కిక్‌ బాక్సింగ్‌లో నిహారిక ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కిక్‌ బాక్సింగ్‌లో నిహారిక ప్రతిభ

Feb 26 2026 8:33 AM | Updated on Feb 26 2026 8:33 AM

కిక్‌ బాక్సింగ్‌లో నిహారిక ప్రతిభ

కిక్‌ బాక్సింగ్‌లో నిహారిక ప్రతిభ

ఖేలో ఇండియా సౌత్‌ జోన్‌ పోటీలకు ఎంపిక

అమలాపురం రూరల్‌: న్యూఢిల్లీలోని కేడీ జావేద్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ కిక్‌ బాక్సింగ్‌ కప్‌–20 పోటీలలో రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారిక అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలను సాధించింది. ఈ సందర్భంగా ఆమె బుధవారం కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని, కోనసీమ ఖ్యాతిని చాటాలని పేర్కొన్నారు. లైట్‌ కాంటాక్ట్‌ విభాగంలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకోగా, క్రియేటివ్‌ ఫామ్‌ వెపన్‌ విభాగంలో రజత పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. ఆమె ప్రతిభతో బెంగళూరులో నిర్వహించనున్న ఖేలో ఇండియా సౌత్‌ జోన్‌ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌లు బీకే రత్నం, అంజనీకుమార్‌లను, ఆమె తల్లిదండ్రులను కలెక్టర్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement