మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
కరీంనగర్‌రూరల్: మూడేళ్లక్రితం కుటుంబకలహాలతో ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు ఆధునిక టెక్నాలజీతో నేపాల్‌లోని ఖాఠ్మాండులో గుర్తించి శనివారం కరీంనగర్‌కు తీసుకొచ్చారు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు వివరాలు గోదావరిఖనికి చెందిన పస్తం సురేశ్(32)కు దుర్శేడ్‌కు చెందిన అనూషతో వివాహమైంది. మూడేళ్లక్రితం అత్తగారింటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్‌రూరల్‌పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక విచారణతోపాటు ఆధునిక సాంకేతిక సాయంతో సురేశ్ విశాఖపట్నం,నేపాల్‌దేశంలోని ఖాఠ్మాండులో నివసిస్తున్నట్లు గుర్తించారు. చివరకు వివిధ ప్రయత్నాల ద్వారా సురేశ్‌ను పట్టుకుని శనివారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిస్సింగ్‌కేసును చేధించిన పోలీసులను సీఐ నిరంజన్‌రెడ్డి అభినందించారు.


