అందుబాటులో అంబులెన్స్‌లు
వేములవాడఅర్బన్: మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు స్థానికంగా ఏడు 108 అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ తెలిపారు. ఒక అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వాహనం ఉందని అందులో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. భక్తులు అత్యవసర వైద్యసహాయం కోసం 108కు ఫోన్ చేయాలని కోరారు. వేములవాడలోని ఈవో కార్యాలయం, శివార్చన, హెలికాప్టర్ ల్యాండింగ్ ఏరియా, వేములవాడ ఏరియా ఆస్పత్రి, భీమేశ్వర సదన్, నాంపల్లిగుట్టపై అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ నయీమ జహా, 108 సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, అనిల్‌కుమార్, రాజు, నవీన్, సాయికృష్ణ పాల్గొన్నారు.


