ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్‌లోనే..
రామగుండం: రామగుండం నగరంలోని 30వ డివిజన్‌పైనే అందరి దృష్టి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ డివిజన్‌లో ముగ్గురు ముఖ్యులు అయోధ్యనగర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్‌ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి కాగా, ఇటీవల అంతర్గాం మండల పరిధిలోకి తన ఓటును బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. కాగా దీని పక్కనున్న 28వ డివిజన్ అబాది రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రోటోకాల్ చైర్మన్, ఏఐసీసీ ప్రతినిధి హర్కర వేణుగోపాల్‌రావు ఓటరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 30వ డివిజన్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ముగ్గురు ముఖ్యుల ఆధిపత్యాన్ని స్పష్టం చేయనుందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
కోలేటి దామోదర్
కౌశికహరి
వేణుగోపాల్‌రావు
మక్కాన్‌సింగ్
రామగుండంలో సర్వత్రా ఆసక్తికర చర్చ
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్‌లోనే..
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్‌లోనే..
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్‌లోనే..


