సౌదీ అరేబియాలో పోచంపేట వాసి మృతి
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన పొలాస రాజేశం (53) ఈనెల 5న సౌదీ అరేబియాలో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోచంపేటకు చెందిన పొలాస రాజేశం నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. ఈనెల 5న తోటలో పనిచేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి చేస్తున్నట్లు సర్పంచ్ రెంటం జగదీశ్ తెలిపారు.
అదుపుతప్పి బోల్తాపడిన కారు
కోనరావుపేట: మండల కేంద్రం నుంచి నిమ్మపల్లికి వెళ్లే దారిలో గద్దెగుట్ట వద్ద కారు అదుపుతప్పి ఓ ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. నిమ్మపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బుర్ర కృష్ణప్రసాద్ ఉదయం 8 గంటలకు తన కారులో పాఠశాలకు వెళ్తుండగా, వెంకట్రావుపేట శివారులోని గద్దెగట్టు చెరువు ప్రాంతంలో కారు అదుపుతప్పి పొలంలో పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడిని 108లో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చిరుతదాడిలో
మేక మృతిపై విచారణ
కోనరావుపేట: కోనరావుపేట మండలం మర్తనపేట అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుత దాడిలో మేక మృతిచెందిన ఘటనపై మంగళవారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. రాజన్నగొల్లపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరి రమేశ్ మేకను చిరుతపులి మర్తనపేట– పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చంపింది. ఈ విషయమై డెప్యూటీ ఎఫ్‌ఆర్‌వో మోహన్‌లాల్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గొర్లకాపరులు, రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్కరు కాకుండా ఇద్దరుముగ్గురు కలిసి వెళ్లాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి భర్తకు అస్వస్థత
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని 39వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి చిటికెన విజయ భర్త చిటికెన సత్తయ్య మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, వైద్య శివప్రసాద్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి సత్తయ్య పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సౌదీ అరేబియాలో పోచంపేట వాసి మృతి
సౌదీ అరేబియాలో పోచంపేట వాసి మృతి
సౌదీ అరేబియాలో పోచంపేట వాసి మృతి


