మౌనమే అయితే.. | - | Sakshi
Sakshi News home page

మౌనమే అయితే..

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

మౌనమే అయితే..

మౌనమే అయితే..

మౌనమే అయితే..

కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్‌ ఓవర్‌ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ శ్రీఈ వాయిస్‌ కావాలిశ్రీ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్‌ ఓవర్‌గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్‌ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్‌ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందులు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్‌ అయ్యాను. అనుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారులను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది.

– మేజిక్‌రాజా, వాయిస్‌ ఓవర్‌ కళాకారుడు, గోదావరిఖని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement