లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

Feb 13 2026 5:27 AM | Updated on Feb 13 2026 5:27 AM

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

● కనీస వేతనాలు అమలు చేయాలి ● సిరిసిల్లలో కార్మిక సంఘాల డిమాండ్‌ ● ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

● కనీస వేతనాలు అమలు చేయాలి ● సిరిసిల్లలో కార్మిక సంఘాల డిమాండ్‌ ● ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

సిరిసిల్లటౌన్‌/తంగళ్లపల్లి/గంభీరావుపేట: కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. నాయకులు కడారి రాములు, పోచయ్య, వడ్డెపెల్లి లక్ష్మణ్‌, కోడం రమణ, జువ్వాజి విమల, ఆకుల రాములు, సోమిశెట్టి దశరథం పాల్గొన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దని ఐసీఈయూ అధ్యక్షుడు దినకర్‌, ప్రధాన కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్‌ కోరారు. సిరిసిల్లలోని ఎల్‌ఐసీ ఆఫీస్‌ వద్ద నిరసన తెలిపారు.

కేంద్రానివి కార్మిక వ్యతిరేక విధానాలు

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ తంగళ్లపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తే సహించం

తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ఉపాధిహామీ కార్మి కులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. నాయకుడు గుంటి వేణు మాట్లాడుతూ ఉపాధిహామీలో సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

పంచాయతీ కార్మికుల ధర్నా

తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గంభీరావుపేటలోని పంచాయతీ కార్మికులు మండల పరిషత్‌ ఎదుట ధర్నా చేపటి, వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement