ఆకట్టుకున్న సృజన టెక్‌ ఫెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సృజన టెక్‌ ఫెస్ట్‌

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

ఆకట్ట

ఆకట్టుకున్న సృజన టెక్‌ ఫెస్ట్‌

ఆకట్టుకున్న సృజన టెక్‌ ఫెస్ట్‌ వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు పాఠశాలల మూసివేత సరికాదు ‘రేవంత్‌ వ్యాఖ్యలపై వెలమ సమరభేరి’ ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ వీధి కుక్కలకు చికిత్స

వేములవాడఅర్బన్‌: అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి పాలిటెక్నిక్‌ సృజన టెక్‌ ఫెస్ట్‌–2026 నిర్వహించారు. కోరుట్ల, అగ్రహారం కళాశాలల విద్యార్థులు మోకానికల్‌, టెక్స్‌టైల్‌ విభాగంలో తయారు చేసిన ప్రాజెక్ట్‌లు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్‌ ప్రభాకరా చారి, అధ్యాపకులు శంకరయ్య, శరణ్య, అంజలి, కనకయ్య పాల్గొన్నారు.

వీర్నపల్లి(సిరిసిల్ల): రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ఎండీ.షఫీయొద్దీన్‌ అధికారులు, సర్పంచులకు సూచించారు. వీర్నపల్లిలోని రైతువేదికలో శుక్రవారం సమావేశమయ్యారు. ఎంపీడీవో శ్రీలేఖ, అధికారులు సుమలత, అన్వర్‌, భీరయ్య, పావని, రాము, అనిల్‌, కార్తికేయ పాల్గొన్నారు.

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని బహుజన క్లాస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్‌గౌడ్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హేతుబద్ధీకరణ కోసం తెచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. వికృతి లక్ష్మీనారాయణ, బండారి మల్లేశం, పులి రాంగోపాల్‌గౌడ్‌, ఇటికాల సుధాకర్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: తమ సామాజిక వర్గంపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆలిండియా వెలమ అసోసియేషన్‌(ఐవా) ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. త్వరలోనే వెలమ సమరభేరి ద్వారా తమ నిరసనను వినిపిస్తామన్నారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. నాయకులు సరీన్‌గాంధీరావు, మోచినేని శ్రీనివాస్‌రావు, రోకండ్ల వెంకటేశ్వర్‌రావు, వంశీకృష్ణారావు, కలకుంట్ల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మోడల్‌స్కూల్‌ విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివి అత్యున్నత ఫలితాలు సాధించాలని బీటీఆర్‌ ఫౌండేషన్‌ అధినేత బెద్రం తిరుపతిరెడ్డి కోరారు. మండలంలోని రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌ విద్యార్థులు 94 మందికి ‘సాక్షి’ మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. సాక్షి స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, రహీంఖాన్‌పేట ఉపసర్పంచ్‌ గడ్డమీది పద్మ, శ్రీకాంత్‌గౌడ్‌, ప్రసన్నకుమార్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: కుక్కల సంఖ్య పెరగకుండా చికిత్స చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా తెలిపారు. ఏనిమల్‌ బర్త్‌ కేర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతున్న కుక్కలను శుక్రవారం ఏబీసీ సెంటర్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధికుక్కలను గుర్తించి అవసరమైన చికిత్స చేసిన అనంతరం తిరిగి వదిలేస్తున్నట్లు తెలిపారు.

ఆకట్టుకున్న సృజన టెక్‌ ఫెస్ట్‌
1
1/1

ఆకట్టుకున్న సృజన టెక్‌ ఫెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement