములవాడలో సగటున ఒక్కో వార్డులో 1400 ఓట్లు ఉండగా.. ఇక్కడ కూడా రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నాయి. రీకౌంటింగ్ ఉన్న వార్డుల్లో మరో గంట అదనపు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపాలిటీ పోలైన అభ్యర్థులు కౌంటింగ్
సిరిసిల్ల 63,562 174 156
వేములవాడ 31,881 113 101


