గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు

Feb 10 2026 8:06 AM | Updated on Feb 10 2026 8:06 AM

గ్రీవ

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు పరిశీలన వసతిగృహ విద్యార్థులపై శ్రద్ధపెట్టాలి వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు 12 నుంచి రెండో విడత సీఎం కప్‌ పోటీలు

సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత ఠాణాల అధికారులకు పంపించి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు

సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సోమవారం పరిశీలించారు. సిరిసిల్లలోని గీతానగర్‌ జెడ్పీ హైస్కూల్‌ను, వేములవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందించాలని, మౌళిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్‌.వెంకటేశ్వర్లు, రాధాబాయి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్‌, తహసీల్దార్లు మహేష్‌ కుమార్‌, జయంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వసతిగృహాల్లోని విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పోతుగల్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో సోమవారం పరిశీలించారు. పోతుగల్‌ హాస్టల్‌లో ఉండి పదోతరగతి చదువుతున్న 18 మంది విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి, హెచ్‌ఎం రాధాకిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మల్లన్న కల్యాణం

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారంలో మల్లికార్జునస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఉండ్రుగుట్ట మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను ఈనెల 3 నుంచి నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పెద్దపట్నం ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నామని మిషన్‌ భగీరథ ఇంట్రా ఏఈ దివ్య అన్నారు. మండలంలోని మొర్రాయిపల్లె, చీకోడు, నామాపూర్‌ గ్రామాలను సోమవారం సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్న నీటి వనరులను పరిశీలించామని తెలిపారు. నీటి సరఫరాకు కావాల్సిన మెయింటెన్స్‌కు నిధులు అందించాలని సర్పంచులు కోరారు. కార్యక్రమంలో ఎంపీవో వాహిద్‌, సర్పంచులు మెంగని శ్రీనివాస్‌, బొమ్మెన అంజనేయులు, అనిల్‌, పంచాయతీ కార్యదర్శులున్నారు.

సిరిసిల్ల అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో ఎడిషన్‌ చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ 2025–26 జిల్లా స్థాయి పోటీలు ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలశాఖ అధికారి రాందాస్‌ తెలిపారు. పట్టణ పరిధిలోని రాజీవ్‌నగర్‌ మినీస్టేడియంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీలు కొనసాగుతాయని వివరించారు. చెస్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, షిటిల్‌ బ్యాడ్మింటన్‌, యోగామ్యాట్స్‌, క్యారం కై న్స్‌, సైకిల్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సంబంధిత పరికరాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 94402 39783లో సంప్రదించాలని కోరారు.

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు
1
1/3

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు
2
2/3

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు
3
3/3

గ్రీవెన్స్‌ డేలో 21 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement