నిబంధనల మేరకు పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు పనిచేయాలి

Feb 6 2026 7:32 AM | Updated on Feb 6 2026 7:32 AM

నిబంధనల మేరకు పనిచేయాలి

నిబంధనల మేరకు పనిచేయాలి

● కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: నియమావళికి అనుగుణంగా అధికా రులు విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ సూచించా రు. జిల్లా కేంద్రంలోని గీతానగర్‌ జెడ్పీ స్కూల్‌లో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం గీతానగర్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓటర్లు 18 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత సామగ్రిని జిల్లా సినారె కళామందిర్‌లోని రిసెప్షన్‌ కేంద్రంలో అప్పగించాలని తెలిపారు.

వసతులు కల్పించాలి

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య హైస్కూల్‌లోని కేంద్రాలను పరిశీలించారు. దివ్యాంగులకు ర్యాంప్‌, పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి తాగునీరు, టాయిలెట్స్‌ వసతి కల్పించాలని ఆదేశించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై మార్గదర్శనం చేశారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, సిరిసిల్ల, విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసాచారి, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్‌, తహసీల్దార్‌ మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement