విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

Feb 11 2026 8:45 AM | Updated on Feb 11 2026 8:45 AM

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

ఎన్పీడీసీఎల్‌ చైర్‌పర్సన్‌ వేణుగోపాలాచారి

ఓదెల(పెద్దపల్లి): విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్‌ చైర్‌పర్సన్‌ వేణుగోపాలాచారి ఆదేశించారు. పొత్కపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మంగళవారం జరిగిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో వేణుగోపాలాచారి మాట్లాడారు. వేలాడే తీగలు, 11 కేవీ విద్యుత్‌ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. జీలకుంట సర్పంచ్‌ రాగిడి మంగ.. ప్రస్తుతం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ జీలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉందని, పేరు, స్థలం మార్చాలని చైర్‌పర్సన్‌కు వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్‌కో డీఈఈ బ్రహ్మచారి, ఏడీ రవీందర్‌, ఏఈఈలు మోహన్‌నాయక్‌, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement