విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

మెట్‌పల్లిరూరల్‌: విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్‌ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్‌, సురేశ్‌ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ లైట్‌ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్‌ షాక్‌ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్‌, సురేశ్‌ మెట్‌పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్‌కు సహకరించిన వినోద్‌, సురేశ్‌పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

12 రోజుల్లో ఇద్దరి మృతి

రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలు తున్నాయి. 12 రోజుల్లో ఇద్దరు విషజ్వరంతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరం, రక్తకణాలు తగ్గిపోయి బోయిని రాములు అనే వ్యక్తి జనవరి 25న మృతిచెందగా విషజ్వరం, రక్తకణాలు పడిపోయి, జాండీస్‌తో కట్కూరి సంజీవ్‌(48) గురువారం మృతిచెందారు. ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షలు చేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంజీవ్‌ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సంజీవ్‌కు తల్లి లక్ష్మి, భార్య మంజూల, కొడుకులు వంశీ(25), సన్ని(19), శ్రావణ్‌(16) ఉన్నారు.

గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం

రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ శివారు గోదావరినదిలో గురువారం గుర్తుతెలియని లభించినట్లు ఎస్సై వెంకటస్వామి పేర్కొన్నారు. మృతుడికి సుమారు 40 ఏళ్ల వయసు ఉంటుందని, ఆకు పచ్చ రంగు ఫుల్‌ టీ షర్ట్‌, దానిలో తెలుపు రంగు, లేత ఆకుపచ్చ జీన్స్‌ ప్యాంట్‌, కుడి చేతికి 3 స్టార్‌ టాటూస్‌, ఎడమ చేతికి టీ, ఎం, ఎన్‌ ఇంగ్లిష్‌ అక్షరాలను టాటూ వేయించుకున్నాడు. ఆచూకీ తెలిసినవారు 87126 56527 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. ఈనెల 2న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కాగా రెండురోజుల వ్యవధిలో మరో మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది.

బెల్ట్‌షాపు మూసివేత

చిగురుమామిడి: మండలంలోని ఓ గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు మద్యం సేవించిన ఘటనపై తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఎకై ్సజ్‌ అధికారులు స్పందించారు. గురువారం పాఠశాలకు సమీపంలో ఉన్న బెల్ట్‌షాపును మూసివేయించారు. విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయని, ఒక్కటి మూసివేసినంత మాత్రాన, మిగతా వాటి పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మిగతా వాటిపైనా చర్యలు తీసుకుని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి1
1/1

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement