అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

అధికార పార్టీ అభ్యర్థుల    గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

రామగుండం: కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్‌ చైర్మన్‌ హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. ఆదివారం అబాది రామగుండంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ లింగాపూర్‌ గ్రామం కార్పొరేషన్‌లో విలీనం కావడంతో పట్టణీకరణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్రా అభివృద్ధి పనులు అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమన్నారు. అబాది రామగుండం, లింగాపూర్‌ గ్రామ రైతులకు శాశ్వతంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement