breaking news
Kakinada District Latest News
-
భారీగా వదిలిన ‘నేతి’చమురు
● టెండర్ ద్వారా కొనాలని గత ఆగస్టులో కమిషనర్ ఆదేశం ● ఇప్పటికే కొటేషన్ ద్వారానే కొనుగోళ్లపై ఆగ్రహం ● అన్నవరం దేవస్థానంపై సుమారు రూ.50 లక్షల భారం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నేతిని టెండర్ ద్వారా కాకుండా కొటేషన్ పద్ధతిపై కొనుగోలు చేయడంపై దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈఓ వీర్ల సుబ్బారావును ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యదేవుని ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని గత ప్రభుత్వ హయాంలో టెండర్ ద్వారా పిలిచి ఖరారు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లు రద్దు చేసి, సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి కొనాలని ఆదేశించింది. ఆ ప్రకా రం సంగం, విజయ డెయిరీల నుంచి కిలో సుమా రు రూ.590కి కొంటున్నారు. అయితే, గత ఆగస్టు లో టెండర్ పిలిచి, ఆవు నెయ్యి కొనుగోలు చేయా లని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ, దేవస్థానంలో పాత పద్ధతిలోనే కొటేషన్ల ద్వారా ఇప్ప టి వరకూ సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసి, 60 వేల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. అదే టెండర్ ద్వారా అయితే కేజీ నెయ్యి రూ.50 నుంచి రూ.100 తక్కువకు వచ్చేదనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. తద్వారా దేవస్థానంపై రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ భారం తగ్గేద ని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఈఓను ఉన్నతాధికారులు ఆదేశించారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. మూడు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని 6 వేల మంది స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. దశమి తిథి కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్లో సత్యదేవుని సేవా టికెట్లు అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులు వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం కొనుగోలు, వసతి గదుల కేటాయింపు తదితర సేవల కు ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చునని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వామివారి అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చునని తెలిపారు. ఆన్లైన్ టికెట్ల కోసం APTEMPLES.ORG వెబ్సైట్ ద్వారా అన్నవరం దేవస్థానాన్ని సంప్రదించాలన్నారు. అలాగే, ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా నిర్దేశిత మొత్తం చెల్లించి పై సేవలు పొందవచ్చని తెలిపారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ తదితర యూపీఐ యాప్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
నూతన విద్యా విధానం.. పేదలకు చదువులు దూరం
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ ● పిఠాపురంలో ఆ సంఘం జిల్లా మహాసభలు పిఠాపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పేద, మధ్య తరగతి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా 30వ మహాసభలు పిఠాపురంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వరకూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ ప్రసంగించారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ధోరణిని చొప్పించేందుకే నూతన జాతీయ విద్యా విధానం, ఎల్‌ఓసీఎఫ్ విధానాలు అమలు చేస్తోందని అన్నారు. తద్వారా విద్యార్థులో శాసీ్త్రయ దృక్పథానికి బదులు అశాసీ్త్రయ భావాలు చొప్పిస్తోందని విమర్శించారు. ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తన భుజాన వేసుకుని అమలు చేస్తోందని అన్నారు. కేంద్రం విధానాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 3, 4, 5 తరగతుల విలీనం, మోడల్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాలను అనుమతించబోమంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల రాజ్యాంగపరమైన హక్కుకు ఈ ఉత్తర్వులు విఘాతంగా మారాయన్నారు. అందరికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఆ హామీ అమలు చేయడం లేదని విమర్శించారు. పీజీ విద్యార్థులకు గుదిబండగా ఉన్న జీఓ నంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ అవతరణ దినోత్సవం నాడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి, విద్యార్థులందరూ రాజకీయ నాయకులుగా తయారు కావాలని చెప్పిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వీటిని వెంటనే నిర్వహించాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ, జిల్లాలోని విద్యారంగ సమస్యలను పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ తానే పరిష్కరిస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల భవనాలు పాతబడి, ఎప్పుడు మీద కూలుతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారని, ఇక్కడ నూతన భవనాలు కట్టించకపోవడం దుర్మార్గమని అన్నారు. పిఠాపురం నియోజవర్గంలోని గొల్లప్రోలు జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి, నూతన భవనం నిర్మించాలని, కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షురాలు జి.చిన్ని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి కె.సిద్ధు, జిల్లా నాయకులు సాయిత్, అమృత, నాని, సంతోష్, జైరామ్, వడ్డి కాసులు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకే ప్రాధాన్యం
● అన్నదాతలకు ‘తేమ’ ఇక్కట్లు ● 17 శాతం లోపు ఉంటేనే కొంటున్న మిల్లర్లు ● ఇదే అదనుగా దళారుల దందా ● బస్తాకు రూ.400 వరకూ కోత ● నష్టపోతున్న రైతులు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తరచుగా చెబుతూనే ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం రైతుల నుంచి ఆవిధంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. ముఖ్యంగా తేమ శాతం నిబంధనలు అన్నదాతలకు తలనొప్పిగా మారాయి. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వానికి విక్రయిస్తే ధాన్యం డబ్బులు వెంటనే రావనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ బాధలు పడలేక, మరో గత్యంతరం లేక ఎక్కువ మంది రైతులు దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తేమ శాతం సాకుతో.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకూ 1.60 లక్షల ఎకరాల్లో వరి కోతలు జరిగాయి. సామర్లకోట, పిఠాపురం, కరప, కొత్తపల్లి, గొల్లప్రోలు, తుని, శంఖవరంతో పాటు పలు మండలాల్లో ఇప్పటికే కోతలు దాదాపు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులు రోడ్లు, కళ్లాల్లో ధాన్యం ఆరబోసుకొంటున్నారు. సాధారణ రకం ధాన్యం బస్తాకు (75 కేజీలు) రూ.1,777, సన్న రకాలకు రూ.1,792 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. తీరా కొనుగోలుకు వచ్చేసరికి ఆవిధంగా జరగడం లేదు. సంప్రదాయ పద్ధతిలో కోతలు కోస్తే పెట్టుబడి ఎక్కువైపోతున్నందున జిల్లాలోని అత్యధిక శాతం రైతులు యంత్రాలతోనే వరి కోతలు చేపడుతున్నారు. కోతలు పూర్తయిన రెండు మూడు రోజుల తర్వాత రైతు సేవా కేంద్రాలకు (ఆర్ఎస్కే) ధాన్యం తీసుకువెళ్తున్నారు. అక్కడి సిబ్బంది ఆ ధాన్యాన్ని సమీప రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత రైతులకు అసలు కష్టాలు మొదలవుతున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబోసి మళ్లీ తీసుకు రావాలని చెబుతున్నారు. దీంతో, రైతులకు రవాణా ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతుల నుంచి బస్తా ధాన్యానికి రూ.300 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో వాతావరణం కూడా రైతులను కలవరపెడుతోంది. ధాన్యం ఆరబోసిన సమయంలో అనుకోకుండా వర్షం కురిస్తే మొదటికే మోసం వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ కష్టాలకు ఎదురీదలేక దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది అధికారుల అంచనా. ఇందులో 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకూ 90 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సర్కారు కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరబెట్టడానికి అదనపు ఖర్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండాలంలంటే రైతులు కుప్పలు వేసి కనీసం వారం, పది రోజులు పైగా నిల్వ ఉంచాలి. లేదంటే యంత్రాలతో పంట కోతల తరువాత వారం రోజులు పైగా కళ్లాలు, రహదారులపై ధాన్యం ఎండబోయాలి. ఇలా చేయాలంటే కూలి ఖర్చుల వంటి రూపాల్లో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రతి గింజా మద్దతు ధరకే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులెప్పుడొస్తాయో..! గత ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం అమ్మిన రైతులకు సుమారు రెండు నెలలు గడచినా కూడా ప్రభుత్వం డబ్బు జమ చేయలేదు. దీంతో, అప్పట్లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఒకవేళ మద్దతు ధరకు ఆశ పడి ఆర్ఎస్కేల ద్వారా మిల్లుకు తరలించినా.. గతానుభవం దృష్ట్యా అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఎప్పటికో కానీ డబ్బులివ్వదేమోనని రైతులు భయపడుతున్నారు. మిల్లుకు ధాన్యం తరలించిన 24 గంటల్లో తమ ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పడమే తప్పా నెలల తరబడి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయాలకు వారు సంకోచిస్తున్నారు. వచ్చేది తక్కువే అయినా మరో దారి లేక దళారులకే అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.90 వేల టన్నుల కొనుగోలు ఇప్పటి వరకూ 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉంటే మద్దతు ధర తప్పకుండా వస్తుంది. కోసిన వెంటనే కాకుండా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఆర్ఎస్కేల్లో మాత్రమే విక్రయించాలి. దళారులను నమ్మి తక్కువ రేటుకు విక్రయించవద్దు. – దేవుల నాయక్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ‘మద్దతు’ దక్కడం లేదు వారం పది రోజులు ఆరబెడితే మాత్రమే మద్దతు ధర ఇస్తామని అంటున్నారు. అందుకే బయటి వ్యక్తులకు బస్తా రూ.1,550కి అమ్ముకున్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి. – సామన గంగారావు, రైతు, అచ్చంపేట, సామర్లకోట మండలం 75 రోజులు పట్టింది గత ఏడాది ఖరీఫ్‌లో ఆర్ఎస్కేల ద్వారా మిల్లుకు ధాన్యం విక్రయించాను. సంబంధిత డబ్బు నా ఖాతాలో జమ చేయడానికి 75 రోజులు పట్టింది. దీంతో, రబీలో బయటి వ్యక్తుల వద్ద అప్పులు చేసి, సాగు చేయాల్సి వచ్చింది. అందుకే, ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే భయపడాల్సి వస్తోంది. – కర్నీడి వీర్రాజు, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం -
● దిగంబరా.. దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా..
స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, ప్ర త్యేక పూజలతో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొ లి రోజు స్వామివారి పల్లకీ సేవ పుర వీధుల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తమ చెంతకే వచ్చిన స్వామిని కన్నులారా తిలకించి భక్తులు పులకించిపోయారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలం కావడంతో పిఠాపురంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పా టు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భ క్తులు తరలి వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరాఠీ భక్తులు ఈ వారం రోజులూ ఇక్కడే ఉండి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది సుమారు 30 వేల మంది మరాఠీ భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు. – పిఠాపురం -
ముళ్లకు నెలలు బ్రేక్
3అన్నవరం: మూడు ముళ్లబంధంతో కొత్త జంటలు ఒక్కటవ్వడానికి మూడు నెలలు బ్రేక్ పడనుంది. ప్రాగస్తమిత శుక్ర మూఢమి ఆదివారం ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఫిబ్రవరి 13న మాఘ బహుళ ఏకాదశి నాడు ముగుస్తుంది. దీంతో, సుమారు మూడు నెలల పాటు వివాహాది శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. తిరిగి ఫిబ్రవరి 19 నుంచి వివాహాలు జరగనున్నాయి. కొద్ది నెలలుగా వివాహాది శుభకార్యాలతో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సందడిగా మారింది. గత ఆశ్వయుజం, కార్తిక మాసాల్లో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ప్రస్తుత మార్గశిర మాసంలో కూడా గత తొమ్మిది రోజులూ పెళ్లిళ్లు జోరుగానే జరిగాయి. ఈ వివాహాల కారణంగా కార్తిక మాసం అనంతరం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొంది. అటువంటిది నేటి నుంచి మూఢమి ప్రారంభ కానుండటంతో ‘మాంగల్యంతంతునానేనా..’కు విరామం కలగనుంది. మాఘంలో కూడా వివాహాలు లేనట్టే.. ఈసారి వచ్చే జనవరి 19న ప్రారంభమయ్యే మాఘ మాసంలో కూడా పెద్దగా వివాహాలు లేవు. ఆ నెలలో సుమారు 20 రోజుల పాటు శుక్ర మూఢమి కొనసాగడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఆ తరువాత కూడా వివాహ ముహూర్తాలు లేవు. తిరిఇ ఫాల్గుణ మాసంలోనే పెళ్లి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి 18న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. అదే నెల 19వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలున్నాయి. అప్పటి నుంచి మార్చి 17వ తేదీ వరకూ వివాహాలు జరగనున్నాయి. మార్చి 19న పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి వివాహాలు మళ్లీ మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. ఏటా మార్గశిరం, మాఘ మాసాల్లో రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది శుక్ర మూఢమి కారణంగా ఫిబ్రవరి 13 వరకూ వివాహాలు లేకపోవడంతో వివాహ మండపాలు, పురోహితులు, క్యాటరింగ్, సన్నాయి మేళం, ఫ్లవర్ డెకరేషన్ తదితర రంగాల వారి ఉపాధికి కొంత ఇబ్బందే కలగనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ శుక్ర మూఢమి వివాహాది శుభకార్యాలకు ఆటంకం మళ్లీ ఫిబ్రవరి 19 నుంచే ‘మాంగల్యంతంతునానేనా..’ -
పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించాలి
● సినీ గేయరచయిత భాస్కరభట్ల ● ఉత్సాహంగా ‘కేరింతలు’ కంబాలచెరువు: పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రముఖ సినీ గేయ రచయిత, కవి భాస్కరభట్ల రవికుమార్ అన్నారు. శ్రీ షిర్డీ సాయి విద్యా సంస్థల ఆధ్వర్యంలో కేరింతలు పేరుతో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు విద్య ఒక్కటే కొలమానం కాదని, వారిలో విద్యతో పాటు ఏ ఇతర రంగాల్లో ఆసక్తి ఉందో గమనించి, దానికి అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. మరో ముఖ్య అతిథి 9వ అదనపు జిల్లా సివిల్ జడ్జి మాధురి మద్దాలి మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలకు కొంత సమయం కేటాయిస్తే బంధాలు బలపడతాయన్నారు. పిల్లలు చెప్పిన విషయాలను వింటూ, మంచి చెడులను వారికి తెలియజేయాలన్నారు. ముందుగా శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ పాలేశ్వరరావు సతీమణి నాగమణి చేతుల మీదుగా అతిథుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, సివిల్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీలేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వాడపల్లి ఖ్యాతి
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఖ్యాతి దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. రోజూ ముఖ్యంగా శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచీ అత్యధిక సంఖ్యలో భక్తులు వాడపల్లికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ‘ఏడు వారాల వెంకన్న దర్శనం–ఏడేడు జన్మల పుణ్యఫలం’ నానుడితో ‘ఏడు వారాల వెంకన్న’గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం తిరుమల (పెద్ద తిరుపతి) తరహాలో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లిస్తున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం నుంచి శుక్రవారం 16 మంది సభ్యుల భక్త బృందం వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ ఓం నమో వేంకటేశాయనమః అని నమస్కరిస్తూ తాము అందరం ఒడిశా నుంచి వచ్చామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులమని, దేశ వ్యాప్తంగా అనేక పుణ్య క్షేత్రాలు, ఆయా దేవతామూర్తుల గురించి తెలుసు.. కానీ ఈ వాడపల్లి క్షేత్రం, ఈ దేవుడి విశిష్టత గురించి ఇటీవలే తెలిసిందన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటామని వారన్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్
క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న ముఖ్య అతిథి డీఈఓ రమేష్ ● పోటీలను ప్రారంభించిన డీఈఓ రమేష్ ● చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమేనని విద్యార్థులకు పిలుపు ● పది జిల్లాల నుంచి 400 మంది హాజరు ● రేపటి వరకు పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అంతర్ జిల్లాల జిమ్నాస్టిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉపవిద్యాశాఖ అధికారి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు క్రీడా సామగ్రిని అందిస్తోందని, ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వాటిని అందించారని, త్వరలో కాకినాడ జిల్లాలోని పాఠశాలలకు ఆ సామగ్రి అందిస్తామన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ఐ వారు ఈ ఏడాది 5 రాష్ట్ర స్థాయి మీట్లు తీసుకున్నారని, ఇది నాలుగో మీట్ అని, పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీనులను అభినందించారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు కూడా మండల స్థాయి నుంచి పోటీలు నిర్వహిస్తున్నామని, అవి శనివారం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. డీవైఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ గెలుపు ఓటముల కన్నా క్రీడాస్ఫూర్తి ప్రధానం అన్నారు. ఎస్జీఎఫ్ఐ అడ్మిన్ కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ ఈ నెల 30 వరకు జరిగే ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారన్నారు. డీఎస్డీఓ సతీష్‌కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో జాతీయస్థాయి ప్రమాణాలతో జిమ్నాజియం ఉందని, వచ్చే ఏడాది జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ జిమ్నాస్టిక్స్ పోటీలను ఏదో ఒక విభాగంలో కాకినాడకు కేటాయించేలా చూడాలని డీఈఓను కోరారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జిమ్నాస్టిక్స్ సంఘ ప్రతినిధి విఠల్, కాకినాడ రూరల్ ఎంఈఓ రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, మాచరరావు, శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్‌ప్రకాష్, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీను క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ జెండాను డీఈఓ రమేష్, ఎస్జీఎఫ్ఐ జెండాను డీఎస్డీఓ ఆవిష్కరించారు. వివిధ జిల్లాల క్రీడాకారులు కవాతు చేసి డీఈఓకు గౌరవ వందనం చేశారు. పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి బెలూన్లు ఎగురవేశారు. డీఈఓ క్రీడాజ్యోతిని వెలిగించారు. సెయింట్ అన్స్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థుల యోగాసనాలు ఆహూతులను ఆకట్టు కున్నాయి. కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్ సంఘ అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు రవిరాజు, పీడీలు ప్రసాద్, హరిబాబు, సూరిబాబు, సురేష్‌రాజు, దీప్తి ఎస్తేరు, మౌని, త్రిపుల, దుర్గ, డీఎస్ఏ జిమ్నాస్టిక్స్ కోచ్ సురేష్, జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఎంపిక కమిటీ సభ్యులు శరత్చంద్ర, జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి యాసిన్, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిటకిటలాడింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో స్వామివారి ఆలయంతో పాటు వ్రత మండపాలు, క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 25 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. పెద్దాపురం డివిజన్‌కు సామర్లకోట బోట్‌క్లబ్ (కాకినాడి సిటీ): ఇప్పటి వరకూ కాకినాడ రెవెన్యూ డివిజన్లో ఉన్న సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్‌కు బదిలీ చేస్తూ గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తమ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా సమర్పించాలని ప్రజలకు సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, అవసరమైన సదుపాయాలు, అధికారులు నిర్వహించిన తనిఖీల వివరాలపై కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లకు, అవకతవకలకు ఎటువంటి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్ల నిర్వహణ పర్యవేక్షణకు ప్రభుత్వం హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని వసతి గృహాల్లో తప్పనిసరిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన 15 రోజులకు ఒకసారి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వసతి గృహాల నుంచి బాలికలను తీసుకువెళ్లడానికి వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకుల ఫొటోలను ఒక ప్రత్యేక రిజిస్టర్లో అతికించి, ఎప్పటికప్పుడు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు లైంగిక విద్య, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ప్రతి శనివారం రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు. -
మొదటి నెల వేతనానికి ఇబ్బంది లేదు
కొత్త టీచర్లకు ఎంప్లాయీ ఐడీతో మొదటి నెల వేతనం ఇచ్చేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండో నెల వేతనం మంజూరుకు మాత్రం ప్రాన్ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం వెంటనే ఆ నంబర్లు కేటాయిస్తున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుంటే వెంటనే నంబర్లు కేటాయిస్తున్నాం. – బి.రామనాథం, జిల్లా ట్రెజరీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాంకేతిక ఇబ్బందులు తొలగించాలి కొత్తగా ఎంపికైన టీచర్లకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ట్రెజరీ అధికారులు సాంకేతిక ఇబ్బందులను తొలగించి వెంటనే వేతనాల చెల్లింపునకు చర్యలు చేపట్టాలి. – పి.సురేంద్రకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులు సకాలంలో స్పందించాలి ఉపాధ్యాయుల బిల్లుల చెల్లింపు విషయంలో ట్రెజరీ అధికారులు సకాలంలో స్పందించాలి. వారు సీఎఫ్ఎంఎస్, ప్రాన్ కేటాయింపులో అనవసరమైన కొర్రీలు వేయకుండా చూడాలి. సకాలంలో బిల్లులు పాస్ చేసి కొత్త ఉపాధ్యాయులు తొలి వేతనం తీసుకుని ఆనందం పొందేలా సహకరించాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఇద్దరు విద్యార్థుల వివాదం
పాఠశాల గేటుకు తాళం వేసిన విద్యార్థి తండ్రి కొత్తపల్లి: పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన వివాదంలో ఒక విద్యార్థి తండ్రి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని వేసిన తాళం తీయించారు. వివరాల్లోకి వెళితే స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పది, ఆరో తరగతి విద్యార్థుల మధ్య నమస్కారం విషయంలో తగాదా ఏర్పడింది. దీంతో 6వ తరగతి విద్యార్థి జరిగిన వివాదాన్ని తన తండ్రికి చెప్పాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తండ్రి పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశాడు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తాళం వేసిన వ్యక్తిని తీసుకువచ్చి తాళం తీయించారు. పాఠశాలలో సమస్య ఏర్పడినపుడు హెచ్ఎంలకు ఫిర్యాదు చేయాలేకానీ ఇలా తాళం వేయకూడదని హెచ్చరించి విద్యార్థి తండ్రిని మందలించారు. దీనిపై ఎంఈఓ వేణుగోపాల్‌ను వివరణ కోరగా పాఠశాల హెచ్ఎం సెలవులో ఉన్నారని దీనికి సంబంధించి సరైన వివరాలు లేవని తెలిపారు. విద్యార్థుల వివాదంపై శనివారం విచారణ నిర్వహిస్తామన్నారు. -
తొలి జీతానికి తకరారు!
● ప్రానం పెట్టి పని చేయొద్దా..● ఒకటిన జీతాలియ్యకుంటే ఎలా? ● ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొత్త టీచర్లు ● ఐడీల కేటాయింపులో తీవ్ర జాప్యం ● ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు ● వచ్చే నెల 15 తరువాత వచ్చే అవకాశం ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి సాక్షి, అమలాపురం: మెగా డీఎస్సీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం నాడు ఈ ఫైల్‌పై సంతకం చేసినప్పటి నుంచి నియామకాలు పూర్తయ్యి తొలి జీతం ఇచ్చే వరకూ అంతా గందరగోళమే. కొలువుల్లో చేరి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ జీతమే లేదు. డిసెంబరు 1వ తేదీన జీతం అందే పరిస్థితీ కానరావడం లేదు. వచ్చే నెల 15వ తేదీ వరకూ వీరికి జీతాలు పడే అవకాశం కనిపించడం లేదు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని డీఎడ్, బీఎడ్ చదివి, పూర్తిచేసి ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం వీరు డీఎస్సీ పరీక్షలు రాశారు. మంచి ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగాలు సాధించిన టీచర్లకు తొలి జీతం అందుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. ప్రతి నెలా వేతనం చెల్లించేందుకు ట్రెజరీలో ఉద్యోగి ఐడీతో పాటు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) జనరేట్ చేస్తారు. ఈ సంఖ్య కోసం కొత్త టీచర్లు ఇప్పటికీ ట్రెజరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,351 మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,349 మంది ఉపాధ్యాయులు కొత్తగా కొలువుల్లో చేరారు. అంతకు ముందు వారికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఐదు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక కేంద్రంలో ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు. లాంగ్వేజ్, సైన్స్, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్జీటీ.. ఇలా క్యాడర్ల వారీగా టీచర్లు శిక్షణ పొందారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చిన అనంతరం 13న విధుల్లో చేరారు. కొంత తర్జనభర్జనల అనంతరం శిక్షణ తీసుకున్న రోజు నుంచి విధుల్లో చేరినట్లుగానే భావించాల్సి ఉంది. తొలుత 3వ తేదీనా లేక 13వ తేదీనా అనే విషయం తేల్చడానికి సమయం పట్టింది. సర్వీస్ రిజిస్టర్(ఎస్ఆర్)లో జాయినింగ్ తేదీ నిర్థారిస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో ఏర్పడిన జాప్యంతో వేతనాల చెల్లింపులో కూడా ఆలస్యమైందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తప్పని ఎదురుచూపులు కొత్త ఉపాధ్యాయులు వేతనం పొందాలంటే ఐడీ, ప్రాన్ తప్పనిసరి కావడంతో వాటిని క్రియేట్ చేయాల్సి ఉంది. ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే వారికి డీడీఓలు వేతన బిల్లులు తయారు చేసి మళ్లీ ట్రెజరీకి పంపుతారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇండక్షన్ ట్రైనింగ్ పొందిన కొత్త టీచర్లు అదే నెల 13న విధుల్లో చేరారు. వారందరికీ మూడో తేదీ నుంచి వేతనాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విధుల్లో చేరే సమయానికి ట్రెజరీ ఐడీ, ప్రాన్ కేటాయించక పోవడంతో అక్టోబర్ నెల జీతం పొందలేకపోయారు. నవంబర్ 6 నుంచి 11వ తేదీ మధ్యలో సప్లిమెంటరీ బిల్లులు ట్రెజరీలో పొందుపరచే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి కూడా ట్రెజరీ ఐడీ, ప్రాన్ పూర్తి స్థాయిలో కేటాయింపు కాలేదు. ఈ నెల 15వ తేదీ నాటికి కొంతమందికి మాత్రం ఆయా నంబర్లు నమోదయ్యాయి. అయినప్పటికీ అక్టోబర్ నెల బకాయి బిల్లు తీసుకుంటేనే కానీ నవంబర్ నెల రెగ్యులర్ బిల్లు చేయడానికి వీలు కాదు. దీంతో, డిసెంబర్ 1వ తేదీన తొలి వేతనం పొందే అవకాశం కొత్త టీచర్లకు చిక్కలేదు. డిసెంబర్ 6 నుంచి 11వ తేదీ మధ్యలో అరియర్ బిల్లులు సబ్మిట్ చేస్తే డిసెంబర్ 15 తర్వాత రెండు నెలల వేతనాలూ పొందే అవకాశముంటుంది. కొత్త ఉద్యోగం మొదటి జీతం కళ్ల చూద్దామంటే ట్రెజరీలో ఏర్పడ్డ సాంకేతిక ఇబ్బందులతో ఆ కల దూరమవుతోందని నూతన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జనవరి 24 నుంచి నాటిక పోటీలు
పెద్దాపురం (సామర్లకోట): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలను జనవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం మండలం దివిలి స్నేహా ఆర్ట్ నాటిక పరిషత్తు అధ్యక్షుడు గొందేసి రాజా తెలిపారు. పోటీల కరపత్రాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివిలి గ్రామంలో సప్తమ నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 24న మమ్మల్ని బ్రతకనివ్వండి (విజయవాడ), గేమ్ (హైదరాబాద్), జనరల్ బోగీలు (కొలకలూరు) నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. జనవరి 25న అసత్యం (విశాఖపట్నం), ఆచమనం (కాకినాడ), మా ఇంట్లో మహాభారతం (చిలకలూరిపేట) నాటికలు ప్రదర్శితమవుతాయని తెలిపారు. జనవరి 26న అమ్మ చెక్కిన బొమ్మ (హైదరాబాద్), ఇది అతని సంతకం నాటిక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. కరపత్రాల ఆవిష్కరణలో నాటక పరిషత్తు సభ్యులు కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతల కీచకపర్వంతో మహిళలు కన్నీరు కాకినాడ రూరల్: రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేని దుస్థితి నెలకొందని, టీడీపీ నేతల కీచకపర్వంతో మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అఘాయిత్యాలకు పచ్చజెండా ఊపినట్టు కూటమి నేతలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే అహ్మద్ నజీర్.. ఇలా ప్రజాప్రతినిధులే గాడి తప్పి ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా టీడీపీ నాయకులు కీచకులుగా మారి ఒంటరి మహిళలు, స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థినులు.. ఇలా ప్రతి ఒక్కరినీ లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల వద్దకు వెళ్తున్న వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. మహిళలకు రక్షణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురిస్తోందని నాగమణి పేర్కొన్నారు. ఘనంగా చండీ హోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి గావించారు. హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి.. రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారి ఆలయ పరిచారకుడు చిట్టెం నరేష్ ఆధ్వర్యాన కనకదుర్గ అమ్మవారికి రుత్విక్కులు లక్ష కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. -
అందరికీ చంద్ర గోల్డ్ టీ
● జనసేన కీలక నేతకు నజరానా ● రిటర్న్ గిఫ్ట్‌గా టీ టైమ్ మినీ మార్ట్లు ● జనం కోరుతున్న కందిపప్పునకు మంగళం ● డిసెంబర్ కోటాలో టీ పొడి అమ్మకాలు ● ఎవరూ అడగకపోయినా ప్రభుత్వం వింతపోకడ ● కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు సాక్షి ప్రతినిధి, కాకినాడ: తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిపెట్టాడనే సామెత చందాన చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. బాబు గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయాలని జనం నెత్తీనోరూ బాదుకుంటున్నా స్పందన లేదు. ప్రతి పేద కుటుంబానికీ అత్యవసరమైన కందిపప్పు సరఫరాకు మంగళం పాడేసిన సర్కార్.. ఏ ఒక్కరూ అడగని టీ పొడిని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు సిద్ధమవుతూండటం విస్మయం కలిగిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని రేషన్ దుకాణాల ద్వారా టీ పొడి అమ్మకాలను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. సర్క్యులర్ విడుదల ప్రజలపై ప్రేమతో రేషన్ షాపుల్లో టీ పొడి విక్రయాలు చేపడుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ టీ పొడి సరఫరాకు టీ టైమ్‌ను వ్యాపార భాగస్వామిగా ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి రేషన్ షాపుల్లో ఏదైనా ఒక ఉత్పత్తి విక్రయం చేపట్టాలని అనుకుంటే ముందుగా సంబంధిత కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాలి. వాటిని మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి కమిటీ పారదర్శకంగా ఖరారు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. టీ పొడి విక్రయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈవిధంగా బహిరంగ టెండర్లు ఆహ్వానించి ఉంటే తాజ్‌మహల్, టాటా చక్రా గోల్డ్, త్రీ రోజెస్ తదితర జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన టీ ఉత్పత్తిదారులు పాల్గొనే అవకాశం ఉండేది. తద్వారా వారి మధ్య పోటీ నెలకొని నాణ్యమైన టీ పొడి సరసమైన ధరకే ప్రజలకు అందించే వీలు కలిగేది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఎటువంటి టెండర్లూ పిలవకుండానే టీ టైమ్ సంస్థకు ఏకపక్షంగా ఈ కాంట్రాక్ట్ అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ కూడా విడుదల చేసింది. రిటర్న్ గిఫ్ట్! ఎటువంటి టెండర్లూ లేకుండానే టీ టైమ్ సంస్థ ద్వారా టీ పొడి అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచీ జనసేన పార్టీకి ఆర్థికంగా చేయూత ఇచ్చిన సంబంధిత నేతకు రిటర్న్ గిఫ్ట్‌గా ఈ భారీ నజరానా ఇచ్చారని అంటున్నారు. అనుకున్నదే తడవుగా.. కాకినాడ జిల్లాలో జనసేనకు అన్నీ తానై చక్రం తిప్పిన క్రియాశీలక నేతకు చెందిన కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చేలా ఈ డీల్ కుదిరిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి రాష్ట్ర కేబినెట్లో పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. దీంతో, అనుకున్న పని సులువైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీలర్లపై ఒత్తిళ్లు! రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లోనూ దశల వారీగా టీ పొడి విక్రయాలు ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా డిసెంబర్ 1న టీ పొడి అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కార్డుదారులకు టీ పొడి అమ్మాలంటూ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ జిల్లాల్లోని రేషన్ డీలర్లపై అధికారుల నుంచి ఇప్పటికే ఒత్తిళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసినప్పటి నుంచీ రేషన్ డీలర్లు రెండు రకాల టీ పొడి ప్యాకెట్లు విక్రయించాలని చెబుతున్నారు. ఈ నెల 30 లోగా ఏ రేషన్ షాపునకు ఎన్ని ప్యాకెట్లు కావాలనే ఇండెంట్ పంపించాలంటూ రెవెన్యూ, పౌర సరఫరాల అధికారుల నుంచి డీలర్లకు మౌఖిక ఆదేశాలు రావడం గమనార్హం. రేషన్ దుకాణాల ద్వారా టీ పొడి విక్రయించే డీలర్లు సంబంధిత కంపెనీకి రూ.5 వేలు చెల్లించాలి. టీ పొడి అమ్మిన తరువాత కమీషన్ ఇస్తామని ఆ ఉతర్వుల్లో పేర్కొన్నారు. మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ నుంచే బియ్యం ఇతర నిత్యావసరాలతో పాటు టీ పొడి కూడా కోటా ప్రకారం విడుదల చేసుకోవాలి. టీ టైం మినీ మార్టుల పేరుతో రేషన్ షాపులను మినీ మార్టులుగా మారుస్తామని, రేషన్ షాపుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. టీ టైం మినీ మార్టులకు ఆ కంపెనీ చంద్ర గోల్డ్ టీ మాత్రమే సరఫరా చేస్తుంది. 20 గ్రాముల ప్యాకెట్ రూ.10, 40 గ్రాముల ప్యాకెట్ ధర రూ.20గా నిర్ణయించారు. ఒక్కో రేషన్ షాపునకు 10 గ్రాముల ప్యాకెట్లు 276, 20 గ్రాముల ప్యాకెట్లు 144 సరఫరా చేయనున్నారు. 10 గ్రాముల ప్యాకెట్లు అమ్మితే రూ.339, 20 గ్రాముల ప్యాకెట్లపై రూ.354 డీలర్‌కు లాభం ఉంటుందని చెబుతున్నారు. రూ.5 వేల విలువైన ప్యాకెట్లు అమ్మితే డీలర్‌కు రూ.693 ఆదాయం వస్తుందని అంటున్నారు. వాస్తవానికి జాతీయ, అంతర్జాతీయ టీ బ్రాండ్ ఉత్పత్తుల ధర కంటే ఈ ధరలు ఎక్కువని పలువురు అంటున్నారు. ప్రస్తుతానికి 10 గ్రాములు, 20 గ్రాముల ప్యాకెట్లని చెబుతున్నా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో కార్డుదారులందరికీ అమ్మడమంటే వ్యవహారం రూ.కోట్లలోనే ఉంటుంది. టీ టైమ్ మినీ మార్టుల పైలట్ ప్రాజెక్టును భవిష్యత్తులో రాష్ట్రమంతా విస్తరించాలనే వ్యూహం ఇందులో లేకపోలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచనుందా? లేదా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ నగరంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను, జగనన్న కాలనీలను సీపీఐ జిల్లా సమితి బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం చాలా మందికి ఇళ్ల స్థలాలిచ్చిందని, డబ్బు లేక అప్పట్లో ఇళ్లు నిర్మించుకోలేని వారందరికీ ప్రభుత్వం వెంటనే రూ.6 లక్షల సబ్సిడీ ఇచ్చి, ఇళ్లు నిర్మించాలని మధు డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని సంవత్సరం కాలంగా సీపీఐ దరఖాస్తులు పూర్తి చేసి, ప్రభుత్వానికి ఇచ్చిందని, దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యా తీసుకోలేదని అన్నారు. సూపర్ సిక్స్‌లో ప్రధానమైన ఇళ్ల స్థలాల హామీని చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. అసలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచన ఉందా, లేదా అని ప్రశ్నించారు. నగరంలో 2,050 టిడ్కో ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా వెంటనే నిధులు మంజూరు చేసి, టిడ్కో ఇళ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. పేదల బస్తీలుగా ఉండాల్సిన టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయని మధు దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, పి.సత్యనారాయణ ఎ.భవాని, బొబ్బిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బోల్ట్ తొలగించమంటే బ్లేడు వదిలేసి కుట్టేశారు!
● ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం ● అదేమని ప్రశ్నిస్తే దాడి చేశారన్న బాధితుడు తుని: స్థానిక ఏరియా ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరి రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వ్యక్తి కాలులో అమర్చిన ఐరన్‌రాడ్డు బోల్టు తొలగించి సిజేరియన్ బ్లేడును కాలులోనే ఉంచి కుట్టు వేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం ఎస్.అన్నవరం పంచాయతీ రామకృష్ణానగరానికి చెందిన వ్యక్తి ఏడాదిన్నర క్రితం కాలుకు గాయం కావడంతో ఏరియా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గాయం బలమైంది కావడంతో అప్పట్లో ఐరన్‌రాడ్డు సైతం అమర్చారు. ఐరన్ రాడ్డు బోల్టును తొలగిస్తే త్వరగా సర్దుకోవచ్చు అనే ఆలోచనతో శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రిలో సిబ్బంది ఆపరేషన్ చేసి రాడ్డు బోల్టు తొలగించారు. అయితే కాలులో సిజేరియన్ బ్లేడును ఒకటి ఉంచేసి కుట్లు వేసేశారు. ఇలా చేసారేంటని బాధితుడు సిబ్బందిని ప్రశ్నిస్తే దాడికి యత్నించారని రోగి వాపోయారు. -
భీమేశ్వరస్వామి ఆదాయం రూ.43.95 లక్షలు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి వారి హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 27 వరకూ 43 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.43,95,359 వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.52,682 వచ్చిందన్నారు. ఈ కార్యక్రమన్ని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి వి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ, పోలీస్ శాఖ,సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
పరివాహన్ను సరి చేయరా?
కాకినాడ ఆర్టీఓ కార్యాలయంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): రవాణా శాఖలో దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో పరివాహన్ పోర్టల్ ప్రవేశ పెట్టారు. ఈ పోర్టల్ ద్వారా 2024 జూలైలో కొన్ని సేవలు అందించారు. ఆ ఏడాది డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అన్ని సేవలూ అందించేలా ఆదేశాలు ఇచ్చారు. అయితే పోర్టల్ ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా పురిటి కష్టాలు దాటలేదు. వాహనదారులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా సమస్య వచ్చి జిల్లా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే తమ పరిధి కాదంటున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే అక్కడ కొన్ని పనులు చేసి మరికొన్నింటి విషయంలో చేతులెత్తేస్తున్నారు. అదేమంటే పోర్టల్ ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుందని చెబుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక విసుగెత్తిపోతున్నట్టు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ మొరాయింపు ప్రస్తుతం రవాణా కార్యాలయం నుంచి అందించే అన్ని సేవలు పోర్టల్ ద్వారానే పొందాల్సి ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్, ఒకరి నుంచి మరొకరికి బదిలీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడం, రెన్యువల్ వంటి అన్ని రకాల సేవలు పరివాహన్ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు. దీంతో ఈ పోర్టల్ తరచూ మొరాయిస్తుండటంతో వాహనదారులు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చేయి తడపాల్సిందే.. వాహనాల ఫిటెనెస్ తనిఖీని ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దాన్ని కాకినాడ సమీపంలోని అచ్చంపేట ఏడీబీ రోడ్డులో ఏర్పాటు చేశారు. అక్కడకు వాహనాలు తనిఖీ కోసం వెళ్లినప్పుడు ఏదో ఒక సాకు చూపి డబ్బు వసూలు చేస్తున్నట్టు వాహనదారులు చెబుతున్నారు. ‘అక్కడకు వెళ్లిన తర్వాత ఆ ప్రైవేటు సంస్థ డ్రైవర్ వాహనాన్ని లోపలికి తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు. కారు అద్దానికి బీటలు పడ్డాయి, టాప్ సరిగా లేదు వంటి లోపాలు చూపుతూ ఫిట్నెస్ ఇచ్చేందుకు ముడుపులు వసూలు చేస్తున్నారు. ముడుపులు అందితే లోపాలున్నా ఫిట్నెస్ ఇచ్చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంద’ని వాహనదారులు కోరుతున్నారు. సమస్యలివే.. ● డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తే కొందరి డేటా పోర్టల్‌లో ఉండటం లేదు. పది మందికి గాను ఇద్దరు, ముగ్గురికి ఇలా జరుగుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే కొందరికి సమస్య పరిష్కారం అవుతుండగా, మరికొందరికి పనికావడం లేదు. ● కారు మరొకరికి అమ్మినప్పుడు డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కానీ, ఆధార్ లింక్‌లో అమ్మిన వారి పేరునే కారు ఉన్నట్లు చూపుతోంది. అలా కారు అమ్మిన ఏడాది వరకూ పోర్టల్‌లో మార్పు కాకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ● పోర్టల్‌లో కొన్ని పాత వాహనాల డేటా కనిపించడం లేదు. అలాంటి వారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే, వాళ్లు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో రాష్ట్ర కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. అక్కడ కూడా కొంతమందికే పని జరుగుతోంది. ● ఇన్సూరెన్స్ చెల్లించిన వారి వివరాలు కనిపించక పోవడం, రెన్యువల్‌కు అ వసరమైన డేటా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా అ నేక రకాల సమస్యలతో వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లారీ యజమానుల ఇబ్బందులు పరివాహన్ పోర్టల్‌లో లారీ ఓనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రాష్ట్రా ల్లో ఈ పోర్టల్ అప్డేట్ కాలేదు. దీంతో మన లారీలు ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు నంబర్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లేదని జరిమానా విధిస్తున్నారు. ఇటీవల ఒక లారీకి సంబంధించిన ఆర్సీ బుక్‌లో ఒక లెటర్ తప్పుగా ఉంటే సరి చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. గతంలో లారీలు కొన్ని నెలలు ఆపినప్పుడు ఆ సమయానికి ట్యాక్స్ మినహాయించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు రోజుల తరబడి లారీలను నిలపాల్సిన పరిస్థితి ఉంటుందని, ట్యాక్స్ మినహాయింపు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవస్థలు పడుతున్నాం గతంలో పరివాహన్ సేవలు రాష్ట్ర పరిధిలో ఉండేవి. అప్పుడు సేవలు సక్రమంగా అందేవి. సేవలన్నీ కేంద్రం అధీనంలోకి వెళ్లి పరివాహన్ సైట్‌కు రవాణా సేవలు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా వాహనాల ఫిట్నెస్ ప్రైవేటీకరణ చేయడంతో చాలా అవస్థలు పడుతున్నాం. – ఆర్.రాజా, వాహన యజమాని సాధ్యమైనంత వరకూ పరిష్కారం పరివాహన్ సైట్ ద్వారా సమస్యలు వస్తున్నమాట వాస్తవమే. మా పరిధిలో ఉంటే సమస్యను సాధ్యమైనంత వరకూ పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్ మన సైట్లో మారినా పై స్థాయిలో మారకపోవడం వల్ల, గ్రామ సచివాలయాల్లో అప్డేట్ కాక ఇబ్బందులు పడుతున్నారు. – కె.శ్రీధర్, డీటీసీ, కాకినాడ పోర్టల్‌లో ప్రారంభించి ఏడాదైనా పూర్తి స్థాయిలో అందని సేవలు కనిపించని పాత వాహనాల వివరాలు, లైసెన్స్ డేటా ఇన్సూరెన్స్ది అదే పరిస్థితి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాహనదారులు కమీషన్ ఇస్తేనే ఫిట్నెస్ -
మూలగ్రంథాలే సర్వదా ప్రామాణికం
● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ● సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ఆరంభం రాజమహేంద్రవరం రూరల్ : మూలగ్రంథాలే మనకు సర్వదా ప్రామాణికం, ధర్మాధర్మాల విచక్షణలో, వివేచనలో మూలగ్రంథాలనే అధ్యయనం చేయాలి. అనువాద రచనలలో సాహితీ సౌరభాలు ఉండవచ్చును, కానీ మూలగ్రంథాలే మనకు శిరోధార్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం హిందూ సమాజంలో వేదవ్యాస భారత ప్రచవన యజ్ఞం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ ‘సంప్రదాయ విరుద్ధమైన మాట నా నోట రాకూడదని జగన్మాతను ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు. భారతంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, శాంత్యనుశాసన పర్వాలపై గతంలో 18 రోజులు ప్రవచనాలు అందించానని, సంపూర్ణ భారతంపై హైదరాబాద్‌లో 18 రోజులు ప్రవచించానని అన్నారు. పండిత వరేణ్యులు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది చంద్రశేఖరశాస్త్రి తదితరులు భారతానికి చక్కటి వ్యాఖ్యానాలు చేశారు. కొందరు కవులు, కొన్ని సినిమాల్లో అవగాహనా లోపంతో కువ్యాఖ్యానాలు చేశారు. వేద పురాణేతి హాసాలను కలిపి చూడాలి, అప్పుడే మనకు రామాయణ, భారత, భాగవతాదుల పట్ల సరి అయిన అవగాహన కలుగుతుందని సామవేదం అన్నారు. భారతంపై కొందరు కవుల రచనలలో అపోహలు, అపార్థాలతో పాటు నిందలు కూడా చోటు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ప్రపంచ వాజ్ఞ్మయంలో ‘ఇలియట్’, ఒడిస్సీ వంటి అతి పెద్ద గ్రంథాలు లేకపోలేదు. కానీ భారతానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇతర ప్రపంచ సాహిత్యంలో కానరావు. తెలుగు వారికి కవిత్రయ భారతంతో ఆత్మీయతానుబంధం ఉన్నదని సామవేదం అన్నారు. ప్రపంచ సాహిత్యంలో భారతం వంటి మరో గ్రంథం లేదని సామవేదం స్పష్టం చేశారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒంటి చేత్తో రామాయణ, భారత, భాగవతాలను రచించిన కవిసార్వ భౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి రాజమహేంద్రనగరానికి చెందిన వారే, అలాగే, రామాయణ, భారత, భాగవతాలను రాజమహేంద్రవరంలో ప్రవచనం చేసిన ఖ్యాతి సామవేదానికే దక్కిందన్నారు. కంచి, శృంగేరీ పీఠాల నుంచి ఆశీస్సులను, మంత్రాక్షతలను ఆయన అందజేశారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ వేదవ్యాసమహర్షి మూడు సంవత్సరాల కాలంలో భారతాన్ని నిర్మించారని, అధర్మం ఏదో తెలుసుకుని దానిని వదిలిపెట్టాలని భారతం మనకు చెబుతోందన్నారు. మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఘన సమ్రాట్ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠీ, హిందు సమాజం ట్రస్టీ న్యాపతి సుబ్బారావు తదితర ప్రముఖులు ప్రసంగించారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభను నిర్వహించారు. -
సమగ్ర శాసీ్త్రయ కులగణన చేపట్టాలి
యానాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. యానాం గీతా మందిరంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రతినిధుల సమావేశం మల్లాడి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారథన్ మహారాజు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్లు మాదిరిగా ఏపీలోనూ స్థానిక సంస్థల్లో అమలు చేయాలన్నారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోని లోపాలను సరిదిద్ది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. జాతీయస్థాయిలో ఉద్యమ నిర్మాణం చేపడతామని, త్వరలో ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఈ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గారమేష్, పెస్పింగి ఆదినారాయణ, గూడూరి వెంకటేశ్వరరావు, బీసీ రమణ, కర్రి చిట్టిబాబు, ఘంటసాల వెంకటలక్ష్మి, కడలి ఈశ్వరి, చొల్లంగి వేణుగోపాల్, మన్నే నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు
కాకినాడ రూరల్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు 10 మంది, టైపిస్టులు 8మంది సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న 18 మందికి గురువారం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఉద్యోగులకు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు అందజేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను జెడ్పీ చైర్మన్ అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వడం ద్వారా ప్రజా సేవ చేయాలన్నారు. ఏపీపీఆర్ ఎంఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థిని మిరియాల ప్రియదర్శిని రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంద్రనాథ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా సోంపూడిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎంపికయింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు కేరళలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. ఆమె 9వ తరగతి చదువుతోందని, ఫిజికల్ డైరెక్టర్ టి.సరస్వతి విద్యార్థినికి శిక్షణ ఇచ్చినట్టు హెచ్ఎం చెప్పారు. -
సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో బాటు పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు వేలాదిగా తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, స్వామివారి వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. -
క్రికెట్ ట్రోఫీకి శ్రీప్రకాష్ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ విజయ్ మర్పంట్ క్రికెట్ ట్రోఫీకి అండర్–16 విభాగంలో కాకినాడ శ్రీప్రకాష్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ గురువారం తెలిపారు. పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న జి.లక్ష్మీగౌతమ్, 10వ తరగతి విద్యార్థి కె.తమన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామనడానికి ఇదే నిదర్శమని తెలిపారు. భవిష్యత్తులో తమ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, కోచ్ దుర్గాప్రసాద్‌ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరిష్, కార్యదర్శి నక్కా వెంకటేష్, శ్రీప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ సమీరా అభినందించి, మెమెంటోలతో సత్కరించారు. -
పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
తుని: పట్టణంలోని బెల్లపువీధిలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి త్రుటిలో ముప్పు తప్పింది. పాయకరావుపేటకు చెందిన ఓ పెళ్లి బృందం బాజా భజంత్రీలతో పెళ్లి వేడుక నిర్వహిస్తోంది. వీరంతా కల్యాణ మండపంలో భోజనాలు చేస్తుండగా, వసతి గదులున్న ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గదిలో ఉన్న ఏసీ నుంచి మంటలు చెలరేగి, కల్యాణ మండపం పొగతో కమ్మేసింది. దీంతో పెళ్లి బృందం వారికి ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. రెండు ఫ్లోర్లలోనూ పొగ కమ్మేయడంతో పెళ్లి బృందం అరుపులు కేకలతో పరుగులు తీశారు. గదిలో ఓ వృద్ధురాలు మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో పెళ్లి బృందం వారు మరింత ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహకారంతో లోపలికి వెళ్లి వృద్ధురాలిని కాపాడారు. మంటలను అదుపు చేయడంతో అంతా ఊరిపి పీల్చుకున్నారు. -
శరణు..శరణు
బిక్కవోలు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి వేడుకలు జిల్లాలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. జిల్లాలోనే పేరు గాంచిన బిక్కవోలు ప్రాచీన గోలింగేశ్వరస్వామి ఆలయంలో కొలువైన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లె శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజాము 1.10 గంటలకు తీర్థపు బిందె సేవతో షష్ఠి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి సేవ అనంతరం దర్శనం కోసం భక్తుల వెల్లువ కొనసాగింది. నాగుల చీరలు ధరించి.. భక్తులు గోదావరి కాలువలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సంతానం లేని మహిళలు ఆలయం వెనుక నాగులు చీరలు ధరించి నిదురించారు. 9 గంటలకు స్వామివారికి నెమలి వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్ కచేరీలు వచ్చిన భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సాధారణ దర్శనానికి మూడ గంటలు, వీఐపీ, రూ.100 దర్శనాలకు రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు వితరణ ఆలయానికి వచ్చిన భక్తులకు, చిన్నారులకు పలు స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, పాలు, మజ్జిగ, బిస్కట్లు పంపిణీ చేశాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ భారీ స్థాయిలో జరిగిన బాణసంచా కాల్పులను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్యాండ్ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాల నడుమ రాత్రి 11 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ బాణసంచా ప్రదర్శనలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా షష్ఠి వేడుకలు సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు కిటకిటలాడిన ఆలయాలు బిక్కవోలుకు పోటెత్తిన భక్తులు -
తెలుగు సినీ హాస్య దిగ్గజం రేలంగి
కొత్తపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు సినీ రంగంలో హాస్య దిగ్గజంగా మన్ననలు అందుకున్నారు రేలంగి వెంకట్రామయ్య. వందేళ్ల తెలుగు సినీ రంగ చరిత్రలో హాస్య నటునిగా, హాస్య పితామహునిగా సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు ఎందరు హాస్యనటులు వచ్చినా రేలంగికి సాటి లేరన్నట్టుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హాస్య నటునిగా చరిత్రలో నిలిచారు. రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య 1910 ఆగస్ట్ 9న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో రామదాసు (రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవారు. చిన్నతనంలో తండ్రి వద్దే రేలంగి ఈ విద్యలు నేర్చుకున్నారు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. కాకినాడ మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నారు. రేలంగి రూపం చూసి తండ్రి పోలీసును చేయాలని ఆశపడ్డారు. కానీ రేలంగి దృష్టి నాటక రంగం వైపు మళ్లింది. చదువుకునేటప్పుడే నాటకాల్లో నటించారు. దాంతో చదువు సజావుగా సాగలేదు. రామదాసు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, కుమారుడిని ఎంఎస్ఎస్ చార్టీస్ సాయంతో చదివించాలనుకున్నారు. నాటకాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండడంతో రేలంగి చదువు తొమ్మిదో తరగతిలో ఆగిపోయింది. నాటక రంగ ప్రవేశం ఓసారి రామదాసు తన కుమారుడిని యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజీయం అనే నాటకానికి తీసుకెళ్లారు. అది రేలంగికి బాగా నచ్చి, తానూ నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. తండ్రికి తెలియకుండా నాటకాల్లో నటించడం మొదలెట్టారు. యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్లో చేరి 1919లో తన పదో ఏట బృహన్నల అనే నాటకంలో తొలిసారి సీ్త్ర పాత్రలో నటించారు. తర్వాత కాలంలో ఇదే క్లబ్లో ఎస్వీ రంగారావు, అంజలీదేవి తదితరులూ నాటకాలు వేశారు. అప్పట్లో ఆడ వేషాలకు నటులు అంతగా ముందుకు రాకపోవడంతో రేలంగికి విరివిగా అవకాశాలు వచ్చాయి. బుచ్చియమ్మతో వివాహం పెళ్లి చేస్తే జీవితం గాడిలో పడుతుందని భావించి తండ్రి రామదాసు తాడేపల్లిగూడెం పక్కనున్న పెంటపాడుకు చెందిన బుచ్చియ్యమ్మతో రేలంగికి పెళ్లి చేశారు. అప్పటికీ రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా, కళాకారుడిగా గౌరవించారు ఆయన బావమరుదులు. భార్య తరఫున ఎంత సంపద ఉన్నా, సొంత కాళ్లపై నిలబడాలని రేలంగి మళ్లీ నటించడం మొదలెట్టారు. వచ్చిన సంపాదనను భార్య చేతిలో పెట్టేవారు. వారికి జన్మించిన కుమారుడితో ఆ దంపతుల జీవితం అన్యోన్యంగా సాగింది. ప్రత్యేక అనుబంధం పౌరాణిక రంగస్థల, సాంఘిక నాటక కళాకారుడు, తెలుగు సినీ హాస్య నటుడు రేలంగికి కళలకు పుట్టినిల్లయిన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ లలిత కళా నికేతన్ వారు హాస్య బ్రహ్మగా పేరొందిన భమిడిపాటి కామేశ్వరరావు చేతుల మీదుగా హాస్య నటచక్రవర్తి బిరుదును అందుకున్నారు. ఇదే సభలో రేలంగిని గోదావరి జిల్లాల అభిమానులు సువర్ణ కంకణంతో ఘనంగా సత్కరించారు. అపర దానకర్ణుడు రేలంగి వెంకట్రామయ్యను అప్పట్లో అపర దానకర్ణుడిగా చెప్పుకొనేవారు. మద్రాసులో రేలంగి ఇంటి వద్ద నిత్య అన్నదానం జరిగేది. సాయం ఆర్థించి వెళ్లిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసిన గొప్ప వ్యక్తి రేలంగి అని చెబుతారు. గోదావరి ప్రాంతంపై ఉన్న మమకారంతో తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్ర మందిర్ పేరిట ధియేటర్ను నిర్మించారు. చివరి అంకంలో ఆయన అక్కడే స్థిరపడ్డారు. 1975 నవంబర్ 27న తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో వయోభారం, అనారోగ్యంతో బాధ పడుతూ తుది శ్వాస విడిచారు. గోదావరి తీరాన కాంస్య విగ్రహం ఉభయ గోదావరి జిల్లాలకు చిరపరిచితుడైన రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహం రాజమహేంద్రవరంలో నెలకొల్పారు. ఆయన అభిమానులు, రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేలంగి ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేటలో ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున దివంగత సినీ ప్రముఖుల విగ్రహాల సరసన గతేడాది సెప్టెంబర్ 19న విగ్రహావిష్కరణ జరిగింది.1935లో ప్రవేశం నాటక రంగంలో అనుభవమున్న రేలంగికి 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం ఆకట్టుకుంది. తానూ చలనచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం సినిమా నిర్మాణానికి నిర్మాత ఐ.రాజారావు సన్నాహాలు పూర్తి చేశారు. తబలా కళాకారుడు పరదేశి.. రేలంగిని దర్శకుడు సి.పుల్లయ్యకు పరిచయం చేశారు. అలా శ్రీకృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లో రేలంగిని దర్శకుడు పుల్లయ్య సినీ రంగానికి పరిచయం చేశారు. అందులో కొద్దిసేపు కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి పాత్రల్లో రేలంగి నటించారు. ఈ సినిమాలో నటనకు రేలంగికి నాలుగు నెలల బస, భోజనం పెట్టి, రూ.డైబ్భె పారితోషికం ఇచ్చారు. ఆ సమయంలో పుల్లయ్య వద్ద నటనతో పాటు, పలు సినీ విభాగాల్లో పని చేశారు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో రేలంగి కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత కీలుగుర్రం, నర్తనశాల, హరిశ్చంద్ర, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, జగదేకవీరుడు, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాల్లో నటించారు. అప్పట్లో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న హాస్య నటుడిగా రేలంగి గుర్తింపు పొందారు. నటుడిగా తారాస్థాయి అందుకున్న రేలంగి అనేక సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. 1954లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్మశ్రీ అవార్డును కళా రంగం నుంచి హాస్య నటునిగా అందుకున్న ఘనత రేలంగికే దక్కింది. 1970లో ప్రదానం చేసిన ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. ఆ సందర్భంగా మద్రాస్ పురవీధుల్లో తెలుగు, తమిళ మహా నటుల నడుమ రేలంగిని అంబారీపై ఊరేగించి, విజయా గార్డెన్స్‌లో ఘనంగా సన్మానించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి భారతీయ హాస్య నటుడు గోదావరి ప్రాంతంతో ఎనలేని అనుబంధం రాజమహేంద్రవరంలో ఆయన కాంస్య విగ్రహం నేడు 50వ వర్ధంతి -
కాలువకు పొంచి ఉన్న ముప్పు
● తవ్వేస్తున్న పోలవరం కుడి కాలువ గట్టు ● పరిహారం పొందినా.. 20 ఎకరాల్లో చేస్తున్న సాగు ● చదును చేసి కౌలుకు ఇస్తున్న వైనం గోపాలపురం: బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం కుడి ప్రధాన కాలువకు ముప్పు పొంచి ఉంది. మండలంలోని చెరుకుమిల్లి, చిట్యాల గ్రామాల మధ్య ఉన్న సుమారు 20 ఎకరాల కాలువ గట్టు మట్టిని కొల్లగొట్టి, ఆ భూమిని సాగులోకి తెచ్చేలా అక్రమార్కులు యత్నిస్తున్నారు. కాలువ తవ్వకాల సమయంలో ఆయా గ్రామాల రైతులకు భూముల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. భవిష్యత్తు అవసరాల మేరకు కాలువల విస్తరణ కోసం భూసేకరణ చేసింది. ఆ భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కాలువ గట్టు మట్టిని అమ్ముకోవడమే కాకుండా, ఆ భూమిలో సాగు చేపట్టారు. చెరుకుమిల్లి గ్రామంలో ఏకంగా కాలువ గట్టు సైతం తవ్వేశారు. దీంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని సమీప భూముల రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గట్టుపై నుంచి వర్షపు నీరు పోలవరం కుడి ప్రధాన కాలువకు వచ్చేలా ఏకంగా కాలువకు గండి కొట్టేశారు. అధిక వర్షం కురిస్తే కాలువలోకి వచ్చే వరద నీటితో పాటు, కాలువ కాంక్రీట్ కూడా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. చెరుకుమిల్లి, చిట్యాల కాంటూరు నంబరు 17, 18 వద్ద ఉన్న కాలువ గట్ల పటిష్టత పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. మట్టి తరలింపు అలాగే భీమోలు, గోపాలపురం, పెద్దాపురం, గుడ్డిగూడెం గ్రామాల మీదుగా వెళుతున్న పోలవరం కుడి ప్రధాన కాలువ గట్టు మట్టిని రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వి, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. చెరుకుమిల్లిలో గట్టు మట్టిని తరలించి, పొగాకు సాగు కోసం ఎకరం రూ.50 వేల నుంచి రూ.70 వేలకు కౌలుకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటువైపు కాలువకు సంబంధించిన అధికారులు కానీ, రెవెన్యూ, పోలీసు అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, కాలువ మరమ్మతులు చేపట్టి, గట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
దళారులకే
అమ్ముకోవాల్సి వస్తోంది ధాన్యం అమ్మాలంటే ముందుగా కనీసం రెండు రోజులపాటు ఆరబెట్టవలసి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉండాలనే నిబంధన శాపమైంది. దళారులకు రూ.1,550కు విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. సీఎంఆర్‌కు ఇచ్చే 75 కేజీల బస్తాకు రూ.1,777 ఇవ్వాలి. కానీ రూ.1,670 ఇస్తున్నారు. 33శాతం నష్టం అంచనాలతో ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని చెబుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. – ఇంటి రమేష్, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం పంటను ప్రభుత్వం కొననంటే ఎలా? నాలుగు ఎకరాల పొలం సాగు చేస్తున్నాను. ఈ ఏడాది పంట ఏపుగా పెరగటంతో ఎకరానికి 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుందనుకున్నాను. వర్షాల దెబ్బకు ఎకరానికి 30 బస్తాల చొప్పున నాలుగు ఎకరాలకు 120 బస్తాల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలకు వెళితే ఎకరానికి 24 బస్తాల చొప్పున 96 బస్తాలే కొంటామంటున్నారు. అసలే ఈ ఏడాది తుపాను ప్రభావంతో మాసూళ్లకు పెట్టుబడులు అధికమవ్వటమే కాకుండా దిగుబడులు తగ్గిపోయాయి. వచ్చిన పంటను ప్రభుత్వం కొననంటే ఎలా? –పెంకే సత్యనారాయణ, రైతు కాజులూరు -
గోవుల మరణాలపై సమగ్ర విచారణ
రాజమహేంద్రవరం రూరల్: రాజమండ్రి సమీపంలోని బొబ్బిల్లంకలో ఉన్న భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న అంశంపై సమగ్ర విచారణకు ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిల్లంకలోని భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో చనిపోయిన గోవులు ఎన్ని, ఏ కారణాల వల్ల చనిపోయాయి, గోశాల సామర్థ్యం ఎంత, సిబ్బంది, ఆహారం, నీటి నిల్వలు తదితర అంశాలపై సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్ ఆర్టీఐ కింద 2023 అక్టోబర్ 30న సమాచారాన్ని అడిగారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, గతేడాది జూన్‌లో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో సెకెండ్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసును ఈ ఏడాది ఆగస్ట్ 12న విచారణ చేసిన ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గోశాలలో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. గోశాల నిర్వహణలో లోపాలను గుర్తించింది. సీసీ కెమెరాలు పని చేయటం లేదని, రికార్డులను సరిగా నిర్వహించటం లేదని నివేదికలో పేర్కొంది. గోశాల నిర్వహణను ఎండోమెంట్ శాఖకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గోవులను రెగ్యులర్‌గా పర్యవేక్షించేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌ను నియమిస్తూ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మంగళగిరి కమిషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విచారణకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ప్రత్యక్షంగా హాజరై, విచారణ నివేదిక కమిషనర్‌కు, దరఖాస్తుదారుకు సమర్పించారు. భగవాన్ మహావీర్ జైన్ గోశాల ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందని, ప్రభుత్వ యంత్రాంగం అఽధీనంలో లేదని ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దృష్టికి తీసుకొచ్చారు. గోశాల ప్రైవేటు సంస్థ నిర్వహణ కింద ఉన్నప్పటికీ, గోవుల సంరక్షణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. గోశాలలో గోవుల మరణాల ఆరోపణలు, వాస్తవ పరిస్థితిపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఆదేశించిన ఆర్టీఐ కమిషనర్ -
27న నిధి ఆప్కే నికట్
రాజమహేంద్రవరం రూరల్: నిధి ఆప్కే నికట్ కార్యక్రమం రాజమహేంద్రవరం ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగుతుందని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వెంకటేశ్వర్లు కలువాయి ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో ఎం/ఎస్ లూఫియన్ ఫార్మాలో, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రైట్ ఇంజినీరింగ్ కాలేజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎస్.యానాంలోని ఎం/ఎస్ వేదాంత లిమిటెడ్, ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం కడగట్ట ఏపీనిట్ పక్కన శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కాలేజీ, పశ్చి మ గోదావరి జిల్లాలో భీమవరం యనమదుర్రు ఎం/ఎస్ సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. మోసాల నివారణ, విజిలెన్స్ అవగాహన, పాస్‌బుక్ తనిఖీ, సభ్యులకు సేవలు, యూఏఎన్ ఖాతాల డీఫ్రీజింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్లు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిధి ఆప్కే నికట్ అని పేర్కొంటూ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇక్కడ సమర్పించవచ్చని తెలిపారు. శ్రీప్రకాష్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలుతుని: పట్టణంలోని శ్రీప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో బుధవారం హెటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ క్యాంపస్ ఇంట ర్వ్యూలు నిర్వహించింది. కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల ఫైనలియర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమెరిస్టీ, బీఫార్మసీ, ఎం.ఫార్మిసీ విద్యార్థులు వంద మందికి పైగా హాజరయ్యారు. కంపెనీ హెచ్ఆర్ హెడ్ జి.రాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించారు. కంపెనీలో క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్స్యూరెన్స్, ప్రొడక్షన్ తదితర విభా గాల్లో పని చేసేందుకు అర్హత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంపికైన వారిని విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ అభినందించారు. హెచ్ఆర్ సీహెచ్ మణికంఠ, వైస్ ప్రిన్సిపాల్ పెను గొండ సుబ్బారావు, ఐక్యూఐసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్‌కుమార్ త్రిపాఠి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఖైదీ మృతి
కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, గుంటూరు సమీపంలో అంకిరెడ్డిపాలేనికి చెందిన మెట్టు భాస్కర్‌రెడ్డి(53).. 30 ఏళ్ల క్రితం బాబాయి, కొడుకు హత్యలకు గురైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. పాతికేళ్ల పాటు బెయిల్‌పై ఉండి, ఐదేళ్ల నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 31న అనారోగ్యానికి గురయ్యాడు. రాజమహేంద్రవరం వైద్యుల సిఫార్సు మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆరోగ్యం విషమించి బుధవారం మధ్యాహ్నం మరణించాడు. దీనిపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.జాతీయ బ్యాడ్మింటన్‌లో హరికృష్ణ, చరణ్‌రామ్‌కు కాంస్యంసామర్లకోట: జాతీయ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలుర డబుల్స్ విభాగంలో సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి హరికృష్ణ, చిత్తూరు జిల్లాకు చెందిన తిప్పన చరణ్రామ్ జంట తృతీయ స్థానం సాధించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్‌లో జరిగిన యోనెక్స్–సన్‌రైజ్ 48వ జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల జంట ప్రతిభ చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో హరికృష్ణ–చరణ్రామ్ కాంస్య పతకాన్ని పొందారు. -
‘కల్ట్’ షూటింగ్ ప్రారంభం
బోట్‌క్లబ్: అస్త్ర మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించనున్న ‘కల్ట్’ సినిమాకు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో డైరెక్టర్ హరీష్ ముహూర్తపు షాట్‌ను క్లాప్ కొట్టి బుధవారం ప్రారంభించారు. నూతన నటీనటులతో సినిమాలను నిర్మిస్తున్నట్లు కో నిర్మాత ప్రసాద్ తెలిపారు. హీరో శ్రీమంత్, హీరోయిన్ అక్షర మాట్లాడుతూ యువతలో క్రికెట్ పట్ల ఉండే ఇష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీస్తున్నట్టు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తీస్తున్నటు తెలిపారు. గతంలో సర్కర్ , ఆలోచించు అర్జున్ తదితర సినిమాలు తీశామన్నారు. షణ్ముఖనాథునికి ప్రత్యేక పూజలు కరప: సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. షణ్ముఖ నాథునికి తెల్లవారు జాము నుంచి భక్తులు పూజలు, అభిషేకాలు చేయించుకున్నారు. పెనుగుదురు – కరప, గ్రామాల మధ్య నిర్మించిన 51 అడుగుల వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం వద్ద తెల్లవారు జాము నుంచి వేద పండితులు ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిక్కాల దొరబాబు, సావిత్రి దంపతులు, సుబ్బారావు, అనూరాధ దంపతులతో వివిధ పూజా కార్యక్రమాలు జరిపించారు. సిరిపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు, సుబ్బారావు సోదరులు ఈ విగ్రహాన్ని నిర్మించారు. 11న మాదిగల ఆత్మీయ కలయిక అమలాపురం రూరల్: అమలాపురం మండలం పేరూరు కొంకాపల్లిలోని సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వచ్చే నెల 11న ఉదయం 10 గంటలకు మాదిగల ఆత్మీయ కలయిక జరుగుతుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తెలిపారు. మండలంలోని రోళ్లపాలెం గ్రామంలో నేదునూరి నాతానియేలు నివాసం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో మాదిగల ఆత్మీయ కలయిక పోస్టర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడికి శ్రీరాములు, నూటుకుర్తి సత్యనారాయణ, బడుగు శ్రీనివాసరావు, పెదపూడి శ్రీనివాసరావు, మంద రామకృష్ణ, సవరపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి విరాళంఅయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు నాయర్ నిఖిల్, వెంకట సత్యపావని దంపతులు బుధవారం రూ.25 వేలు విరాళం అందజేశారు. ఈ సొమ్మును దాత ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
జుడో పోటీల్లో పతకాల పంట
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జుడో అసోసియేషన్, ఏపీ జుడో అసోసియేషన్, శాప్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సంయుక్త సహకారంతో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లా సీనియర్ జుడో చాంపియన్ షిప్ పోటీల్లో కాకినాడ జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని డీఎస్డీఓ వి.సతీష్‌కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ వెయిట్ కేటగిరీల్లో మొత్తం 14 మెడల్స్, ఇందులో ఏడు స్వర్ణ, నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు సాధించినట్టు చెప్పారు. పురుషుల విభాగంలో టీం చాంపియన్ షిప్ ప్రథమ స్థానం, మహిళా విభాగంలో టీం చాంపియన్ షిప్ ద్వితీయ స్థానం కాకినాడ జిల్లాకు దక్కిందని వివరించారు. మొత్తం ఏడు స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్‌లో వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి సీనియర్ జుడో చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, డీఎస్ఏ జుడో కోచ్ పి.వెంకటతేజను డీఎస్డీఓ అభినందించారు.రాష్ట్ర స్థాయిలో 14 మెడల్స్ కై వసం -
నాలుగేళ్లుగా కోనసీమలో హెచ్ఐవీ కేసులు ఇలా..
సంవత్సరం హెచ్ఐవీ పాజిటివ్ కేసులు గర్భిణులకు పరీక్షలు పాజిటివ్ కేసులు 2022–23 47,291 358 30,320 2 2023–24 44,468 392 26,407 7 2024–25 45,913 311 17,866 9 2025–26 31,280 125 16,643 4 (అక్టోబర్ వరకు) రాయవరం: హెచ్ఐవీ నియంత్రణకు సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలే శ్రేయస్కరం. సమాజంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ మహమ్మారి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధిగా వేళ్లూనుకుంది. గతంలో ఈ వ్యాధిపై నలుగురిలో మాట్లాడాలంటే సంశయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దశాబ్ద కాలానికి ముందు చాపకింద నీరులా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. సురక్షితం కాని శృంగారం ఎంత ప్రమాదకరమో కరపత్రాల ద్వారా చాటి చెప్పడంతో క్రమంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. బహిరంగ చర్చ సాధారణం కావడంతో, కొన్నేళ్లుగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. డిసెంబరు ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. హెచ్ఐవీ అంటే.. హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనేది ఎయిడ్స్ (ఎకై ్వర్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్)ను కలగజేస్తుంది. లైంగికంగా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులతో రక్తం ఎక్కించడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ వైరస్ బలహీనపరిచి, క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణింపజేస్తుంది. క్రమంగా తగ్గుతున్న బాధితులు జిల్లాలో 2022–23లో 0.78 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024–25 నాటికి 0.63 శాతంగా ఉంది. 2025–26లో అక్టోబర్ నాటికి 0.40 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 31,280 మందిని పరీక్షించగా, 125 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే 16,643 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో నలుగురికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. గర్భిణుల్లో మాత్రం 2022–23 నుంచి గతేడాది వరకు కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ ఏడాది నినాదమిదే.. ‘అంతరాయాన్ని అధిగమించడం.. ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఏటా డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినంగా పాటిస్తారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎలా ఎదుర్కోవాలనే దానిపై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది ఓవర్‌కమింగ్ డిజరప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. అందరితో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్నదే దీని ఉద్దేశం. జిల్లాలో పరిస్థితి ఇలా.. హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు జిల్లాలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2000–2001లో 4,600 కేసులు నమోదు కాగా, 2005–06లో 6,107 కేసులు నమోదయ్యాయి. 2009–10లో ఈ సంఖ్య 8,933కు చేరింది. దీంతో జాతీయ స్థాయిలో హెచ్ఐవీపై ప్రకటించిన యద్ధం కారణంగా అన్ని స్థాయిల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పలు స్వచ్ఛంద సంస్థల కృషి కూడా అభినందనీయం. 2020–21లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి 3,933కు చేరింది. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 31,280 మందికి పరీక్షలు చేయగా, 125 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు 358 పాజిటివ్ కేసులు తేలాయి. 2023–24లో 392, 2024–25లో 311 పాజిటివ్ కేసులు గుర్తించారు. కోనసీమలో చికిత్స కేంద్రాలివే.. హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు అమలాపురం, రామచంద్రపురంల్లో ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే రాజోలు, కొత్తపేట, మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు, కిమ్స్ ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని నెలకొల్పారు. ప్రతి ఆస్పత్రిలో హైరిస్క్ వ్యాధిగ్రస్తులకు హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నారు. హెచ్ఐవీ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఆరు నెలలకు వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి గర్భిణీకి హెచ్ఐవీ టెస్ట్‌లు చేస్తున్నారు. తగ్గుముఖం పట్టిన హెచ్ఐవీ కేసులు వ్యాధిగ్రస్తుల జీవన శైలి మెరుగుకు కృషి కోనసీమలో 2022–23లో 358 కేసులు.. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 గుర్తింపు డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం కట్టడికి చర్యలు జిల్లాలో హెచ్ఐవీ సమస్య అదుపులోనే ఉంది. దీని తీవ్రత తెలుసుకున్న చాలా మంది అప్రమత్తంగా ఉంటున్నారు. హెచ్ఐవీ బాధితులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ నుంచి బాధితుల రక్షణకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం. – డాక్టర్ భరతలక్ష్మి, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జరిగిన 41వ సీనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఐదు పతకాలు (4 కాంస్య, ఒకటి రజత) సాధించినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. వీరిలో పి.హరికిరణ్ రజత పతకం సాధించగా, వై.గంగాభవాని, జి.వంశీ, ఎల్ వెంకన్నదొర, ఎం హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. ఈ టోర్నమెంట్‌కు కోచ్‌గా పి.భార్గవి, మేనేజర్‌గా ఆర్ మణికంఠ వ్యవహరించారన్నారు. సీనియర్ ఏపీ టీం జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్‌ను డీఎస్డీఓ సతీష్‌కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వీరభద్రారెడ్డి, కార్యదర్శి జి.ఎలీషాబాబు, తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఎ.మధుసూదన్‌రావు, కోచ్‌లు డీఎన్ సత్యనారాయణ, ఎన్ తులసి, కేవీ సత్యనారాయణ, ఎంపీ త్రిమూర్తులు, ఎన్ రత్న తదితరులు అభినందించారు. -
మన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే గొప్పది
కాకినాడ లీగల్: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే గొప్పదని, ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కోర్టు హాలులో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను రాజ్యాంగం పరిరక్షించేలా న్యాయవ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రసాదించిందన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టి.పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.మూడో అదనపు జిల్లా జడ్జి ఆనంది -
నష్టం అంచనాలున్న
పొలాల్లో 24 బస్తాలే మోంథా తుపానుతో నష్టపోయినట్టు గుర్తించిన పంట పొలాల్లో ఎకరానికి 24 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తాం. పంట నష్టంపై సర్వే చేశాం. సామర్లకోట మండలంలో 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. రైతుల నుంచి ఎకరానికి 24 బస్తాలు చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తాం. 33శాతం పంట నష్టం జరిగిన రైతుల పంట భూములను తుపానులో నష్టపోయినట్టుగా అంచనా వేశాం. ఆ మేరకు 24 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నాం, – వి మురళీధర్, మండల వ్యవసాయ అధికారి, సామర్లకోట మండలం -
వీర్లా.. కొత్తవార్లా!
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా త్వరలో దేవదాయ శాఖకు చెందిన అధికారిని నియమించనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా ఉన్న వీర్ల సుబ్బారావు డెప్యూటేషన్ వచ్చే నెల 13వ తేదీతో పూర్తవుతూండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి ఆయనను అన్నవరం దేవస్థానం ఈఓగా డెప్యూటేషన్‌పై నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 29న జీఓ విడుదల చేసింది. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ అదే నెల 12న ఉత్తర్వులు ఇవ్వగా, సుబ్బారావు గత ఏడాది డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సుబ్బారావునే మరో ఏడాది పాటు ఇక్కడ ఈఓగా కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. వివాదాలు.. వివాదాస్పద నిర్ణయాలు ఫ వాస్తవానికి గడచిన ఏడాది కాలంగా అన్నవరం దేవస్థానంలో అనేక వివాదాలు నెలకొన్నాయి. ఫ గత ఏప్రిల్‌లో నీటి ఎద్దడి కారణంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేవస్థానం సత్రాల్లో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఈఓ సుబ్బారావు ఆదేశించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్క రోజులోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఫ దేవస్థానంలో ఈఓ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువవడంతో ‘చినబాబొచ్చారు.. బహుపరాక్’ శీర్షికన ఏప్రిల్‌లో ‘సాక్షి’ ప్రచురించిన కథనం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ అలాగే, ఈఓ వేధిస్తున్నారంటూ సిబ్బంది సెలవుకు దరఖాస్తు చేయడం, కొంతమంది వీఆర్ఎస్పై వెళ్లడం వంటి వాటిపై ‘స్వామీ.. నీ కొలువుకు సెలవు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. వీటితో పాటు మీడియాలో పలు వివాదాలపై కథనాలు ప్రచురితమవడంతో వీటిపై విచారణకు కమిషనర్ ఆదేశించారు. ఆ మేరకు అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్ ఏప్రిల్ 23న దేవస్థానంలో అధికారులతో సమావేశమై, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. విచారణకు హాజరైన వారందరూ ఈఓ తమను వేధిస్తున్నారని చెప్పారు. ఆ మేరకు చంద్రకుమార్ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఈఓ సుబ్బారావును బదిలీ చేస్తారని భావించారు. కానీ, ఆవిధంగా జరగలేదు. అయితే, మూడు నెలల క్రితం కమిషనర్ ఒక మెమో జారీ చేస్తూ, దేవస్థానం సిబ్బందితో సఖ్యతగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు కూడా వారితో గొడవ పడొద్దని ఈఓకు సూచించారు. ఒక ఈఓకు కమిషనర్ ఈవిధంగా మెమో ఇవ్వడం అన్నవరం దేవస్థానం చరిత్రలో అదే ప్రథమం కావడం విశేషం. ఫ మరోవైపు దేవస్థానంలో జరిగే ప్రతి వ్యవహారం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడం, కనీసం చిన్నపాటి ఉద్యోగి బదిలీ కూడా ప్రజాప్రతినిధి ఆదేశాలు లేకుండా చేయకపోవడం కూడా వివాదాస్పదమైంది. దీనివలన గతంలో రూ.10తో అయ్యే పనికి ఇప్పుడు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఫ ఈ వివాదాల ఫలితమో ఏమో కానీ, భక్తులతో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలలో అన్నవరం దేవస్థానం పలు విభాగాల్లో చివరి స్థానంలో నిలిచింది. ఆ తరువాత కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానంలో తనిఖీ చేసి సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటికీ దాదాపు 30 శాతం భక్తులు దేవస్థానంలో వివిధ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కార్తికం విజయవంతమైనా.. ఇదిలా ఉండగా ఇటీవల కార్తిక మాసం ఎటువంటి దుస్సంఘటనలూ లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఆ నెల రోజులూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవాలయం ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఈ నెల 5న గిరి ప్రదక్షిణ, ఇతర రద్దీ రోజుల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు, కాకినాడ డెప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావులను కమిషనర్ నియమించిన విషయం తెలిసిందే. వీరందరి కృషితోనే కార్తిక మాసం విజయవంతమైందని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో అందరూ ఈఓనే అభినందిస్తారు. కానీ, ఉన్నతాధికారులు సుముఖంగా లేనందువల్లనే ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆర్జేసీ వైపు మొగ్గు అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో గతంలో ఇక్కడ రెండుసార్లు ఈఓగా పని చేసిన ప్రస్తుత దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) వి.త్రినాథరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గత ఏడాది కూడా ప్రయత్నించారు. అప్పుడు ఒక సీనియర్ నాయకుడు వచ్చేసారి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా రెండేళ్ల క్రితం డీసీలుగా పదోన్నతి పొందిన అధికారులు కూడా ఈఓగా రావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ఈఓను నియమిస్తారా లేక ప్రస్తుత ఈఓ సుబ్బారావునే మరో ఏడాది కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. ఫ అన్నవరం దేవస్థానానికి కొత్త ఈఓ నియామకంపై పుకార్లు ఫ వచ్చే నెల 13తో ముగియనున్న ప్రస్తుత ఈఓ డెప్యూటేషన్ ఫ మరో ఏడాది కొనసాగేందుకు సుబ్బారావు ప్రయత్నాలు! ఫ ఈ పోస్టుపై పలువురి ఆశలు -
ప్రభుత్వం అన్నిటా విఫలం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో జిల్లా కార్యదర్శి కె.బోడకొండ అధ్యక్షతన మంగళవారం జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, రైతులు, విద్యా రంగానికి కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని చెప్పి ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం దారుణమని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి, నిర్మించిన ఇళ్లను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని, దీనివలన పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఏర్పడిందని ఈశ్వరయ్య ఆరోపించారు. ఇప్పటికై న కట్టిన టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. రోజుకు 14 గంటల పని వంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడంపై ఈశ్వరయ్య మండిపడ్డారు. కార్మికులు దీర్ఘకాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్మిక చట్టాల ఉల్లంఘనకు గానీ, కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించే వ్యవస్థకు గానీ సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు, లోకేష్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలు చేస్తూ, పెట్టుబడులు వస్తున్నాయంటున్నారని, రాష్ట్రంలో ఒక్క పెద్ద పరిశ్రమయినా ప్రారంభమైందా, ఒక్క కొత్త ప్రాజెక్టు వచ్చిన ఆధారం ఉందా అని ఈశ్వరయ్య ప్రశ్నించారు. కార్పొరేట్ల పాలనకు ప్రజలు వెతుకుతున్న ప్రత్యామ్నాయం ఎరజ్రెండా పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు సీపీఐ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగుతాయని, ఈ సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు, వామపక్ష అభిమానులు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు తరలి రావాలని ఈశ్వరయ్య కోరారు. పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, కార్మిక, రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. దీనికి భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విస్తృత సామాజిక, రాజకీయ ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుట్టబోతోందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ, ప్రపంచ కోటీశ్వరులకు సేవలందించే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, పప్పు ఆదినారాయణ, శాఖ రామకృష్ణ, ఎ.భవాని తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఆనంద భారతి గ్రౌండ్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్జీఓ హోమ్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఫ హామీలు అమలు కావడం లేదు ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య -
జ్ఞాన పథం.. విజ్ఞాన రథం
కాకినాడ క్రైం: విజ్ఞాన రథం కదిలొచ్చింది. స్కిల్ ల్యాబ్ ఆన్ వీల్స్ విద్యార్థుల విజ్ఞాన తృష్ణను తీర్చింది. వారి బంగారు భవితకు జ్ఞానపథాన్ని పరచింది. రూ.లక్షలు వెచ్చించినా లభ్యం కాని విశేష జ్ఞానాన్ని పంచి, బెస్టాఫ్ లక్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ఈ స్కిల్ ల్యాబ్ బస్సుకు రూపకల్పన చేసింది. ఈ బస్సు దేశం మొత్తం సంచరిస్తోంది. ప్రభుత్వ నేతృత్వంలో ఈ సంస్థే విజ్ఞాన విస్తరణకు అవసరమైన వ్యయాన్ని భరిస్తోంది. వైద్య విద్యార్థుల్లో శస్త్రచికిత్స నైపుణ్యతను మెరుగుపరిచి, ఆధునికతను జోడించి, ఆ ప్రయోజనాలు ప్రజలకు అందేలా వైద్యుల్ని సంసిద్ధుల్ని చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వ్యయం లేని ఈ శిక్షణను వైద్య విద్యార్థులకు ఓ వరంలా అందించడమే ఈ స్కిల్ ల్యాబ్ ఉద్దేశం. ఇదీ బస్సు ప్రత్యేకత సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఈ బస్సులో ఐదు లాప్రోస్కోపిక్ సెట్లు ఉన్నాయి. వీటి ధర రూ.3 కోట్లు. పూర్తి ఎయిర్ కండీషన్‌తో కూడిన ఈ బస్సు లోపల ఐదు స్క్రీన్లతో పాటు ఐదు ల్యాప్ సెట్లు ఉంటాయి. వీటిని చైన్నెకి చెందిన ఇద్దరు సీనియర్ సాంకేతిక నిపుణులు నిర్వహిస్తూంటారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ గంభీర ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా 22 రోజుల పాటు సంచరించే ఈ బస్సు ద్వారా 1,300 మంది పీజీ, జూనియర్ డాక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. గత నెల 11న చైన్నెలో ప్రారంభమైన ఈ బస్సు విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని వైద్య కళాశాలల్లోని పీజీలకు శిక్షణనిచ్చింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు (ఆర్ఎంసీ) వచ్చి రెండు రోజుల శిక్షణ అనంతరం గుంటూరు బయల్దేరింది. ఏం నేర్పారంటే.. రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాపులో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లైవ్ టిష్యూ, సిమ్యులేటర్లు, ట్యూబింగెన్ మోడల్‌పై అవగాహన కల్పించారు. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విధానాలైన ల్యాప్ ఫండోప్లికేషన్, ల్యాప్ బౌల్ అనాస్టమోసిస్, ల్యాప్ స్ప్లీనెక్టమీ, ల్యాప్ హిస్టరెక్టమీ, ల్యాప్ కొలిసిస్టెక్టమీలపై పీజీలు, జూనియర్ డాక్టర్లకు ప్రయోగాత్మక బోధన అందించారు. వీటితో పాటు నిత్యం నిర్వహించే సాధారణ శస్త్రచికిత్సల పైనా అవగాహన కల్పించారు. కళాశాల ప్రయోగశాలల్లో దొరకని ఆవు, పంది జంతువుల కణజాలాలతో శస్త్రచికిత్స ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు. ఈ రెండు జంతువుల కణజాలాలే ఎంచుకునేందుకు ప్రధాన కారణం వీటి దేహ నిర్మాణం మనుషుల దేహ నిర్మాణంతో సారూప్యత కలిగి ఉండటమేనని సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సింహాద్రి చెప్పారు. 2 రోజులు... 70 మంది రెండు రోజుల పాటు 70 మంది జూనియర్ డాక్టర్లు, పీజీలు ఈ శిక్షణ ప్రయోజనాలను అందిపుచ్చుకున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మొత్తం 10 బ్యాచ్‌లు ఈ శిక్షణలో పాల్గొన్నాయి. రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ పర్యవేక్షణలో సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీలు పి.నరేష్కుమార్, అనురాగమయి, హరిణితో పాటు సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.హేమంతి విద్యార్థులకు బోధించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శశి సమక్షంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్ సోమవారం ఈ శిక్షణను ప్రారంభించారు. జాన్సన్ అండ్ జాన్సన్ తరఫున ఏపీ రీజినల్ సేల్స్ మేనేజర్ మురళీకృష్ణ, జోనల్ మేనేజర్ పీకే రాజు పర్యవేక్షించారు. ఫ రంగరాయ వైద్య కళాశాలలో స్కిల్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫ వైద్య విద్యార్థులకు రెండు రోజుల పాటు శిక్షణ ఫ అధునాతన శస్త్రచికిత్సలపై శిక్షణ పొందిన 70 మంది వైద్యులు వైద్య విద్యార్థులకు వరం జాన్సన్ అండ్ జాన్సన్ సౌజన్యంతో నిర్వహించిన స్కిల్ ల్యాబ్ శిక్షణ వైద్య విద్యార్థులకు ఓ వరం. జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ పీజీలు, జూనియర్ వైద్యులు ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకొని లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విధానాలను మరింత మెరుగుపరుచుకున్నారు. సంస్థ యాజమాన్యంతో పాటు ఏర్పాటుకు చొరవ చూపి, శిక్షణను ప్రారంభించిన డీఎంఈ డాక్టర్ రఘునందన్‌కు ధన్యవాదాలు. – డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్, ప్రిన్సిపాల్, ఆర్ఎంసీ, కాకినాడ ప్రాక్టీస్‌కు ఎంతో తోడ్పడుతుంది స్కిల్ ల్యాబ్ బస్సులో ఇచ్చిన శిక్షణ ఎంతగానో తోడ్పడింది. లాప్రోస్కోపిక్ సిమ్యులేషన్ను పెంచింది. లాప్ పరికరాల నిర్వహణ, ఉపయోగించే తీరు, లాప్ ద్వారా సూచరింగ్ టెక్నిక్స్ కొత్తగా నేర్చుకోగలిగాం. ఆధునిక శస్త్రచికిత్స విధానాలపై అవగాహన పెరిగింది. రోగులకు శస్త్రచికిత్స సేవలు అందించే రోజువారీ ప్రాక్టీస్‌కు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ రొంగలి శ్రీలాస్య, పీజీ ఫస్టియర్, జనరల్ సర్జన్, ఆర్ఎంసీ, కాకినాడ -
వారాహి అమ్మవారికి ఆభరణాల సమర్పణ
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాత అమ్మవారికి పలువురు భక్తులు, దాతలు మంగళవారం వివిధ ఆభరణాలు సమర్పించారు. ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి రూ.25 వేల విలువైను వెండి రుద్రాక్ష మాల, మేడపాటి శ్రీకాంత్‌రెడ్డి అమ్మవారి ఉత్సవమూర్తికి రూ.20 వేల విలువైన వెండి కిరీటం, నల్లమిల్లి గణేష్‌రెడ్డి రూ.75 వేలు విలువైన హస్తాలు, చైతన్య బ్యాంకర్స్ సౌజన్యంతో అమ్మవారి ముఖ అలంకారాలు, వానపల్లి వెంకట గణేష్ బంగారం, వెండితో తయారు చేయించిన మంగళ సూత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ, భక్తులకు ప్రతి రోజూ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ వారాహి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్‌రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ యోగా పోటీలకు భవానీచౌదరి దేవరపల్లి: మండలంలోని చిన్నాయగూడేనికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి ఇమ్మణ్ణి అర్మిత భవానీ చౌదరి జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైంది. ప్రకాశం జిల్లా జి.పంగులూరు మండలం చందలూరులో ఈ నెల 24న జరిగిన రాష్ట్రస్థాయి అండర్–17 ట్రెడిషనల్ యోగా బాలికల విభాగంలో అర్మితా భవానీచౌదరి ప్రథమస్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023–24లో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమస్థానం, 2023లో అసోంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయస్థానం, ఉత్తర ప్రదేశ్‌లోని హజియాబాద్లో జరిగిన జాతీయ స్థాయి 2023 డిసెంబరులో జరిగిన యూవైఎస్ఎఫ్ ప్రపంచ యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించినట్టు ఆమె తెలిపారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 2024లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపినట్టు ఆమె చెప్పారు. 2025 జనవరిలో సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా చాంపియన్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ప్రతిభ చూపి ఐదో స్థానం సాధించినట్టు ఆమె చెప్పారు. ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. -
మరో ఏడాది కొనసాగేందుకు ఈఓ ప్రయత్నాలు
కొత్త ఈఓగా ఎవరిని నియమించాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తనను మరో ఏడాది కొనసాగించాలంటూ ఈఓ సుబ్బారావు పలువురు ప్రజాప్రతినిధుల సిఫారసులతో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఒక ప్రజాప్రతినిధి ఇప్పటికే లేఖ ఇచ్చారని అంటున్నారు. అయితే, మిగిలిన ప్రజాప్రతినిధులు దీనిపై అంత ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానంలో గత ఏడాది కాలంగా సుమారు 30 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇవన్నీ ప్రజాప్రతినిధుల సిఫారసులతోనే జరిగాయి. త్వరలో దేవస్థానంలో ఆరు అర్చక, రెండు ఘనపాఠి పోస్టులతో పాటు, ఒక పారాయణదారు పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. అలాగే, ఖాళీగా ఉన్న 20 వ్రత పురోహిత పోస్టుల భర్తీ కూడా జరగాల్సి ఉంది. -
రేపటి నుంచి ఉచిత కంటి పరీక్షలు
సామర్లకోట: పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకూ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రం విశ్రాంతి భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్మోహన్రావు ఈ వివరాలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎర్నేని కుటుంబ సభ్యులు శివ, శ్యామ్, సునీతల ఆధ్వర్యాన నటరాజ నాట్యాంజలి (అమెరికా), శంకర నేత్రాలయం ఆధ్వర్యాన ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కంటి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అవసరమైన వారికి అధునాతన సదుపాయాలతో కూడిన బస్సులోనే ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారన్నారు. ఆపరేషన్ జరిగిన రెండు గంటల్లోనే ఇంటికి పంపిస్తారని తెలిపారు. వారం రోజుల పాటు కంటి పరీక్షలకు హాజరయ్యే వారికి పంచారామ క్షేత్రం ఆధ్వర్యాన అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్వాహకులు శివ, సునీత మాట్లాడుతూ, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇస్తామని తెలిపారు. బయట కంటి ఆపరేషన్‌కు రూ.30 వేల వరకూ ఖర్చవుతుందని, తమ వాహనంలో డిసెంబర్ 1 ఉంచి 5వ తేదీ వరకూ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు. చైన్నె రాకపోకలకు ఖర్చులు పెట్టుకుంటే అవసరమైన వారికి రూ.5 లక్షల విలువైన ఆపరేషన్ ఉచితంగా చేయిస్తామని చెప్పారు. కంటి శిబిరానికి వచ్చే వారు ఫోన్ నంబర్, ఆధార్ జెరాక్స్ కాపీలు తీసుకు రావాలని, బీపీ, సుగర్ బాధితులు వారు వాడుతున్న మందులు తీసుకు రావాలని సూచించారు. పూర్తి వివరాలకు 98481 74374, 99519 11111 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా కంటి శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
సాఫ్ట్‌బాల్‌లో ఉమ్మడి తూర్పునకు ద్వితీయ స్థానం
ద్వితీయ స్థానంలో నిలిచిన బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిన బాలుర జట్టు ఐ.పోలవరం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 22 నుంచి 24 వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈ పోటీలు జరిగాయి. అండర్– 14 సాఫ్ట్‌బాల్ బాలబాలికల పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెండు జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఇరు జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ జట్లలో జి.వేమవరం ఉన్నత పాఠశాలకు చెందిన బాలురు ఆరుగురు, బాలికలు ఏడుగురు జట్టు విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించారు. బాలికల విభాగం నుంచి జి.వేమవరం పాఠశాల చెందిన ఎం బాబు బెస్ట్ పిక్చర్ గాను, మద్దింశెట్టి బాల ఆదిత్య బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా, బాలికల విభాగం నుంచి ఎం.ఝాన్సీ శ్రీ బెస్ట్ క్యాచర్‌గా అవార్డు అందుకున్నారు. రెండు జట్లలో స్థానిక క్రీడాకారులను సోమవారం స్థానిక పాఠశాలలో పాఠశాల హెచ్ఎం వారణాసి సుభద్ర లక్ష్మీదేవి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బసవ అప్పారావు, సర్పంచ్ నల్లా సుదర్శన్‌రావు సత్కరించారు. ఇరు జట్లకు కోచ్, మేనేజర్‌గా వ్యవహరించిన ఎం.నాగ రాంప్రసాద్, జి.సునీల్ కుమార్, జి.కళావతిలను పలువరు అభినందించారు. -
కాకినాడలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ తన నూతన బ్రాంచ్‌ను కాకినాడ మెయిన్‌రోడ్డులో సోమవారం ప్రారంభించింది. సినీ తారలు ఓజీ ఫ్రేమ్ నటి ప్రియాంక మోహన్, యాంకర్, సినీనటి అనసూయ, జబర్దస్ నటుడు హైపర్ ఆది షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు రాజశేఖర్, గ్రంధిబాబ్జి పాల్గొన్నారు. షోరూమ్ ప్రతినిధులు శ్రీను, రత్తయ్య, స్వామి మాట్లాడుతూ కాకినాడలో తమ బ్రాంచ్‌ను పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేశామన్నారు. కిడ్స్, మెన్, ఉమెన్‌కు సంబంధించిన వస్త్రాలతో పాటు పెళ్లి వేడుకలకు కావాల్సిన అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లు ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
పెళ్లింట కనువిందు!
డూడూ బసవన్నలు సింహద్వారం వద్ద రడీమేడ్ అరటి గెలలు వయ్యారాలు పోతున్న పల్లెటూరు యువతి తిరగలి తిప్పుతున్న పల్లె పడుచు ట్రెండుకు అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవితంలో ఒకసారి జరిగే వివాహ వేడుక చిరస్థాయిగా గుర్తుండిపోయేలా భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెదపట్నంలంకలో కొమ్ముల వారి మన మండువాలో సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్‌లో పలు రకాల బొమ్మలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కోనసీమ కొబ్బరాకు పందిళ్లు, అరటి బొందలతో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలకు ఈ బొమ్మలు తోడయ్యాయి. డూడూ బసవన్నలు, ఆవు, దూడ, కాళీయ మర్దనం, తిరగలి వద్ద కూర్చుని తిప్పుతున్న పల్లె పడుచు, డోలు, సన్నాయి వాయిస్తున్న వాద్యకారులు, బిందెతో వయ్యారాలు పోతూ కూర్చున్న పల్లె పడుచు బొమ్మలు రంజింపజేశాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చాయి. అతిథులు ఆసక్తిగా వీటిని తిలకించారు. వాటి వద్ద నిల్చుని సెల్ఫీలు, ఫొటోలు తీయించుకున్నారు. – మామిడికుదురు -
షష్ఠి ఉత్సవాలకు వేళాయె
● బిక్కవోలులో పూర్తయిన ఏర్పాట్లు ● రాష్ట్రం నలుమూలల నుంచీ రానున్న భక్తులు బిక్కవోలు: రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు బుధవారం తెల్లవారుజామున 1.10 గంటలకు స్వామివారి తీర్థపు బిందె సేవతో శ్రీకారం చూడతారు. షష్ఠి ఉత్సవాలకు ఆలయ పరిసరాలు విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సినిమా సెంటర్ నుంచి రావిచెట్టు వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో దేవతామూర్తులు, వివిధ అంశాలతో కూడిన ఎల్ఈడీ బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. చలువ పందిళ్లను రంగు,రంగుల వస్త్రాలతో అలంకరించారు. ఆలయ చరిత్ర 1,100 ఏళ్ల చర్రిత కలిగిన బిక్కవోలులో వేంచేసియున్న శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచీన శివక్షేత్రాలలో ఒకటి. రాజహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే రోడ్డులో ఉన్న ఈ ఆలయం తూర్పు చాళుక్యుల శిల్పాకళా వైభవంతో భాసిల్లుతోంది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమాదిత్యుని పేరిట విక్రమపురంగాను మూడవ విజయాదిత్యునిగా పేరుగాంచిన గుణగవిజయాదిత్యుని కాలం క్రీ.శ. 849–892లో బిరుదాంకినవోలుగాను వినుతికెక్కింది. కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. తూర్పు చాళుక్య రాజులలో గుణగ విజయాదిత్యుడు, చాళుక్యభీముడు (క్రీ.శ.892–921) సుప్రసిద్ధులు. గుణగవిజయాదిత్యుడు పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, కళింగులతో యుద్ధాలు చేసి విజయం సాధించి, శుత్రు సంహార పాప పరిహారం నిమిత్తం 108 శివాలయాలు నిర్మించగా చాళుక్య భీముడు తన పరిపాలనా కాలంలో 360 శివాలయాలు నిర్మించారు. తురుష్కుల దండయాత్రలు, మరాఠీ యుద్ధాల వల్ల చాలా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. నేడు బిక్కవోలులో ఆరు దేవాలయాలు చాళుక్యుల శిల్పాకళా వైభావానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. తూర్పుచాళుక్యుల తరువాత బిక్కవోలును రాజధానిగా పరిపాలించిన వారిలో ముఖ్యులు కొండవీటి రెడ్లు. వీరి కాలంలో సంగీత, సాహిత్య కళా సంగమ ప్రదేశంగా బిక్కవోలు పేరుగాంచింది. తర్వాత ఈ ప్రాంతం పెద్దాపురం సంస్థాఽనాధీశుల ఏలుబడిలోకి వచ్చింది. శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి మహారాజు 234 ఎకరాల చెరువును తవ్వించగా ఆ ప్రదేశంలో అనేక శివలింగాలు, శిథిలమైన దేవాలయాలు బయట పడటంతో నేటికీ లింగాల చెరువుగా పిలుస్తారు. రాజుగారి గోవులు దేవాలయ శిథిలాల పైకి వెళ్లి, అక్కడ వున్న పుట్టలో పాలు విడిచేవి. ఆ విషయం రాజుగారికి తెలిసి అక్కడ మట్టిని తవ్వించగా మూడు శివాలయాలు బయటపడ్డాయి. ఆ ప్రదేశాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తున్నారు. గోవు పాదాలతో తొక్కడం వల్ల, గోవు పాలతో అభిషేకించడం వల్ల అప్పటి వరకు విజయేశురునిగా పిలిచిన స్వామిని నేడు గోలింగేశ్వరస్వామిగా పూజిస్తున్నారు. ఆలయంలో శ్రీ పార్వతి అమ్మవారు – శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు దక్షిణ ముఖంగాను, శ్రీ విజయ గణపతి, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి ఉత్తర ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయానికి ఇరుపక్కలా శ్రీ చంద్రశేఖరస్వామి, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు 25వ తేదీ రాత్రి 6 గంటకు భజన, 9 గంటలకు గొర్రెల బ్రదర్స్ రామచంద్రపురం వారి బుర్రకథ, 1.10 గంటలకు తీర్థపు బిందె సేవ అనంతరం ఏలూరు వారి నాబత్ ఖానా కచేరీ, 26న 7.20 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, ఉమ్మలాడ, భీమవరం, దువ్వ, బిక్కవోలు గ్రామాల బ్యాండ్ కచేరీ, 4.30 గంటలకు బాణసంచా 7.35కు గంటలకు వివిధ రకాల బ్యాండ్ మేళాలు, కోయ డాన్సులతో సంబరం, రాత్రి 10 గంటలకు బాణ సంచా పోటీలు. 27న కొలాటం, చండీమేళం, కేరళ వాయిద్యాలతో రథోత్సవం, 27న తాపేశ్వరం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సినీ మ్యూజికల్ నైట్, 28న బిక్కవోలువారి కూచిపూడి నృత్య ప్రదర్శన, 29న అనపర్తి వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సినీ మ్యూజికల్ నైట్, 30న రాజమహేంద్రవరం కూచిపూడి నృత్య ప్రదర్శన, సత్య హరిశ్చంద్ర నాటకం, డిసెంబర్ 1న ఏకాహం ప్రారంభం, 2న ఉదయం ఏకాహం ముగింపు, రాత్రి అన్న సమారాధనతో షష్ఠి ఉత్సవాలు పూర్తవుతాయి.బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం బిక్కవోలు సంతానం కోసం ఆలయంలో నిద్రిస్తున్న మహిళలు (ఫైల్) అభయ ముద్రలో దర్శనం ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారిగా పూజలందుకుంటున్నారు. చతుర్బుజుడై అభయ ముద్రలో దర్శనం ఇస్తారు. పై రెండు చేతులలో దండం, పాశం ఉన్నాయి. కింద కుడిచేతితో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనంపై ఉంచారు. స్వామివారికి కుడి వైపున సహజ సిద్దమైన పుట్ట ఉంది. రోజూ రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్ట వద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం. అంగారక క్షేత్రంగా పిలిచే ఈ దేవాలయంలో భక్తులు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సంతానం లేని మహిళలు పుట్ట పై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి సంతాన ప్రాప్తి కలుగజేస్తాడని భక్తుల నమ్మకం. అందరికీ స్వామి దర్శనం కల్పిస్తాం గత ఏడాది 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా వస్తారని భావిస్తున్నాం. సుమారు రు.55 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అధికారులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – పల్లె శ్రీనివాసరెడ్డి(వాసు), షష్ఠి ఉత్సవ కమిటీ చైర్మన్, బిక్కవోలు -
జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఛరిష్మా
అమలాపురం టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) 69వ ఈవెంట్‌గా నిర్వహిస్తున్న జాతీయ బాస్కెట్ పోటీలకు అంబాజీపేటకు చెందిన విద్యార్థిని నిమ్మకాయల ఛరిష్మా సాయి రుత్విక ఎంపికై ంది. అమలాపురంలోని శ్రీవాగ్దేవి స్కూలులో పదో తరగతి చదువుతున్న ఛరిష్మా బాస్కెట్‌బాల్ రాష్ట్ర బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన అంతర జిల్లాల బాస్కెట్ బాల్ పోటీల్లో ఛర్మిషా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సాధించింది. వచ్చే నెల మొదటి వారంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్నంద్గామ్లో జరుగనున్న జాతీయ పోటీల్లో ఛర్మిషా జిల్లా జట్టుతో తలపడనుంది. సోమవారం సాయంత్రం స్కూలులో జరిగిన అభినందన సభలో విద్యార్థిని ఛర్మిషాను స్కూలు డైరెక్టర్ పరసా భరత్, ప్రిన్సిపాల్ డాక్టర్ శిష్టి శ్రీరామచంద్రమూర్తి, హెచ్ఎం పిచ్చిక సుబ్రహ్మణ్యం, పీఈటీ రాజేష్, ఇతర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసించారు. జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికై న ఛరిష్మా ఆ పోటీల్లో కూడా విజేతగా నిలిచి తమ స్కూలుకు, జిల్లాకు పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో మొదటి స్థానం
కొత్తపల్లి: రాష్ట్ర స్ధాయి రగ్భీపోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు మొదటి స్థానం సాధించినట్లు సోమవారం జిల్లా రగ్బీ కోచ్ లక్ష్మణరావు తెలిపారు. రెండు రోజులుగా కర్నూలులో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి పాఠశాల రగ్బీ బాలికల పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల రగ్బీ బాలికల జట్టు ప్రథమ స్ధానం సాధించిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్ –19 స్కూల్ గేమ్ కార్యదర్శి వెంకటరెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి రగ్బీ అధ్యక్షుడు పి.దొరబాబు, చైర్మన్ వియ్యపు రామన్నరాజు అభినందించారు. జిల్లా జట్టు కోచ్ మేనేజర్‌గా పీడీలు శేషకుమారీ, కె.నాగలింగేశ్వరావు, భార్గవ్ వ్యవహరించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్స్ జుడో పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జుడో సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో రెండు రోజులుగా జరిగిన జుడో సీనియర్స్ చాంపియన్ షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కాకినాడ జిల్లా జుట్ట కై వసం చేసుకోగా, రెండో స్థానంలో తూర్పుగోదావరి జట్టు, ఉమెన్ క్యాటగిరిలో రెండో స్థానం కాకినాడ జిల్లా జట్టు అందుకున్నాయి. పోటీలలో విజేతలకు జుడో సంఘ రాష్ట్ర సీఈఓ వెంకట్, కాకినాడ చైర్మన్ వెలగ వెంకట కృష్ణారావు, కాకినాడ జిల్లా ట్రజరర్ రమణ, డీఎస్ఏ కోచ్ తేజ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. -
ఆ రోజు ఏం జరిగింది?
కాకినాడ క్రైం: పడని ఇంజెక్షన్ చేసి తాళ్లరేవు మండలం గండేపల్లి పంచాయతీ చినవలసల గ్రామానికి చెందిన నిండు గర్భిణి పెసింగి మల్లీశ్వరి(31) మృతికి కారకులైన కాకినాడ జీజీహెచ్ వైద్యులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్‌గౌర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ గంభీర సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో విచారణ నిర్వహించారు. ఘటన జరిగిన గైనకాలజీ విభాగంలోని యాంటీ నాటల్, జీఐసీయూలలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి నర్సులు, వైద్యుల వరకు ప్రతి ఒక్కరి వివరణ తీసుకొని నాలుగు గంటల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబీకుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు. ఘటన జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి అయిన మృతురాలి వదిన ఽసంగాడి ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు మృతురాలి సోదరి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు డీఎంఈ స్వీకరించారు. మల్లీశ్వరి మృతిపై విచారం వ్యక్తం చేసిన డీఎంఈ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. విచారణ అనంతరం పలువురు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తీరుపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. వార్డుల్లో సిబ్బంది డబ్బు గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు రోగుల పట్ల అనుచితంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డీఎంఈ డాక్టర్ రఘునందన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి కారకులపై చర్యలకు సిఫారసు చేస్తానన్నారు. నేటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆరుగురు సభ్యుల బృందం ఈ విచారణ చేపట్టింది. డీఎంఈతో పాటు ఇన్చార్జి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహ నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసన్, గైనకాలజీ హెచ్‌వోడీ అనురాగమయి విచారణ కమిటీలో ఉన్నారు. ఒకటి కాదు రెండు నిండు ప్రాణాలు... కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లీశ్వరితో పాటు మరికొద్ది రోజుల్లో జన్మించేందుకు సిద్ధంగా ఉన్న శిశువు బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసిందని కన్నీటి పర్యంతమయ్యారు. నిండు చూలాలిని కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి అన్యాయమైపోయామని కుటుంబీకులు రోదించారు. ఐదేళ్ల బాలిక తల్లిలేని బిడ్డగా మిగిలిపోయిందని వాపోయారు. మృతురాలి కుటుంబీకులు సోమవారం కాకినాడ జీజీహెచ్‌కు వచ్చి మాతాశిశు విభాగం ఆవరణలో బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంతో కొందరు వైద్యులే చేజేతులా ఆమెను పొట్టబెట్టుకున్నారని ఆరోపించారు. పాంటాప్రొజోల్ ఇంజెక్షన్ పడదని ఎంత చెబుతున్నా పీజీ వైద్యురాలు డాక్టర్ నేనా నువ్వా, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి బయటకి పో అంటూ తనపై మండిపడిందని బాధితురాలి వదిన ధనలక్ష్మి వాపోయింది. నిండు గర్భిణి మృతిపై డీఎంఈ విచారణ జీజీహెచ్‌లో బైఠాయించి కుటుంబీకుల ఆందోళన వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ప్రాఽథమిక నిర్ధారణ ఇంకా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్న డీఎంఈ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ -
పరిశోధన.. వేదన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వివిధ రంగాల్లో పరిశోధనలు జరిగితేనే ప్రపంచ ప్రగతి మరింత ముందుకు సాగుతుంది. అటువంటి పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం నిరాశే మిగులుస్తోంది. పరిశోధనలకు సంబంధించిన పీహెచ్డీ కోర్సులలో నేరుగా అడ్మిషన్లకు ఉద్దేశించిన ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) ఏడాదిన్నరకు పైగా నిర్వహించడం లేదు. రాష్ట్రంలో సెట్ తరహాలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. యూజీసీ నెట్‌కు దేశవ్యాప్తంగా 7 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతూంటారు. యూజీసీ క్రమం తప్పకుండా నెట్ నిర్వహిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం సెట్ ఊసే లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు తనయుడు లోకేషే స్వయంగా విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సెట్‌పై దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా, కనీసం క్యాలెండర్ ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. తిరోగమనంలో విద్యారంగం చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచీ రాష్ట్రంలో విద్యారంగం తిరోగమనంలో పయనిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత నెలాఖరు వరకూ ఇంజినీరింగ్ అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల పేరుతో ఈ నెలలో కూడా ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహణలోనూ అదే తీరు అవలంబించడంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సెట్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూండటంతో విద్యార్థులు తీరని నిరాశకు గురవుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు ఏపీ సెట్ లేదా నెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. లేదా పీహెచ్డీ చేసిన వారు అర్హులు. ఏపీ సెట్‌కు పీజీ పూర్తి చేసిన వారు లేదా పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఏపీ సెట్లో అప్పుడే పీజీ పాసైన విద్యార్థుల నుంచి వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సైతం పోటీ పడుతున్న దాఖలాలున్నాయి. చివరిసారిగా గత ఏడాది ఏప్రిల్‌లో ఏపీ సెట్ నిర్వహించారు. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. సాధారణంగా నెట్, సెట్ అర్హత సాధించిన వారికి వివిధ విశ్వవిద్యాలయాలు ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా నేరుగా పీహెడీ అడ్మిషన్ కల్పిస్తూంటాయి. కానీ, ఈ ఏడాది సెట్ నిర్వహించకపోవడంతో యూనివర్సిటీలు ఇంటర్నల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తమ జీవితాలతో చెలగాటమాడటం ప్రభుత్వానికి తగదని వాపోతున్నారు. సెట్ నిర్వహించాలి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్లు నిర్వహించి, విద్యార్థుల సమయం వృథా కాకుండా అడ్మిషన్లు కల్పించాలి. సమయానికి పరీక్షలు నిర్వహించనందువలన ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి నిరాశ ఎదురవుతోంది. క్యాలెండర్ ప్రకారం పీహెడ్డీ ప్రవేశాలకు క్రమం తప్పకుండా సెట్ నిర్వహించాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విద్యార్థులకు నిరాశ పీజీ పూర్తి చేసి, వివిధ విభాగాల్లో పీహెచ్డీ చేద్దామనుకుంటున్న వారికి నిరాశే ఎదురవుతోంది. సెట్ నిర్వహిస్తేనే కానీ ఆయా వర్సిటీలు పీహెచ్డీ అ డ్మిషన్లు కల్పించలేని పరిస్థితి. ఈ విషయంలో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని, పరిశోధక విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలి. – కె.సాయిబాబు, లైబ్రేరియన్, కాకినాడ నూతన రీసెర్చ్ ప్రాజెక్టులేవీ?మరోవైపు జేఎన్‌టీయూకేతో పాటు ఆదికవి నన్నయ వంటి యూనివర్సిటీల్లో నూతన రీసెర్చ్ ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. ఏటా జేఎన్టీయూకే ద్వారా రెగ్యులర్, పార్ట్‌టైం విధానంలో దాదాపు 350 వరకూ పీహెడ్డీ అడ్మిషన్లు కల్పిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గతంలో ఇబ్బడిముబ్బడిగా పరిశోధన ప్రాజెక్ట్లులు వచ్చేవి. ప్రస్తుతం రీసెర్చ్ ప్రాజెక్టులు లేక వర్సిటీలు బోసిపోతున్నాయి. కొత్త ప్రాజెక్ట్లులు వస్తే వాటి కింద అడ్మిషన్లు కల్పించి పీహెచ్డీ పట్టా అందించవచ్చు. వర్సిటీకి బోధన, పరిశోధన, సామాజిక బాధ్యత ముఖ్యమైన విధులు. బోధించడానికి ఇక్కడ తగినంత మంది ప్రొఫెసర్లూ లేరు. పరిశోధనకు కొత్త ప్రాజెక్ట్లులూ లేవు. రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు కావాలని దరఖాస్తు చేసినా.. ఢిల్లీ స్థాయికి వెళ్లి ప్రాజెక్టు తెచ్చేంత చొరవ ఎవ్వరూ తీసుకోవడం లేదు. రీసెర్చ్ ప్రాజెక్టు, పేటెంట్లతో తమకేమీ సంబంధం లేనట్టుగా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఫ క్యాలెండర్ ప్రకారం జరగని ప్రవేశ పరీక్షలు ఫ గత ఏడాది ఏప్రిల్‌లో చివరిసారిగా ‘సెట్’ ఫ ఏడాదిన్నరగా జాప్యం చేస్తున్న ప్రభుత్వం ఫ నిలిచిపోయిన రీసెర్చ్ అడ్మిషన్లు -
కాస్త గండి.. అయినా దండి
అన్నవరం: తుపాను ప్రభావంతో కాస్త గండి పడినా.. మొత్తం మీద ఈ ఏడాది కార్తిక మాసంలో సత్యదేవుని దండిగానే ఆదాయం సమకూరింది. లక్షలాదిగా వచ్చిన భక్తుల ద్వారా స్వామివారికి మొత్తం రూ.19,48,12,985 ఆదాయం వచ్చిందని అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు చెప్పారు. రత్నగిరిపై సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. గత ఏడాది కార్తికంలో రూ.20,04,29,132 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కార్తికం ప్రారంభంలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో మొదటి వారం రోజుల పాటు స్వామివారి సన్నిధికి భక్తులు పెద్దగా రాలేదు. ఫలితంగా ఆదాయం సుమారు రూ.56 లక్షలు తగ్గిందని ఈఓ తెలిపారు. అయితే, దేవస్థానంలో వివిధ దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితికి గాను 2024 కార్తికంలో నిర్వహించిన వేలంలో రూ.1.09 కోట్లు రాగా, ఈ కార్తికంలో జరిపిన వేలంలో రూ.2.23 కోట్లు వచ్చిందని తెలిపారు. ఇది కూడా కలిపితే 2024 కార్తికంలో రూ.21.14 కోట్లు రాగా.. ఈ ఏడాది కార్తికంలో అంతకు మించి రూ.21.76 కోట్లు ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఫ గత ఏడాది కార్తికంలో స్వామివారి వ్రతాలు 1,47,142 జరిగాయి. ఈ ఏడాది కార్తికం తొలి వారంలో తుపాను ప్రభావంతో భక్తులు పెద్దగా రాక 1,34,476 వ్రతాలు మాత్రమే జరిగాయి. ఇవి గత ఏడాది కార్తికం కన్నా 12,666 తక్కువ. ఫ సత్యదేవుని వ్రతాల్లో 96,484 (70 శాతం) రూ.300 టికెట్టువే జరిగాయి. ఆ తరువాత రూ.వెయ్యి టికెట్టువి 16,099, రూ.1,500 వ్రతాలు 9,511, రూ.2 వేల వ్రతాలు 12,382 జరిగాయి. ఫ సత్యదేవుని హుండీల ఆదాయాన్ని రెండో విడతగా సోమవారం లెక్కించగా రూ.1.78 కోట్లు వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ లెక్కింపు చేపట్టారు. ఈ నెల 7న తొలి విడత లెక్కింపులో రూ.1.73 కోట్లు వచ్చింది. దీంతో మొత్తం కార్తికంలో హుండీల ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఫ కార్తిక మాసంలో భక్తుల కోసం ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.81.88 లక్షలతో తాత్కాలిక విశ్రాంతి షెడ్లు, టాయిలెట్లు, క్యూలు ఇతర ఏర్పాట్లు చేశారు. ఫ అలాగే, ఈ నెల 2న పంపా జలాశయంలో జరిగిన సత్యదేవుని తెప్పోత్సవం, 5న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు విద్యుత్ విభాగం ద్వారా రూ.20 లక్షలతో విద్యుద్దీపాలంకరణ తదితర ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి రత్నగిరికి సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది, ఈ ఏడాది కార్తిక మాసాల్లో దేవస్థానానికి విభాగాల వారీగా వచ్చిన ఆదాయం (రూ.కోట్లు) విభాగం 2024 2025 వ్రతాలు 8.34 7.81 ప్రసాద విక్రయాలు 4.86 4.57 హుండీలు 3.04 3.51 సత్రాల అద్దెలు 1.43 1.23 ఆదాయం (రూ.లక్షల్లో) ట్రాన్స్‌పోర్టు 41 39 దర్శనం టికెట్లు 86 90 కల్యాణ మండపాలు 8 6 ప్రసాదం బ్యాగ్‌లు 5 4 కల్యాణాలు 8 8 ఆర్జిత సేవలు 8 10 కేశఖండన 15 12 ఏసీ వ్రతాలు 60 62 కానుకలు 4 4 వివాహాలు 2 1 ఫ సత్యదేవునికి రూ.19,48 కోట్ల కార్తిక ఆదాయం ఫ గత ఏడాది కంటే రూ.56 లక్షలు తక్కువ ఫ ‘మోంథా’తో తగ్గిన రాబడి -
పేరు మారినా.. తీరు మారలే..
అన్నవరం: రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది అన్నవరం దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పరిస్థితి. దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ గత అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నవరం దేవస్థానం సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల శానిటేషన్ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థ చేజిక్కించుకుంది. అయితేనేం! నవంబర్ 24వ తేదీ వచ్చేసినప్పటికీ అక్టోబర్ నెల వేతనాలు జమ కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో గుంటూరుకు చెందిన కనకదుర్గ సంస్థ శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్ట్ నిర్వహించినప్పుడు కూడా ఇదే విధంగా జీతాలు ఆలస్యమయ్యేవి. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు రావడం.. ఆ తరువాత వేతనాలు చెల్లించడం జరిగేది. ప్రస్తుతం ‘పద్మావతి’ సంస్థలో సుమారు 350 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారికి జీతాల రూపంలో సుమారు రూ.60 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఆ ఊసే లేకుండా పోయింది. నిర్వహణ సంస్థ పేరు మారిందే తప్ప తమ తలరాతలు మాత్రం మారడం లేదని పారిశుధ్య సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. వీఐపీ ట్రీట్మెంట్ అందుకేనా! ‘పద్మావతి’ సంస్థ యజమాని భాస్కరనాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడనే ప్రచారం 2014 నుంచి ఉంది. 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు కూడా దేవస్థానాల శానిటేషన్ కాంట్రాక్ట్ ఈ సంస్థకే దక్కింది. ఇప్పుడు కూడా ఆయనే దక్కించుకున్నారు. అన్నవరం సహా అన్ని దేవస్థానాల్లోనూ భాస్కరనాయుడుకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి తగినట్టుగానే ఆయా దేవస్థానాల అధికారులు ఆయన వద్దకే శానిటేషన్ అగ్రిమెంట్ పత్రాలు తీసుకువెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అన్నవరం దేవస్థానానికి ఆయన గత నెల 24న వచ్చారు. అప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు. ఆయన మళ్లీ ఇక్కడకు రాలేదు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులే ఆయన వద్దకు అగ్రిమెంట్ పత్రాలు పట్టుకుని వెళ్లడం గమనార్హం. జీతాలు త్వరలో చెల్లిస్తాం శానిటేషన్ సిబ్బందికి సంబంధించి అక్టోబర్ నెల జీతాల బిల్లు తయారు చేశాం. అవసరమైన ప్రొసీజర్లు పూర్తి చేసిన వెంటనే జీతాలు చెల్లిస్తాం. అక్టోబర్ నెలలో ఎంత మంది పని చేశారో అటెండెన్స్ ఉంది. ఆ ప్రకారమే చెల్లిస్తాం. కాంట్రాక్టర్‌తో ఇంతవరకూ అగ్రిమెంట్ చేసుకోని విషయం వాస్తవమే. అగ్రిమెంట్ పత్రాలతో సిబ్బంది ఆయన వద్దకు వెళ్లారు. కాంట్రాక్టర్ సంతకం చేసిన వెంటనే నేను కూడా సంతకం చేస్తా. డిసెంబర్ నుంచి మొదటి వారంలోనే పారిశుధ్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం ఫ ఇప్పటికీ అందని అక్టోబర్ జీతాలు ఫ అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బంది దుస్థితి అగ్రిమెంట్‌కు తీరుబాటే లేదు! గత నెల నుంచే పద్మావతి సంస్థ శానిటేషన్ కాంట్రాక్టు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఆ సంస్థతో దేవస్థానం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకోకపోవడం విచిత్రం. అగ్రిమెంట్ లేకుండానే దాదాపు రెండు నెలలుగా ఆ సంస్థ తరఫున సిబ్బంది పని చేస్తూండటం గమనార్హం. ఎంత మంది పని చేస్తున్నారనే దానికి ఏ ఆధారమూ లేదు. దేవస్థానం అధికారులు చెప్పినంత మందికి ఆ సంస్థ జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. దేవస్థానంలో విధులు నిర్వహించే సిబ్బందికి అటెండెన్స్ వేస్తున్నామని, ఆ ప్రకారమే జీతాలు చెల్లించాల్సిందిగా కాంట్రాక్ట్ సంస్థకు చెబుతామని అధికారులు అంటున్నారు. -
ఏం చేశారని మాకోసం?
కాకినాడ రూరల్: ఆరుగాలం శ్రమించి.. అందరికీ తిండి గింజలు పండిస్తున్న అన్నదాతకు అడుగడుగునా కడగండ్లు తప్పడం లేదు. విత్తు వేసి.. ప్రకృతి విపత్తులకు ఎదురీది.. ఎలాగోలా సిరుల పంటలు పండించినా.. వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగడుగునా దగా పడుతున్న రైతన్న ఇక్కట్లను సర్కారు పట్టించుకోవడం లేదు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల వేళ చెప్పి, ఓట్లు దండుకుని, తొలి ఏడాది ఈ పథకానికి మంగళం పాడారు. రెండో ఏడాది అనేక కోతలు, కొర్రీలు పెట్టి అరకొరగానే విదిల్చారు. విపత్తులతో నష్టపోతే పరిహారం ఊసే లేదు. ఉచిత పంటల బీమాకు స్వస్థి పలికారు. ధాన్యం కొనుగోళ్లలోనూ సవాలక్ష నిబంధనలతో ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ చేసిందేమీ లేకపోయినా.. ఏవేవో చేసేశామని చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధపడుతోంది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకూ ‘రైతన్నా... మీకోసం’ వారోత్సవాల పేరిట కొత్త రాగంతో ప్రచారానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రతి రైతు ఇంటికీ వెళ్లి వారి జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తదితర అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఆ వివరాలను ఈ నెల 30 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ పరిశీలిస్తారు. అదే రోజు రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. అయితే, దాదాపు ఏడాదిన్నర పాలనలో ‘ప్రచారార్భాటం పీక్.. ఆచరణ వీక్’ అనే రీతిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వాధినేతలు, అధికారులు.. తమకు చేసిందేమీ లేకున్నా, ఇప్పుడు తమ ముందుకు ఎందుకొస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది పెట్టుబడి సాయం, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందజేసి, ఉచిత పంటల బీమా అమలు చేసి తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. అడుగడుగునా దగా ● ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ పేరిట సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వీటిలో ఒకటి అన్నదాత సుఖీభవ. దీని కింద రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే తొలి ఏడాది ఈ పథకం అమలును పక్కన పెట్టేసి, జిల్లాలోని రైతులకు సుమారు రూ.300 కోట్ల మేర జెల్ల కొట్టారు. ● అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేశారు. లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా ఏటా 1.80 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వంలో సుమారు 30 వేల మంది లబ్ధిదారులకు రకరకాల కొర్రీలతో ఈ పథకం అమలు చేయలేదు. 1,50,475 మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా పథకం వర్తింపజేసింది. జిల్లాలో సుమారు 65 వేల మంది కౌలు రైతులుండగా కౌలు గుర్తింపు కార్డులు పొందిన సుమారు 15 వేల మంది అప్పట్లో రైతుభరోసా లబ్ధిని అందుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఖరీఫ్ ముగింపు దశకు చేరుకున్నా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము నయా పైసా కూడా విదల్చలేదు. ● గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులకు అందించింది. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఆ మొత్తాన్ని నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే భరించింది. దీనివలన అప్పట్లో ప్రకృతి విత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇటువంటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల భాగస్వామ్యం పేరిట పంటల బీమా ప్రీమియం భారాన్ని వారి పైనే మోపింది. ఈ భారం మోయలేక జిల్లాలోని 40 శాతం మంది రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. విపత్తులతో ఇటు పంటలు దెబ్బ తినగా.. అటు బీమా పరిహారం కూడా రాకపోవడంతో వీరు నష్టపోయారు. ● ఖరీఫ్‌లో అదునుకు యూరియా లభించక జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు నానా అగచాట్లూ పడ్డారు. ● గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 46,929 మంది రైతులు రూ.148 కోట్ల మేర పంట నష్టపోయారు. కానీ, ప్రభుత్వం రూ.52 కోట్లుగానే అంచనా వేసింది. దీంతో, బాధితులకు తీరని నష్టం జరగనుంది. ● ఇక ధాన్యం కొనుగోళ్ల సమయంలోనూ రైతులు దగా పడుతున్నారు. ఈ విషయం గత ఖరీఫ్, రబీతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌లో కూడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఎ–గ్రేడ్ రకం ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకానికి రూ.1,777 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ, తేమ శాతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. ఫలితంగా ఇటీవలి మోంథా తుపానుతో తడిసి, రంగు మారిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. రైతు సేవా కేంద్రానికి వెళ్తే సవాలక్ష నిబంధనలు చెబుతూండటంతో.. ఆ బాధలు పడలేక అయినకాడికి దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా దళారులు బస్తాకు సుమారు రూ.250 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు. ● వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ కింద గత ప్రభుత్వం రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ రాయితీని పూర్తిగా ఎగ్గొట్టింది. ● రైతుకు అండగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా విత్తు నుంచి పంట విక్రయం వరకూ రైతులకు తోడుగా నిలిచింది. వీటిని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ● మరోవైపు ఆక్వా రంగం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అటు ఉద్యాన రైతులు సైతం గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్నారు. ● ఇంత జరుగుతున్నా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని రైతులు వాపోతున్నారు. పుట్టెడు కష్టాల్లో పుడమి పుత్రులు అన్నదాత సుఖీభవకు తొలి ఏడాది మంగళం రెండో ఏడాది కోత ఉచిత పంటల బీమా ఎత్తివేత ధాన్యం కొనుగోళ్లలో దగా ఆక్వా, ఉద్యాన రైతులదీ ఇదే దుస్థితి ఈ పరిస్థితుల్లోనే ‘రైతన్నా.. మీకోసం’ అంటూ ప్రభుత్వం ప్రచారార్భాటం నేడు ప్రారంభం రైతులను తప్పుదారి పట్టించేందుకే.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతూ ఇప్పుడు ‘రైతన్నా మీకోసం’ అంటూ రైతుల ఇళ్లకు వ్యవసాయాధికారులను పంపించడం హాస్యాస్పదంగా ఉంది. రైతులకు విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం పండించిన పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతోంది. రైతులకు పంట నష్టపరిహారంతో పాటు కౌలు కార్డులు, రైతు రుణాలకు సైతం ఎగనామం పెట్టింది. ఇప్పుడు రైతులను తప్పుదారి పట్టించేందుకే రైతన్నా మీకోసం కార్యక్రమానికి తెర తీసింది. ఈ ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. – లంక ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు, ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. కన్నుల పండువగా రథోత్సవం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవా రి రథోత్సవం ఆలయ ప్రాకారంలో ఘనంగా ని ర్వహించారు. ఉదయం 10 గంటలకు రథాన్ని తూర్పురాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం మేళతాళాల మధ్య ఆ రథంపై స్వా మి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం కొబ్బ రికాయ కొట్టి రథ సేవ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వెంట రాగా మూడుసార్లు ఆల య ప్రాకారంలో రథ సేవ ఘనంగా నిర్వహించా రు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. లోవలో భక్తుల రద్దీతుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. కార్తిక మాసం ముగియడం, ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ ద్వారా 13 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,56,645, పూజా టికెట్లకు రూ.1,54,390, కేశఖండన శాలకు రూ.11,120, వాహన పూజలకు రూ.7,940, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.39,745, విరాళాలు రూ.58,028 కలిపి మొత్తం రూ.4,27,868 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. -
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ఫ ‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన ఫ ట్రిప్స్ స్కూల్లో ఉత్సాహంగా నిర్వహణ ఫ స్పెల్‌బీ క్వార్టర్, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్ పరీక్ష ఫ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులను ఆంగ్ల భాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివా రం నిర్వహించిన స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్‌కు విశేష స్పందన లభించింది. రాజమహేంద్రవరం త్రిపుర నగర్‌లోని ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ పరీక్షలు రాయించేందుకు అమితాసక్తి చూపారు. ‘సాక్షి’ స్పెల్‌బీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 కేటగిరీలుగా నిర్వహించగా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ ‘సాక్షి’ మ్యాథ్‌బీ 4 కేటగిరీల్లో జరిపారు. 1,180 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కేటగిరీ–1లో 1, 2 తరగతుల విద్యార్థులకు, కేటగిరీ–2లో 3, 4 తరగతులకు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులకు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీ వంటి పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, వారిలోని ప్రతిభను గుర్తించడానికి, కాంపిటేటివ్ పరీక్షలకు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు అన్నారు. స్పెల్‌బీ, మ్యాథ్‌బీ నిర్వహించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాలాత్రిపురసుందరి, ‘సాక్షి’ రీజనల్ మేనేజర్ రమేష్‌రెడ్డి’ పర్యవేక్షించారు. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్వేఫీస్, అసోసియేట్ స్పాన్సర్‌గా రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి.ఆంగ్లం, గణితంపై పట్టు సాధించవచ్చు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్‌బీ పరీక్ష దోహదపడుతుంది. ‘సాక్షి’ మ్యాథ్‌బీ పరీక్ష ద్వారా గణితంలో రీజనింగ్, లాజికల్ ఽథింకింగ్తో పాటు పోటీతత్వం పెంపొందించడంలో దోహదం చేస్తుంది. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి ప్రజ్ఞావంతులుగా తయారవుతారు. స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు ‘సాక్షి’ నిర్వహించడం అభినందనీయం. – రూపాదేవి గూడూరు, డైరెక్టర్, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం కాన్ఫిడెన్స్ పెరుగుతోంది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ‘సాక్షి’ స్పెల్‌బీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త పదాలు నేర్చుకోవడంతో పాటు కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు. నైపుణ్యాలు పెంచుకునేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి. – ధన్యట్రెఫోసా, 8వ తరగతి, ట్రిప్స్ స్కూల్, రాజమహేంద్రవరం భయాన్ని దూరం చేసేందుకు.. ‘సాక్షి’ స్పెల్‌బీలో గత ఏడాది ఫైనల్స్‌కు వెళ్లాను. అలాగే ‘సాక్షి’ మ్యాథ్‌బీ అంటే ఎంతో ఆసక్తి. గణితంపై భయాన్ని దూరం చేసే విధంగా మ్యాథ్స్‌బీ పరీక్ష ఒక ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. మా నైపుణ్యాలు పెరుగుతాయి. థ్యాంక్యూ ‘సాక్షి’. – ఆశ్రిత ఎండూరి, 8వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం అకడమిక్‌గా ఉపయోగం ‘సాక్షి’ స్పెల్‌బీ కాంపిటేషన్ పరంగానే కాక అకడమిక్‌గా కూడా చాలా ఉపయోగపడుతోంది. కాంపిటేషన్ కోసం వందల్లో పదాలు నేర్చుకునే అవకాశం కలిగింది. తద్వారా అకడమిక్‌గా కూడా అన్ని విధాలా సహకారి అయ్యింది. – మేడపాటి శ్రీలక్ష్మీ సాత్విక, 10వ తరగతి, లాహోరల్ స్కూల్, రాజమహేంద్రవరం ప్రోత్సహించడం అభినందనీయం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ‘సాక్షి’ స్పెల్‌బీ నిర్వహించడం అభినందనీయం. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్‌లో ఒకాబ్యులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. – గోడి అజయ్, విద్యార్థి తండ్రి, రాజమహేంద్రవరం గణితంపై భయం ఉండదు.. గణితం అంటే విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ‘సాక్షి’ మ్యాథ్‌బీ దోహదపడుతుంది. ఈ పరీక్షలు పై తరగతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మ్యాథ్‌బీ గణితంపై పట్టు సాధించేందుకు దోహదం చేస్తుంది. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. – నౌషద్ బేగం, విద్యార్థిని తల్లి, రాజమహేంద్రవరంకొత్త విషయాలు తెలుసుకున్నా.. ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడంతో నేను కొత్త విషయాలను తెలుసుకున్నాను. స్పెల్లింగ్స్‌తో పాటు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించేందుకు ఉపయోగపడింది. ‘సాక్షి’ యాజమాన్యం స్పెల్‌బీ పరీక్ష రాయించి విద్యార్థులను ప్రోత్సహించడం బాగుంది. – పూర్వి మల్లెల, 6వ తరగతి, ఆదిత్య స్కూల్, శ్రీనగర్, కాకినాడ -
రేపు సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం
సామర్లకోట: సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం కాకినాడలో జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి జి.ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సమావేశంలో ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేస్తామన్నారు. కార్మికులకు ద్రోహం చేసేలా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండుతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విభజన తరువాత జిల్లా తలసరి ఆదాయం బాగా తగ్గిపోయిందని, జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి ఈశ్వరయ్యను అభినందించడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలదండలు, శాలువాలు, బొకేలు కాకుండా ఆర్థికంగా ఎంతో కొంత విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ విరాళాలు వచ్చే నెల 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ఎంతో ఉపయోగపడతాయని మధు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెదిరెడ్ల సత్యనారాయణ, బొత్సా శ్రీను, కశింకోట కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
విలువను.. గుర్తించరా?
సాక్షి, అమలాపురం: ఇటు వ్యవసాయం.. ఇటు ఉద్యానం సాగు ఏదైనా, పంటలు ఏమైనా ఫలితం ఒక్కటే. దిగుబడులు పెరిగిన సమయంలో ధరలు ఉండవు. ధరలు ఉంటే దిగుబడి ఉండదు. ఈ రెండింటి మధ్య రైతు నష్టపోవడం పరిపాటిగా మారింది. రెండు నెలల క్రితం రికార్డు స్థాయి ధర వచ్చిన కొబ్బరి ఇప్పుడు నేల చూపు చూస్తోంది. అరటి ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ఉన్నా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పోక ధర బాగున్నా డిమాండ్‌కు తగినట్టుగా లేదు. ఇందుకు ప్రధాన కారణం దిగుబడులు పెరగడమే కాదు.. స్థానికంగా వినియోగం లేకపోవడం, దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి రావడమే. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ధరలు రావాలంటే స్థానికంగా విలువ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ప్రభుత్వం, కోకోనట్ బోర్డు, క్వాయర్ బోర్డు, ఖాదీ, ఎంఎస్ఎంఈ, ఉద్యానశాఖ పరిశ్రమల ఏర్పాటు చేస్తామనే ప్రకటనలకు మాత్రమే పరిమితవుతున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం భారీ పరిశ్రమలు తరలివస్తున్నాయని ప్రచారం చేసుకోవడమే తప్ప స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోవడం లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ముందుకు రాకపోవడంతో రైతుల నష్టాలు తీరడం లేదు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. వరితో ఇలా చేయొచ్చు ఉమ్మడి జిల్లాలో వరి అతి పెద్ద సాగు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 5.60 లక్షల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతాయి. ఖరీఫ్, రబీ కలిపి 31.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ధాన్యా న్ని నేరుగా విక్రయించి రైతులు, బియ్యం, తవుడు విక్రయాలతో మిల్లర్లు సరిపెడుతున్నారు. బియ్యాన్ని అన్నం కోసమే కాకుండా దీనితో నూడిల్స్, పాస్తా, పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, రడీ టూ కుక్ రైస్, రైస్ మిల్క్ తయారు చేసే అవకాశముంది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు రైస్ బ్రాన్ కొవ్వు ఆమ్లాలతో సబ్బులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలు తయారు చేయవచ్చు. రైస్ బ్రాన్ జ్యూస్, కొన్ని ఫుడ్ అప్లికేషన్స్ లేదా హెల్త్ డ్రింక్స్ తయారు చేయవచ్చు. తవుడుతో రైస్ రిచ్ ఆయిల్ వంటి వంట నూనెలతో పాటు టైర్లు, పెయింట్లు, సౌందర్య సాధనాలు, టూత్‌పేస్ట్, పశుగ్రాసం వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. కాకినాడ జిల్లా సర్పవరం వద్ద తవుడుతో ఆయిల్ తయారు చేసే పరిశ్రమలున్నాయి. అరటి పౌడర్... చిప్స్‌కు భలే డిమాండ్ అరటికి ప్రస్తుతం ధర లేక రైతులు విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో సుమారు 69 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. కేరళ, తమిళనాడుల్లో అరటి చిప్స్ తయారు చేస్తుంటారు. మన ప్రాంతాల్లో పొటాటో చిప్స్ స్థానంలో అరటి చిప్స్ ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే వీటి తయారీ పరిశ్రమలు స్థానికంగా లేవు. వీటితోపాటు అరటి పౌడర్, డ్రై బనానా, పానీయాలు, ఐస్ క్రీం, పెరుగును తయారు చేయవచ్చు. ఎండబెట్టిన అరటి పండును పిండిగా చేసి పూరి, చపాతీ తయారు చేసి అమ్ముతున్నారు. ఉమ్మడి ‘తూర్పు’లో వరి, కొబ్బరి, అరటి, కోకో విస్తృత సాగు అన్ని రకాల ఉత్పత్తుల ధరలు తగ్గి రైతులు విలవిల దిగుబడి బాగున్న సమయంలో ధరలు లేక నష్టం విలువ ఆధారిత ఉత్పత్తులు చేస్తే అదనపు ఆదాయం అప్పుడే వ్యవసాయం, ఉద్యానం లాభదాయకం దీనిపై దృష్టి పెట్టని చంద్రబాబు సర్కార్ కోకో హోమ్మేడ్ చాక్లెట్ కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్‌లో అంతర పంటగా సుమారు 15 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కోకో బీన్స్‌ను నేరుగా అమ్ముతున్నారు. కానీ కోకో గింజలతో సొంతంగా ఇంటి వద్ద చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పాలు, డార్క్ చాక్లెట్లు, కోకో పౌడర్‌ను ఉత్పత్తి చేయవచ్చు. తమిళనాడులోని పర్యాటక ప్రాంతమైన ఊటీలో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని సొంతంగా చాక్లెట్ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఆ పరిస్థితి లేదు. కోకో గుజ్జుతో జామ్‌లు, జెల్లీలు, సౌందర్య పోషణ వస్తువులు కూడా తయారు చేయవచ్చు. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామం శనివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు ఇక్కడ స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామివారిని కన్నులారా దర్శించుకున్నారు. అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి, ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,32,900, అన్నదాన విరాళాలు రూ.48,762, కేశఖండనకు రూ.9,560, తులాభారం ద్వారా రూ.250, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.21,330 కలిపి మొత్తం రూ.2,12,802 ఆదాయం వచ్చిందని వివరించారు. మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. స్వామివారికి అర్చకుడు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించి, విశేషంగా అలంకరించారు. రేపటి నుంచి ‘రైతన్నా మీకోసం’ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోనూ సోమవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు ప్రతి రైతు ఇంటినీ సందర్శిస్తారన్నారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, దిగుబడులు, వారి అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేస్తారని వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతర అంశాలను ఈ కార్యక్రమంలో వివరించాలన్నారు. ప్రతి గ్రామానికీ ప్రత్యేక బృందాలను నియమించి, ఇంటింటికీ వెళ్లి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 29 వరకూ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు ఇంటినీ సందర్శించాలని, 30 నుంచి వచ్చే నెల 3 వరకూ రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాలని తెలిపారు. వచ్చే నెల 3న రైతు సేవా కేంద్రాల్లో స్థానిక రైతులతో సమావేశం నిర్వహించి, రబీ, వచ్చే ఖరీఫ్, ఆ తరువాత వచ్చే రబీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు జిల్లా స్థాయిలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అన్ని విభాగాల అధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. -
పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం
-8లో..ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025సత్యసాయి స్ఫూర్తి.. నిత్య సేవల వ్యాప్తి సత్యసాయి సేవా సమాజాలు సుమారు 50 సంవత్సరాలుగా దీనుల సేవలో తరిస్తూ వారి మన్ననలు పొందుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అతి పెద్ద వైద్యాలయం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్). ఇక్కడకు నిత్యం 2 వేల నుంచి 3 వేల మంది నిరుపేద రోగులు రకరకాల అనారోగ్య సమస్యలతో వస్తూంటారు. ఈ సంఖ్య శని, సోమవారాల్లో అయితే 3 వేలు దాటేస్తుంటుంది కూడా. ఇంతటి కీలకమైన ఆస్పత్రికి ప్రభుత్వ పర్యవేక్షణా లోపమే శాపంగా మారుతోందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కాకినాడ జీజీహెచ్‌తో పాటు జిల్లాలోని ఇతర ఆస్పత్రులను తరచుగా సందర్శించేవారు. ఆకస్మిక తనిఖీలు చేసేవారు. దీంతో, వైద్యులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించేవారు. నాటి ప్రభుత్వం ఆస్పత్రుల అభివృద్ధికి సైతం పెద్దపీట వేయడంతో రోగులకు ఆధునిక వైద్య సేవలు సైతం ఉచితంగా అందేవి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులు కానీ, ఉన్నతాధికారులు కానీ జీజీహెచ్ వైపు కన్నెత్తి చూసిన దాఖాలాలు లేవు. దీంతో, కొంత మంది వైద్యులు, సిబ్బంది సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోగమొచ్చి ఆస్పత్రికి వెళ్తే చావు తప్పదేమోననే దయనీయ పరిస్థితులు జీజీహెచ్‌తో పాటు జిల్లాలోని చాలా ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్నాయి. ఇది మొత్తం వైద్య వృత్తికి, జీజీహెచ్‌కు కళంకం తెస్తోంది. వరుస మరణాలు జీజీహెచ్‌లో కొందరు వైద్యుల నిర్లక్ష్యానికి 4 నెలల్లో 5 నిండుప్రాణాలు బలైపోయాయి. ఆగస్టు మొదటి వారంలో కాకినాడ జగన్నాథపురానికి చెందిన 21 ఏళ్ల వివాహిత పలపాల సుధారాణి జీజీహెచ్ గైనకాలజీ విభాగంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పల్మనరీ ఎడిమాకు గురైన ఆమెకు వైద్యులు తక్షణ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపారు. దీంతో సుధారాణి మృతి చెందింది. ఆమె మరణంతో ఐదేళ్ల కుమారుడు, నెలన్నర పాప తల్లి లేని వారయ్యారు. అదే నెల మూడో వారంలో కాకినాడ దేవాలయం వీధికి చెందిన 55 ఏళ్ల మహిళ హృద్రోగంతో జీజీహెచ్ కార్డియాలజీ విభాగంలో చేరింది. ఆహారం తీసుకోలేని పరిస్థితి. దీంతో, ఆహారాన్ని కడుపులోకి పంపించేందుకు రైల్స్ ట్యూబ్ వేశారు. దీనిని నిర్లక్ష్యంగా వేయడంతో ట్యూబు చివరి భాగం కడుపులోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. కనీసం ఈ విషయం కూడా గమనించకుండా ట్యూబు ద్వారా పాలు పోశారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఊపిరాడక పొలమారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం బయటకు రాకుండా బాధ్యులు సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ నెలలో కాకినాడకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి చిన్నపాటి థైరాయిడ్ సమస్యతో జీజీహెచ్‌కు వచ్చాడు. మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న అతడి మధుమేహం, రక్తపోటును వైద్య సిబ్బంది సక్రమంగా పర్యవేక్షించలేదని, అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలోని రథాలపేటకు చెందిన 20 ఏళ్ల వివాహిత రాయుడు కవితకు ఇంగ్వినల్ హెర్నియా (తొడ, పొత్తి కడుపు కలిసే భాగంలో దేహ అంతర్భాగం కొంత మేర ఉబ్బడం) సమస్య వచ్చింది. వైద్యపరంగా ఇది చాలా సాధారణ సమస్య అని, చిన్న శస్త్రచికిత్సతో తగ్గిపోతుందని పిఠాపురం వైద్యులు చెప్పారు. దీంతో, కవిత ఈ నెల 10న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. వైద్యులు ఆమెకు ఈ నెల 15న శస్త్రచికిత్స చేశారు. సాయంత్రం 5.40 గంటలకు కవిత చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. జీజీహెచ్‌కు నడిచి వచ్చిన యువతి వైద్యుల నిర్లక్ష్యంతో ఐదు రోజుల్లో విగతజీవిగా మారిందని సహ రోగులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన వివాహిత పెసింగి మల్లీశ్వరి (31) రెండోసారి గర్భం దాల్చింది. ఎనిమిదో నెలలో సాధారణ పరీక్షల కోసం ఈ నెల 14న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. ఆ సందర్భంగా తనకు పడని మందుల జాబితాను వైద్యులకు ఇచ్చింది. వారు అభినందించి, ఆ మందుల వివరాలు కేస్ షీటులో రాసుకున్నారు. కానీ, ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం తనకు ప్రమాదకరమని ఆమె రాసిచ్చిన పాంటాప్రొజోల్ ఇంజెక్షన్‌ను కుటుంబ సభ్యులు వద్దని వారిస్తున్నా ఇచ్చారు. దీంతో, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మల్లీశ్వరి కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆమె గర్భంలోని శిశువు గుండె ఆగిపోయిందని వైద్యులు చెప్పారు. అపస్మారక స్థితికి చేరుకున్న మల్లీశ్వరికి వైద్యులు సీపీఆర్, ఇతర వైద్య ప్రక్రియలు చేసినా ఫలితం లేకపోయింది. వైద్యులు హైడ్రామా నడిపి రాత్రి 11 గంటల సమయంలో మల్లీశ్వరి చనిపోయిందని వైద్యులు చెప్పారు. మరోవైపు కాకినాడ జీజీహెచ్‌లో మాదిరిగానే అక్టోబర్ 5న తుని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ బాలింత నిండు ప్రాణాలు కోల్పోయింది. తుని రూరల్ తిమ్మాపురానికి చెందిన రత్నకుమారి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆ సమయంలో సకాలంలో సరైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రసవానంతరం బ్లీడింగ్ అవుతోందని చెప్పినా వైద్యులు ఉదాసీనంగా వ్యవహరించడమే రత్నకుమారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు కాలాక.. నాలుగు నెలల వ్యవధిలోనే ఒక్క జీజీహెచ్‌లోనే ఐదు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇంత మంది రోగులు మృతి చెందిన తరువాత విచారణ, వైద్యులు, సిబ్బందిపై చర్యలు అంటూ హడావుడి చేస్తోంది. ఈ మేరకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించారు. వాస్తవానికి జీజీహెచ్‌లో వరుస మరణాలకు ప్రభుత్వం ఇన్నాళ్లు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి, పర్యవేక్షణ లోపమే కారణమని, దీనిపై ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్‌లో 50కి పైగా విభాగాలుంటాయి. ఏటా 250 మంది వైద్యులను అందించే ప్రతిష్టాత్మక రంగరాయ వైద్య కళాశాలకు ఇది బోధనాస్పత్రి. ఇక్కడ 200 మందికి పైబడి వైద్యులు (ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు), 250 మంది జూనియర్ వైద్యులు (మెడికోలు) ఉన్నారు. ఇంత మంది ఉన్నా మరణాలు చోటు చేసుకోవడానికి ప్రభుత్వ పర్యవేక్షణా లోపమే కారణమని పలువురు ఆక్షేపిస్తున్నారు. పైగా చిన్న వయసు రోగులు సైతం చనిపోతూండటం ఇటీవల వివాదాస్పదమవుతోంది. సర్జరీ టేబుల్‌పై ప్రాణాలు పోయిన రోగులను కూడా వివాదం అవుతుందన్న కారణంతో టేబుల్ డెత్ ప్రకటించక, ఐసీయూకు తరలించి, కాసేపటికి డెత్ డిక్లేర్ చేస్తున్నారన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి. కీలక శస్త్రచికిత్సలను పీజీలతో చేయిస్తున్నారని, పై స్థాయి వైద్యులు నామమాత్రానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పలు వార్డుల్లో మెడికోలు అందించే వైద్య సేవలపై అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు, హెచ్ఓడీల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ లేనందువల్లనే ఇటువంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. జీజీహెచ్ పర్యవేక్షణను గాలికొదిలేసిన సర్కారు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రజాప్రతినిధులు, అధికారులు ఫలితంగానే సేవల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం 4 నెలల్లో 5 నిండు ప్రాణాలు బలి ఇప్పుడు వరుస మరణాలతో ఇరకాటంలో ప్రభుత్వం వైద్యులు, సిబ్బందిపై విచారణ, చర్యలు అంటూ హడావుడి -
అనేక కార్యక్రమాలు
సత్యసాయి బాబా వారి స్ఫూర్తితో సత్యసాయి సేవా సమితుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే నారాయణ సేవగా అన్నదాన కార్యక్రమం ఒకటి. నిరుపేదలు, కనిపెంచిన సంతానం, ఆదరణ లేక జానెడు పొట్ట కోసం ఎంతోమంది విలవిల్లాడుతున్నారు. వారి జీవన స్థితిగతులను స్వయంగా చూశాం. వారు బయటకు రాలేరు. చేయి చాచి యాచించలేరు. అటువంటి వారి కోసం పలు సేవా సమితులు నిత్య నారాయణ సేవ అమలు చేస్తున్నాయి. ఎందరో అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాయి. – మన్యం పర్వత వర్థనరావు, జిల్లా సత్యసాయి సేవా సంస్థల వలంటరీ కన్వీనర్, రావులపాలెం -
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
● అనారోగ్యంతో చదువులు ముందుకు సాగవు ● ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అమలాపురం టౌన్: విద్యార్ధులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చేతి గోళ్లు, అరిచేతులు, జట్టు, తినే ఆహారం అన్నింటా పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హితవు పలికారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవం, పూర్వపు విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా పాఠశాల వద్ద శనివారం జరిగిన ప్రవచన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనారోగ్యంతో చదువులు ముందుకు సాగవన్నారు. విద్యార్ధులు ఇంట్లో అమ్మ పెట్టే ఆహారం తినేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అమ్మ పెట్టే అన్నం అమృతంతో సమానమని పేర్కొన్నారు. చదువులకు ఎంత విలువ ఇస్తారో వ్యక్తిగత పరిశుభ్రతకూ అంతే విలువ ఇవ్వాలన్నారు. మార్కెట్లో దొరికే తాజా కాయగూరలతోపాటు మన ఇంటి పెరటిలోనో, ఆవరణలోనో మొక్కలు పెంచాలని సూచించారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడలకు ప్రాము ఖ్యత ఇవ్వాలని తెలిపారు. ఏకాగ్రతతో చదివినప్పుడే చదివింది వంట పడుతుందని తెలిపారు. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతోపాటు పూర్వ విద్యార్థులు బోణం కనకయ్య, నల్లా విష్ణుమూర్తి పాల్గొన్నారు. చాగంటిని పాఠశాల తరఫున సత్కరించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● కారు, రెండు బైక్‌లు, రూ.3 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం ● డీఎస్పీ దేవకుమార్ వెల్లడి నల్లజర్ల : పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ శనివారం నల్లజర్ల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా తూర్పుగోదావరి జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడినట్టు చెప్పారు. ఒడిశాలో పోలీసులపై ఈ ముఠా కాల్పులకు తెగపడినట్టు వివరించారు. నల్లజర్ల సెంటర్లో నక్కా వారివీధిలో ఒంటరిగా ఉంటున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి చొరబడ్డ ఈ ముఠా సెప్టెంబరు 24వ తేదీ అర్ధరాత్రి రాళ్ళతో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. అక్కడే ఉన్న రెండు బైక్‌లు తీసుకుపోయారు. దీనిపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంతకుముందు రోజు ప్రత్తిపాడులో జ్యూయలరీ షాపులో 11కిలోల వెండి ,ఒక బుల్లెట్ బండి దొంగతనం చేశారు. దేవరపల్లి సీఐ నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. నెల్లూరుకు చెందిన ప్రక్రద్దీన్ ఒంగోలు జైలులో ఉండగా ఈ మధ్యప్రదేశ్ ముఠాతో సంబంధాలు ఏర్పరుచుకొని నేరాలకు పాల్పడేవాడు. ఈ ముఠాతోనే నల్లజర్లలో నేరానికి పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. రెండునెలల తర్వాత ఈ ముఠాతో మళ్ళీ దొంగతనాలకు పాల్పడే క్రమంలో నల్లజర్ల పోలవరం కాలువగట్టు సమీపంలో శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈముఠాను నల్లజర్ల సీఐ వై.రాంబాబు తమ సిబ్బందితో వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా నల్లజర్లలో దొంగతనం చేసేంది తామే నని ఈ ముఠా ఒప్పుకుంది. నెల్లూరు రూరల్ మండలం మూలపేటకు చెందిన షేక్ ప్రక్రుద్దీన్, మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వివిధ తండాలకు చెందిన హోలీబేడాకు చెందిన కేసు ఉమ్రా, మాల్పురియాకు చెందిన రాగన్ మాధవ్ హటిలా, దేవిపురాకు చెందిన బారిక్ సింగ్ అజినార్, హెలీబెడాకు చెందిన మొహర్కల్లు మోహదా, భుటియాకు చెందిన హీరు హరియా అజినార్లను అరెస్ట్ చేశామన్నారు. వీరిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించినట్టు చెప్పారు. సమావేశంలో దేవరపల్లి, నల్లజర్ల సిఐలు నాగేశ్వరనాయక్, వై.రాంబాబు, ఎస్ఐ దుర్గాప్రసాదరావు, క్రైం ఎస్ఐ రవీంద్ర పాల్గొన్నారు. -
కనీస ‘మద్దతు‘పై బాబు ఉదాసీనత
రాష్ట్రంలో మొన్న టమాటా, నేడు అరటి వంటి పంటలకు కోత సొమ్ము కూడా రాక రైతులు చేలను, తోటలను దుక్కులు దున్నేసి నిరసన తెలుపుతున్నారు. వీటితోపాటు పలు పంటలకు కనీస మద్దతు రాకపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయడం లేదు సరికదా.. పంటలు కొనుగోలు చేసే దళారులను నియంత్రించకపోవడంతో మార్కెట్లో ధరల నిర్ణయం ఇష్టానుసారంగా ఉంది. కోనసీమ జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ చూస్తున్నప్పటికీ జిల్లా రైతులకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పంట పోతున్నా పెట్టుబడి రాయితీ అందకపోవడం, ఉచిత బీమా ఎత్తేయడం వల్ల పరిహారం అందకపోవటం, ధరలు పడిపోవడం రైతులను కుంగదీస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కనీస మద్దతు ధరల కల్పనకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించింది. అనంతపురం, కడప తదితర జిల్లాల్లో టమాట, అరటి ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ఆయా పంటలను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయించింది. కరోనా సమయంలో అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో వనామీ రొయ్యల ధర కేజీ రూ.50కు పడిపోయిన సమయంలో కూడా కనీస మద్దతు ధరలు ప్రకటించి ఎగుమతిదారుల ద్వారా కొనుగోలు చేయించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయడం అటుంచి రైతులు నష్టపోతుంటే సమీక్షలు జరిపిన సందర్భాలు కూడా లేకుండా పోయాయి. -
కొబ్బరితో 106 రకాల ఉత్పత్తులు
మూడు జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సగటున ఏడాదికి 126 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. కొబ్బరి కాయ, ఆకులు, కాండంతో కనీసం 106 ఉత్పత్తులు స్థానికంగా తయారు చేసే అవకాశముంది. కొబ్బరి చిప్స్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కొబ్బరి క్రీమ్, కొబ్బరి విప్పింగ్ క్రీమ్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, నాటా డి కోకో, కొబ్బరి వెనిగర్, కొబ్బరి బెల్లం, చక్కెర, నీరా, కొబ్బరి అమినోలు, సిరప్లు తయారు చేయవచ్చు. కొబ్బరి నూనెను సబ్బులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. -
మోసపోయిన మహిళ క్షేమంగా ఇంటికి
అమలాపురం రూరల్: ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లికి చెందిన ఎం.మంగాదేవి దుబాయ్‌లో నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఇబ్బందులు పడుతుండగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రం క్షేమంగా ఇంటికి చేర్చినట్టు నోడల్ అధికారి కే. మాధవి, మేనేజర్ గోళ్ల రమేష్ శనివారం తెలిపారు. ఆ మహిళ 2025 11 మే దుబాయ్ వెళ్లిందని అక్కడ 3 నెలల 15 రోజులు ఒక ఇంటిలో పనికి కుదిరిందన్నారు. అక్కడ ఆ ఇంటి యజమాని చాలా ఇబ్బంది పెడుతూ ఒత్తిడి చేస్తూ ఉండేవారని విషయాన్ని ఏజెంట్ దృష్టికి తీసుకు రాగా అతను పనుల నిమిత్తం పలు ఇళ్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టాడని తెలిపారు. భోజనం పెట్టేవారు కాదని ఈ క్రమంలో ఆరోగ్యం చెడిపోయి ఇబ్బంది పడిందని చెప్పారు. మంగాదేవి కుటుంబ సభ్యులు కలెక్టర్ మహేష్‌కుమార్‌ను ఆశ్రయించగా ఆయన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రాన్ని ఈ అంశం పరిశీలించమని ఆదేశించగా సిబ్బంది బాధితురాలితో, ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపి ఆమెను క్షేమంగా ఇండియాకు చేర్చారు. పెదపట్నంలంకలో షూటింగ్ సందడి మామిడికుదురు: ‘‘రాజి మంచి మొడుడు కావాలని దేవుడికి దండం పెట్టుకో అమ్మా’’ అంటూ కథనాయికి జయశ్రీకి తండ్రి పాత్రధారి రాజీవ్ కనకాల చెబుతున్న సీన్‌తో పెదపట్నంలంకలో శనివారం ‘రాజి’... ‘‘నో కాంప్రమైజ్’’... సినిమా షూటింగ్ ప్రారంభమైంది. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆరంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి పాఠశాలకు క్రీడామైదానం ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా కాకినాడ డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి సత్యన్నారాయణ, డీఎస్డీఓ బి.సతీష్‌కుమార్; ఖోఖో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జానకిరామయ్య, జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడు పట్టాభిరాం హాజరయ్యారు. ఎస్జీఎఫ్ఐ మహిళా కార్యదర్శి సుధారాణి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖోఖో సంఘ ప్రతినిధులు వాసు, పీడీలు మాచరరావు, రాజశేఖర్, నూకరాజు, సురేష్‌రాజు, దిశ చైర్మన్ స్వరాజ్యలక్ష్మి, జేఎన్టీయూకే పీడీ శ్యాంకుమార్ పాల్గొన్నారు. 24వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 13 జిల్లాల నుంచి 180 మంది హాజరు -
జిల్లా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా తలాటం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన తలాటం హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కార్యదర్శి నక్క వెంకటేష్ శనివారం తెలిపారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్ఫరాజ్ నవాజ్, కోశాధికారి జి.అప్పారావు (జిమ్మీ), ఎన్ సత్యానందంలతో పాటు సభ్యులు ఏకగ్రీవంగా హరీష్‌ను ఎన్నుకున్నారు. ఈయన గతంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కి సేవలు అందించడంతో పాటు హరీష్ ఫౌండేషన్ పేరుతో క్రీడామైదానాల అభివృద్ధితోపాటు క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రొత్సహిస్తున్నారు. -
గిరిజాతి ఆవుకు అరుదైన కవల దూడలు
మామిడికుదురు: గిరి జాతి ఆవుకు అరుదైన కవల దూడలు పుట్టిన ఘటన మామిడికుదురులో శనివారం చోటు చేసుకుంది. కుడుపూడి రామేశ్వర్, జానకి దంపతుల పొలంలో గిరి జాతికి చెందిన ఆవు మగ, ఆడ దూడలకు జన్మనిచ్చింది. ఈ దూడలు 2.8 అడుగుల ఎత్తు, 2.8 అడుగులు పొడవుతో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై పశు వైద్యాధికారి చేగొండి శ్రీరామ్‌ను సంప్రదించగా ఇలా కవల దూడలు పుట్టడం అరుదైన ఘటన అన్నారు. ఎక్కడో 100కి ఒకటి వంతున ఈ విధంగా జరుగుతుందన్నారు. గిరి జాతి ఆవు పూటకు మూడు నుంచి నాలుగు లీటర్ల పాలిస్తుందన్నారు. ఆ పాలు 4–5 వెన్న శాతం కలిగి ఉంటాయని చెప్పారు. గిరి జాతి అవు రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖరీదు ఉంటుందని చెప్పారు. స్థానికులు ఈ కవడ దూడలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
బాలుడి నిజాయితీ
గండేపల్లి: పదేళ్ల బాలుడికి తాను వెళుతున్న మార్గంలో నగదు ఉన్న పర్సు కంట బడటంతో భద్రపరిచి బాధితులకు అందజేసి తన నిజాయితీని చాటాడు. రంగంపేట మండలం వెంకటాపురానికి చెందిన బొడెం దొరబాబు తల్లి అనంతలక్ష్మితో కలసి మోటార్ సైకిల్‌పై గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో పెళ్లి భోజనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తాళ్లూరు యల్లమిల్లి మీదుగా తమ గ్రామం వెళుతుండగా తాళ్లూరు శివారులో అనంతలక్ష్మి పర్సు (రూ.7,200) పడిపోయింది. కొంతదూరం వెళ్లాక పర్సు పోయిందని గమనించి, వెనక్కి వెతుక్కుంటూ వచ్చినప్పటికి కనబడకపోవడంతో నిరుత్సామంతో ఇంటికి వెళ్లిపోయారు. తాళ్లూరు మఠంలో అన్న సమారాధనకు స్నేహితులతో వెళుతున్న గ్రామానికి చెందిన కిలాడి పండుకు పర్సు కనిపించింది దానిని భద్ర పరచి మఠంలో ఉన్న తన తండ్రి శ్రీనుకు తెలియజేశాడు. గ్రామానికి చెందిన కూరగాయల విక్రయదారుడు కురందాసు అప్పారావు, శ్రీను కలిసి గ్రామానికి చెందిన ఒమ్మి ప్రసాద్‌కు తెలియజేయడంతో పర్సులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా ప్రసాద్ బాధితులకు సమాచారం అందజేశారు. దీంతో బాధితులు వచ్చి నగదుతో ఉన్న పర్సును తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలుడిని పలువురు అభినందించారు. బాలుడు స్థానికంగా ఉన్న హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. -
28 నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
రామచంద్రపురం రూరల్: ఈ నెల 28, 29 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పిలుపు ఇచ్చారు. మండలంలోని ద్రాక్షారామ శ్రీనివాస శైల ఐటీఐ కళాశాల ప్రాంగణంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. సిద్దూ మాట్లాడుతూ పీడీఎస్‌యూ 51 ఏళ్లుగా విద్యార్థుల హక్కుల కోసం, శాసీ్త్రయ విద్యా సమ సమాజ స్థాపన కోసం పోరాడుతోందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, మెస్ చార్జీల పెంపు, కాస్మోటిక్ చార్జీల వంటి సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచీ విద్యార్ధులు వెల్లువలా తరలివచ్చి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలిని కోరారు. అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీవైఎల్ నాయకులు వి. నాగరాజు, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి, పీడీఎస్‌యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాల్ టిక్కెట్ల విడుదల
పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు హాల్ టిక్కెట్లు విడుదల చేశామని, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా వీటిని పొందాలని నవోదయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 7,170 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరికి 32 కేంద్రాల ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబర్, యూజర్ ఐడీకి గాను విద్యార్థి పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. జర్మనీలో ఉద్యోగావకాశాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.గోపీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పెంటర్లు, స్టీల్ ఫిక్సర్లు, పేవింగ్ స్టోన్ వర్కర్లు, రోడ్డు వర్కర్ల వంటి వృత్తుల్లో అవకాశాలున్నాయని వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులై 44 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.2.57 లక్షల జీతం ఉంటుందన్నారు. వసతి, వీసా, విమాన చార్జీలను కంపెనీ భరిస్తుందన్నారు. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.2 లక్షలు రెండు విడతల్లో చెల్లించాలన్నారు. వివరాలకు 99888 53335 నంబరులో సంప్రదించాలని కోరారు. చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి కాకినాడలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం పెద్దాపురం (సామర్లకోట): తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆప్కో మాజీ డైరెక్టర్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ముప్పన వీర్రాజు డిమాండ్ చేశారు. పెద్దాపురంలోని ఆప్కో కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కాకినాడలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. చేనేత పరిశ్రమకు రావలసిన 30 శాతం రిబేట్, పావలా వడ్డీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి 30 శాతం రిబేట్ వస్తే నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు తక్కువ ధరకే విక్రయించే వీలుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 వరకూ చేనేత సంఘాలున్నాయని, వీటిలో పని చేసిన కార్మికులు కూలీ సక్రమంగా అందే అవకాశం లేక ఇతర రంగాలకు మళ్లిపోతున్నారని చెప్పారు. ఈ సదస్సులో ప్రతి చేనేత కార్మికుడూ పాల్గొనాలని వీర్రాజు కోరారు. నేటి నుంచి అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల ఎస్జీఎఫ్ఐ ఖోఖో పోటీలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్‌లు, మేనేజర్లు, 40 మంది లోకల్ అధికారులు హాజరు కానున్నారు. పోటీల నిర్వహణకు డీఎస్ఏ మైదానంలో రెండు కోర్టులను సిద్ధం చేశారు. క్రీడాకారులకు గొడారిగుంట, రమణయ్యపేట మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో వసతి కల్పించారు. పోటీల ఏర్పాట్లను డీఈఓ పిల్లి రమేష్, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీను శుక్రవారం పర్యవేక్షించారు.12 మంది పిల్లల్లో గుండె వ్యాధుల నిర్ధారణ కాకినాడ క్రైం: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన ఇండో బ్రిటిష్ హాస్పిటల్ సౌజన్యంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన 18 ఏళ్లలోపు పిల్లలకు శుక్రవారం గుండె వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్‌లోని పీడియాట్రిక్స్ విభాగం పర్యవేక్షణలో సేవలందిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం(డైస్)లో డాక్టర్ జ్యోతిప్రకాష్ బృందం ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. 37 మంది పిల్లలను పరీక్షించగా, వీరిలో 12 మందిలో గుండె వ్యాధులు నిర్ధారించినట్లు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ తెలిపారు. వీరిలో ఐదుగురికి శస్త్రచికిత్సల ద్వారా, మిగిలిన ఏడుగురికి మందుల ద్వారా సమస్య నయం చేస్తారన్నారు. శస్త్రచికిత్సల నుంచి మందుల వరకూ పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.అరుణ తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలను పీడియాట్రిక్స్ హెచ్ఓడీ డాక్టర్ మాణిక్యాంబ పర్యవేక్షించారు. -
మంత్రిగారూ.. తీరు మార్చుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్తిక వనభోజనాల్లో శెట్టిబలిజి కులాన్ని విమర్శించేలా మాట్లాడడం సరికాదని, మంత్రి హోదాలో ఉన్నపుడు మాట తీరు మార్చుకోవాలని ఆ సంఘ నాయకులు హితవు పలికారు. అమలాపురంలో ఇటీవల జరిగిన శెట్టిబలిజ వనసమారాధనలో మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడడంపై కాకినాడలోని జిల్లా శెట్టిబలిజి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ వైస్ ఎంపీపీ కర్రి గోపాలకృష్ణ, జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, శెట్టిబలిజ సంఘ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, అనుసూరి ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రి సుభాష్ విమర్శించడం సరికాదన్నారు. ఏ పార్టీ అయినా శెట్టిబలిజి ఐక్యతను చూసి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవులు ఇస్తున్నారన్నారు. నాయకుల తీరు వల్ల లా వర్గం ఐక్యత దెబ్బతింటుందన్నారు. కుల అభివృద్ధిని పక్కనపెట్టి సొంత అజెండాతో నిర్ణయాలు తీసుకుని ఒకరిని ఒకరు దూషించుకోవడం సరికాదన్నారు. పదవులు వీరికి సొంతంగా రాలేదని, కేవలం కులం ఆధారంగా వచ్చాయన్న సంగతి మర్చిపోకూడదన్నారు. సమాజంలో ఎదుగుతున్న శెట్టిబలిజ కులాన్ని ప్రస్తుత తరం ఆదర్శంగా తీసుకోవాలని ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలన్నారు. రాజకీయంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని వారు సూచించారు. సమావేశంలో శెట్టిబలిజ సంఘ నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, రాయుడు వెంకటేశ్వరరావు, కేత శ్రీనివాస్, సత్తిబాబు, సత్తిబాబు, కడలి రాంపండు, వాసంశెట్టి మాధవ్, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సుభాష్‌కు శెట్టిబలిజ సంఘం నాయకుల హితవు -
1 అయితే సరే.. ఆపైన ఇక్కట్లే..
● ఇంటి నంబర్ 1తో ఉంటేనే రిజిస్ట్రేషన్లు ● 2 ఆపైన ఉంటే మొరాయింపు ● రెండు నెలలుగా ఇదే తంతు ● 16 గ్రామాల కక్షిదారులకు ఇబ్బందులుప్రత్తిపాడు: పని సులభతరం చేయాడానికి ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం వారికి శాపంగా మారింది. ఈ సమస్యతో ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 16 గ్రామాల్లోని స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగక కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నంబర్లు 1తో ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2, 3, 4.. ఆపైన ఉంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. కుమార్తెకు పెళ్లి చేసి, పసుపు – కుంకుమ కింద ఇల్లు ఇద్దామన్నా.. ఇంటి స్థలాన్ని గిఫ్ట్‌గా రిజిస్ట్రేషన్ చేద్దామన్నా.. అవసరానికి అమ్ముకుందామన్నా.. కొనుగోలు చేద్దామన్నా.. డబ్బు అవసరం కోసం తనఖా పెట్టుకుందామన్నా రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ రోజు కాకపోతే మరో రోజు జరుగుతుందని కక్షిదారులు భావిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కూడా ఏం చేయాలో తెలియక రేపు మాపు అంటూ తిప్పి పంపుతున్నారు. ప్రత్తిపాడు, కిర్లంపూడి, శంఖవరం, గొల్లప్రోలు, పిఠాపురం, అడ్డతీగల తదితర మండలాల పరిధిలో 68 గ్రామాలకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలు ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే జరుగుతూంటాయి. అయితే, ప్రత్తిపాడు మండలం వాకపల్లి, పోతులూరు, ఒమ్మంగి, రాచపల్లి; ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి; గొల్లప్రోలు మండలం చెందుర్తి, చిన జగ్గంపేట, కొడవలి, వన్నెపూడి; కిర్లంపూడి మండలం వేలంక, రామకృష్ణాపురం, రాజుపాలెం, గెద్దనాపల్లి, ముక్కొల్లు; పిఠాపురం మండలం దొంతమూరు, వెల్దుర్తి గ్రామాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రం ఒకటో నంబర్ కాకపోతే జరగడం లేదు. ఈ గ్రామాల్లోని ఇంటి నంబర్లు 2, 3, 4, 5 తదితర నంబర్లతో ఉన్న నివేశన స్థలాలు, ఇళ్ల క్రయవిక్రయాలు, తనఖా, గిఫ్టు తదితర రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అమ్మేవారు, కొనుగోలు చేసేవారు, వీలునామా రాసేవారు, రాయించుకునే వారు ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజూ సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తూంటారు. తీరా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్తున్నారు. దూరాభారం, సమయం వృథా, సొమ్ముల ఖర్చు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరి చేసి, తమ ఆస్తులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయా గ్రామాల కక్షిదారులు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం రిజిస్టేషన్ల శాఖలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నందు వలన ఈ పరిస్థితి తలెత్తింది. కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామాలకూ రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయి. ఈ 16 గ్రామాల్లో ఇంటి నంబర్ 1తో ఉంటే రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు లేవు. 2 అంతకంటే ఎక్కువ నంబరు ఉన్న ఇళ్లు, నివేశన స్థలాల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారులను నివేదించాం. – వి.విక్టర్ డేనియల్, సబ్ రిజిస్ట్రార్, ప్రత్తిపాడు -
భీమేశ్వరునికి జటాజూటాలంకరణ
పంచారామ క్షేత్రంలో ముగిసిన కార్తిక మాస ఉత్సవాలుసామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వారికి శుక్రవారం వెండి జటాజూటాన్ని అలంకరించారు. కార్తిక మాసం ముగిసిన అనంతరం పోలి పాడ్యమి నాడు స్వామివారికి ఈ అలంకరణ చేయడం ఆనవాయితీ. బ్యాంకు లాకరులో భద్రపర్చిన వెండి జటాజుటాన్ని ట్రస్టు బోర్డు చైర్మన్, భక్త సంఘం నాయకులు ఆలయానికి తీసుకుని వచ్చారు. సంప్రోక్షణ అనంతరం దీనిని స్వామివారికి వేద పండితులు అలంకరించారు. భక్త సంఘం నాయకుల ఆధ్వర్యాన స్వామి, అమ్మవారి ఆలయాల్లో సాంబ్రాణి ధూపం వేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి జటాజూటాలంకరణను ఉచితంగా తిలకించడానికి భక్తులను అనుమతించారు. స్వామివారికి ధూపం వేయడంతో గంట వరకూ అలంకరణ కనిపించలేదు. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని బంగారు కిరీటం, స్వర్ణాభరణాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు బారులు తీరారు. భక్త సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఆలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. మహిళల కోలాటం, వీరభద్రుని నృత్యం తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. -
రబీలో 1.91 లక్షల ఎకరాలకు నీరు
బోట్‌క్లబ్ (కాకినాడి సిటీ): వచ్చే రబీలో జిల్లాలోని గోదావరి తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు పరిధిలోని 1,90,865 ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గోదావరి, ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థల్లో ప్రస్తుత నీటి నిల్వల గురించి ఇరిగేషన్ ఎస్ఈ కె.గోపీనాథ్ తొలుత వివరించారు. ఈ వ్యవస్థల కింద రబీలో పూర్తి ఆయకట్టుకు అందించేందుకు నీటి నిల్వలున్నాయని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ, గోదావరి డెల్టా కింద 1,05,341 ఎకరాలు, పీబీసీ కింద 32,507 ఎకరాలు, ఏలేరు కింద 53,017 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. వచ్చే నెల 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు సంబంధించి ఆయకట్టు రైతులు డిసెంబర్ 31 నాటికి నాట్లు వేయాలని, వచ్చే ఏడాది మార్చి 31 లోగా సాగు పూర్తి చేయాలని కోరారు. రబీ సాగునీటి విడుదల చేసేలోగా జిల్లాలో సాగునీటి వ్యవస్థల పటిష్టతకు ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మోంథా తుపానుకు దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలో 50 మైనర్ ఇరిగేషన్ చెరువులను ఆర్ఆర్ఆర్ (రిపేర్, రెన్నోవేషన్, రిస్టోరేషన్) స్కీమ్ కింద గుర్తించి, నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. మరో 100 మైనర్ ఇరిగేషన్ చెరువులను కూడా గుర్తించామని, వీటికి కూడా త్వరలో ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపారావు, ఎంపీలు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. -
అంతా పదిలమేనా!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జగన్నాథపురానికి చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. పరీక్షల సమయంలో నామినల్ రోల్స్ పంపించేటప్పుడు అతడి తండ్రి పేరు తప్పుగా నమోదు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత అనంతరం అధికారులు జారీ చేసిన మార్కుల మెమోను శ్రీనివాస్ పరిశీలించగా తండ్రి పేరు తప్పుగా ఉన్నట్లు గుర్తించాడు. సరే ఏమవుతుందని అనుకుని ఇంటర్మీడియెట్ అడ్మిషన్ పొందాడు. టెన్త్ మార్కుల జాబితా ఆధారంగా అక్కడ కూడా తండ్రి పేరు తప్పుగా నమోదైంది. ఉన్నత విద్య పూర్తయ్యాక విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి పేరు తప్పుగా ఉందని గుర్తించిన పాస్‌పోర్టు అధికారులు అతడి దరఖాస్తును తిరస్కరించారు. ఆ తర్వాత చదివుకున్న పాఠశాలకు వచ్చి, తండ్రి పేరును సరి చేయించుకునేందుకు శ్రీనివాస్‌కు ఏడాదికి పైగా సమయం పట్టింది. ఇది ఒక్క శ్రీనివాస్ నమస్యే కాదు. జిల్లాలో చాలా మంది విద్యార్థులకు ఏటా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సాధారణంగా అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల వివరాల నమోదులో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పొరపాట్లు చేస్తూంటారు. భవిష్యత్తులో ఆ విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు, విదేశాలకు వెళ్లేందుకు, పోటీ పరీక్షలు రాసే సమయంలోను టెన్త్ మార్కుల జాబితాలోని చిన్నచిన్న తప్పులే పెద్ద సమస్యగా మారుతూంటాయి. వాటిని సరిదిద్దుకునేందుకు తిరిగి నానా తంటాలూ పడాల్సి వస్తోంది. అధికారులకు సైతం ఈ సమస్య తలనొప్పిగా మారుతోంది. తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని, టెన్త్ నామినల్ రోల్స్ సమయంలోనే అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి సమస్యా తలెత్తదు. ముందస్తు కార్యాచరణ విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతి మార్కుల మెమోయే ఎంతో కీలకం. ఉన్నత చదువులే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సైతం అందులోని వివరాలే ప్రధానం. ఇంతటి ప్రాధాన్యమున్న మార్కుల జాబితాలు రూపొందించేటప్పుడు విద్యార్థుల వివరాల్లో ఎలాంటి తప్పులూ దొర్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నామినల్ రోల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటి పదిసార్లు పరిశీలించాలని, తేడాలుంటే సరి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించక ముందే వారి వివరాలు సరిచూసేలా ముందస్తు కార్యాచరణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 247, ప్రైవేటువి 219 ఉన్నాయి. ఈ 466 పాఠశాలల నుంచి ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 29,866 మంది హాజరవుతున్నారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువు ఉంది. ఈ తరుణంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పదో తరగతి విద్యార్థుల పేర్లు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం తదితర వివరాలను సరిచూసే పనిలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు సేకరించి, యూడైస్‌లోని వివరాల ఆధారంగా పరిశీలిస్తున్నారు. అక్షర దోషాలు, వివరాల్లో తప్పులుంటే సరి చేస్తున్నారు. ఈ కసరత్తును వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సక్రమంగా నమోదు చేయాలి అన్ని ప్రభుత్వ, పైవేటు పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలి. విద్యార్థి పేరుతో పాటు సంరక్షకుల పేర్లలో అక్షర దోషం లేకుండా చూడాలి. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు కూడా జాగ్రత్త వహించాలి. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ విద్యార్థి భవితకు టెన్త్ మార్కుల జాబితాయే కీలకం ఏ తప్పు దొర్లినా తలనొప్పి తప్పదు పకడ్బందీగా నామినల్ రోల్స్‌పై కసరత్తు పబ్లిక్ పరీక్షలకు 29,866 మంది హాజరు -
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ రామచంద్రపురం: ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ (గస్తీ)పై దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ పోలీసులకు సూచించారు. నియోజకవర్గంలోని రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయం, ద్రాక్షారామ పోలీస్ స్టేషన్, మండపేట రూరల్ సర్కిల్ కార్యాలయాల వార్షిక తనిఖీలను నిర్వహించి సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. సబ్ డివిజన్లో నమోదైన కేసుల ఫైళ్లను పరిశీలించి, పెండింగ్ కేసుల స్థితిగతులు, దర్యాప్తు పురోగతి గురించి ఆరా తీశారు. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చోరీ కేసులను త్వరితగతిన ఛేదించి, రికవరీల శాతాన్ని పెంచాలని సూచించారు. సైబర్ నేరాలపై మహిళల చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్, సీఐలు వెంకటనారాయణ, పి.దొరరాజు, సురేష్, ఎస్సైలు లక్ష్మణ్, నాగేశ్వరరావు, రాము, డీ సురేష్, హరీష్‌కుమార్, కిషోర్, జానీ బాషా పాల్గొన్నారు. -
చేతివాటంపై దర్యాప్తు చేయాలి
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల నగదు లెక్కింపులో సేవకుడి పేరుతో చేతివాటం ప్రదర్శించిన ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయం హుండీలను బుధవారం తెరచి లెక్కిస్తున్న సమయంలో రామచంద్రపురం మండలం వెంగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే సేవకుడు రూ.60 వేల దొంగతనానికి పాల్పడగా, అతనిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జగ్గిరెడ్డి గురువారం కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారని, క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శ్రీనివాసరావు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త రూ.60,000 దొంగిలించిన ఉదంతం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మకర్తగా ఉన్న ఆ పార్టీ నాయకుడే డైరెక్ట్‌గా స్వామివారి హుండీలో చేతులు పెట్టి నగదు తీసుకువెళ్లిన దృశ్యాలు చూశామన్నారు. అలాగే దంపతులు నిలువు దోపిడీ మొక్కు తీర్చుకొని నగలు స్వామివారికి సమర్పిస్తే, లెక్కించే సమయంలో అవి లేకపోవడం చూసి వారు ఫిర్యాదు చేసిన ఘటన కూడా తెలుగుదేశం హయాంలో జరిగిందన్నారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక బృందం ద్వారా సేవ చేసేందుకు ఆలయానికి వచ్చి ఇటువంటి దొంగతనాలకు పాల్పడ్డాన్ని వైఎస్సార్ సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇతను ఎప్పటి నుంచి వస్తున్నాడు? ఎవరు చెబితే అతనికి ఈ అవకాశం కల్పించారు? అతను గతంలో ఏఏ దేవాలయాల్లో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు? వంటి అంశాలు విచారించి మొత్తం ఎంత దొంతిలించాడో తేల్చాలన్నారు. అతను ఎవరు సిఫారసు చేస్తే ద్రాక్షారామ ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉన్నాడో, తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాలయాలను కూడా తెలుగు తమ్ముళ్లు ఈ విధంగా దోచుకుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నగదు, సెల్ఫోన్లు రికవరీ పెద్దాపురం (సామర్లకోట): పట్టణ టెలికాం కాలనీలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించి నిఽందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు, మోటారు సైకిలు, దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. గురువారం పెద్దాపురం సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పెంకే సింహచలం తన కుమార్తె వివాహం నిమిత్తం బీరువాలో ఉంచిన రూ.ఐదు లక్షల నగదు, బంగారం ముక్క టెలికాం కాలనీలో నివాసం ఉంటున్న ఇంటి బెడ్ రూమ్‌లో బీరువా లాకర్లో పెట్టినట్టు చెప్పారు. పెళ్లి పనుల కోసం కాకినాడ వెళ్లి ఈ నెల 10వ తేదీ రాత్రి 12.30 గంటల సమీపంలో ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు, బీరువా తెరచి ఉండటంతో ఈ నెల 11వ తేదీన పెంకే సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మౌనిక కేసు నమోదు చేశారన్నారు. ఘటనా ప్రదేశంలో లభించిన ఆధారాల మేరకు బుధవారం రాత్రి పెద్దాపురం–సామర్లకోట రోడ్డులోని అయోధ్యాలయం గ్రాండ్ లే అవుట్ వద్ద నిందితుడు యర్రంశెట్టి చరణ్ విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న రూ.3.60 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు పెద్దాపురం మండలం, ఆనూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా చెప్పారు. ఇతనిపై గతంలో చైతన్యపురం, మలక్‌పేట, అంబర్‌పేట, సరూర్‌నగర్, రాజమహేంద్రవరం, వనస్థలిపురం, గండేపల్లి, ప్రకాశనగరం, సర్పవరం, హయాత్నగరం పోలీసు స్టేషన్లలో పలు దొంగతనం కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన సీఐ పి.విజయ్‌శంకర్, క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్సై మౌనిక, సిబ్బందిని ఎస్పీ బిందుమాధవ్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
రిటైర్డ్ ఎంఈవోకు సైబర్ వల
ముమ్మిడివరం: రిటైర్డ్ ఎంఈవో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. ఏకంగా రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ గురువారం తెలిపారు. ముమ్మిడివరం, కాట్రేనికోనతోపాటు పలు మండలాల్లో ఎంఈవోగా పనిచేసిన బొజ్జా రమణశ్రీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. మీ ఆధార్‌కార్డు ద్వారా రూ.3 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, దీనిపై కేసు నమోదయ్యిందని సైబర్ నేరగాళ్లు ఆయనను ఫోన్లో బెదిరించారు. ఇది చాలా పెద్ద కేసు అని, కేసు మాఫీకి రూ.70 లక్షలు ఇవ్వాలని ఆగంతకులు వాట్సాప్ కాల్లో బెదిరించారు. దీంతో భయపడిన ఆయన విడతల వారీగా రూ.34.60 లక్షలు వారికి ముట్టజెప్పారు. నేరగాళ్ల తీరుతో అనుమానం వచ్చిన ఆయన మోసపోయానని గ్రహించారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జ్వాలాసాగర్ తెలిపారు. ● అక్రమ లావాదేవీల పేరుతో బెదిరింపు ● రూ.34.60 లక్షల చెల్లింపు -
రాష్ట్ర స్థాయి క్రీడలకు ముగ్గురు విద్యార్థులు
అల్లవరం: స్కూల్ గేమ్స్ జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 18న కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ క్రీడాప్రదర్శన చేసిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని దేవగుప్తం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.వేణుగోపాలకృష్ణ గురువారం తెలిపారు. అండర్ –14 బాలురు, బాలికల వాలీబాల్ విభాగంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గెద్దాడ సాయి ప్రసన్న, పెచ్చెట్టి పవన్‌కుమార్, అండర్ 17 షాట్ పుట్ బాలికల విభాగంలో గూడవిల్లి రక్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం తెలిపారు. ఈ నెల 24న గుంటూరులో జరిగే షాట్‌పుట్ పోటీల్లో రక్షిత, డిసెంబర్ 6 న నెల్లూరులో జరిగే వాలీబాల్ పోటీల్లో సాయిప్రసన్న, పవన్‌కుమార్ జిల్లా తరపున ఆడనున్నారని తెలిపారు. క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేయడంలో కృషి చేసిన పీడీ రాజ్‌కుమార్‌ను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
వృద్ధుడి ఆచూకీ కోసం గాలింపు
నిడదవోలు రూరల్: పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో స్నానానికి దిగి గల్లంతైన వృద్ధుడి ఆచూకీ కోసం గురువారం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమిశ్రగూడెంలోని లోహియనగర్కు చెందిన ఉయ్యూరి వెంకటరమణ (62) ఈ నెల 19వ తేదీన గల్లంతు కాగా ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. వెంకటరమణ ఆచూకీ కోసం సమిశ్రగూడెం కాల్వ గట్లు, కాకరపర్రు హెడ్‌లాక్ వద్ద ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.బాలుడి అదృశ్యం శంఖవరం: మండలంలోని కత్తిపూడి గ్రామానికి చెందిన బాలుడు ముద్రగడ శ్రీనివాస్ అదృశ్యమైనట్టు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. ఈ నెల 17 తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదన్నారు. బాలుడికి సుమారు 15 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలుడు ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని కోరారు. -
సాహస పథం.. సేవా దృక్పథం
● విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి ● సుశిక్షితులవుతున్న వైనం ● రేపు 77వ ఎన్సీసీ దినోత్సవం రాయవరం: వారు ఎంతటి సాహసకృత్యానికై నా వెనుకాడరు. ఎలాంటి విపత్కర పరిస్థితులలోను మనోధైర్యాన్ని కోల్పోరు. ఎదపై బండరాళ్లను పగులకొట్టించుకోవడం, భగభగమండే రింగుల్లో నుంచి క్షణాల్లో దూరి పోవడం, వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేని అరణ్యాల్లో పర్యటించడం, పర్వతారోహణ చేయడం, సముద్రాల్లో సెయిలింగ్ వంటి పనులు వారి మనోధైర్యానికి మచ్చుతునకలు. జాతరలు, ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణలో తమ సహకారం అందించడం వారి సేవా దృక్పథానికి నిదర్శనం. వారే ఎన్సీసీ విద్యార్థులు. శనివారం 77వ ఎన్సీసీ దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్సీసీ అమలు తీరుతెన్నులపై ప్రత్యేక కథనం. జిల్లాలో పరిస్థితి ఇదీ.. ఉక్కు సంకల్పం, ధైర్య సాహసాలు..విలువలకు మారు పేరుగా ఎన్సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) నిలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 25 కళాశాలలు, 52 పాఠశాలల్లో ఎన్సీసీ అమలవుతోంది. ఇందులో ఎన్సీసీ క్యాడెట్లుగా సుమారు 36,000 మంది బాల బాలికలు శిక్షణ పొందుతున్నారు. ఎవరు అర్హులంటే.. ఎనిమిదో, తొమ్మిదో తరగతిలో కనీసం ఐదు అడుగుల ఎత్తు ఉండి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారిని మాత్రమే ఎన్సీసీ క్యాడెట్స్‌గా ఎంపిక చేస్తారు. ఎన్సీసీ అమలవుతున్న విద్యాసంస్థల్లో బోధకుడిని ఎన్సీసీ అధికారిగా నియమిస్తారు. ఆ అధికారి ఆధ్వర్యంలోనే శిక్షణ ఉంటుంది. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయం విద్యార్థుల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయంగా ఎన్సీసీ శిక్షణ కొనసాగుతుంది. దశలవారీగా శిక్షణ ఉంటుంది. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో క్యాడెట్లకు ఫీల్డ్ క్రాఫ్ట్, బెటల్ క్రాఫ్ట్, డ్రిల్లింగ్, ఫైరింగ్, మిలటరీ మ్యాప్ రీడింగ్, ఆప్టికల్స్ కోర్సులో శిక్షణ ఇస్తారు. క్రమశిక్షణ, ధైర్య సాహసాల పెంపు, సేవాభావం, దేశభక్తి, మానవీయ విలువలు తదితర పలు అంశాలను కూడా బోధిస్తారు. శిక్షణలో క్యాడెట్ల క్రమశిక్షణ, హాజరు, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి పలు అంశాలను పరిగణలోనికి తీసుకుని ఏడాదిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే 15 క్యాంపులకు ఎంపిక చేస్తారు. మిలటరీ అధికారుల పర్యవేక్షణలో క్యాడెట్లకు ఫైరింగ్, పర్వతారోహణ, జంపింగ్, విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే మానసిక, శారీరక స్థైర్యాన్ని పెంపొందించే పలు సాహస కృత్యాల్లో కఠోర శిక్షణ ఇస్తారు. క్యాంపుల్లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న క్యాడెట్లు సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు. కాకినాడ హెడ్ క్వార్టర్స్‌గా.. ఎన్సీసీ గ్రూపు కాకినాడ హెడ్ క్వార్టర్స్‌గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రూపు కమాండర్‌గా కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ కొనసాగుతున్నారు. కాకినాడ కేంద్రంగా ఇటీవల కాలంలో ఆయన నేతృత్వంలో వివిధ రకాల క్యాంపులు నిర్వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్యాంపులు ముఖ్యంగా ఈ ఏడాది స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, మెను క్యాంప్‌లు నిర్వహించారు. ఐడియా, ఇన్నోవేషన్ కాంపిటేషన్స్ కూడా నిర్వహించారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్సీసీ క్యాడెట్స్‌తో నిర్వహించిన కార్యక్రమాలు కాకినాడ హెడ్ క్వార్టర్స్‌కు మంచి పేరు తీసుకువచ్చాయి.విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు పాఠశాల స్థాయిలో ‘ఎ’ సర్టిఫికెట్, కళాశాల స్థాయిలో ‘బి’ సర్టిఫికెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ స్థాయిలో ‘సి’ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. సర్టిఫికెట్ సాధించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ‘సి’ సర్టిఫికెట్ సాధించిన క్యాడెట్లకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుల్స్‌లో అత్యధికులు ఎన్సీసీ నేపథ్యం ఉన్న వారే. దేశభక్తి, క్రమశిక్షణ పెరుగుతాయి ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి పెరుగుతుంది. ఎన్సీసీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. క్రమం తప్పకుండా క్యాంపులు నిర్వహిస్తూ ఏటా వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. – కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, గ్రూపు కమాండర్, ఎన్సీసీ గ్రూపు హెడ్ క్వార్టర్, కాకినాడ -
ఆధ్యాత్మిక సౌరభం.. భక్తజన సంరంభం
కార్తిక పౌర్ణమినాడు సత్యదేవుని గిరి ప్రదక్షిణకు వెల్లువెత్తిన భక్తజనం (ఫైల్) ● సత్యదేవుని సన్నిధిలో ముగిసిన కార్తిక సందడి ● ఈ నెల రోజుల్లో సుమారు 20 లక్షల మంది భక్తుల రాక ● 1,34,500 వ్రతాల నిర్వహణ ● రూ.23 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అన్నవరం: పుణ్యక్షేత్రమైన అన్నవరానికి మరింతగా ఆధ్యాత్మిక పరిమళాలను అద్దిన కార్తిక సందడికి గురువారంతో తెర పడింది. అటు దేవస్థానానికి ఇటు గ్రామంలో వివిధ వృత్తుల వారికి ఈ పవిత్ర మాసం సిరులు కురిపించింది. గతంలో తిరుపతి, సింహాచలంతో పాటు కార్తిక మాసంలోనే కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తజనం పోటెత్తినప్పటికీ.. ఎటువంటి అపశృతీ లేకుండా అంతా సాఫీగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్తికంలో సుమారు 20 లక్షల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా చివరి వారంలో భక్తులు వెల్లువలా తరలి వచ్చారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో శని, ఆది, సోమవారాలు కావడంతో సుమారు 3 లక్షల మంది భక్తులు రావడం విశేషం. కార్తిక సంరంభమిలా.. ● అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం వరకూ ఆశ్వయుజ అమావాస్య. ఆ తరువాత కార్తిక శుద్ధ పాడ్యమి ప్రారంభమైంది. అదే రోజున రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 22 ఉదయం నుంచే కార్తిక మాస సందడి నెలకొంది. ● కార్తికం ప్రారంభంలోనే మోంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 23 నుంచి 28వ తేదీ వరకూ భక్తులు పెద్దగా రాలేదు. ఆ తరువాత మూడు వారాల్లో మాత్రం లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో రత్నగిరి జనసంద్రమే అయ్యింది. తుపాను అనంతరం మిగిలిన 24 రోజుల్లో దాదాపు 20 రోజుల పాటు భక్తులతో కిటకిటలాడింది. తొలి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మర్నాడు సాయంత్రం వరకూ వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ● కార్తిక మాసంలో శని, ఆది, సోమవారాలు, దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాల్లో 80 వేల నుంచి లక్ష మందికి పైగా భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ● ఈ నెల 2న క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. ● ఐదో తేదీ కార్తిక పౌర్ణమి నాడు సత్యదేవుని సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం జరిగిన గిరి ప్రదక్షిణలో 2 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ● ఈ నెల 15న బహుళ ఏకాదశి కావడంతో అత్యధికంగా 1.20 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అదే రోజు ఈ కార్తిక మాసంలోనే అత్యధికంగా 11,647 వ్రతాలు జరిగాయి. వ్రతాలపై ‘మోంథా’ ప్రభావం కార్తికంలో సత్యదేవుని వ్రతాలు 1,34,500 జరిగాయి. గత ఏడాది కార్తికంలో 1,47,142 జరగగా, దీనితో పోల్చితే ఈ ఏడాది 12,642 వ్రతాలు తగ్గాయి. కార్తికం తొలి వారంలో మోంథా తుపాను ప్రభావంతో ఆరు రోజుల పాటు భక్తులు అంతంత మాత్రంగానే రావడంతో ఆ మేరకు వ్రతాలు తగ్గాయని అధికారులు చెప్పారు. తుపాను రకపోతే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.50 లక్షల వ్రతాలు జరిగేవని తెలిపారు. 2022లో 1,42,378 వ్రతాలు జరగగా.. 2023లో ఆ సంఖ్య మిచాంగ్ తుపాను ప్రభావంతో 1,28,832కు తగ్గింది. దండిగా ఆదాయం కార్తికంలో రూ.23 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో రూ.21.50 కోట్ల రాబడి వచ్చింది. వాస్తవానికి ఏటా కార్తికంలో సత్యదేవుని ఆదాయం పెరుగుతోంది. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా ఒక వారం భక్తులు రాకపోవడంతో ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని తర్జనభర్జనలు పడుతున్నారు. తొలి విడతగా ఈ నెల 7న హుండీల ద్వారా రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చే నెలలో మరో విడత హుండీల ఆదాయం లెక్కించనున్నారు. దేవస్థానం బస్సుల ద్వారా కూడా దేవస్థానానికి రూ.38 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది కార్తికంలో ఇది రూ.42 లక్షలుగా ఉంది. ఈ ఆదాయానికి కూడా తుపాను గండి కొట్టింది. కంపార్ట్మెంట్ విధానంతో సత్ఫలితాలు లక్షలాదిగా వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం ముందు భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు సత్ఫలితాలనిచ్చాయి. ఆరు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి, ఒక్కో దానిలో వెయ్యి మంది చొప్పున భక్తులను ఉంచి, క్యూ ఖాళీ అయిన వెంటనే అందులోకి పంపించేవారు. దీనివలన తోపులాట లేకుండా దర్శనాలు సజావుగా జరిగాయి. ముందస్తు ఏర్పాట్లతో.. కార్తిక మాసం ప్రారంభమైన తరువాత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గత నెల 25న దేవస్థానంలో ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారాావుతో సమీక్షించారు. గిరి ప్రదక్షిణకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావును, సహాయకులుగా డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, లోవ, వాడపల్లి ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావులను నియమించి, అవసరమైన సూచనలు ఇచ్చారు. చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు, ఇతర అధికారులు, సిబ్బంది కూడా సమన్వయంతో పని చేయడంతో కార్తికం సవ్యంగా ముగిసింది.రికార్డు స్థాయిలో ప్రసాదాల అమ్మకాలు ఈ ఏడాది ప్రసాదాల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. ఒక్కొక్కటి రూ.20 చొప్పున సుమారు 23 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్ సిబ్బంది అహర్నిశలూ కష్టపడి సాధారణ రోజుల్లో 70 వేల నుంచి లక్ష, పర్వదినాలలో లక్ష నుంచి 2 లక్షల వరకూ కూడా ప్రసాదం ప్యాకెట్లు తయారు చేశారు. సిబ్బంది బాగా పని చేశారు కార్తికంలో దేవస్థానం సిబ్బంది చాలా బాగా పని చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్లనే ఎక్కడా చిన్నపాటి లోపం కూడా లేకుండా అంతా సాఫీగా సాగింది. లారెస్ విశ్రాంతి షెడ్డు, తాత్కాలిక కంపార్ట్మెంట్లు బాగా ఉపయోగపడ్డాయి. – ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం అందరి సహకారంతో.. కార్తికంలో అన్నవరం వచ్చిన భక్తులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేశాం. సిబ్బంది బాగా కష్టపడ్డారు. పోలీసు, రెవెన్యూ, స్వచ్ఛంద సేవల సిబ్బంది, ఇతర విభాగాల వారు బాగా సహకరించారు. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
సాగర తీరాన ఆధ్యాత్మిక సందడి
● రసలింగేశ్వరునికి, 1.08 కోట్ల శివలింగాలకు వైభవంగా మహాకుంభాభిషేకం ● ఆదికుంభేశ్వరస్వామికి బిల్వార్చన ● వేలాదిగా తరలివచ్చిన భక్తులు కాకినాడ రూరల్: సాగర తీరాన ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్తిక అమావాస్యను పురస్కరించుకుని కుంభాభిషేకం రేవు వద్ద మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. దుమ్ములపేట తదితర ప్రాంతాల వారు సముద్ర స్నానాలు చేసి స్వామి వారికి స్వయంగా అభిషేకాలు చేసుకున్నారు. ఉదయం ఆదికుంభేశ్వరస్వామికి బిల్వార్చన నిర్వహించారు. రసలింగేశ్వరస్వామికి తోట పుండరీకాక్షులు (బాబీ) దంపతుల ఆధ్వర్యాన మహాకుంభాభిషేకం నిర్వహించి ఆ ద్రవ్యాలను 108 మంది కన్యలతో సముద్రంలో నిమజ్జనం చేశారు. శ్రీదేవీ భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. 1.08 కోట్ల శివలింగాలకు సలాది శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యాన మహాకుంభాభిషేకం జరిపారు. రెండుచోట్లా భక్తులు కూడా స్వయంగా అభిషేకాలు చేసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు చేశారు. దుమ్ములపేట ప్రజలు, మత్స్యకారులు, బోట్ల యజమానులు, చేపల వ్యాపారులు, చేపల వేలం పాటదారుల సంయుక్త ఆధ్వర్యాన మధ్యాహ్నం భారీ అన్నదానం నిర్వహించారు. పోర్టు స్టేషన్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. లోక కల్యాణార్థం, ప్రకృతి విపత్తుల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే సంకల్పంతో కాకినాడ సాగర తీరాన ఏటా ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని తోట పుండరీకాక్షులు (బాబీ) మీడియాతో అన్నారు. అభిషేక ద్రవ్యాలను 108 మంది కన్యలతో నిమజ్జనం చేయడం ద్వారా సముద్రం శాంతిస్తుందన్నారు. ఆలయం శిథిలావస్థకు చేరుకుంటోందని, దీనిని పరిరక్షించుకునే బాధ్యత కాకినాడ ప్రజలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ డైరెక్టర్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గమ్మవారికి కార్తిక అమావాస్య సందర్భంగా గురువారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహు తి గావించారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాదులు, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు వే ణు, బాలు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు 40 మంది భక్తులు రూ.750 టిక్కెట్టుతో హోమంలో పాల్గొన్నారు. ఈవీఎం గోదాము తనిఖీ బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గురువారం పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేసి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. వీటి భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదిక పంపిస్తున్నామని వెల్లడించారు. గోదాము చుట్టూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలూ జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త వాటి ఏర్పాటు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జె.వెంకట్రావు కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో గురువారం ఈ అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 16,43,161 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని చెప్పారు. పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనంలోకి మార్చేందుకు ప్రతిపాదిస్తామన్నారు. హేతుబద్ధీకరణ ప్రకారం జిల్లాలో కొత్తగా 183 పోలింగ్ కేంద్రాలు రానున్నాయని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ తమ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన బీఎల్ఏ–2 ఫామ్‌లో వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని డీఆర్ఓ కోరారు. సమావేశంలో రావూరి వేంకటేశ్వరావు (వైఎస్సార్ సీపీ), సీహెచ్ రమేష్‌బాబు (బీజేపీ) తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు చర్యలు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల వద్ద విధులు నిర్వహించే కస్టోడియన్ అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారి విధులు, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) నుంచి వచ్చిన ధాన్యానికి తిరుగు రశీదు జారీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో 269 రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. వీటిని 117 రైస్ మిల్లులకు అనుసంధానం చేశామని చెప్పారు. జిల్లాలో ధాన్యం సేకరణ ఇప్పటికే ప్రారంభమైందని, ఇప్పటి వరకూ 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులను రెండు షిఫ్టుల్లో నియమించామని చెప్పారు. వీరు మిల్లులకు వచ్చిన ధాన్యం వాహనాలను నిర్ణీత సమయంలో అన్లోడ్ చేయించి, రద్దీ లేకుండా చూడాలని డీఆర్ఓ ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.దేవులా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ సుఖీభవ ఇవ్వాలి
అధికారంలోకి వస్తే ఏటా రైతులకు రూ.20 వేలు చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు సహా కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఒక్కరంటే ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చేతులెత్తేశారు. ఈ ఏడాది అయినా పెట్టుబడి సహాయం అందిస్తే మేలు చేకూరుతుందని రైతులంతా ఎదురుచూశారు. బయట ధాన్యం కమీషన్ ఏజెంట్లు, దళారులు, వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే పరిస్థితి కల్పిస్తున్నారు. పెట్టుబడి సాయం ఇస్తే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరం. జగన్ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా విడతల వారీగా పెట్టుబడి సాయం అందించారు. – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ ఈసారైనా పెట్టుబడి సాయం అందించండి నాకు ఎకరం 30 సెంట్ల భూమి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పీఎం కిసాన్, రైతు భరోసా సాయం అందింది. ప్రస్తుతం ‘అన్నదాత సుఖీభవ’ డబ్బు అందడం లేదు. అదిగో... ఇదిగో... అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా నా బ్యాంకు ఖాతాలో అన్నదాత సుఖీభవ డబ్బు పడలేదు. ఈసారైనా రైతులపై దయ చూపాలి. – చిలకమర్తి జయ హసిత, ప్రత్తిపాడు -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయ ప్రాంగణం కిట కిట లాడింది. స్వామివారి ఆలయంతో బాటు వ్రత మండపాలు, క్యూ లు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఆలయాన్ని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరచి పూజలు చేశారు. అనంతరం వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. అదే సమయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించగా స్వామివారి వ్రతాలు 3,400 జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
భవిత నీదే బ్యాచిలర్!
రాయవరం: డిగ్రీ కోర్సుల కోసం మంచి కళాశాలలో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్లో మార్కుల పర్సంటేజీ బాగుండాలి. ఈ రెండు కాకుంటే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో సిఫారసు చేయించాలి. ఇది ఒకప్పటి మాట. నేడు పరిస్థితి మారింది. డిగ్రీ వైపు మొగ్గు చూపే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఒకప్పుడు డిగ్రీ కళాశాలలకు మంచి ఫోకస్ ఉండేది. ఒక్కో కాలేజీలో సుమారు ఐదు వేల వరకు విద్యార్థులు చదువుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు పడిపోయింది. కొన్ని మూతపడేందుకు సిద్ధంగా వున్నాయి. డిగ్రీ అంటేనే విద్యార్థులు పెదవి విరిచే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది డిగ్రీ కళాశాలల అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఏర్పడ్డ జాప్యం తీవ్ర ప్రభావం చూపింది. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఇంజినీరింగ్ కోర్సుల హవా ముందు డిగ్రీ కోర్సులు డీలా పడ్డాయి. సాఫ్ట్వేర్ రంగం నెమ్మదించినప్పటికీ 2024 నుంచి ఇంజిరింగ్ కోర్సుల వేగం మళ్లీ పెరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా వాటిలో 1,960 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన కౌ న్సెలింగ్‌లో 772 మంది మాత్రమే అడ్మిషన్లు పొందా రు. ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరానికి సంబంధించి కేవలం 39 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇదిలా ఉంటే మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. డిగ్రీ అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశం కానుంది. నోటిఫికేషన్ ఆలస్యంతోనే నోటిఫికేషన్ ఆలస్యంగా వెలువడడమే డిగ్రీలో అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గడానికి కారణంగా అధ్యాపకులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముందు జరగడంతో చాలా మంది విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరిపోయారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్‌లోనే విడుదల కాగా, ఫస్టియర్ అడ్మిషన్లకు జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పటికే అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో చేరిపోయారు. దీంతో డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల భర్తీపై తీవ్ర ప్రభావం చూపింది. డిగ్రీ కోలుకునేనా విద్యా రంగంలో కాలానుగుణంగా కొన్ని కోర్సులు వెనుకబడి, మళ్లీ పుంజుకోవడం చూస్తుంటాం. కొన్నేళ్లు ఇంజినీరింగ్ కోర్సులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. చాలా కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బీఈడీ కొన్నేళ్లుగా బాగా వెనుకబడి ఆయా కళాశాలలు మూతపడ్డాయి. ఇటీవల కాలంలో బీఏ, బీకాం, బీఎస్సీ చదువుకున్న విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఈ కారణంగా రాబోయే రోజుల్లో మళ్లీ మంచి రోజులు వస్తాయని కళాశాలల యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.డిగ్రీతోనే లక్షల్లో ప్యాకేజీలు డిగ్రీలో 25 కోర్సులు విద్యార్థులు చేరేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బీఎస్సీ కంప్యూటర్, ఎంఐ డేటా సైన్స్, బీసీఏ కోర్సులు ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. ఇవి చేసిన విద్యార్థులు గడిచిన రెండేళ్లలో రూ.13.5 లక్షలు, రూ.1050 ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీల్లో డిగ్రీ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వూల ద్వారా ఎంపికవుతు న్నారు. డిగ్రీ విద్యార్థులైతే నిలకడ ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు వీరిని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఏ ప్రభుత్వానికై నా, సంస్థలకై నా, పరిశ్రమలకై నా, ఏ ఇతర విభాగాలకై నా నిపుణులైన కార్మికులు, ఇంజినీర్లు, డాక్టర్లు, సాంకేతిక వర్గాలు ఎంత అవసరమో.. వారి విధి విధానాలను గాడిలో పెడుతూ.. వారి జీత భత్యాలు.. సెలవులు.. అవసరాలు.. ఉద్యోగంలో ఉన్నపుడు.. పదోన్నతులపుడు.. పదవీ విరమణ అనంతర ప్రక్రియలు చూడాల్సిన పాలకవర్గమూ అంతే ముఖ్యం. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇంజినీర్లు, వైద్యులు తదితర వర్గాల వారు ఏ మాత్రం పనికిరారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకుంటే పాలన స్తంభించిపోతుంది. నిజానికి చెప్పాలంటే చాలా మంది ప్రొఫెషనల్ కోర్సుల వారికి పలు కార్యాలయాల్లో దరఖాస్తులు ఎలా రాయాలో.. ఎలా పూరించాలో అంత అవగాహన ఉండదు. ఈ పని పూర్తిగా పరిపాలన విభాగం వారి సహకారంతో చేయాల్సిందే. ఇంతటి విలువైన పని చేయాలంటే కచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారి అవసరం ఎంతైనా ఉంది. ఈ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను తక్కువగా చూడడం ఏమాత్రం సమంజసం కాదు. ఎన్ని కంప్యూటర్ కోర్సులు, ప్యాకేజీలు, ఏఐలు వచ్చినా డిగ్రీ ఉత్తీర్ణుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేటి సమాజంలో చాలా చోట్ల మంచి ప్యాకేజీలకే మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి కూడా. ఈ విధంగా ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిగ్రీతో అవకాశాలు పుష్కలం ఇంజినీరింగ్ కన్నా డిగ్రీతోనే ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఇచ్చే నోటిఫికేషన్లకు డిగ్రీనే ప్రధాన అర్హతగా పేర్కొంటున్నారు. ఈ నెల 20తో ముగుస్తున్న స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ కేపీ రాజు, ప్రిన్సిపాల్, డిగ్రీ కళాశాల, కొత్తపేట డిగ్రీ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం ఫలితంగా ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 39శాతం మాత్రమే చేరికలు నేటితో ముగియనున్న స్పాట్ అడ్మిషన్లు -
క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాలలో ఉన్న నల్లరాయి క్వారీ నిర్వహణపై బుధవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్.పైడిపాల సర్వే నంబర్ 15లో 1.735 హెక్టార్లు, ములగపూడి సర్వే నంబర్ 1పీలో 0.858హెక్టార్లు, డి.పైడిపాల సర్వే నంబర్ 59పీలో 0.507 హెక్టార్లు, మొత్తం 3.1 హెక్టార్లు, ఎస్.పైడిపాల 15పీలో 3.44హెక్టార్లు, మల్లంపేట సర్వేనంబర్ 90లో 2.5 హెక్టార్లు నల్లరాయి క్వారీ నిర్వహణకు ఎస్కే టెర్రా మైన్స్ అండ్ మినరల్స్ ఎల్ఎల్పీ పేరుతో కృష్ణా జిల్లాకు చెందిన బట్లంక స్వామి కిరణ్‌పాల్ దరఖాస్తు చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎంబీఎస్.శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణి పర్యవేక్షణలో జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకుండా, ప్రజలు ఇళ్లు దెబ్బతినకుండా నైపుణ్యత, నిర్దేశిత ప్రమాణాలు కలిగి వారితో బ్లాస్టింగ్ చేపట్టాలని, స్థానికులకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రతిపాధిత క్వారీ ప్రాంతంలో ఉన్న సాగు భూములకు ఎలాంటి నష్టం జరగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్వారీయింగ్ చేస్తామని యాజమాన్యాలు హామీ ఇచ్చారు. సంబంధిత నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తహసీల్దారు, ఎస్వీ.నరేష్, ఎస్ఐ బి.వెంకటేశ్వరరావు, ఎన్విరానిమెంట్ ఆర్ఐ పట్నాయక్, వీఆర్ఓలు చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మరో చంద్రజాలం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు ప్రభుత్వం ఒకటొకటిగా తూట్లు పొడుస్తూ వస్తోంది. రైతే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని ఎన్నికల ముందు చంద్రబాబు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా గద్దె నెక్కగానే రైతులను చిన్నచూపు చూస్తున్నారు. ఇచ్చిన హామీలను కూడా గాలికొదిలేసి రోడ్డు పాల్జేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని పెంచి ప్రతి రైతుకు రూ.20వేలు అన్నదాత సుఖీభవ అందిస్తానని చంద్రబాబు ప్రకటించారు. బాబు మాటలు నమ్మి రైతులు అన్నదాత సుఖీభవ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడచిపోయింది. చంద్రబాబు గత ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేసి రైతులకు నిలువునా దగా చేశారు. గతేడాది బాబు మాటలు నమ్మి మోసపోయిన రైతుల సంఖ్య జిల్లాలో 1.80 లక్షలకు పైమాటే. ఈ ఏడాది చూస్తే కొందరికి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా ఎగనామం పెట్టారని రైతులు మండిపడుతున్నారు. గతేడాది పెట్టుబడి సాయం కోసం గంపెడాశతో రైతులు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. సాయం అందిస్తామని ఇచ్చిన హామీనే చంద్రబాబు తొలి ఏడాది గోదాట్లో కలిపేశారు. ఽప్రస్తుతం రెండవ ఏడాది ఖరీఫ్ సీజన్ కూడా తుది దశలో ఉంది. పెట్టుబడి సాయం మాత్రం రైతులకు ప్రభుత్వం ఇవ్వకుండా దగా చేసిందని రైతులు మండిపడుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2 వేలు వంతున రైతుల ఖాతాల్లో జమ చేసేసింది. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇప్పటికే రైతుల ఖాతాలో జమ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ ముగిసే సమయానికి (బుధవారం కొందరు రైతుల ఖాతాల్లో జమ) కొందరికి ఇచ్చి మరికొందరి పట్ల దయలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది. అప్పట్లో క్రమం తప్పకుండా రైతు భరోసా రైతులు సాగుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే సంకల్పంతో రైతు భరోసా సొమ్ము సకాలంలో ఖాతాల్లో జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఖరీ్‌ఫ్ సాగుకు సమాయత్తమయ్యే రైతులకు భరోసా కల్పిస్తూ మే నెలలో రూ.7,500 జమ చేసేవారు. అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోతలతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండవ విడతలో రూ.4,000 జమ చేసేవారు. మూడో విడతగా జనవరి నెలలో మరో రూ.2,000 ప్రతి రైతుకు జమచేసి రైతుల ఇంట సంక్రాంతి పండగను తీసుకువచ్చారు. ఇలా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున రైతుల ఖాతాల్లో ఏటేటా జమ చేశారు. చివరకు కోవిడ్ కష్టకాలంలో సైతం రైతు భరోసా నిధులు జమ చేశారు. వైఎస్సార్ రైతు భరోసాతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్‌పుడ్ సబ్సిడీ ఇలా అనేక పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ సాయంగా ఏటా రూ.20వేలు వంతున ఒక్కో రైతుకు జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించారు. బాబు ఏటా ఇస్తానన్న రూ.20 వేలు మొదటి ఏడాది రైతులకు ఎగనామం పెట్టారు. ఇప్పుడు కూడా వేలాది మంది అర్హులైనవారికి ఈ పథకం అందచేయకుండా చంద్రబాబు సర్కార్ దగా చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు రాక.. గిట్టుబాటు కాక అన్నదాత సుఖీభవ ద్వారా జిల్లాలోని లక్షా 50వేల 475 మంది రైతులకు రూ.99.8 కోట్లు బుధవారం విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కిసాన్ ద్వారా రూ.2,000, అన్నదాత సుఖీభవ ద్వారా రూ.5000 కలిపి మొత్తంగా రైతుకు రూ.7,000 వంతున రెండో విడతగా జమ చేశారు. జిల్లాలో 1.80 లక్షలకు పైగానే రైతులు ఉన్నారని అంచనా. ఈ లెక్కన చూసుకున్నా 30వేల పై చిలుకు రైతులకు అన్నదాత సుఖీభవ లేకుండా ఎగనామం పెట్టినట్టేనంటున్నారు. ఖరీఫ్ పంట చేతికందే దశలో మోంథా తుపాను దెబ్బకు రైతులు కుదేలైపోయారు. దిగుబడులు సగానికి పడిపోయి, దక్కిన ధాన్యం తడిసిపోవడంతో సరైన ధర లేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎకరాకు రూ.40వేల పై చిలుకు పెట్టుబడులు కాగా రూ.20 వేల నుంచి రూ.25వేలు కూడా గిట్టుబాటు కాక లబోదిబోమంటున్నారు. ఈ తరుణంలో అన్నదాత సుఖీభవ వస్తుందని తెలిసి సంతోషపడ్డారు. కుంటిసాకులతో అన్నదాత సుఖీభవ లేకుండా చేయడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నదాతకు అండగా జగన్ ఖరీఫ్ సీజన్లో రైతుల విత్తనాలు కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తూ వచ్చింది. కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6000కు నాడు జగన్ రైతు పక్షపాతిగా మరో రూ.7,500 కలిపి మొత్తం రూ. 13,500 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. జిల్లాలో 1.80 లక్షలకు పైగా రైతులు ఈ ఐదేళ్లలో కేవలం రైతు భరోసా ద్వారానే రూ.1,121 కోట్ల లబ్ధి పొందారు. ‘అన్నదాత సుఖీభవ’ ఆశలు గల్లంతు 30 వేల మందికి మొండిచేయి కౌలు రైతులకు కుచ్చుటోపీ ఇప్పటికే ఖరీఫ్ నష్టపోయిన వైనం జగన్ సర్కార్‌లో రూ.1,121 కోట్ల లబ్ధి కౌలు కార్డులతో సరి జిల్లాలో సుమారు 65 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. ఇందులో 13 నుంచి 15 వేల మంది కౌలు రైతులు అన్నదాత సుఖీభవకు అర్హులుగా గత ప్రభుత్వంలోనే తేల్చారు. గత జగన్ ప్రభుత్వంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కౌలు రైతులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు మొండిచేయి చూపించింది. ఇప్పటికే ఈ వర్గాలకు పంట రుణాలు ఇవ్వక కేవలం కౌలురైతులకు కౌలు కార్డులు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కౌలురైతులకు ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా దగా చేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే తమకు పథకం వర్తిస్తుందని ఎదురుచూసిన కౌలు రైతులను చంద్రబాబు సర్కార్ నిలువునా దగా చేసింది. -
ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గా రామదాసు
కరప: గోవాలో ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు జరిగే 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా–2025 సెలెక్షన్ కమిటీ, జ్యూరీ మెంబర్‌గా కరప మండలం పెనుగుదురుకు చెందిన సినీ, టీవీ సీరియల్స్ నిర్మాత, దర్శకుడు నామన రాంబాబు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల మంతిత్వశాఖ సెక్రటరీ సంతోష్‌కుమార్ మౌర్య నుంచి ఉత్వర్వులు వచ్చినట్టు బుధవారం ఆయన విలేకరులకు తెలిపారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 నంది అవార్డులు తీసుకున్నారు. 15వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. 2019లో అమరావతిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ ఆర్గనైజర్‌గా పాల్గొన్నారు. 2005–2007లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అన్నదాత సుఖీభవ రెండో విడత ప్రారంభం సామర్లకోట: ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ అన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రెండవ విడత ప్రారంభం సందర్భంగా బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండవ విడతలో జిల్లాలో 1,50, 475 మంది రైతులకు రూ.99.85 కోట్లు అందజేశామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించగా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ సానా సతీష్‌బాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు. ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడిగా వెంకటరమణ కాకినాడ క్రైం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కాకినాడ శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శిగా డాక్టర్ ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కాకినాడలోని రామ్కోశాలో ఏర్పాటు చేసిన సమావేశంలో 2025–27 పదవీ కాలానికి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు, అనంతరం అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ప్రెసిడెంట్‌గా విష్ణు మహేష్‌బాబు, కోశాధికారిగా ఎల్ఆర్ఎన్.నరసింగ్‌రావు పైడికొండల, ఉపాధ్యక్షులుగా జి.కృష్ణవేణి, ఎస్.వీరభద్రరావు, త్రిమూర్తుల రాయుడు, ఐఎంఏ ఏఎంఎస్ చైర్మన్‌గా ఆర్.గౌతమ్ ప్రవీణ్, సెక్రటరీగా పివి.నిశాంత్, ఐఎంఏ సీజీపీ చైర్మన్‌గా కె.శైలజ, సెక్రటరీగా పి.జానకీ, ఏఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా జి.సత్యవతి, ఏ.మాధవి, జేడీఎన్ చైర్మన్‌గా తొండూరు పీఎన్ఎస్ఆర్ అభిలాష్, ఎంఎస్ఎన్ చైర్మన్‌గా ముద్దా రాజేష్ ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్‌గా డాక్టర్ జీఎస్ మూర్తి వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అద్దరిపేట విద్యార్థి ఎంపిక తొండంగి: రాష్ట్ర స్థాయి పరుగుపందెం పోటీలకు మండలంలోని అద్దరిపేట జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థి ఎంపికై నట్టు ఆ పాఠశాల హెచ్.ఎం.దుర్గా కుమారి తెలిపారు. తమ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న పిక్కి జగదీష్ ఈనెల 18న కాకినాడలో జిల్లా స్థాయిలో జరిగిన పరుగు పందెం పోటీల్లో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా జగదీష్‌ను, శిక్షణ ఇచ్చిన పీఈటీ ఉపాధ్యాయుడు మునకోటి దుర్గా ప్రసాద్‌ను ఉపాధ్యాయ బృందం, గ్రామపెద్దలు అభినందించారు. ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు రేపు కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లోని డైస్ సెంటర్లో 0–18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలను శుక్రవారం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడకు చెందిన ఇండో బ్రిటీష్ హాస్పిటల్ సౌజన్యంతో రాష్ట్ర బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గుండె వ్యాఽధి నిర్ధారణ అయిన పిల్లలకు ఇండో బ్రిటీష్ హాస్పిటల్లో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో పీహెచ్సీ, యూపీహెచ్‌సీలకు చెందిన వైద్యాధికారులు అనుమానిత పిల్లలను గుర్తించి శిబిరానికి సిఫార్సు చేయాలని ఆయన సూచించారు. -
కలసి రాని ఖరీఫ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను విరుచుకుపడింది. చివరి దశలో ఉన్న వరి పంటను నిండా ముంచేసింది. రైతులను ఆర్థికంగా కోలుకోలేని రీతిలో దెబ్బ తీసింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ చిల్లిగవ్వ సహాయం కూడా అందలేదు. గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వమే ఉచిత పంటల బీమా చేయించడంతో పంట నష్టం జరిగినా ఇన్పుట్ సబ్సిడీతో రైతుకు భరోసా లభించేది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో జిల్లాలోని 60 శాతం మంది ఈ పథకానికి దూరమయ్యారు. తుపానుతో నష్టపోయారు. అంతా బాగుంటే 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. ఆ అంచనాలు కాస్తా తలకిందులయ్యాయి. పోయిన పంట ఎలాగూ పోయింది.. కనీసం మిగిలినదైనా ఒబ్బిడి చేసుకుని ఉన్నంతలో గట్టెక్కుదామనుకున్నా.. ప్రభుత్వ ‘మద్దతు’ ఏమాత్రం లభించడం లేదు. దీంతో, పెట్టుబడి కూడా రాని దుస్థితిని ఖరీఫ్ రైతులు ఎదుర్కొంటున్నారు. తీవ్రంగా నష్టపోతున్న తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కాకినాడ రూరల్, కరప, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు రూరల్, ఏలేశ్వరం, గండేపల్లి, తుని, తొండంగి, జగ్గంపేట తదితర మండలాల్లో ప్రస్తుతం వరి కోతలు, మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆయా మండలాల్లోని ప్రధాన రహదారులు, కళ్లాల్లో రైతులు ధాన్యాన్ని బరకాలపై ఆరబెట్టి తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ని‘బంధనాల’ బాధలు జిల్లావ్యాప్తంగా 80 శాతం ఆయకట్టులో రైతులు ఖరీఫ్‌లో సన్న వరి రకాలనే సాగు చేశారు. పంట కోతకు వచ్చేనాటికి ఎకరానికి తక్కువలో తక్కువ రూ.36 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. పంట కలిసొస్తుందనే ఉద్దేశంతో దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. తీరా పంట చేతికందే దశలో తుపాను విరుచుకుపడింది. ఇప్పుడేమో ఎకరానికి 25 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. ప్రభుత్వ ని‘బంధనాల’తో తడిసి, రంగు మారిన అమ్ముకోలేక రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. గ్రేడ్–1 రకం ధాన్యానికి 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకానికి రూ.1,777 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ప్రకటించింది. కానీ, తేమ శాతం నిబంధనల సాకుతో ఆ ధర ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. పైగా ప్రభుత్వం నుంచి ధాన్యం సొమ్ము రావడానికి చాలా రోజులు పడుతోంది. పైగా తేమ శాతం తగ్గాలంటే ధాన్యం ఆరబెట్టాలి. దీనికిగాను బరకాలకు, ఇద్దరు ముగ్గురు కూలీలకు కలిపి రోజుకు రూ.2 వేలు అవుతోంది. ఈ బాధలు భరించలేక, మరో గత్యంతరం లేక రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని బస్తాకు రూ.300 తక్కువకై నా దళారులకు అమ్మేస్తున్నారు. బస్తా ధాన్యాన్ని రూ.1,480 నుంచి రూ.1,500కే కమీషన్ ఏజెంట్లకు దళారులకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. విచిత్రమేమిటంటే కమీషన్ ఏజెంట్లు, దళారులు కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల కళ్లాల్లోనే ఎండబెట్టుకుంటున్నారు. ఎకరాకు రూ.10 వేలు కూడా రాలేదు ఈ ఏడాది ఐదెకరాల్లో వరి సాగు చేశాను. గతంకన్నా పెట్టుబడి అదనంగా అయింది. అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని విక్రయిస్తే పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఎకరాకు రూ.10 వేలు కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ధరను పెంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – చిటికిరెడ్డి ఏసుబాబు, రైతు, ఏలూరు, ప్రత్తిపాడు మండలం పెట్టుబడి కూడా దక్కడం లేదు నేను ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. ఎకరాకు రూ.40 వేల వరకూ పెట్టుబడి అయ్యింది. రైతుకు ఎకరాకు 15 బస్తాల కౌలు ఇవ్వాలి. మూడెకరాల్లో కోతలు కోశాం. తుపాను ప్రభావంతో చేలు పడిపోవడంతో దిగుబడి 25 బస్తాలు మించేలా లేదు. పక్క గ్రామాల్లో బస్తా ధాన్యం రూ.1,500కు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. దిగుబడి, ధర లేక కౌలు రైతులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా దక్కడం లేదు. – దామలంక సతీష్, కౌలు రైతు, కొవ్వూరు, కాకినాడ రూరల్ పెట్టుబడి పెరిగిపోయింది ఐదెకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలకు పైగా ఖర్చయింది. ఎకరాకు 30 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. 75 కేజీల బస్తా రూ.1,480కే అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది తుపానుతో వరి పంట నేలకొరిగి, దిగుబడి తగ్గడమే కాకుండా, మరో రూ.5 వేలు అదనంగా ఖర్చయింది. ఎకరాకు రూ.10 వేలు నష్టపోయాను. సకాలంలో ఎరువులు దొరకకపోవడం, అసలు కన్నా అదనంగా సొమ్ము వెచ్చించి ఎరువులను కొనుగోలు చేయడంతో పెట్టుబడి పెరిగిపోయింది. – ఏపూరి వెంకట రమణ, రైతు, చినశంకర్లపూడి, ప్రత్తిపాడు మండలం జిల్లాలో ఖరీఫ్ సాగు వివరాలు వరి సాగు విస్తీర్ణం 2,12,000 ఎకరాలు కోతలు పూర్తయినవి 21,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు 293 ఉత్పత్తి అంచనా 6,00,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం3,00,000 మెట్రిక్ టన్నులు ఫ ‘మోంథా’తో తీరని నష్టం ఫ పడిపోయిన దిగుబడులు ఫ కానరాని ప్రభుత్వ ‘మద్దతు’ ఫ గత్యంతరం లేక దళారులకే అమ్ముకుంటున్న రైతులు ఫ పెట్టుబడులు కూడా రావడం లేదని గగ్గోలు -
పెట్టుబడి రావడం లేదు
కరప మండలం పెదకొత్తూరుకు చెందిన కౌలు రైతు కర్రి ప్రసాద్ వాకాడ గ్రామంలో ఓ రైతు నుంచి మూడెకరాలు కౌలుకు తీసుకున్నారు. ఖరీఫ్, రబీ పంటకు కలిపి ఎకరాకు 25 బస్తాల కౌలు ఇవ్వాలనేది ఒప్పందం. మోంథా తుపాను రావడానికి ముందే ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడి అయ్యింది. చివరిలో తుపాను విరుచుకుపడటంతో పంట ఒక్కసారిగా నేలనంటేసింది. పెట్టిన పెట్టుబడి కాస్తా ముంపులో కొట్టుకుపోయింది. గింజ సరిగా తోడుకోక మడంపొల్లు వచ్చింది. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 బస్తాల వరకూ తగ్గిపోయింది. వచ్చిన ధాన్యం రంగు మారిపోయింది. యంత్రంతో ఎకరం చేను కోసేందుకు గంట సమయం పట్టేది. పంట పడిపోవడంతో రెండు గంటలు పట్టింది. ఫలితంగా ఎకరాకు మరో రూ.3,200 చొప్పున అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పంట కోయించి, లే అవుట్లోకి ధాన్యం తీసుకొచ్చి, ఆరబెట్టేందుకు ఎకరాకు మరో రూ.12 వేల నుంచి రూ.15 వేలు అయ్యింది. ఈ విధంగా విత్తనాలు, దమ్ములు, వరి నాట్లు, కలుపుతీత, పురుగుమందులు, ఎరువులు, మాసూళ్లకు కలిపి ఎకరాకు సుమారు రూ.45 వేల వరకూ ఖర్చయ్యింది. కూలి ఖర్చులు మరో రూ.10 వేలు. ఇంత పెట్టుబడి పెడితే ఇప్పుడు ఎకరాకు 20 నుంచి 25 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదని ప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడుల మాట దేవుడెరుగు.. కౌలు తీసేయగా కనీసం కోతలు, నూర్పిడి ఖర్చు కూడా రావడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. పెద కొత్తూరు లే అవుట్లో ఆరబెట్టిన ధాన్యం -
సాగర తీరాన రేపు మహాకుంభాభిషేకం
కాకినాడ రూరల్: మహాకుంభాభిషేకానికి కాకినాడ సాగర తీరం ముస్తాబైంది. కుంభాభిషేకం రేవు సమీపాన శ్రీ మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 1.8 కోట్ల శివలింగాలకు, రసలింగేశ్వరునికి కార్తిక అమావాస్య రోజైన గురువారం 50వ మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదికుంభేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన, శ్రీదేవి, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం అభిషేక జలాలను 108 మంది కన్యలతో సముద్రంలో కలపనున్నారు. దుమ్ములపేట ప్రజలు, మత్స్యకారులు, బోట్ల యజమానులు, వ్యాపారులు ఆధ్వర్యాన మధ్యాహ్నం మహాన్నదానం చేయనున్నారు. మహాకుంభాభిషేకం కరపత్రాలను యజ్ఞ కమిటీ సభ్యులు తోట పుండరీకాక్షులు, చిట్నీడి శ్రీనివాస్, బోగిరెడ్డి తాతారావు, గంగిరెడ్డి అరుణ, బూర్ల సత్యనారాయణమ్మ, నామన ప్రసన్న, సలాది శ్రీనివాసరావు తదితరులు ఆలయం ప్రాంగణంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆలయం వద్ద శాశ్వతంగా 1.8 కోట్ల శివలింగాల కోసం రూ.10 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు పుండరీకాక్షులు ప్రకటించారు. -
ప్రైవేటు ఆస్పత్రులపై ఆకస్మిక దాడులు
తుని: పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) నరసింహ నాయక్ పర్యవేక్షణలో ఆస్పత్రులు, ల్యాబ్‌లలో రికార్డులను పరిశీలించారు. శ్రీలక్ష్మీ జనరల్ ఆస్పత్రి, అంకారెడ్డి డెంటల్ క్లినిక్, దుర్గాప్రసాద్ డయాబెటిక్ కేర్ సెంటర్, లీలా నర్సింగ్ హోమ్, సురేష్ ఆస్పత్రి, రవితేజ క్లినికల్ ల్యాబ్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ మాట్లాడుతూ, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జ్యోతి డయోగ్నోస్టిక్స్ సెంటర్‌ను సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు ఉన్నా రెన్యువల్ చేసుకోకుండా పలు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. రిజిస్టేషన్లు సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల పట్టిక, సేవలు, వైద్యుల వివరాలను నోటీసు బోర్డులో విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనుమతులు తీసుకున్న ప్రాంతంలోనే ఆస్పత్రులు, ల్యాబ్‌లు నడపాలని స్పష్టం చేశారు. వీరేశ్వరునికి రజత సర్పాభరణం ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి వారికి కూసంపూడి సతీష్‌వర్మ దంపతులు మంగళవారం రజత సర్పాభరణాన్ని సమర్పించారు. సంప్రోక్షణ అనంతరం స్వామివారికి అర్చకుడు పేటేటి శ్యామల కుమార్ సర్పాభరణాన్ని అలంకరించారు. వేద విద్యా గురుకులానికి భారతాత్మ పురస్కారం రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి సింఘాల్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక భారతాత్మ నగదు పురస్కారం అందించింది. ఈ పురస్కారం కింద రూ.7 లక్షల చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. గురుకులం వ్యవస్థాపకుడు, ప్రధానాచార్యులు వేదార్థ చూడామణి, ఘన సమ్రాట్ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి తరఫున గుళ్లపల్లి లక్ష్మీనారాయణ దత్తాత్రేయ ఘనపాఠి, పైడిమర్రి చంద్రశేఖర ఘనపాఠి ఈ విశిష్ట పురస్కారాన్ని పుణేలో గోవింద దేవ గిరీజీ, ఆచార్య స్వామి ప్రద్యుమ్న చేతుల మీదుగా ఇటీవల అందుకున్నారు. అక్కడి నుంచి మంగళవారం వచ్చిన వారిద్దరూ అక్కడ స్వీకరించిన చెక్కు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి, గురుకుల కార్యదర్శి డాక్టర్ టీవీ నారాయణరావులకు సమర్పించారు. పుణె నుంచి వచ్చిన ఇద్దరికీ గురుకులంలో కమిటీ సభ్యులు, శిష్యబృందం ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర ఘనపాఠి మాట్లాడుతూ, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) పూర్వ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పేరిట ఏర్పాటు చేసిన సింఘాల్ ఫౌండేషన్ తరఫున 2022లో ఉత్తమ వేద అధ్యాపకునిగా భారతాత్మ పురస్కారం స్వీకరించడం, ఇప్పుడు సర్వశ్రేష్ట గురుకులంగా పురస్కారం లభించడం దత్తాత్రేయ స్వామి అనుగ్రహమని అన్నారు. దేశంలో వందల సంవత్సరాల నుంచి ఎన్నో వేద పాఠశాలలు నడుస్తూండగా కేవలం 25 సంవత్సరాల నుంచి నడుస్తున్న తమ గురుకులానికి ప్రతిష్టాత్మక భారతాత్మ పురస్కారం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఆ పానవ నదీ తీరంలోని గురుకులానికి పురస్కారం రావడం దైవానుగ్రహమని అభివర్ణించారు. గుళ్లపల్లి ఆంజనేయ ఘనపాఠి దివ్యాశీస్సులు, గురుకుల ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్న కమిటీ సభ్యులు, వదాన్యుల సహకారం, అధ్యాపకుల పరిశ్రమ, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కారణంగానే ఈ విశిష్ట పురస్కారం వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఫ పత్రాలు లేకుండానే ల్యాబ్ నిర్వహణ ఫ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ -
మత్తుకు బానిసలు కావద్దు
రాజానగరం: జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలనే తపనతో ముందుకు సాగాలే తప్ప మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోరాదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హితవు పలికారు. జిల్లా వృద్ధులు, దివ్యాంగులు, ట్రాంజెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నషా ముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం వర్సిటీలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి, ఎంచుకున్న లక్ష్యాలకు దూరం కారాదని విద్యార్థులకు హితవు పలికారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ మేరకు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, డీన్ ఎన్.ఉదయ్ భాస్కర్, సుందర్రాజు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్‌షన్
మంగళవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2025● పబ్లిక్ పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూళ్లు ● ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ● ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యం ● నిర్దేశిత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తూ రసీదులు ఇవ్వని వైనం ● పట్టించుకోని విద్యా శాఖ అధికారులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ● కాకినాడ శ్రీరామ్‌నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సునీల్ పదో తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో.. ఆ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి రూ.125 ఇచ్చారు. పాఠశాల అకౌంటెంట్ అది కుదరదంటూ రూ.వెయ్యి వసూలు చేశారు. రసీదు అడిగితే లేదని సమాధానమిచ్చారు. ● కాకినాడ నాగమల్లి తోట జంక్షన్‌లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఓ చిరుద్యోగి కొడుకు శ్రీకాంత్ పదో తరగతి చదువుతున్నాడు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చిన ఆ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి పాఠశాల సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. ఫీజు రూ.125 కదా అని అడగ్గా, ఫీజుతో పాటు ఖర్చులుంటాయని అకౌంటెంట్ చెప్పినట్లు వారు వాపోయారు. ● జిల్లాలో ఈ రెండు స్కూళ్లలోనే కాదు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా శాఖ నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా పదో తరగతి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. రూ.125 పరీక్ష ఫీజు అయితే, అదనంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ అదనపు దోపిడీపై విద్యా శాఖ అధికారులు తనిఖీలు చేసి, చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 219 ప్రైవేట్, 247 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 29,866 వేల మంది విద్యార్థులు పది పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అడిగేవారేరీ..? జిల్లాలో వివిధ యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 466 ఉన్నాయి. ఇందులో 219 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో పబ్లిక్ పరీక్షలకు అన్ని యాజమన్యాల నుంచి 29,866 మంది హాజరవుతుండగా, వీరిలో ప్రైవేట్ విద్యార్థులు 19,500 వరకూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు పరీక్షల ఫీజు రూ.125 చెల్లించేందుకు పాఠశాలలకు వెళితే, అదనపు సొమ్ము డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి చేస్తున్న అదనపు వసూళ్లు రూ.800 చొప్పున లెక్కించినా.. కనీసం రూ.1.60 కోట్లు అవుతోంది. ప్రభుత్వ రుసుము మాత్రమే చెల్లిస్తామని చెబితే, అదనపు ఖర్చులుంటాయని ఆయా స్కూళ్ల హెచ్ఎంలు చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్లిదండ్రుల పిల్లలకు ఏదో ఓ సాకు పెట్టి, తోటి విద్యార్థుల ఎదుట అవమానాలకు గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని కొంత మంది తల్లిదండ్రులు మండల విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ‘చూస్తాం.. చేస్తాం’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ పరీక్ష ఫీజులకు రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసారం దోచుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అదనపు వసూళ్లు చేస్తుంటే, చర్యలు చేపట్టాల్సిన విద్యా శాఖాధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు. ప్రత్యేక బృందాలను నియమించి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అటు స్కూల్ ఫీజులు, ఇటు పబ్లిక్ పరీక్షల్లోనూ ఇష్టానుసారం దోచుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థుల నుంచి పబ్లిక్ పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే వసూలు చేయాలి. అంతకంటే ఎక్కువగా ఒక్క రూపాయి కూడా విద్యార్థుల నుంచి తీసుకోకూడదు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అదనంగా రూ.వెయ్యి వరకు ఫీజులు దోచేస్తున్నారని తెలిసింది. విద్యా శాఖ అధికారులు తనిఖీ చేసి చర్యలు చేపట్టాలి. – బి.సిద్దూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ ప్రభుత్వ రుసుమే చెల్లించాలి పదో తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వ రుసుము మాత్రమే చెల్లించాలి. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశాం. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేస్తే మాకు సమాచారం ఇవ్వవచ్చు. – పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ ప్రభుత్వం నిర్దేశించిన పబ్లిక్ పరీక్ష ఫీజులిలా.. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు రూ.125 మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రూ.125 మూడు కన్నా తక్కువ సబ్జెక్టులు రూ.110 ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో అదనంగా రూ.60 అండర్ఏజ్ విద్యార్థులకు రూ.300 ఫీజుల ప్రక్రియ మొదలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని విద్యా శాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలుంటాయని ఆదేశాల్లో స్పష్టంచేసింది. నిర్దేశిత ఫీజు కంటే అదనంగా వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, అవి ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా అదనంగా పబ్లిక్ పరీక్ష ఫీజు పేరుతో దోచేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. చర్యలు శూన్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రజలు గమనిస్తున్నారు
పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, హిందుపురంలో పార్టీ కార్యాలయంపై పెద్దపెద్ద కంకరరాళ్లతో దాడులకు తెగబడటం అన్యాయమన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలు చెప్పినట్టే కేసులు కడుతున్నారన్నారని, వాస్తవాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుందా, లేక చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలక్షేపం చేస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన చంద్రబాబు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దాపురం, ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అనిల్‌కుమార్(బన్నీ), రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, ప్రచారసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, వివిధ విభాగాల నేతలు అల్లి రాజబాబు, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు బోరా పెద్ద, బాదం మధు, రోకళ్ల సత్య, దుర్గాప్రసాద్, ఐ.శ్రీను, కంపర బాబీ, చిట్నీడి మూర్తి, హెచ్ఎంఎస్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
దౌర్జన్యాలకు పరాకాష్ట
ధర్నాను ఉద్ధేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. చిత్రంలో పార్టీ నేతలు ● చంద్రబాబు సర్కార్‌పై సమర శంఖం ● హిందూపురం ఘటనపై నిరసన ● బాలాజీ చెరువు సెంటర్లో వైఎస్సార్ సీపీ నేతల ధర్నా ● నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రాజా, మాజీ ఎంపీ గీత సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. వ్యక్తులు, వ్యవస్థలపై దాడులకు తెగబడుతూ సొంత జిల్లాలో అడుగుపెట్టాలంటే వీసా తీసుకోవాలనే పరిస్థితికి చేరుకున్నాయని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. హిందూపురంలో వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ మూకలు చేసిన దాడి, దౌర్జన్యాలపై కాకినాడలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్దఎత్తున నినదించాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు కాకినాడ బాలాజీచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మెడలో నల్ల కండువాలు వేసుకుని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, అసలు రాష్ట్రంలో పరిపాలన అంటూ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు గద్దె ఎక్కిన దగ్గర నుంచి రెడ్‌బుక్ పాలన నడుస్తూ, దౌర్జన్యాలు, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిందని ప్రజలు ఏవగించుకుంటున్నార ని విమర్శించారు. చంద్రబాబు పాలన చూస్తుంటే పాకిస్తాన్లో ఉన్నామనే భావన కలుగుతోందన్నారు. గతంలో బీహార్‌లో జంగిల్ రాజ్‌గా లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులను ప్రోత్సహించి జరిపిన అరాచకాలు, దోపిడీలతో ప్రజలు విసుగెత్తిపోయి ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందన్నారు. ఇక్క డా అదే తరహాలో నడుస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే పార్టీ నేతలు పలకరించేందుకు వెళ్లే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. పార్టీ నేతల కోసం హిందూపురం వెళ్లాలంటే పాస్‌పోర్టు కావాలని అడిగే దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న ఆర్థి క పరిస్థితులు చూస్తుంటే మరో సూడాన్ అయిపోతుందనే భయం కలుగుతోందన్నారు. మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట కో–ఆర్డినేటర్ తోట నరసింహం మాట్లాడుతూ, హిందుపురంలో పార్టీ కార్యాలయం ధ్వంసం, పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడటం అన్యాయమన్నారు. అధికార పార్టీ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలని హితవు పలికారు. -
దత్తత విషయంలో దళారులను నమ్మవద్దు
కలెక్టర్ షణ్మోహన్ బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దత్తత విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. దత్తత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ, చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా దత్తత తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దత్తతలో ఉండే వివిధ రకాల వెసులుబాట్లు.. రిలేటివ్ అడాప్షన్ (రక్త సంబంధీకుల దత్తత), స్టెప్ పేరెంటెడ్ ఆడాప్షన్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బందికి సూచించారు. ఈ నెలలో గ్రామ, మండల, డివిజనల్ స్థాయిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా దత్తత ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి మాట్లాడుతూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలంటే జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికార్లను సంప్రదించాలన్నారు. దత్తత తీసుకునే వారు 85550 60818, 63035 99264, 93925 00795 నంబర్లలో సంప్రదించాలన్నారు. భూముల బదిలీ ప్రక్రియ వేగవంతం చేయాలి కాకినాడ ఎస్ఈజెడ్ భూములు రైతుల పేరున బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ, కేఎస్ఈజెడ్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో ఎస్ఈజెడ్ లిమిటెడ్ ద్వారా 1,189 ఎకరాల భూమిని 1,545 మంది రైతులకు బదిలీ చేయాల్సి ఉందన్నారు. ఆయా భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పత్రాలపై స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయించినట్టు చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, జిల్లా రిజిస్ట్రార్ జయలక్ష్మి, పాడా పీడీ చైత్రవర్షిణి, కాకినాడ సెజ్ జీఎం ఎం.శ్రీనివాసు పాల్గొన్నారు. -
రత్నగిరిపై కార్తిక శోభ
● ఆఖరి సోమవారం కిక్కిరిసిన సత్యదేవుని ఆలయం ● స్వామిని దర్శించిన 90 వేల మంది భక్తులు ● తొమ్మిది వేల వ్రతాలు, రూ.కోటి ఆదాయం అన్నవరం: అత్యంత పవిత్రమైన కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని ఆలయం వేలాది భక్తులతో పోటెత్తింది. సోమవారం వేకువజామున ఒంటి గంట నుంచి సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణంలో భక్తజన సందోహం నెలకొంది. సుమారు 90 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. రికార్డు స్థాయిలో తొమ్మిది వేల సత్యదేవుని వ్రతాలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.కోటి ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. శనివారం ఏకాదశి సందర్భంగా 1.20 లక్షల మంది, ఆదివారం 1.10 లక్షల మంది భక్తులు విచ్చేసిన విషయం తెలిసిందే. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించిన అధికారులు ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరిచి భక్తులను అనుమతించారు. వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలు వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి అంతరాలయ దర్శనం, యంత్రాలయ దర్శనాలను నిలిపివేశారు. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ, తూర్పు రాజగోపురం ఎదురుగా రావి చెట్టు వద్ద పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో నిండిపోయింది. కార్తిక మాసంలో ముఖ్యమైన పర్వదినాలు ముగియడంతో సత్యదేవుని సన్నిధిన రద్దీ కూడా తగ్గనుంది. మూడు రోజుల్లో లక్షల మంది భక్తులు విచ్చేసినా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా సాగడంతో దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 1,26,330కు చేరిన వ్రతాలు కార్తిక మాసంలో సత్యదేవుని వ్రతాలు గతేడాదికి చేరువలో ఉన్నాయి. సోమవారం జరిగిన తొమ్మిది వేల వ్రతాలతో కలిపి మొత్తం 1,26,330 వ్రతాలు జరిగాయి. గతేడాది కార్తిక మాసంలో 1,47,142 వ్రతాలు జరిగాయి. సోమవారం దేవస్థానానికి రూ.కోటి ఆదాయం వచ్చింది. సత్యదేవుని వ్రతాల్లో దాదాపు 70 శాతం రూ.300 టిక్కెట్‌తో జరిగినవే. రూ.వెయ్యి వ్రతాలు 847, రూ.1,500 వ్రతాలు 462, రూ.రెండు వేల వ్రతాలు 577 జరిగాయి. వ్రతాల ద్వారానే సుమారు రూ.45 లక్షల ఆదాయం సమకూరగా, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. మిగిలిన విభాగాల ద్వారా రూ.15 లక్షలు సమకూరింది. పది వేల మందికి పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.పంచారామ క్షేత్రం.. శివనామ స్మరణం సామర్లకోట: బాలాత్రిపుర సుందరి సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వేంచేసిన సామర్లకోట పంచారామ క్షేత్రం భక్తజనుల శివనామ స్మరణతో మార్మోగింది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉచిత, రూ.20, రూ.50 రూ.100 క్యూల్లో భక్తులు బారులు తీరారు. ఈఓ భళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో తెల్లవారుజాము మూడు గంటలకు గోపూజ, అనంతరం స్వామివారికి తొలి అభిషేకం, తొలి పూజలు జరిగాయి. ఈఓతో పాటు, ఉత్సవాల ప్రత్యేకాధికారి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. తెల్లవారుజామున, రాత్రి భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం ప్రజ్వరిల్లింది. ఆలయ కోనేరులో, గోదావరి కాలువలో భక్తులు పుణ్యస్నానాలు చేసి, దర్శనాల కోసం ఆలయానికి తరలివచ్చారు. -
యూనిటీ మార్చ్‌తో యువతలో ఐక్యతా భావం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): యువతలో ఐక్యత భావం, దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యత మార్చ్ (యూనిటీ మార్చ్)ను నిర్వహించినట్టు కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఐదు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. స్థానిక కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి సాంబమూర్తి నగర్ ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రను ట్రైనీ కలెక్టర్ మనీషా, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్ర భానుగుడి జంక్షన్, కోకిల రెస్టారెంట్, మదర్‌థెరిస్సా సెంటర్ మీదుగా ఆదిత్య కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్బోధించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ కుతంత్రాలు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి కాకినాడ రూరల్: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తన మార్కు కుత్రంతాలకు పాల్పడుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు బహిర్గతం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులపై చంద్రబాబు నోరు పారేసుకోవడం తగదన్నారు. కాకినాడలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఎందుకంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయబోమని ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పారని, రేవు దాటాక తెప్ప తెగలేసినట్టుగా.. ఇప్పుడు ఉద్యోగులు, కార్మికులపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారంపై తెల్ల ఏనుగంటూ మాట్లాడుతున్నారన్నారు. అమరావతి రాజధానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, దాన్ని తెల్ల ఏనుగు అంటారన్నారు. స్టీల్ ప్లాంట్ భూములపై కన్ను వేసి, కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్ల ప్యాకేజీ ఎలా వినియోగించారనేది చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉత్పాదన ఉద్యోగికి సగటున 785 టన్నులు కాగా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సగటున 629 టన్నులు మాత్రమేనన్నారు. సొంత గనులు లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల బారిన పడుతుందంటూ చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించేందుకు ఉన్న ఆసక్తిని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పెడితే కచ్చితంగా లాభాల బాట పడుతుందని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. పీజీఆర్ఎస్కు 382 అర్జీలు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 382 అర్జీలు సమర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావుతో పాటు, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. రేషన్ కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్య నిర్వహణ, వివిధ సంక్షేమ పథకాలు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు నిర్దేశించారు. రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక అమలాపురం టౌన్: అమలాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు బీహెచ్‌వీఎస్ రామకృష్ణ సోమవారం తెలిపారు. ఇందులో అండర్–17 విభాగానికి ఎ.శిరీష, అండర్–14 విభాగానికి పి.వినయ్‌కృష్ణ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 20న చిత్తూరులో జరగనున్న పోటీలకు వినయ్‌కృష్ణ, 21న నూజివీడులో జరిగే పోటీల్లో శిరీష పాల్గొంటారని అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. -
తొందారిగా సాగేందుకు..
● తుది దశకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు ● ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ నిర్మాణం ● తగ్గనున్న 70 కిలోమీటర్ల దూరం ● రూ.4,200 కోట్ల అంచనా వ్యయం దేవరపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ.. పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకున్నారు. మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి రానుంది. న్యాయపరమైన చిక్కులు తొలగడంతో కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద మూడు కిలోమీటర్ల రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి పనులు పూర్తి చేసి వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామాలను తాకకుండా ఈ హైవే నిర్మాణం చేపడుతున్నారు. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడడంతో పాటు సమయం, దూరం తగ్గుతుంది. సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల దేవరపల్లి నుంచి ఖమ్మంకు సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారుల అంచనా. రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లు లేకుండా నాలుగు వరుసల హైవే నిర్మాణం జరుగుతుంది. 2022 ఏప్రిల్‌లో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం 2024 సెప్టెంబర్‌కు మూడేళ్లలో హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే అధిక వర్షాలు, తుపాన్లు, కొన్ని ప్రాంతాల్లో న్యాయపరమైన చిక్కుల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఐదు ప్యాకేజీలుగా.. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ సుమారు 162 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ మంత్రిత్వ శాఖ రూ.4,200 కోట్లు మంజూరు చేసింది. ఐదు ప్యాకేజీల్లో పనులు చేపట్టగా, తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్యాకేజీల్లో జరిగాయి. అయితే 5వ ప్యాకేజీలో పొంగుటూరు వద్ద మూడు కిలోమీటర్ల రహదారి పనులు మాత్రమే జరగాల్సి ఉంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే దేవరపల్లి డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి (16) కలుస్తుంది. ఈ ప్రాంతంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రమ్‌ఫుట్ నిర్మించారు. అయితే నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న రహదారికి సుమారు 1,100 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మాణ పనులు చేపట్టింది. ఇలా వెళ్తే దగ్గరే.. గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి దూరం తగ్గుతుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు విజయవాడ మీదుగా కాకుండా నేరుగా దేవరపల్లి నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రయ్ రయ్ మంటూ ఖమ్మం నుంచి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల దూరం తగ్గుంతుందని అంటున్నారు. మలుపులు లేకుండా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల రహదారిని రూ.2,200 కోట్లతో చేపట్టారు. చింతలపూడి సమీపంలోని రేచర్ల వద్ద నుంచి హైవే పనులు ప్రారంభమవుతాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య ఎనిమిది టోల్ ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మించారు. హైవే నిర్మాణంతో దేవరపల్లి – హైదరాబాద్ మధ్య దూరం సుమారు 70 కిలోమీటర్లు తగ్గుతుంది. రహదారి పూర్తిగా పంట పొలాల మధ్య నుంచి వెళుతుంది. మలుపులు లేకుండా సమాంతరంగా ఉంటుంది. మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ మెట్ట ప్రాంతంలో తల్లాడ – దేవరపల్లి(316డీ), గుండుగొలను – కొవ్వూరు (ఎన్‌హెచ్ 16), ఖమ్మం – దేవరపల్లి మూడు నేషనల్ హైవేల ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పండించిన పంటలను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్, విశాఖ, కోల్‌కతా, విజయనగరం వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను రైతులు రవాణా చేస్తున్నారు. ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజలు వంటివి రవాణా జరుగుతుంది. తద్వారా పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. పనులు ముమ్మరం చేశాం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నాలుగు ప్యాకేజీల్లో పనులు పూర్తికాగా, 5వ ప్యాకేజీలో మూడు కిలోమీటర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఈ హైవేతో హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. భూసేకరణకు ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పనులు ముమ్మరం చేశాం. దేవరపల్లి వద్ద టోల్‌ప్లాజా నిర్మాణం పూర్తయ్యింది. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం పూర్తి చేశాం. ఇక్కడ రెండు జాతీయ రహదారులు కలుస్తాయి. – బి.కృష్ణమూర్తి, పీడీ, నేషనల్ హైవేస్, రాజమహేంద్రవరం -
కువైట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి..
అమలాపురం రూరల్: కువైట్‌లో తీవ్ర ఇబ్బందులు పడిన చెయ్యేరు గ్రామ వాసి ఆర్.సత్యవతిని సురక్షితంగా స్వదేశానికి చేరారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ తక్షణ చర్యలు తీసుకుని బాధితురాలికి సహాయం అందించింది. 2025 జూలైలో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన సత్యవతి అక్కడ తీవ్ర ఆరోగ్య సమస్యలు, పని చేసే ఇంటి వద్ద మానసిక ఒత్తిడి ఎదుర్కొని అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించగా కలెక్టర్ వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పర్యవేక్షించి, కువైట్‌లోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అత్యవసర సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా పరిపాలన సమన్వయంతో సత్యవతిని సురక్షితంగా స్వగృహానికి చేర్చారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లదలచిన వారు తప్పనిసరిగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించి సురక్షిత మార్గాల్లోనే వెళ్లాలని, నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని నోడల్ అధికారి కె.మాధవి సూచించారు. కార్యక్రమంలో సమన్వయకర్త గోళ్ల రమేష్, కె.సత్తిబాబు, సఫియా, దుర్గ తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్ చాగల్లు: చోరీ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు పట్టణ ఎస్సై పి.విశ్వం సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 16న కొవ్వూరు క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చి వెనుక నివాసం ఉంటున్న తుంపిరి రామారావు, తన కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా, తలుపు తాళం పగులగొట్టి, ఇంటి లోపలి బీరువాలోని రూ.3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైన ట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు రాజమహేంద్రవరానికి చెందిన, ప్రస్తుతం కోరుకొండ మండలం బుచ్చెంపేటలో ఉంటున్న కుందుర్తి శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి బంగారు నల్లపూసల తాడు, మూడు బంగారు ఉంగరాలు, నాలుగు జతల వెండి పట్టీలు, నాలుగు వెండి ఉంగరాలు, రెండు వెండి బ్రేస్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. అలాగే నిందితుడిపై కొవ్వూరు పట్టణ, రాజమహేంద్రవరం త్రీ టౌన్, కడియం పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు ఉన్నాయన్నా రు. రాజమహేంద్రవరం కేసుకు సంబంధించి బంగా రు తాడు, కడియం కేసుకు సంబంధించి రూ. 5,340 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా కేసును చేధించిన కొవ్వూరు టౌన్ ఎస్సై విశ్వం, సిబ్బందిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అభినందించారు. సత్రం పేరు గదుల పాత పెరగనున్న సంఖ్య అద్దె అద్దె హరిహరసదన్ (ఏసీ) 84 రూ.950 రూ.1,500 (జీఎస్టీతో) హరిహరసదన్ (జనరల్) 51 రూ.600 రూ.800 ప్రకాష్‌సదన్ (ఏసీ) 64 రూ.999 రూ.1,260 (జీఎస్టీతో) న్యూసీసీ 48 రూ.500 రూ.700 ఓల్డ్సీసీ 48 రూ.500 రూ.700 -
వైద్యుడిపై దోపిడీ దొంగల దాష్టీకం
● పోలీసులమని చెప్పి బెదిరింపు ● ఏటీఎంలకు తిప్పి డబ్బు డ్రా చేసి ఇవ్వాలని దాడి కాకినాడ క్రైం: కాకినాడలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో అర్ధరాత్రి దాటితే మగవారే నిర్భయంగా తిరగలేని పరిస్థితి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన 29 ఏళ్ల డాక్టర్ రవి జైశ్వాల్ స్థానిక రంగరాయ వైద్య కళాశాలలో ఈఎన్టీ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక సుబ్బయ్య హోటల్ సమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక రాత్రి ఒంటి గంట సమయంలో డ్యూటీ ముగించుకుని జీజీహెచ్ నుంచి ద్విచక్ర వాహనంపై తన రూమ్‌కు వెళుతుండగా, గుర్తు తెలియని ముగ్గురు త్రీ లైట్ జంక్షన్ సమీపంలో అటకాయించారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుని వివరాలు అడిగారు. తన వంతు బాధ్యతగా వైద్యుడు వివరాలు చెప్పి ముందుకు సాగుతుండగా రెండు ద్విచక్ర వాహనాలపై ఆ ముగ్గురు వ్యక్తులు రవిని వెంబడించారు. అనుమానం కలిగిన రవి దారి మళ్లించాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్లగా అక్కడికి సమీపంలో చీకటి ప్రాంతంలో రవి వాహనానికి అడ్డుగా తమ వాహనాలు నిలిపి మరోమారు తన ఐడీ చూపించాలని అడిగి కార్డు తీసుకున్నారు. డబ్బులు కావాలని బెదిరించారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే దాడి చేశారు. జేబుల్లో చేతులు పెట్టి పర్స్‌ను బలవంతంగా లాక్కొని అందులో ఉన్న రూ.2,500 నగదు తీసుకున్నారు. పర్సులో ఉన్న ఏటీఎం కార్డు తీసి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని అడిగారు. ఇవ్వనని తెగేసి చెప్పే సరికి దాడి చేసి తమ వద్ద ఉన్న ఓ పదునైన ఆయుధాన్ని చూపించి బెదిరించి ఏటీఎం వద్దకు బలవంతంగా తీసుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు త్రీ లైట్ జంక్షన్లో రవి వాహనం వద్ద ఉండగా, మరో వ్యక్తి తన వాహనంపై రవిని ఎక్కించుకుని వెళ్లాడు. స్థానిక నూకాలమ్మ గుడి వెనుక ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయించేందుకు ప్రయత్నం చేయగా, ఆ ఏటీఎం పనిచేయలేదు. దీంతో సమీపంలో ఉన్న నాలుగు ఏటీఎం కేంద్రాలకు తిప్పాడు. చివరికి మెయిన్ రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం వద్ద ఆపి డబ్బు డ్రా చేయాలని బెదిరించాడు. ఈ క్రమంలో డాక్టర్ రవి తన స్నేహితుడికి అప్పటికే వాట్సాప్‌లో తన లొకేషన్ పంపి తాను ప్రమాదంలో ఉన్నానని సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలో ఉన్న బీటు కానిస్టేబుళ్లు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దోపిడీ దొంగ తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. బాధితుడు రవి తక్షణమే పోలీసులతో కలసి త్రీ లైట్ జంక్షన్లో తన వాహనం దగ్గర ఉన్న మిగిలిన ఇద్దరి కోసం వెళ్లగా వారు తమ తోటి దొంగ ఇచ్చిన ముందస్తు సమాచారంతో అప్పటికే పరారయ్యారు. రవి సహాయం కోసం ఎక్కడికీ వెళ్లకూడదన్న కుయుక్తితో అతడి వాహనం టైర్లను తమ వద్ద ఉన్న పదునైన ఆయుధంతో పొడిచేశారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆబోతుల వీరంగం: వ్యక్తి మృతి
అల్లవరం: కార్తిక మాసం సందర్భంగా తీర్థయాత్రకు వచ్చిన ఓ భక్తుడు ఆబోతుల వీరంగంలో మృత్యువాత పడ్డాడు. అల్లవరం ఎస్సై సంపత్‌కుమార్ కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన దంగేటి శ్రీనివాస్ (51) తన భార్య, కుమార్తెతో పాటు మరో ఇద్దరితో కలసి అయినవిల్లి, కుండలేశ్వరం పుణ్యక్షేత్రాలను ఆదివారం దర్శించుకుని ఓడలరేవుకు ఆటోలో వెళ్లారు. బీచ్ నుంచి తిరిగి వస్తుండగా అల్లవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆబోతులు వీరంగం చేస్తూ ఆటోపైకి దూసుకొచ్చాయి. దీంతో ఆటో బోల్తా పడడంతో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి అల్లవరం సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరొకరు..చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్టు ఎస్సై కె.నరేంద్ర సోమవారం తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన ఇరగవరపు ఆంజనేయులు (23) ఆదివారం రాత్రి మోటార్ సైకిల్‌పై విజ్జేశ్వరం గ్రామంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి తిరిగి కలవలపల్లి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణగూడెం శివారులోని కల్యాణ మండపం దాటిన తర్వాత ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆంజనేయులు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి అన్నయ్య ఇరగవరపు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతుడు వ్యవసాయం కూలీగా జీవనం సాగించేవాడు. బాలికపై లైంగిక దాడి కపిలేశ్వరపురం: ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నల్లూరు గ్రామానికి చెందిన బాలిక (8)పై అదే గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై బాధిత బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఇద్దరు పిల్లలతో సహా వ్యక్తి అదృశ్యం మలికిపురం: లక్కవరం గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్ తన ఇద్దరి పిల్లలతో అదృశ్యం అయ్యాడు. భార్యతో విభేదాల కారణంగా దుర్గాప్రసాద్ తన ఇద్దరి పిల్లలను ఆధార్ కార్డుల కోసం అని సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి తీసుకు వచ్చాడు. అనంతరం దిండి– చించినాడ వంతెనపైకి తీసుకు వెళ్లాడు. అక్కడ తన బైక్, జోళ్లు విడిచి అదృశ్యం అయ్యాడు. నదిలో దూకాడా... లేక ఎక్కడికై నా వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే వారి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. -
సోమేశ్వరుని సన్నిధిలో సినీ నటుడు గౌతంరాజు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ బెస్తపేట సమీపంలో వేంచేసి ఉన్న ఆనంద అమృతవల్లీ సమేత సోమేశ్వరస్వామి కల్యాణ వేడుకను చివరి కార్తిక సోమవారం రోజున శాస్త్రోక్తంగా నిర్వహించారు. దివంగత గంపల సోమేశ్వరరావు సతీమణి భార్గవి ఆధ్వర్యంలో జరిగిన స్వామి కల్యాణ క్రతువులో సినీ నటుడు గౌతంరాజు దంపతులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదం భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో యాట్ల నాగేశ్వరరావు, గంపల వెంకట సోమరాజు, వాసంశెట్టి భవానీ శంకర్, కనకమేడల సంస్కారానంద, మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. యువకుడిపై దాడి బిక్కవోలు: రంగాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపురానికి చెందిన తంగెల్ల రాము అదే గ్రామానికి చెందిన ఓ యువతి గతంలో ప్రేమించుకున్నారు. ఇది ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఆ యువతి ఎక్కడికై నా తీసుకెళ్లమని, లేకపోతే చనిపోతానని రాముకు చెప్పడంతో సింగారం చింత గ్రామానికి తీసుకువెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇంటికి వారిని తీసుకు వెళ్లిపోయారు. అయితే ఈ నెల 15న రాత్రి తుమ్మలపల్లి గ్రామంలో రాము బైకుపై వెళ్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించారు. రాముపై దాడి చేశారు. దీంతో అతని తల్లి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి, సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మేమేం పాపం చేశాం..
● వయసు పైబడిందని తొలగించడం అన్యాయం ● తిరిగి నియమించాలంటూ మహిళల విన్నపాలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శానిటరీ విభాగంలో 50 ఏళ్లు పైబడిన 40 మంది మహిళలను తొలగించారని, తిరిగి విధుల్లో తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నిబంధనతో పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల దేవస్థానంలో 26 మంది ఉద్యోగులను కొత్త కాంట్రాక్టర్ పద్మావతి హాస్పటాలిటీస్ అండ్ ఫెసలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థ గత నెలలో తొలగించింది. అయితే ఆ సిబ్బంది అక్కడి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్‌రావును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. దాంతో ఆయన ఆ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి తొలగించిన ఉద్యోగులనరు తిరిగి నియమించాలని, వారి పొట్టకొట్టొద్దని చెప్పారు. దీంతో 60 ఏళ్లు దాటిన నలుగురు ఉద్యోగులు మినహా మిగిలిన వారిని తిరిగి ఆ కాంట్రాక్టర్ విధుల్లోకి తీసుకున్నారు. అన్నవరం దేవస్థానంలో కూడా గత నెలలో 40 మంది మహిళలను పద్మావతి హాస్పటాలిటీస్ అండ్ ఫెసలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థ తొలగించింది. గతంలో ఎన్నడూ లేని నిబంధనతో వీరిని తొలగించడంపై ‘కూటమి కోసం కూడు కొట్టారు’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో గత నెల 24న కథనం ప్రచురితమైంది. అధికార కూటమికి చెందిన కార్యకర్తలను నియమించేందుకే వీరిని తొలగించారనే విమర్శలు వినిపించాయి. ‘సాక్షి’లో కథనం దేవస్థానంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శానిటరీ విభాగ సిబ్బందిని 58 ఏళ్ల వరకూ కొనసాగించారు. అటువంటిది ఈ ప్రభుత్వంలో 45 ఏళ్లు దాటితే తొలగించాలని, ఏకంగా జీఓ విడుదల చేయగా దేవస్థానం అధికారులు ముందుగా 50 ఏళ్లు దాటిన వారిని తొలగించారని కథనం వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు వివాదం ముదరకుండా ఆ మహిళలను కార్తిక మాసంలో పనిచేయడానికి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే కార్తిక మాసం పూర్తవ్వడంతో ఒకటి రెండ్రోజులలో తిరిగి వారిని తొలగించనున్నారు. అయితే ద్వారకాతిరుమల దేవస్థానంలో ఏ విధంగా సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారో, అదే విధగా తమను కూడా తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
రత్నగిరిపై సత్రం గదుల అద్దె పెంపు
అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వివిధ వసతి సత్రాల గదుల అద్దెలు పెంచుతూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. హరిహరసదన్ సత్రంలో గత ఏడాది, ప్రకాష్‌సదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలలో గత నెలలో సుమారు రూ.రెండు కోట్లతో మరమ్మతులు చేయించారు. కొత్త బెడ్‌షీట్స్ మార్చారు. ఈ వివరాలతో సత్రాలలో గదుల అద్దెలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ను కోరడంతో ఆయన ఆ మేరకు ఆదేశాలిచ్చినట్టు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు.రత్నగిరిపై హరిహరసదన్ సత్రం -
కాపులను ఒకే వేదికపైకి తీసుకొస్తాం
కాకినాడ రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులను త్వరలో ఒకే వేదికపైకి తీసుకువచ్చి కొత్త సంఘం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కాకినాడలో శుభం కాపు కల్యాణ మండలంలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కాపు కార్తిక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూడకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి సమాజంలో మంచి నడవడిక నేర్పించాలన్నారు. కాపులంటే ఇలానే ఉండాలనే విధంగా పెంచాలని సూచించారు. కాపులకు ఒక చరిత్ర ఉన్న విషయం అందరికీ తెలిసే విధంగా సంఘీయులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘం ఏర్పాటు చేసి, కాపులకు ఏ కష్టం వచ్చినా సహాయం చేసే విధంగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాపు సద్భావన సంఘ నాయకులు గట్టి సత్యనారాయణ, దుగ్గన బాబ్జీ, చిట్నీడి శ్రీనివాస్, జనపాముల నాగబాబు, ఆకుల వెంకటరమణ, రంబాల వెంకటేశ్వరరావు, సంగిశెట్టి అశోక్, పెండెం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఫ త్వరలో కొత్త సంఘం ఏర్పాటు ఫ వన సమారాధనలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు -
తేగనచ్చేస్తున్నాయ్..
నాగుల చవితి తర్వాత దొరికే తేగలంటే అందరికీ ఇష్టమే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంటాయి. డెల్టా ప్రాంతంలో తాటి చెట్లు ఉన్నా మెట్ట ప్రాంతంలో తేగల పాతర వేసి వాటిని విక్రయించడం చాలామందికి జీవనోపాధిగా మారింది. జూన్, జులై నెలల్లో తాటిచెట్లను కొనుగోలు చేసి పండ్లను పాతర వేసి సీజన్లో తేగలను అమ్ముతుంటారు. అటువంటి తేగల ధర ప్రస్తుతం కొండెక్కింది. దశాబ్ద కాలం కిందట పది తేగలతో కూడిన కట్ట రూ.10 నుంచి రూ.15 పలకగా, నేడు రూ.50కు చేరింది. తాటి పండ్లను భూమిలో పాతరేస్తే తేగలుగా మారతాయి. పూర్తిగా పీచు పదార్థంతో కూడిన తేగలను జీర్ణశక్తి కోసం ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకుంటారు. నాగేంద్రుడికి ప్రీతిపాత్రంగా భావించే తేగలను నాగుల చవితిరోజు పుట్టలో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తేగల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి తేగలను బంధువులు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు కూడా పంపిస్తుంటారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం పుణ్యమా అని మెట్ట ప్రాంతంలో తాటిచెట్ల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో తాటి తోపులు తగ్గడంతో సహజంగానే తాటిపండ్లు తగ్గిపోయాయి. ఇలా తేగలకు సహజంగానే ధర పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మెట్ట ప్రాంతంలో తేగలు రుచికరంగా కూడా ఉండడంతో వాటిని వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఏదేమైనా వ్యాపారులు చెబుతున్న తేగల ధర విని సామాన్యులు అమ్మో అంటున్నారు. – రాయవరం -
శెట్టిబలిజల ఐక్యత చాటుదాం
అమలాపురం రూరల్: తెలుగు రాష్ట్రాల్లోని శెట్టిబలిజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ఐక్యత చాటే ఉద్దేశంతో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరు పరిధి సత్తెమ్మ తల్లి ఆలయం ఆవరణలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో శెట్టిబలిజ కార్తిక వన సమారాధన, ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఐక్యంగా ఉంటూ ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం కలిగి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజలకు రాజ్యాధికారం దిశగా కృషి చేస్తామన్నారు. శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ స్థాపించి మంత్రి సుభాష్ వ్యక్తిగతంగా రూ.కోటి విరాళంగా ప్రకటించారు. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ జాతి ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ శెట్టిబలిజల అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి, కుడుపూడి సూర్యనారాయణ వంటి మహనీయులు ఎంతో కృషి చేశారన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, శెట్టిబలిజ సంఘ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, పెచ్చెట్టి విజయలక్ష్మి, గుత్తుల సాయి, వాసంశెట్టి చినబాబు, చొల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మంత్రి సుభాష్ -
నిత్యం తల్లిచుకునేలా..
● ర్యాలిలో అమ్మకు మందిరం నిర్మించిన మ్యాజిక్ ఫ్యామిలీ సృష్టిలో ప్రతి ప్రాణికి మూలం ‘అమ్మ’.. అందుకే తల్లిని మించిన దైవం లేదని అంటారు. అటువంటి తల్లికి ఏకంగా ఆరాధ్య మందిరమే నిర్మించి, ప్రేమను చాటుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన డాక్టర్ చింతా శ్యామ్‌కుమార్. ర్యాలి మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాల హెచ్ఎం అయిన శ్యామ్‌కుమార్ మ్యాజిక్ ప్రదర్శనలతో ఇంద్రజాలకుడిగా ప్రసిద్ధి చెందారు. సమాజంలో పేదలు, అనాథలకు అల్పాహారం, ఆహారం అందిస్తూ సేవ చేస్తున్నారు. ఈ సేవలకు స్ఫూర్తి తన తల్లి నాగ వీరమణి స్ఫూర్తి అని శ్యామ్ చెబుతున్నారు. ర్యాలిలో ఎన్నో ఏళ్లుగా ఆమె ఆధ్వర్యంలో ప్రతి శనివారం సుమారు 300 నుంచి 400 మందికి అల్ఫాహారం, కుటుంబ ఆధారం లేని వృద్ధులు, పేదలు సుమారు 30 మందికి ప్రతి రోజు భోజనం వండి వడ్డిస్తూ వచ్చారు. గత ఏడాది నవంబరు 18న ఆమె గుండెపోటుతో మృతి చెందారు. ఆమె స్ఫూర్తితో మ్యాజిక్ ఫ్యామిలీ ఆయా సేవలను కొనసాగిస్తుంది. అన్నపూర్ణా డే కేర్ హోమ్ ద్వారా పేదల ఆకలి తీరుస్తూ, విద్య, వైద్య సేవలు చేస్తున్నారు. అమ్మ సేవలు శాశ్వతంగా కొనసాగించాలని శ్యామ్ ర్యాలి గ్రామంలో తమ రెండిళ్లకు మధ్య ఉన్న స్థలంలో అమ్మకు ప్రత్యేక మందిరం నిర్మించారు. తమిళనాడులో ఓ ప్రముఖ శిల్పిచే నాగ వీరమణి విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని ఆ మందిరంలో ప్రతిష్ఠించారు. ఆదివారం అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ఆ మందిరాన్ని ప్రారంభించారు. ఆమె విగ్రహం వద్ద ‘అమ్మ’ అక్షర రూపంలో సహస్ర జ్యోతులతో నివాళులర్పించారు. అనంతరం తన తల్లి జీవితంపై రూపొందించిన ఐదు పాటలను విడుదల చేశారు. మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు అన్నపూర్ణ, డాక్టర్ మోహిత్, డాక్టర్ సీత, తేజశ్రీ శ్రీకాంత్, రుషిత్, జాన్విక, డాక్టర్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. – కొత్తపేట -
కార్తిక సన్‌దడి
కొత్తపల్లి: సముద్ర తీరంలో పర్యాటకుల సందడి నెలకొంది.. కార్తిక మాసం, ఆపై ఆదివారం కావడంతో కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం కళకళలాడింది. వన సమారాధనల జోరు పెరిగింది. స్నేహితులు, బంధువులతో బీచ్‌కు వచ్చి సాయంత్రం వరకూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్ హౌస్ నుంచి ఉప్పాడ బీచ్ రోడ్డు వరకూ పర్యాటకుల వాహనాలతో నిండిపోయింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఉన్న ఈ తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఉప్పాడ బీచ్‌కు తరలివచ్చారు. ఆదివారం కావడంతో తుని సమీపంలోని తలుపులమ్మ లోవ అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్న భోజనం అనంతరం తీర ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ వసతులు లేకపోవడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. తీర ప్రాంతంలోని సరుగుడు తోటలు, బెంచీలు తొలగించడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. కనీసం తాగేందుకు నీరు లేకపోవడంపై విస్తుపోయారు. ఇదిలాఉంటే సాగర తీరంలో పిల్లలు, పెద్దలు కేరింతలు కొట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు టెంట్లు వేసుకుని, సౌండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకుని ఆట పాటలతో డ్యాన్స్ చేశారు. క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. ఈ సాగర తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. బీచ్ రోడ్డులోకి భారీగా వచ్చిన పర్యాటకుల వాహనాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉప్పాడ సాగర తీరంలో పర్యాటకుల సందడిఫ సాగర తీరంలో వన సమారాధనలు ఫ కేరింతలు కొట్టిన చిన్నారులు -
అరటి ఆకులో ఆహారం
ఫ ‘కార్తికం’తో పెరిగిన ధర కార్తిక మాసంలో అరటి ఆకులోనే భోజనం చేయాలనేది అనాదిగా వస్తున్న ఆచారం.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో రకరకాల ఆకృతుల్లో, వివిధ రకాల మెటీరియల్స్‌తో రూపొందించిన భోజనం ప్లేట్లు వచ్చినా అరటి ఆకుకు ఉన్న డిమాండ్ తగ్గలేదు. కార్తిక మాసంలో అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ కార్తికంలో భోజనానికి అరటి ఆకునే వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో అరటి ఆకులకు డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో 100 అరటి ఆకులు రూ.100 వరకూ ధర పలుకుతుండగా, కార్తిక మాసం ప్రారంభంలో ఒక్కసారిగా ధర పెరిగింది. ప్రస్తుతం వంద అరటి ఆకులు రూ. 300 పలుకుతున్నాయి. అయ్యప్ప భక్తులు కూడా అరటి ఆకులోనే భోజనాలు చేస్తారు. విస్తరిలు అందుబాటులో ఉన్నా భోజనం చేయరు. కార్తిక మాసం, అయ్యప్పల సంఖ్య పెరగడం.. వన భోజనాల హడావుడితో అరటి ఆకులకు సహజంగానే డిమాండ్ ఏర్పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద కార్తిక వనభోజనాలు చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. జిల్లాలో అరటి తోటల సాగు అధికంగానే ఉంది. 12,300 హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఈ నెలలో వచ్చిన మోంథా తుపాను కారణంగా వీచిన గాలులకు అరటి తోటలు పడిపోవడం.. ఆకులు చీలిపోవడంతో అరటి ఆకులు దొరకడం కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్య రీత్యా మంచిదని, అందుకే పూర్వకాలం నుంచి అరటి ఆకులో భోజనం చేయడం సంప్రదాయంగా వస్తుంది. సంప్రదాయంతో పాటు అరటి ఆకులో నుంచి శరీరానికి అవసరమైన సహజ సిద్ధమైన ఔషధాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. అరటి ఆకులో వేడి వేడి ఆహార పదార్థాలతో యాంటీ ఆక్సిడెంట్స్ కలసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని పలువురి నమ్మకం. – రాయవరం -
బాలిక అదృశ్యం
రంగంపేట: ఓ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు రంగంపేట ఎస్సై శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఎస్టీ రాజాపురం గ్రామానికి చెందిన ఓ బాలిక (17) రాజానగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారం ఉదయం కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతకగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జేశారు. ఆబోతు దాడిలో వృద్ధుడి మృతి కాకినాడ రూరల్: ఆబోతు దాడిలో తూరంగి రణదీప్నగర్కు చెందిన గండిమేని పేరులు (75) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం కాలకృత్యాల నిమిత్తం బయకు వెళ్తున్న పేరులును ఆబోతు కొమ్ములతో పొడిచి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంద్రపాలెం అడిషనల్ ఎస్సై సమర్పణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాల భీముడి జననం ఫ శిశువు బరువు 4.2 కిలోలు ప్రత్తిపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆదివారం ఓ మాతృమూర్తి బాల భీముడికి జన్మనిచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తునికి చెందిన వెలుగుల క్రాంతి రెండో కాన్పుకు చింతలూరు గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. నెలలు నిండడంతో శనివారం స్థానిక సీహెచ్‌సీలో చేరింది. అయితే హైరిస్క్ కేసుగా వైద్యులు నిర్ధారించారు. కడుపుతో ఉన్నప్పుడు వచ్చే షుగర్ వ్యాధి ఉండడంతో ఆమెకు వైద్య సిబ్బంది శస్త్రచికిత్స చేశారు. అయితే పుట్టిన మగ శిశువు బరువు 4.2 కిలోలు ఉండడంతో బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు సీహెచ్‌సీ సూపరిటెండెంట్ డాక్టర్ బి.సౌమ్య మైఖేల్ తెలిపారు. -
ఆధ్యాత్మికత.. సేవా తత్పరత
రాయవరం: మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆచరిస్తూ సత్యసాయి సేవా సంస్థలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆకలి అనేవారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటున్నాయి. ఏటా నవంబర్ 23న సత్య సాయిబాబా జయంతిని నిర్వహిస్తుండగా, ఈ ఏడాది శత జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సత్యసాయి సేవా సమితులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం జోన్ల పరిధిలో 120 సత్యసాయి సేవా సమితులు, 252 భజన మండళ్లు ఉన్నాయి. వీటి ద్వారా భారతీయ సంస్కతీ సంప్రదాయాలు పరిఢవిల్లేలా అన్ని పర్వదినాలను నిర్వహిస్తున్నారు. అన్ని మతాలను ఒకటిగా చేర్చి సనాతన ధర్మాన్ని సత్యసాయి సేవా సంస్థలు విస్తరిస్తున్నాయి. సత్యసాయి సేవా సంస్థల ద్వారా నగర సంకీర్తనలు, నామ సంకీర్తనలు, సామూహిక పూజలు, యజ్ఞాలు, క్రతువులు, లిఖిత నామ జపం, వ్యక్తిగత సాధనలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగంలో భాగంగా 350 బాల వికాస్‌లను నిర్వహిస్తున్నారు. బాలవికాస్ ద్వారా విద్యార్థులకు ఆధ్యాత్మికత, విజ్ఞానంతో పాటు ప్రధానంగా మానవతా విలువలను ప్రబోధిస్తారు. గ్రూపు 1, 2, 3 తరగతులుగా నిర్వహించే బాల వికాస్లలో సుమారు 15 వేల మంది బాలబాలికలు సభ్యులుగా ఉన్నారు. 534 మంది బాలవికాస్ గురువులు వీరికి విద్యా బోధన చేస్తున్నారు. ఏడాది పొడవునా.. ఫ సత్యసాయి సేవా సంస్థల పరిధిలో ఏటా పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేస్తున్నారు. అలాగే ఫీజులు, బస్ పాస్‌ల రూపంలో ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రావులపాలెంలోని కంప్యూటర్ సెంటర్ ద్వారా ఏటా 200 మందికి ఉచితంగా కంప్యూటర్ విద్యనందిస్తున్నారు. ఫ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణ కేంద్రాల ద్వారా పేద మహిళలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తున్నారు. ఈ ఏడాది 500 మంది వరకూ జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో శిక్షణ పొందారు. జిల్లాకు చెందిన 100 మందికి పుట్టపర్తిలో జ్యూట్ కుట్టు మెషీన్లు అందజేశారు. అంతేకాకుండా 2013 అక్టోబర్ నుంచి నెల నెలా ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో నెలకు దాదాపు 3 వేల మంది గర్భిణులకు కాల్షియం టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కాంబినేషన్ సిరప్లు, మల్టీ విటమిన్ సిరప్‌తో కూడిన హెల్త్ కిట్లను అందజేస్తున్నారు. ప్రతి నెలా 19న గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. రోజూ నిడదవోలు, కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందే రోగులకు సహాయకులుగా వచ్చేవారికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం సత్యసాయి సేవా సంస్థల పరిధిలో పేదల కోసం అల్లోపతి, హోమియో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. రోజూ, వారం వారీగా వైద్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. అనాథ పిల్లల (బాలురు) కోసం తాటిపాక, రావులపాలెం, ఊబలంకల్లో అనాథాశ్రమాలు నెలకొల్పారు. అదేవిధంగా తాటిపాక, రావులపాలెం, వడ్లమూరుల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారు. రావులపాలెం, ఊబలంకల్లో ఏర్పాటు చేసిన బధిరుల ఆశ్రమంలో 33 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. మారేడుమిల్లిలో ప్రతి నెలా గిరిజనులకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. నగర సంకీర్తన చేస్తూ.. లోక కల్యాణం కోసం రోజూ గ్రామాల్లో సత్యసాయి సేవా సంస్థలు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నాయి. వేకువ జామునే గ్రామాల్లో సత్యసాయి భజనలను ఆలపిస్తూ నగర సంకీర్తన చేస్తున్నారు. నగర సంకీర్తన ద్వారా గ్రామస్తులను మేల్కొలపడం, భక్తిభావాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫ నిరంతరాయంగా సత్యసాయి సేవా కార్యక్రమాలు ఫ ఉమ్మడి జిల్లాలో 120 సమితులు, 252 భజన మండళ్లు ఫ 23న సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు బాబా అనుగ్రహంగా భావిస్తూ.. జిల్లాలో సత్యసాయి సేవా సంస్థలు సేవాభావంతో పనిచేస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవగా భావించడమే సేవా సంస్థల పరమావధి. ఇది బాబా అనుగ్రహంగా భావిస్తున్నాం. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. –బులుసు వెంకటేశ్వర్లు, సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా నైతిక విలువలు నేర్పుతూ.. సత్యసాయి సేవా సంస్థలో బాలవికాస్ గురువుగా పనిచేస్తున్నాను. చిన్నారులకు ఆధ్యాత్మికత, నైతిక విలువలు నేర్పడం బాలవికాస్ ముఖ్య ఉద్దేశం. 35 ఏళ్లుగా సత్యసాయి సేవాసంస్థలో పనిచేస్తున్నాను. –ఆకెళ్ల సీతామహాలక్ష్మి, గురువు, బాలవికాస్, దంగేరు, కె.గంగవరం మండలం -
రేపు జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్‌లో 100 ట్రైనీ కెమిస్ట్ పోస్టులకు, అపోలో ఫార్మసీలో 50 ఫార్మా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని వివరించారు. పదో తరగతి, ఆపైన ఉత్తీర్ణులైన విద్యార్థులు దీనికి హాజరు కావచ్చన్నారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు. అతిథి అధ్యాపకులకు ఇంటర్వ్యూలుబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 18, 19 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీన సంస్కృతం, ఇంగ్లిష్, స్టాటిస్టిక్స్, చరిత్ర; 19వ తేదీన కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, మేనేజ్మెంట్, పీజీ ఫిజికల్ కెమిస్ట్రీ, పీజీ అనలటికల్ కెమిస్ట్రీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. పీజీలో 55 శాతం ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా సెట్ పాసైన వారు అర్హులని, వివరాలకు 96520 23082 నంబరులో సంప్రదించాలని కోరారు. గుళ్లపల్లికి ఘనసమ్రాట్ బిరుదు ప్రదానం రాజమహేంద్రవరం రూరల్: వేదవిద్యా పరిరక్షణకు, వేదవిద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేస్తున్న శ్రీ దత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠిని పలువురు వక్తలు కొనియాడారు. సీతారామచంద్ర ఘనపాఠి దంపతులను ఆయన షష్టి పూర్తి సందర్భంగా గురుకులంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి మాట్లాడుతూ, ఎందరో ఘనపాఠులను తయారు చేయడమే కాకుండా, ఇటీవలి కాలంలో సంపూర్ణ ఘన పారాయణ నిర్వహించిన ఖ్యాతి గుళ్లపల్లికి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘ఘనసమ్రాట్’ బిరుదు ప్రదానం చేశారు. కాకినాడకు చెందిన ఉప్పులూరి గణపతిశాస్త్రి వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో సాంగవేదార్థ రత్నాకర, రాచకొండ తెన్నేటి వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యాన ‘వేదధర్మ మహా యశస్వి బిరుదులతో సత్కరించారు. తనకు జరిగిన సత్కారాలకు సీతారామచంద్ర ఘనపాఠి కృతజ్ఞతలు తెలిపారు. వేద పరిరక్షణతోనే సర్వజగద్రక్షణ జరుగుతుందని, యావత్తు విశ్వానికి వేదం సుఖశాంతులు ప్రసాదించగలదని అన్నారు. కార్యక్రమంలో గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి, గురుకులం కార్యదర్శి, భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, నగర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, పలువురు వేదశాస్త్ర విద్వాంసులు పాల్గొన్నారు. -
అన్నవరం.. భక్తజన సాగరం
ఇక్కట్లు షరా మామూలే ● రత్నగిరిపై భక్తులకు ఆదివారం కూడా ఇబ్బందులు తప్పలేదు. సత్యదేవుని దర్శనానికి సుమారు 4 గంటల పాటు క్యూలో నిలబడి ఉండాల్సి వచ్చింది. దీంతో స్వామివారి ఆలయానికి వచ్చే సమయానికి అందరూ నీరసబడిపోయారు. ● భక్తుల లగేజీకి లాకర్లు చాలకపోవడంతో విశ్రాంతి షెడ్డులోనే ఉంచి, వాటికి భక్తులు కాపలా ఉన్నారు. ● సత్యదేవుని దర్శనానంతరం భక్తులు వెలుపలకు వచ్చేందుకు ఒకే ఒక్క మార్గం ఉంచారు. 2023లో చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్నప్పుడు అగరువత్తులు విక్రయించే షాపు పక్క నుంచి 10 అడుగుల వెడల్పున మాత్రమే మెట్లు నిర్మించారు. అప్పట్లో ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదు. వేలాది మంది భక్తులు ఈ మెట్ల మీద నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తూండటంతో తోపులాట జరుగుతోంది. ఈ మెట్ల దారిని మరింత వెడల్పు చేయడమో లేక తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్ల నుంచి భక్తులు దిగువకు వెళ్లేలా అనుమతించడమో చేయడం మేలు. ● పశ్చిమ రాజగోపురం పక్కన ఉన్న గేటును మూసివేసి అటువైపు నుంచి భక్తుల రాకపోకలకు అనుమతించడం లేదు. దీని ద్వారా దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులతో ఉన్న మహిళలను అనుమతించాలి. ● రూ.300 వ్రత మండపాలు ఆరు ఉన్నాయి. ఒక మండపం నిండాక మరో దానిలోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే ఏ మండపంలోకి అనుమతిస్తారో తెలియక భక్తులు అన్ని మండపాల వద్దకూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. కొన్ని మండపాల్లో వ్రతాలు జరుగుతున్నా అక్కడే క్యూలో ఉండిపోయారు తప్ప మరో మండపం వద్దకు వెళ్లలేకపోయారు. కనీసం పశ్చిమ రాజగోపురం లోపల ఏ వ్రత మండపం వద్దకు వెళ్లాలో మైకు ద్వారా ప్రకటించినా ఈ ఇబ్బంది తప్పేది. ● సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో చిన్న పిల్లలకు పాలిచ్చేందుకు ఎక్కడా మిల్క్ ఫీడింగ్ క్యాబిన్లు లేకపోవడంతో తల్లులు ఇబ్బందులు పడ్డారు. ● దేవస్థానం బస్సులతో పాటు దాతలు సమకూర్చినవి కలిపి మొత్తం 16 బస్సులను రత్నగిరి, సత్యగిరి, రైల్వే స్టేషన్ల మధ్య నడిపారు. ఐదు నిమిషాలకో బస్సు నడిపినా చాలకపోవడంతో భక్తులు ఆటోలను ఆశ్రయించారు. ● సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు ● వరుసగా రెండో రోజూ లక్ష మందికి పైగా రాక ● 10,523 వ్రతాల నిర్వహణ అన్నవరం: పవిత్ర కార్తిక మాసం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో సత్యదేవుని ఆలయానికి భక్తులు లక్షలాదిగా పోటెత్తుతున్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం 1.20 లక్షల మంది భక్తులు రత్నగిరికి వచ్చిన విషయం తెలిసిందే. అదే ఒరవడిలో ఆదివారం కూడా లక్ష మందికి పైగా భక్తులు రావడంతో అన్నవరం భక్తజనసాగరాన్ని తలపించింది. శనివారం రాత్రి నుంచే రత్నగిరికి భక్తజన ప్రవాహం మొదలైంది. ఇసుకేస్తే రాలని రీతిలో వేలాది వాహనాల్లో వెల్లువెత్తిన భక్తులతో ఆదివారం సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సత్యగిరిపై హరిహర సదన్ ముందు పార్కింగ్ స్థలం, సత్యగిరి రోడ్లు, మల్టీ లెవెల్ పార్కింగ్ స్థలాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తూర్పు రాజగోపురం నుంచి పశ్చిమ రాజగోపురం వరకూ క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణం భక్తులత నిండిపోయింది. ఒక దశలో భక్తులు నడవడానికి ఏమాత్రం వీలు లేని పరిస్థితి ఏర్పడింది. వ్రత, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ అంతరాలయ, యంత్రాలయ దర్శనాలను నిలిపివేశారు. వేకువజామున 2 గంటల నుంచే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా, ఆలయ ప్రాంగణంలో, ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన ర్యాకులలో భక్తులు దీపారాధనలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఉదయం నుంచీ ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈఓ వీర్ల సుబ్బారావు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం వద్ద కొంతసేపు క్యూ లైన్లలో భక్తులను నడిపించారు. సిబ్బందికి సూచనలిచ్చారు. సుమారు 20 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం, చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేశారు. 1,25,600కు చేరిన వ్రతాలు సత్యదేవుని వ్రతాలు ఆదివారం 10,523 జరిగాయి. శనివారం జరిగిన 11,650 వాటితో కూడా కలిపితే ఈ రెండు రోజుల్లోనే 22,173 వ్రతాలు జరిగినట్లయింది. గత ఏడాది కార్తికంలో ఇదే సమయానికి 1,29,636 వ్రతాలు జరగగా.. ఈ కార్తికంలో ఇప్పటి వరకూ 1,25,600 జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 4 వేల వ్రతాలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. గత ఏడాది కార్తిక మాసం మొత్తం 1.47 లక్షల వ్రతాలు జరిగాయి. దీనిని అధిగమించాలంటే కార్తికంలో మిగిలిన నాలుగు రోజుల్లో మరో 22 వేల వ్రతాలు జరగాల్సి ఉంటుంది. సోమవారం కూడా కనీసం 10 వేల వ్రతాలు జరిగితే ఆ సంఖ్యను అధిగమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రూ.1.10 కోట్ల ఆదాయం ఆదివారం వచ్చిన భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.1.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో వ్రతాల ద్వారానే సుమారు రూ.65 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ఇతర విభాగాల ద్వారా రూ.15 లక్షలు వచ్చింది. నేడు కూడా రద్దీ కార్తిక మాసంలో చివరి సోమవారం కావడంతో సత్యదేవుని సన్నిధికి నేడు కూడా సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాత మూడు రోజులూ పెద్దగా రద్దీ ఉండదు. ఈ ఒక్క రోజు సాఫీగా గడచిపోతే చాలని అధికారులు, సిబ్బంది కోరుకుంటున్నారు. ఇప్పటికే సత్రాల్లోని గదులను సిఫారసు లేఖలతో ప్రముఖుల బంధువులు తీసేసుకున్నారు. మిగిలిన గదులను దళారులు చేజిక్కించుకున్నారు. సామాన్య భక్తులకు కనీసం 20 శాతం గదులు కూడా లభించే అవకాశం లేదు. భక్తులు గదుల కోసం చూడకుండా డార్మెట్రీలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
రమణీయం.. నారసింహుని కల్యాణం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో ఆదివారం ఆర్జిత సేవగా స్వామివారి శాంతి కల్యాణం బహుళ ద్వాదశి తిథి నాడు అర్చకులు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయ కల్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం ప్రారంభించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు ఈ కల్యాణాన్ని రమణీయంగా జరిపారు. పాల్గొన్న భక్తులకు స్వామి మూలవిరాట్ దర్శన భాగ్యాన్ని దేవస్థానం కల్పించింది. అలాగే లడ్డూ ప్రసాదం ఇచ్చి, అన్నదాన పథకంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ పి.విజయ సారఽథి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఆలయంలో నిర్వహించిన శ్రీ నారసింహ సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకుడు రామకృష్ణమాచార్యులు వేదమంత్రాలతో హోమం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
యంత్ర సేవపై కుతంత్రం
● వ్యవసాయ యంత్రాల రాయితీకి మంగళం ● రెండేళ్లుగా ఒక్క పరికరమూ ఇవ్వని చంద్రబాబు సర్కారు ● పెరిగిన కూలి రేట్లు ● యంత్రాలు దొరక్క రైతులకు ఇక్కట్లు ● అధిక రేట్లకు ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు తెచ్చుకుంటూ అవస్థలు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు ఆధునిక యంత్రాల సాయంతో పంటలు పండించాలని చెబుతూనే.. యంత్ర రాయితీ పథకానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడింది. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 50 శాతం రాయితీపై వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2 లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరు 2.12 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వీరికి విత్తు నుంచి కోతల వరకూ వివిధ దశల్లో ఉపయోగపడే యంత్ర పరికరాలను యంత్ర సేవా పథకం ద్వారా ప్రభుత్వం అందజేయాలి. దుక్కులు, దమ్ములు చేసుకునేందుకు ట్రాక్టర్లు, డ్రమ్ సీడర్లు, వరి కోత యంత్రాలతో పాటు ఇతర పరికరాలను ఈ పథకంలో ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఒక్క రైతుకు కూడా రాయితీ పరికరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కూడా ముగిసింది. కానీ, ఇప్పటి వరకూ రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు, వరి కోత యంత్రాలు, మినీ ట్రాక్టర్లలో ఏ ఒక్కటీ మంజూరు చేయలేదు. అసలు ఆ ఊసే తేవడం లేదు. యంత్ర సేవా పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుంది. అయినప్పటికీ అవి ఏమయ్యాయో.. రైతులకు పరికరాలు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది. అద్దెకు తెచ్చుకుంటూ.. ప్రతి గ్రామంలో సుమారు 2 వేల నుంచి 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఓవైపు కూలి రేట్లు అధికంగా ఉంటున్నాయి. మరోవైపు ఆయా గ్రామాల్లో సీజన్లో వ్యవసాయ యంత్ర పరికరాలు దొరకని పరిస్థితి. దీంతో, రైతులు గత్యంతరం లేక ఇతర ప్రాంతాల నుంచి ఆయా యంత్రాలను అధిక రేట్లకు అద్దెకు తెచ్చుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని రైతులు ఒడిశా, బిహార్, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వరి కోత యంత్రాలను అద్దెకు తెచ్చుకోవాల్సి వస్తోంది. గత రబీ కోతల సమయంలో భారీ వర్ష సూచనలు రావడంతో రైతులు హడావుడి పడ్డారు. ఇదే అదనుగా పలువురు దళారులు వరి కోత యంత్రాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అద్దెల పేరిట దండిగా గుంజారు. అప్పట్లో ఎకరం వరి కోతకు ఏకంగా రూ.3,500 వసూలు చేశారు. అవే వరి కోత యంత్రాలు స్థానికంగా అందుబాటులో ఉంటే రూ.2,500 మాత్రమే అద్దె ఉండేది. వర్ష సూచనల నేపథ్యంలో రైతులు మరో దారి లేక వరి కోత యంత్రానికి ఎక్కువ రేటు చెల్లించుకోవాల్సి వచ్చింది. టార్పాలిన్లకు సైతం.. కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం ఆరబోసుకొనేందుకు రైతులకు టార్పాలిన్ అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు కావాల్సిన టార్పాలిన్లను 50 శాతం రాయితీపై అందించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సైతం ఇవ్వలేదు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు సుమారు 10 రోజుల పాటు ధాన్యం ఎండబెట్టాల్సి వచ్చింది. ఎకరం పొలంలో ధాన్యం ఎండపోసేందుకు ఐదారు టార్పాలిన్లు అవసరం. ఈవిధంగా రైతులు ఒక్కో టార్పాలిన్‌ను రోజుకు రూ.50 చొప్పున అద్దెకు తెచ్చుకున్నారు. కొందరు రైతులు 20 రోజుల వరకూ ధాన్యం తరలించపోవడంతో అన్ని రోజులకూ అద్దె చెల్లించాల్సి వచ్చింది. అదే ప్రభుత్వం రాయితీపై ఇస్తే ఆ టార్పాలిన్లు రైతులకు రెండు మూడేళ్ల పాటు ఉపయోగపడేవి. వారికి అద్దె బాధ కూడా తప్పేది. చంద్రబాబు ప్రభుత్వం స్ప్రేయర్లు సైతం ఇవ్వకపోవడంతో రైతులు గత ఖరీఫ్, రబీ సీజన్లలో వాటిని అద్దెకు తెచ్చుకొనే పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సి వచ్చింది. కూలీల కొరత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత అధికంగా ఉంది. ఆయకట్టుకు తగిన విధంగా కూలీలు దొరకడం లేదు. గతంలో వేరే ప్రాంతాల నుంచి కూలీలు వలస వచ్చి వరి నాట్లు, కలుపుతీత, కోతల వంటి పనులు చేసేవారు. దీంతో, కూలీల కొరత కొంత మేర తగ్గేది. ప్రస్తుతం వలస కూలీలు అస్సలు రావడం లేదు. దీంతో, స్థానిక కూలీలతో పనులు చేయించడం రైతులకు కష్టసాధ్యమైపోయింది. పైగా, ఎకరం వరి కోత కోయాలంటే ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.6 వేల వరకూ కూలి చెల్లించాలి. కుప్ప నూర్పిడికి ట్రాక్టర్, కూలీలకు మరో రూ.6 వేలు అవుతుంది. అదే, వరి కోత యంత్రం అందుబాటులో ఉంటే రూ.3,500 ఈ పనులైపోతాయి. ధాన్యం ఆరబోతకు టార్పాలిన్లు, ఒకరిద్దరు కూలీలకు మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఇలా చూసుకున్నా రైతుకు రూ.6 వేలు మిగులుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పరికరాలు వెంటనే అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతులకు, రైతు సేవా సంఘాలకు యంత్ర సేవా పథకం కింద రాయితీపై పరికరాలు అందించేవారు. గత ప్రభుత్వ హయాంలో 2,431 మంది రైతులకు, 150 రైతు సేవా సంఘాలకు రూ.27.52 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందజేశారు. గ్రామాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలను తక్కువ రేట్లకే అద్దెకు ఇచ్చేవారు. ఈ విధానానికి కూడా చంద్రబాబు సర్కారు స్వస్తి పలికింది. దీంతో, దళారుల వద్ద రైతులు యంత్ర పరికరాలు తెచ్చుకుని అధిక మొత్తంలో అద్దెలు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.ఈ పథకం పునరుద్ధరించాలి ఖరీఫ్, రబీ సీజన్లలో యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేవు. బయటి నుంచి వచ్చే వరి కోత యంత్రాలపై ఆధారపడి కోతలు కోయడం వల్ల ఎకరాకు రూ.2 వేలు వరకూ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం యంత్రాలు ఇస్తే తీసుకొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వరి కోతలు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కోత యంత్రాలు పూర్తి స్థాయిలో దొరకడం లేదు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యంత్ర సేవా పథకాన్ని వెంటనే పునరుద్ధరించి, పరికరాలు మంజూరు చేయాలి. – అడబాల గోవిందు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం -
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తిక బహుళ ఏకాదశి పర్వదినం కూడా కలిసి రావడంతో ఆలయానికి వేలాదిగా పోటెత్తారు. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ సేవల ద్వారా దేవస్థానానికి రూ.60,26,448 ఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. అప్పనపల్లిలో భక్తుల రద్దీ మామిడికుదురు: కార్తిక బహుళ ఏకాదశి శనివారం సందర్భంగా అప్పనపల్లిలోని బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారి ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. పాత ఆలయంలో అభిషేకాలు చేయించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.6,63,405 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారిని 8 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, 5,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.2,28,539 విరాళాలుగా అందించారని వివరించారు. -
తొలి తిరుపతి..
భక్తజన పెన్నిధిపెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి బహుళ ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచీ అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 22 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,26,230, అన్నదాన విరాళాలు రూ.1,25,747, కేశఖండన ద్వారా రూ.5,280, తులాభారం ద్వారా రూ.500, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.26,685, స్వామి వారి కానుకలు రూ.221 కలిపి మొత్తం రూ.3,84,663 ఆదాయం వచ్చిందని వివరించారు. 4,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. -
రత్నగిరి..జనసంద్రం
● సత్యదేవుని దర్శనానికి లక్ష మందికి పైగా రాక ● రికార్డు స్థాయిలో 11,650 వ్రతాల నిర్వహణ ● రూ.1.20 కోట్ల ఆదాయం అన్నవరం: కార్తిక బహుళ ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం రత్నగిరి భక్తజనసంద్రమే అయ్యింది. సత్యదేవుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకూ ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు వచ్చారు. సాధారణంగా స్వామివారి ఆలయానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భక్తులు వస్తారు. సత్యదేవుని దర్శనానంతరం స్వస్థలాలకు వెళ్తారు. అయితే, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెళ్లేవారు వెళ్తూంటే.. వచ్చేవారు వస్తూనే ఉన్నారు. ఈ కార్తిక మాసంలో పౌర్ణమి నాడు సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శించగా ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ 1.20 లక్షల మంది తరలివచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని, స్వామివారి ఆలయాన్ని శనివారం వేకువజామునే తెరచి, పూజలు చేశారు. అనంతరం వ్రతాలు ప్రారంభించారు. అప్పటి నుంచే సత్యదేవుని దర్శనాలకు కూడా భక్తులను అనుమతించారు. రద్దీ కారణంగా అంతరాలయ, యంత్రాలయ దర్శనాలు నిలిపివేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.1.20 కోట్ల ఆదాయం సమకూరింది. వ్రతాల ద్వారా రూ.65 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.40 లక్షలు, మిగిలిన విభాగాల ద్వారా రూ.15 లక్షలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. సుమారు 20 వేల మందికి పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. ఆలయం, వ్రత మండపాల్లో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ పర్యవేక్షించారు. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు తప్పని ఇక్కట్లు ● దేవస్థానం అధికారులు అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ వెల్లువలా తరలి వచ్చిన భక్తులకు అవి సరిపోక ఇక్కట్లు పడ్డారు. ● కొండ దిగువ నుంచి రత్నగిరికి, కొండ పైనుంచి దిగువకు తగినన్ని బస్సులు లేక గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ● మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండ దిగువ నుంచి రత్నగిరికి తగినన్ని బస్సులు లేకపోవడంతో పలువురు ఆటోలను ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుంచి ఆటోకు రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేశారు. ● రూ.1,500, రూ.2 వేల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు వ్రతాల నిర్వహణకు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. రూ.1,500 వ్రతాలు అనివేటి మండపంలో (ధ్వజస్తంభం వద్ద) మాత్రమే చేస్తారు. అక్కడ రెండు బ్యాచ్‌లలో ఏకకాలంలో 200కు మించి వ్రతాలాచరించే వీలు లేదు. ఈ నేపథ్యంలో వీరి కోసం స్వామివారి ఆలయం వెనుక, ఉత్తరం వైపున షామియానాలతో తాత్కాలికంగా రెండు మండపాలు ఏర్పాటు చేసినా, వాటిలో వ్రతాలకు భక్తులు మొగ్గు చూపలేదు. ● రూ.2 వేల వ్రత మండపాలు కూడా చాలక భక్తులు ఇబ్బంది పడ్డారు. వ్రతాల టిక్కెట్లతో గంటల తరబడి వేచియుండాల్సి వచ్చింది. ● క్యూలో గంటల తరబడి నిలబడాల్సి రావడంతో చిన్న పిల్లలతో వచ్చిన వారి వేదన వర్ణనాతీతం. చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కానీ, ఎవ్వరికీ ఒక్క బిస్కె ట్ ప్యాకెట్, పాలు పంపిణీ చేసిన దాఖలాల్లేవు. ● సత్యదేవుని దర్శనానికి భక్తులు సుమారు 3 గంటల పాటు క్యూలో నిలుచున్నారు. అయితే, కంపార్టుమెంట్లలో అది కూడా క్యూ చివరిలో ఉన్నవారికి మాత్రమే మంచినీరు సరఫరా చేశారు. ఫలహారాలు, మజ్జిగ పంపిణీ వంటి వాటి ఊసే లేదు. ● టాయిలెట్ల నిర్వహణ అత్యంత దారుణంగా ఉంది. దేవస్థానంలో శానిటరీ నిర్వహణ కాంట్రాక్టు పొందిన పద్మావతి సంస్థ ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించకపోవడం, ఉన్న సిబ్బందికి అంత అనుభవం లేకపోవడమే దీనికి కారణం. ● లారస్ ఫార్మా నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సగ భాగాన్ని దేవస్థానం కౌంటర్లు ఆక్రమించడంతో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి పెద్దగా స్థలం లేకుండా పోయింది. ● గతంలో ఈఓలుగా పని చేసిన ప్రస్తుత కమిషనర్ కె.రామచంద్ర మోహన్, ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, వి.త్రినాథరావులు భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. సీసీ టీవీలు చూస్తూ వాకీటాకీల ద్వారా సిబ్బందికి సూచనలిచ్చేవారు. ప్రస్తుతం ఆ పని దేవస్థానం చైర్మన్ రోహిత్ చేస్తున్నారు. ఈఓ వీర్ల సుబ్బారావు తన కార్యాలయానికే పరిమితమవుతున్నారనే విమర్శ వస్తోంది.ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులుజోరుగా వ్రతాలు ఈ కార్తిక మాసంలో ఇప్పటి వరకూ ఈ నెల 5న పౌర్ణమి నాడు జరిగిన 9,248 వ్రతాలు మాత్రమే అత్యధికం. ఆ రికార్డును అధిగమిస్తూ శనివారం 11,650 వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాల్లో రూ.300 టిక్కెట్టువి 8,182, రూ.వెయ్యి వ్రతాలు 1,307, రూ.1,500 వ్రతాలు 969, రూ.2 వేల టిక్కెట్టు వ్రతాలు 969, ఆన్లైన్వి 436 ఉన్నాయి. వీటితో కలిపి కార్తికంలో ఇప్పటి వరకూ 1,15,086 వ్రతాలు జరిగాయి. గత ఏడాది కార్తికంలో ఇదే సమయానికి 1,25,544 వ్రతాలు జరగగా, ఈ ఏడాది ఇంకా 10,458 వ్రతాలు తక్కువగా ఉన్నాయి. -
దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏపీ రైతుకూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక యూటీఎఫ్ హోమ్‌లో శనివారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత బాలాజీ చెరువు సెంటర్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా సభాస్థలి వరకు కార్మికులు, కర్షకులు ప్రజా సంఘాల శ్రేణులు ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ సమాజంలో ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి పీడించే సాంఘిక ధర్మం కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచె అంజిబాబు, అధ్యక్షులు మడకి సత్యం, ఉపాధ్యక్షులు నారాయణమూర్తి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కె.గంగవరం: మండలంలోని యర్రపోతవరం – బాలాంతరం గ్రామాల మధ్య యానాం ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. బాలాంతరం గ్రామానికి చెందిన పంపన భాస్కరరావు (72), విత్తనాల శివ ప్రసాద్ యర్రపోతవరం నుంచి బాలాంతరం వెళుతున్నారు. వారిని ద్రాక్షారామ నుంచి యానాం వైపు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో భాస్కరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన శివప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
● వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ● అరెస్టు చేసిన పోలీసులు కాకినాడ క్రైం: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ ఆ వివరాలు వెల్లడించారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ పాత నేరస్తుడు. అదే ప్రాంతానికి చెందిన మోది కార్తిక్, కర్రి దుర్గాప్రసాద్, కర్రి నానితో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళాలు తెరవడంలో ఆరితేరిన ఈ బృందం ముందుగా కిటికీలు, చెప్పుల స్టాండ్లలో తాళం చెవి కోసం వెతుకుతారు. కనిపించకపోతే తలుపులు తెరిచి ఇళ్లు గుల్ల చేస్తారు. సుమారు ఏడాది కాలంగా నగరంలో ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. ఇలా కాకినాడ వన్ టౌన్, టూ టౌన్, పోర్టు, ఇంద్రపాలెం, కరప పోలీస్స్టేషన్ల పరిధిలో దోపిడీలకు పాల్పడ్డ ఈ ముఠా ఏడాది కాలంలో 331 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, కిలో వెండి సామగ్రిని దొంగిలించింది. సుమారు రూ.42.60 లక్షల విలువైన ఈ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తాము చోరీ చేసిన సొత్తును పర్లోవపేటకు చెందిన సుంకర అచ్యుత వరప్రసాద్, బండి హారిక, ఇంద్రపాలేనికి చెందిన కటకం పద్మరాజు అనే వ్యక్తులకు విక్రయించి ఆ సొత్తుతో జల్సాలు చేశారు. దొంగిలించిన నేరంలో నలుగురిలో ముగ్గురిని, కొన్న నేరంలో ముగ్గురిలో ఇద్దరిని మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. కర్రి దుర్గాప్రసాద్, కటకం పద్మరాజు పరారీలో ఉన్నారు. ఎస్డీపీవో దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో కాకినాడ క్రైం సీఐ వి.కృష్ణ, పోర్టు, రూరల్ సీఐలు సునీల్ కుమార్, చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో క్రైం బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించి కేసును ఛేదించాయని ఎస్పీ తెలిపారు. -
టూర్.. హుషార్
రాయవరం: చదువుతో పాటు ఆటపాటలు అవసరమని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఆటపాటలే కాదు, విహారయాత్రలు కూడా విద్యార్థులకు చాలా అవసరం. అవి బుద్ధి వికాసానికి, విజ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విహార యాత్రలకు ఈ ఏడాది కూడా విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. సమగ్ర శిక్షా ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.500 వంతున కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే పలు పాఠశాలలు తమ విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకుని వెళుతున్నాయి. అవగాహన తరగతి గదిలో నాలుగు గోడల మధ్య నేర్చుకునే అంశాలను ప్రత్యక్షంగా చూసి, అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతో సమగ్ర శిక్షా నిధులతో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులను విహార యాత్రలకు తీసుకువెళ్లేందుకు అనుమతినిచ్చారు. పాఠశాలలోని విద్యార్థుల్లో 8 శాతం మందికి నిధులు కేటాయించారు. నవంబర్ నెలాఖరులోపు ఈ విజ్ఞాన, విహార యాత్రలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 20తో సమ్మేటివ్–1 పరీక్షలు ముగుస్తున్నందున, ఆ తర్వాత నుంచీ విహార యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పరీక్షల అనంతరం విద్యార్థులకు ఆటవిడుపుగానూ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని పీఎంశ్రీ ఫేజ్–1, ఫేజ్–2కు చెందిన 77 పాఠశాలలను ఎక్స్పోజర్ విజిట్‌కు ఎంపిక చేశారు. వీటిలోని 8 శాతం మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇలా ఆ 77 పాఠశాలలకు చెందిన 4.280 మంది విద్యార్థులకు రూ.21.40 లక్షలు పాఠశాలల ఖాతాలకు విడుదల చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యాస్థాయి, ప్రతిభ, ఆసక్తి ఆధారంగా విహారయాత్రకు అవకాశం లభించనుంది. అలాగే విహారయాత్రకు తీసుకు వెళ్లాల్సిన ప్రాంతాలను రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రాంతాలివే విద్యార్థులను విహార యాత్రలకు తీసుకువెళ్లడానికి ఈ కింది తెలిపిన ప్రదేశాలను ఎంపిక చేశారు. కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరం రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, ఓఎన్జీసీ, తాళ్లరేవు మండలం కోరంగి మడ అడవులు, పెద్దాపురంలోని పాండవుల మెట్ట, అడ్డతీగల వద్ద ఉన్న మెడిటేషన్న ప్లాంట్స్, ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట. మార్గదర్శకాలు ● ముందస్తుగా మండల స్థాయి కమిటీని సంప్రదించి, వారితో చర్చించి విహారయాత్రకు తీసుకుని వెళ్లే తేదీని ఖరారు చేసుకోవాలి. సదరు విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా ఏపీసీకి తెలపాలి. ● విహార యాత్ర వాహనాల విషయంలో సాధ్యమైనంత వరకు ఆర్టీసీ సౌకర్యాలు వినియోగించుకోవాలి. ప్రథమ చికిత్సకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మాత్రమే విహారయాత్రకు విద్యార్థులను తీసుకు వెళ్లాలి. ● విద్యార్థులు, విద్యార్థినులకు తోడుగా పురుష, మహిళా ఉపాధ్యాయులను కూడా పంపించాలి. ప్రతి పది మంది విద్యార్థినులకు ఒక మహిళా టీచర్ తప్పనిసరిగా ఉండాలి. ● విద్యార్థులకు అందుబాటులో అన్ని వేళల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేసుకోవాలి. ● విహారయాత్ర పూర్తయిన వెంటనే అక్కడకు వెళ్లిన టీచర్లు, విద్యార్థుల వివరాలు, ఖర్చులు, ఫొటోల వివరాలతో డాక్యుమెంటేషన్‌ను డీఈవో/సమగ్ర శిక్షా కార్యాలయంలో సమర్పించాలి. మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతం రాజమహేంద్రవరంలోని రోడ్ కమ్ రైల్ వంతెన ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది విహార యాత్ర మధ్యలో విద్యార్థులు బస్సు దిగాల్సి వచ్చినప్పుడు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి. అందరూ బస్సు ఎక్కారా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే బస్సును ముందుకు కదపాలి. విహారయాత్రలో చూసిన విషయాలను ఒక పుస్తకంలో రాసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. నదులు, చెరువుల వద్ద ఈత కొట్టకుండా చూసుకోవాలి. పాఠశాల విద్యార్థులందరూ యూనిఫాంలో ఉంటే మంచిది. సెల్ఫీలు దిగేటప్పుడు పరిసరాలను తప్పనిసరిగా గమనించాలి. ఎక్స్పోజర్ విజిట్‌కు పచ్చజెండా ఈనెల చివరిలో విద్యార్థుల విహారయాత్రలు ఉమ్మడి జిల్లాలో 4,280 మందికి రూ.21.40 లక్షల విడుదల -
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయంలో ప్రారంభమవుతుంది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు శనివారం ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి ఈ సమావేశం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమ శాఖకు సంబంధించి ప్రగతి నివేదికలతో హాజరు కావాలన్నారు. బాలిక అదృశ్యం రంగంపేట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శివప్రసాద్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వడిశలేరు గ్రామానికి చెందిన కొల్లం వెంకట రమణ పెద్ద కుమార్తె శ్రీవల్లి (17) శుక్రవారం ఉదయం బ్యాంకు పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతికారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు రంగంపేట ఎస్సై 94409 04854, అనపర్తి సీఐ 94407 86538లకు సమాచారం ఇవ్వాలని కోరారు. డిగ్రీ విద్యార్థిని.. అమలాపురం టౌన్: అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని గుబ్బల జ్యోత్స్న అదృశ్యమైంది. ఆమె అమలాపురంలోని వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో చదువుతోంది. శనివారం ఉదయం ఇంటి నుంచి కాలేజీకి అమలాపురం బయలుదేరింది. అయితే కాలేజీకి రాలేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో తండ్రి అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎన్ఆర్ కిశోర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సీఐ పి.వీరబాబు 94407 96561, ఎస్సై కిశోర్ బాబు 81435 79127కు తెలియజేయాలన్నారు. -
భీమేశ్వరస్వామికి ఫ్రాన్స్ రాయబారి పూజలు
రామచంద్రపురం రూరల్: భారతదేశంలో ఫ్రాన్స్ అంబాసిడర్ (ఫాన్స్ రాయబారి) థాయర్ మాఽథ్యూ కుటుంబ సమేతంగా శనివారం ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామిని దర్శించుకున్నా రు. వారికి ఆలయ ఈఓ, దేవదాయశాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వరస్వామిని, మాణిక్యాంబా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బేడా మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈఓ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు. -
చెరువులపై అక్రమార్కుల కన్ను
● దర్జాగా కబ్జా చేస్తున్న వైనం ● అనుమతులు లేకుండా పూడ్చివేత పనులు ● గ్రామాలకు తాయిలాల పేరుతో ఆక్రమణ తాళ్లరేవు: పంచాయతీ చెరువులపై అక్రమార్కుల చూపు పడింది. గ్రామాల్లోని చిన్నాచితకా చెరువులను దర్జాగా కబ్జా చేసి పూడ్చివేస్తున్నారు. గ్రామాలకు చిన్న తాయిలాలు ఎరచూపి రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమించి ఆనక సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చిన చెరువులు నేడు నిరుపయోగంగా మారడంతో వాటిపై అక్రమార్కులు కన్నేశారు. కొందరు నాయకుల అండదండలతో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న గ్రామ పంచాయతీ చెరువులు, గ్రామ కంఠం భూములు కనుమరుగవుతున్నాయి. ఇలా వెలుగులోకి.. కోరంగి పంచాయతీ పరిధి దిండి గ్రామంలో ఒక మంచినీటి చెరువును కొందరు అక్రమార్కులు పూడ్చివేస్తుండడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి వీజేవీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణ వెలుగు చూసింది. దిండి గ్రామంలోని సర్వే నెంబరు 298లో 0.64 సెంట్ల భూమిలో పంచాయతీ చెరువు ఉంది. గతంతో దీని నీటినే గ్రామస్తులు తాగేవారు. ఎన్నో ఏళ్లుగా ఈ చెరువులో ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు తవ్వకం, సంరక్షణ చర్యలు చేపట్టేవారు. అయితే ఆ చెరువును కొందరు అక్రమార్కులు జేసీబీల సాయంతో పూడ్చివేస్తుండడంతో పంచాయతీ కార్యదర్శి అడ్డుకున్నారు. అయితే ఆ భూమిని ఎవరు కొన్నారు, ఎవరి వద్ద కొన్నారు, ఎవరు కప్పెడుతున్నారు అనే వివరాలను వెల్లడించకపోవడం, పంచాయతీ అనుమతులు తీసుకోకుండా దౌర్జన్యంగా చెరువు పూడ్చివేస్తున్నారని కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువు పూడ్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరికొన్ని.. సుంకరపాలెం గ్రామ పంచాయతీలో యానాం – ద్రాక్షారామ రహదారి చెంతన ఉన్న సుమారు రెండు ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. మిగిలిన సుమారు 60 సెంట్లకు పైగా ఉన్న భూమిని సైతం పలువురు పూడ్చివేయడం గతంలో చర్చనీయాంశమైంది. దీనిపై కొందరు సామాజిక కార్యకర్తలు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అది కూడా తాత్కాలికంగా ఆగింది. అయితే కొందరు బడా నాయకులు గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామంటూ, గ్రామ పెద్దలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని చెబుతుండడంతో ఆక్రమణల పర్వం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఉన్న పంచాయతీ చెరువులను పూడ్చివేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరంగి పంచాయతీలోని దిండిలోని పురాతన మంచినీటి చెరువు పూడ్చివేత పనులు సుంకరపాలెం పంచాయతీలో గ్రామ చెరువును పూడ్చి వేస్తున్న వైనం -
గంటలకొద్దీ జాప్యం.. ప్రయాణికులకు శాపం
● తీవ్ర ఆలస్యమైన కాకినాడ నాన్‌స్టాప్ బస్సులు ● జనానికి అవస్థలు రాజమహేంద్రవరం సిటీ: కాకినాడ నాన్‌స్టాప్ బస్సులు సుమారు మూడు గంటల పాటు రాకపోవడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య ప్రతి 15 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ బస్సు తిరగాలి. అయితే, శనివారం సాయంత్రం ఏకంగా మూడు గంటల పాటు నాన్‌స్టాప్ బస్సులు రాలేదు. రాత్రి 7 గంటల వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో, రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాకినాడ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడి తీవ్ర అవస్థలకు గురయ్యారు. గంటల తరబడి నాన్‌స్టాప్ బస్సులు రానప్పటికీ ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల రాకపోకలపై అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య నిత్యం వందలాది మంది ప్రయాణిస్తూంటారని, వారికి ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సుల రాకలో జాప్యం జరిగితే, వెంటనే ప్రత్యామ్నాయంగా బస్సులు ఏర్పాటు చేసి, తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సామర్లకోట వద్ద వంతెన నిర్మాణ పనుల కారణంగా కాకినాడ నాన్‌స్టాప్ బస్సుల రాకలో జాప్యం జరిగిందని ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ మాధవ్ చెప్పారు. అలాగే కాకినాడ డిపోలో కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే నాన్‌స్టాప్ బస్సులు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకూ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
చిట్టిబుర్రలపై.. పెను భారం
ఈ విధానమే సరికాదు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పరీక్ష విధానమే సరి కాదు. 1, 2 తరగతులకు రెండుసార్లు జవాబులు రాయాలనడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉపాధ్యాయులే సమాధానం చెప్పి రాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, విద్యార్థులు చదువుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మార్పు తీసుకురావాలి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్ష విధానంలో మార్పులు రావాలి. ఒక సిలబస్‌నే రెండుసార్లు ఇవ్వడంతో ప్రయోజనం ఉండదు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది సరైన విధానం కాదు – మోర్త శ్రీనివాసరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నారులపై భారం తగదు చిన్నారులపై ఈ విధమైన పరీక్షల భారం తగదు. తద్వారా వారిలో పరీక్షలంటే భయం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి పరీక్షల విధానంపై పునరాలోచన చేయాలి. స్కూల్ స్థాయి పరీక్షల ఽవిధానంలో మార్పు రావాలి. – వాకాడ వెంకట రమణ, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ ఉత్తీర్ణత తగ్గుతుంది ఈ విధమైన పరీక్షలతో విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష విధానంపై సరైన నిర్ణయం తీసుకోవాలి. సమయమంతా దీనికే సరిపోతే ఇక బోధన ఏవిధంగా చేయాలి? – కె.కాశీ విశ్వనాథ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆడుతూ పాడుతూ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సు. గురువుల వద్ద అక్షరాలు దిద్ది. పుస్తకాలు చదవడం నేర్చుకుని.. చిన్నచిన్న ప్రశ్నలకు తెలిసీ తెలియని జవాబులు చెప్పే అమాయకత్వం. ఆ క్రమంలోనే చిన్నచిన్న పరీక్షలు రాసే సమర్థత పెంచుకునే ప్రయత్నం.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే ప్రతి చిన్నారి పరిస్థితీ దాదాపు ఇదే. అటువంటి చిట్టి బుర్రలపై చంద్రబాబు ప్రభుత్వం చదువుల పేరుతో పెద్ద భారమే మోపుతోంది. పాతిక మార్కుల పరీక్ష అంటేనే ఏమిటో అర్థం కాని వయస్సులో ఉన్న ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఏకంగా 100 మార్కులకు పరీక్ష పెడుతోంది. పసి మనసులపై ఒత్తిడి పెంచేలా ఇటువంటి పరీక్షలు నిర్వహించడం మునుపెన్నడూ చూడలేదని, ఇదెక్కడి విడ్డూరమని ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతోందంటే.. చదువులు, ర్యాంకుల పేరుతో ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురి చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ కోవలోకి ప్రభుత్వ స్కూళ్లు కూడా వచ్చి చేరాయి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ఎస్ఏ పరీక్షలు నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.8 లక్షల మందికి పైగా విద్యార్థులుండగా.. వీరిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ 85 వేల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాయాలి. వీరందరికీ ఒకే ప్రశ్న పత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ముద్రించిన ప్రశ్నపత్రంతోనే పరీక్షలు జరుపుతూండగా.. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం సొంతంగా ముద్రించి నిర్వహిస్తున్నాయి. పరీక్షలు ఇలా.. ● 1, 2 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్.. 3, 4, 5 తరగతుల వారికి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షలు ఉంటాయి. అదే 6 నుంచి పదో తరగతి వరకూ సబ్జెక్టుల వారీగా నిర్వహిస్తారు. ● ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులుకు గతంలో 50 మార్కులకు మాత్రమే ఎస్ఏ పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు దీనిని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఏకంగా 100 మార్కులకు పెంచేసింది. ఇందులో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌కు మరో 20 మార్కులు ఉంటాయని ప్రకటించారు. ఇంటర్నల్ మార్కులు ఏవిధంగా ఇస్తారనేది ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. రాత పరీక్షలో ప్రశ్నలు తమకు సైతం అర్థం కాని రీతిలో ఇస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. ● దీనికి తోడు మునుపెన్నడూ చూడని రీతిలో ఆన్సర్ షీటుతో పాటు వర్క్ బుక్‌లో సైతం జవాబులు రాయాలని ఆదేశించారు. దీంతో, ఏమీ తెలియని చిన్నారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ● 1, 2 తరగతుల వారికి 8 పేజీలు.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏకంగా 15 పేజీలు కేటాయించారు. 20 ప్రశ్నలకు సంబంధించిన జవాబులను ఆన్సర్ షీటులోను, 13 ప్రశ్నల సమాధానాలను వర్క్బుక్లోను రాయాల్సి ఉంది. ● పరీక్ష సమయం 2.30 గంటలు ఇచ్చారు. అయితే, ఆ సమయంలో జవాబులు రెండు షీట్లలో ఏవిధంగా రాయాలో అర్థం కాక చిన్నారులు సతమతమవుతున్నారు. రెండు పేపర్లు రాసేందుకు నాలుగైదు గంటల సమయం పడుతోందని చెప్తున్నారు. ఈ ప్రశ్న పత్రం ప్రకారం మెజార్టీ విద్యార్థులు ఫెయిలయ్యే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులే విద్యార్థులకు సమాధానాలు చెప్పి రాయిస్తున్నారని తెలుస్తోంది. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనానికే సమయం సరిపోతోందని, బోధన ఇంకెప్పుడు చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అసలీ వ్యవహారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులకు తెలిసే జరుగుతోందా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఆగ్రహం ఇది 1, 2 తరగతుల విద్యార్థుల ప్రశ్నపత్రంలా లేదని.. ఎంఏ చదివే వారికి ఇచ్చిన తరహాలో ఉందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. దీని ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను ఏ విధంగా పరీక్షించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్‌తో సంబంధం లేదని, శాసీ్త్రయంగా కూడా లేదని చెబుతున్నారు. ఎస్ఏ, ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) ప్రశ్నపత్రాల రూపకల్పనలో తమ అభిప్రాయాలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 1, 2, 3 తరగతుల విద్యార్థులకు 100 మార్కులకు ఎస్ఏ నిర్వహణ 80 మార్కులకు ప్రశ్నపత్రం ఇంటర్నల్‌కు మరో 20 ఆన్సర్ షీట్‌తో పాటు వర్క్‌బుక్‌లోనూ జవాబులు రాయాల్సిందే.. రెండున్నర గంటలే సమయం ఇదెక్కడి విడ్డూరమంటున్న టీచర్లు, తల్లిదండ్రులు -
అక్రమాల గుట్టలు
కాకరపర్రు స్టాక్ పాయింట్ వద్ద లారీలోకి పొక్లెయిన్‌తో ఇసుక లోడింగ్ సాక్షి, రాజమహేంద్రవరం: ఇసుక మాఫియా బరి తెగిస్తోంది. కూటమి నేతల అండదండలతో అనధికార ధరల దందాకు తెర లేపింది. ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే అధిక ధరలకు ఇష్టారాజ్యంగా అమ్ముతూ.. కొనుగోలుదార్లను నిలువుదోపిడీ చేస్తూ రూ.లక్షలు దండుకుంటోంది. నిడదవోలు నియోజకవర్గంలో నిబంధనలను ఇసుకలో తొక్కేస్తోంది. కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ దందాకు అడ్డాగా.. ఇసుక అక్రమ దందాకు నిడదవోలు నియోజకవర్గం అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గంలో 7 ఇసుక ర్యాంపులున్నాయి. వీటి నుంచి తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడే దందా మొదలవుతోంది. గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ఇసుక అందుబాటులో ఉంచాలనే తలంపుతో గతంలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీనిని ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లు, పాటదారులు అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ధరలను కాదని తమకు ఇష్టమొచ్చిన రేటుకు ఇసుక విక్రయిస్తున్నారు. వారు చెప్పిందే రేటు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం స్టాక్ పాయింట్లను బట్టి టన్ను ఇసుకను రూ.145 నుంచి రూ.160కి విక్రయించాలి. దీని ప్రకారం 20 టన్నులకు రూ.2,900 నుంచి రూ.3,200 అవుతుంది. కానీ, 20 టన్నుల లారీ ఇసుకను డిమాండును బట్టి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు అమ్ముతున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇష్టమైతే కొను.. లేదంటే పొమ్మని తెగేసి చెబుతున్నారు. ఈవిధంగా ప్రతి రోజూ వందల లారీల ఇసుక విక్రయిస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు చెప్పే నాథుడే కరువయ్యారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ‘తాము చెప్పిందే రేటు’ అన్నట్టుగా ఇసుక మాఫియా వ్యవహరిస్తోంది. ఈ దందా చూసి లారీ డ్రైవర్లు, ఇసుక కొనుగోలుదార్లు విస్తుపోతున్నారు. గుట్టల్లో గుట్టు! ఒక్కో ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ప్రతి రోజూ పదుల సంఖ్యల లారీల ఇసుక తరలిపోతోంది. అటువంటప్పుడు ఆ స్టాక్ పాయింట్లలో ఇసుక గుట్టలు సైతం కరగాలి. కానీ, దీనికి భిన్నంగా గుట్టలు మరింత పెరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. తరలుతున్న ఇసుక తరలుతూనే ఉండగా.. ఆ గుట్టల్లో తిరిగి అక్రమంగా ఇసుక నింపేస్తున్నారు. ఈ తంతు నిత్యకృత్యంగా మారుతోంది. ఫలితంగా ప్రారంభించినప్పుడు ఉన్న స్థాయిలోనే స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కానూరు గుట్ట కథేమిటో? కానూరు శశి స్కూల్ సమీపాన ఉన్న ఇసుక గుట్ట తూర్పు గోదావరికి కేటాయించిందా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబధించినదా.. అనే విషయం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇక్కడి స్టాక్ పాయింట్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించినట్లు అధికారులు చెప్పారు. కానీ, అమ్మకాలు మాత్రం అన్ని జిల్లాలకూ జరుగుతున్నాయి. కాకరపర్రు, కానూరు స్టాక్ పాయింట్లలో పగలు కాకుండా రాత్రి వేళల్లో దందా జోరుగా సాగుతోంది. వందలాది లారీల ఇసుక రాత్రికి రాత్రే తరలిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక లారీలతో సాధారణ వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణేదీ? ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద అధికారుల నిఘా ఏమాత్రం ఉండటం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారుల జాడ కూడా కనబడటం లేదు. గుట్టల్లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా కేవలం జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. దీంతో, ఇసుక మాఫియా ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. ఏ జిల్లా ఏ జిల్లా..: కానూరు శశి స్కూల్ పక్కన వేసిన గుట్ట కానూరు కొండలమ్మ గుడి వెనుక ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ నిడదవోలు నియోజకవర్గంలో ఇసుక దందా అధిక ధరలకు అమ్మకాలు నిబంధనల ప్రకారం 20 టన్నుల లారీ ఇసుక రూ.2,900 విక్రయిస్తున్నది రూ.6 వేలకు.. పట్టించుకోని అధికారులుఅనధికారికం.. అధికారికం.. ఇసుక స్టాక్ యార్డుల పేరిట అధికారికంగా ఇసుక గుట్టలు వేశారు. వీటిని అధికారులు పరిశీలించి ఎక్కడెక్కడ ఏ మేరకు ఇసుక నిల్వలున్నాయో లెక్క కట్టారు. అనంతరం ఇసుక మాఫియా ఈ అధికారిక గుట్టల్లో అనధికారికంగా దాచి ఉంచిన ఇసుకను కలిపేసి, దర్జాగా విక్రయాలు చేపడుతోంది. పురుషోత్తపల్లి, కానూరు, కాకరపర్రు గ్రామాల వద్ద ఇసుక గుట్టలు ఎంతకూ తగ్గకపోవడమే మాఫియా ఇసుక దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇసుక అమ్మకాలు ఎక్కడా ఆగడం లేదు.. రాత్రి, పగలు వాహనాల్లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంది.. అయినా ఇసుక మాత్రం రవ్వంత కూడా తరగడం లేదు. కానూరు కొండలమ్మ గుడి వెనుక వేసిన (మునిపల్లి స్టాక్ పాయింట్) అధికారిక గుట్టలో 52,652 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు అధికారికంగా చూపించారు. కానీ, ఇక్కడ మాత్రం సుమారు 80 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు సమాచారం. కానూరు – పెండ్యాల ర్యాంపులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను గోదావరి వరద ముసుగులో పగలు, రాత్రి తరలించేసి, అధికారిక గుట్టలో కలిపేశారు. కాకరపర్రు స్టాక్ పాయింట్లో 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు చూపించారు. ఇక్కడి ర్యాంపులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను తీసుకువచ్చి అధికారిక గుట్టలో కలిపేయడంతో చిన్న ఇసుక గుట్ట కాస్తా కొండలా మారింది. -
రత్నగిరికి భక్తుల తాకిడి
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 4,800 వ్రతాల నిర్వహణ ● రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. కార్తిక బహుళ దశమి, శుక్రవారం పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా భక్తులు రత్నగిరికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పార్కింగ్ స్థలాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 4,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కార్తిక మాసంలో చివరి శనివారం, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో శుక్రవారం రాత్రి నుంచే భక్తులు అధిక సంఖ్యలో రత్నగిరికి చేరుకుంటున్నారు. సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరచి వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే సత్యదేవుని దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. 94 వేలు దాటిన సత్యదేవుని వ్రతాలు కార్తిక మాసంలో ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండగా శుక్రవారం నాటికి సత్యదేవుని వ్రతాలు 94 వేలు మాత్రమే జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి 1,19,550 వ్రతాలు జరిగాయి. దీంతో పోల్చితే ఈ కార్తికంలో ఇప్పటి వరకూ సుమారు 25 వేల వ్రతాలు తక్కువగా జరిగాయి. శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ఆది, సోమవారాల్లో సుమారు 15 వేలు, ఆ తరువాతి మూడు రోజులూ మరో 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కార్తిక మాసంలో సుమారు 1.30 లక్షల వ్రతాలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తిక మాసంలో 1.47 లక్షల వ్రతాలు జరిగాయి. -
పెద్దిరెడ్డి కుటుంబంపై బురద జల్లేందుకే ఆరోపణలు
కాకినాడ రూరల్: తమ నాయకులపై బుదరజల్లే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుందని, అందులో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. తమ పార్టీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనవి ఆరోపణలేనని, నిరూపణ కావని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్న సదరు భూమి.. ఆయనకు చెందినదేనంటూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చలపతిరావు నిర్ధారించిన విషయాన్ని గ్రహించాలన్నారు. 1968 గెజిట్ ప్రకారం సర్వే నంబరు 295, 296లో కూడా ఆ భూమి పెద్దిరెడ్డికి చెందినదిగానే రికార్డులు చెబుతున్నాయని, అనుమానం ఉంటే డెహ్రడూన్ నుంచి మ్యాప్‌లు రప్పించుకుని పరిశీలించాలని సూచించారు. ఉమ్మడి ఏపీ అటవీ శాఖ మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి.. శంషాబాద్‌లో 450 ఎకరాల అటవీ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడారని గుర్తు చేశారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటం కోసం రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలను వేధించడం తగదని హితవు పలికారు. అసత్య ఆరోపణలు చేసే బదులు అటవీ, రెవెన్యూ చట్టాలు చదువుకోవాలని సూచించారు. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రక్రియలకు పవన్ తెర తీశారని నాగమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గిరిజన విద్యార్థినికి ‘సఖి’ చేయూత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్ చొరవతో ఓ గిరిజన విద్యార్థినికి వసతి సమకూరింది. వివరాల్లోకి వెళ్తే.. రంపచోడవరానికి చెందిన తేజస్విని తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. తల్లి పెంచి పోషించి, ఇంటర్మీడియెట్ వరకూ చదివించింది. ఆరోగ్యం క్షీణించి ఆమె మంచాన పడటంతో తేజస్విని డిగ్రీ చదువుకు ఆటంకం కలిగింది. మెరిట్‌తో కాకినాడ సమీపంలోని పటవలలోని కైట్ కాలేజీలో డిగ్రీ సీటు సాధించినా, నిలువ నీడ లేకుండా పోయింది. అలాగని సుదూరాన ఉన్న స్వగ్రామానికి రోజూ వెళ్లి రావడం అసాధ్యం. ఈ నేపథ్యంలో పత్రికల్లో సఖి వన్‌స్టాప్ సెంటర్ గురించి తెలుసుకున్న తేజస్విని కొద్ది రోజుల క్రితం అడ్మిన్ ఆర్.శైలజను ఫోనులో సంప్రదించింది. సాయం చేయాలని కోరింది. తక్షణమే స్పందించిన శైలజ ఈ విషయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ సీహెచ్ లక్ష్మికి తెలియజేశారు. ఆమె ఆదేశాల మేరకు సామర్లకోటలోని కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తిని కలిసి, విద్యార్థిని చదువుకు సాయం అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రవీణ్ చక్రవర్తి శుక్రవారం సఖి వన్‌స్టాప్ సెంటర్‌కు వచ్చి విద్యార్థిని వసతికి అవసరమైన హాస్టల్ ఫీజు మొత్తాన్ని అందజేశారు. -
● అమ్మ రూపం.. లక్ష గాజుల వైభవం..
కార్తిక మాసం.. శుక్రవారాన్ని పురస్కరించుకుని కాకినాడ సూర్యారావుపేటలోని బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహంతో పాటు.. ఆ తల్లి సన్నిధానంలో రంగురంగుల గాజులను దండలు దండలుగా కూర్చారు. ఈ అలంకరణను కన్నులారా వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచీ అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. అమ్మవారికి అలంకరించిన గాజులను శనివారం ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. – బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) -
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
రూ.5 వేల జరిమానా అయినవిల్లి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక కోర్టు జడ్జి కె.శ్రీదేవి శుక్రవారం తీర్పు ఇచ్చారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, స్థానిక ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2018 ఆగస్టు ఏడో తేదీన అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామం పిల్లివారిపేటకు చెందిన 15 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ముత్తాబత్తుల సతీష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి హెడ్ కానిస్టేబుల్ జె.సత్యనారాయణ పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీలు ఏవీఎల్ ప్రసన్నకుమార్, డీఎస్పీ ఆర్.రమణ, ఎస్కె మాసూం బాషా సమగ్ర దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పబ్లిక్ ప్యాసిక్యూటర్లు కె.వెంకటరత్నం బాబు, పి.శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదించగా జడ్జి నిందితుడికి పై విధంగా తీర్పు ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి అధికారులను, ప్రస్తుత కొత్తపేట ఏఎస్డీపీఓ ఎస్.మురళీ మోహన్, పి.గన్నవరం సర్కిల్ సీఐ రుద్రరాజు భీమరాజు, అయినవిల్లి ఎస్ఐ హరికోటి శాస్త్రి, సిబ్బందిని ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పు భర్తపై హత్యాయత్నం కేసు నమోదు అమలాపురం టౌన్: భార్యపై అనుమానంతో ఏకంగా ఇంటికే నిప్పు పెట్టి ఆమెను చంపేందుకు ప్రయత్నించిన జంగా శివ (సురేష్)పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామం పోలేరమ్మ గుడి సందుకు చెందిన జంగా విజయ దుర్గా భవాని ఈ మేరకు తన భర్తపై ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. భవాని అదే గ్రామంలో తన తల్లి ఇంటి వద్ద పిల్లలతో ఉంది. పిల్లలతో ఆమె నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఇంటిపై శివ పెట్రోలు పోసి నిప్పు పెట్టాడని సీఐ తెలిపారు. ఇల్లు పాక్షికంగా కాలిపోగా, అతని భార్య, పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎన్ఆర్ కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విజ్ కిడ్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్ష్యశ్రీ ప్రతిభ రావులపాలెం: విజ్ కిడ్స్ కార్నివాల్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన కిడ్స్ ప్రీమియర్ లీగ్ సీజన్–4 గ్రాండ్ ఫైనల్లో రావులపాలేనికి చెందిన కొవ్వూరి లక్ష్యశ్రీ రెండో స్థానం నిలిచినట్టు ఆమె తల్లిదండ్రులు మహాలక్ష్మి, సూర్యానారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఇటీవల పూణేలో జాతీయస్థాయిలో జరిగిన ప్రీమియర్ లీగ్‌లో మూడు అంశాల్లో హ్యాండ్ రైటింగ్, శ్లోకాలు, డ్యాన్స్ పోటీలలో జూనియర్ కేటగిరీలో రావులపాలేనికి చెందిన ఐదో తరగతి విద్యార్థిని కొవ్వూరి లక్ష్యశ్రీ పాల్గొని మూడు విభాగాల్లోనూ రెండో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే ప్రముఖ విజ్ కిడ్స్ ఫౌండర్ అభిషేక్ అవధాని చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతిని అందుకుందన్నారు. -
ఫ్రెంచ్–భారత్ సాంస్కృతిక బంధం బలమైనది
● ఫ్రెంచ్ రాయబారి థేర్రీ మాథ్యూ ● ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం ● పలు చిత్రాల ప్రదర్శన యానాం: ఫ్రాన్స్, భారత్ సాంస్కృతిక బంధాలు బదిలీ అయ్యేందుకు ఫ్రెంచి ఫిల్మ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి థేర్రీమాత్యూ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేడ్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగే ఫ్రెంచి ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆర్‌ఏఓ, ఐఏఎస్ అధికారి అంకిత్‌కుమార్‌ను ఫ్రెంచి సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసారు. ఫ్రెంచి కాలం నాటి ఆర్సీఎం చర్చి తదితర వాటిని సందర్శించారు. యానాంలో వివిధ పాఠశాలల్లో ఫ్రెంచిభాష తరగతులు అమలు తీరుపై చర్చించారు. అనంతరం వివిధ ఫ్రెంచి చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్‌ఏఓ అంకిత్‌కుమార్, పుదుచ్చేరి ఫ్రెంచి కాన్సుల్ జనరల్ ఎటైనీ రోలాండ్ పేగ్, అలియన్స్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ లారెంట్ జూలికస్, అధ్యక్షుడు సతీష్ నల్లం, నల్లం వెంకట్రామయ్య, యానాంలో ఫ్రెంచి పౌరుల ప్రతిఽనిధి సాధనాలు బాబు, చింతా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్లు తెంపి.. చెంగున ఉడాయించి..
● రోడ్డుపై వెళుతున్న మహిళలే అతని టార్గెట్ ● ఆనవాలు తెలియకుండా మాస్క్‌లు, టోపీలు ● వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తూ చైన్ స్నాచింగ్‌లు ● ఆరు నేరాల్లో రూ.12.32 లక్షల సొత్తు రికవరీ ● నిందితుడి వివరాలు వెల్లడించిన ఎస్పీ మీనా అమలాపురం టౌన్: రహదారిలో స్కూటీలపై వెళ్తున్న మహిళలే అతని టార్గెట్. వారు కనిపిస్తే చాలు అతని చేతులు లాఘవం ప్రదర్శిస్తాయి. వెంటనే చటుక్కున మెడలో చైన్లు లాగేసి ఉడాయిస్తాడు. రెక్కీ నిర్వహించి మరీ నేరాలకు పాల్పడడంలో అతను దిట్ట. తన ఆనవాలు తెలియకుండా ముఖానికి మాస్క్.. తలకు టోపీ పెట్టుకుంటాడు. తాను నడిపే మోటారు సైకిల్‌ను గుర్తించకుండా నెంబర్ ప్లేట్లు మారుస్తూ నేరాలకు పాల్పడుతుంటాడు. నేరం చేసిన తర్వాత కొద్ది దూరం వెళ్లాక తాను వేసుకున్న డ్రెస్ కూడా మార్చేసి సాధారణ ప్రజానీకంలో కలసిపోతాడు. ఇదీ ఇతని నేరాల స్టయిల్. ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన ప్రస్తుతం కాకినాడ వెంకటేశ్వర కాలనీ పార్కు వద్ద నివసిస్తున్న సాధనాల వెంకటేష్ చివరకు ద్రాక్షారామ పోలీసులకు చిక్కాడు. ద్రాక్షారామ పోలీసుల లోతైన దర్యాప్తుతో వెంకటేష్ నేరాల చిట్టా వెలుగు చూసింది. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడు వెంకటేష్ చేసిన నేరాలను వివరించారు. అతని నుంచి రూ.12.32 లక్షల విలువైన 112.784 గ్రాముల బంగారు నగలను రికవరీ చేశారు. అలాగే నిందితుడు నేరాలకు ఉపయోగించే ఏపీ05 డీబీ 1709 నెంబర్ గల గ్లామర్ మోటార్ సైకిల్‌ను కూడా స్వాఽధీనం చేసుకున్నారు. రామచంద్రపురం డీఎప్పీ బి.రఘువీర్, సీఐ ఎం.వెంకట నారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్సై ఎస్.నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐదు బృందాలు.. 250 సీసీ కెమేరాల పరిశీలన నిందితుడు వెంకటేష్‌ను వెంకటాయపాలెం వంతెన వద్ద శుక్రవారం పట్టుకున్నారు. ఇతని కోసం 250 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని కోసం ఐ దు పోలీస్ బృందాలను నియమించడంతో వారు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నేరాల చిట్టా ఇదీ.. ● 2023 మే 11న కాకినాడ సమీపంలో వలసలపాక గ్రామంలో స్కూటీపై వెళుతున్న మహిళ మెడలో బంగారు తాడు కాజేశాడు. ● 2023 మే 9న కాకినాడ–సామర్లకోట రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో బంగారు తాడు తెంపేసి దోచుకున్నాడు. ● 2025 మే 11న కరప మెయిన్ రోడ్డులో స్కూటీపై తల్లీకూతుళ్లు వెళుతుండగా వెనుక కూర్చున్న అమ్మాయి మెడలో బంగారు గొలుసు కాజేశాడు. ● 2025 మే 16న ద్రాక్షారామ దగ్గర వెంకటాయపాలెం దాటిన తర్వాత ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఇద్దరు మహిళలు స్కూటీపై వెళుతుండగా వాహనం నడుపుతున్న మహిళ మెడలో బంగారు మంగళ సూత్రాలను దొంగిలించాడు. ● 2025 జూన్ 24న వెంటూరు గ్రామ శివారు వంతెన వద్ద స్కూటీపై వెళుతున్న మహిళ మెడలో బంగారు తాడు కాజేశాడు. ● 2025 ఆగస్టు 20న ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దాటిన తర్వాత స్కూటీపై వెళుతున్న మహిళ మెడలో బంగారు తాడును లాక్కున్నాడు. పోలీస్ అధికారులకు రివార్డులు కరడు కట్టిన చైన్ స్నాచర్ వెంకటేష్‌ను డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో పట్టుకోవడమే కాకుండా రూ.12.32 లక్షల సొత్తును రికవరీ చేసిన సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు లక్ష్మణ్, నాగేశ్వరరావు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లను ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
జజర చిత్రీకరణలో తాళ్లూరు మఠం అర్చకులు
గండేపల్లి: మండలంలోని తాళ్లూరు మఠంలో శుక్రవారం జరిగిన జజర చిత్రం షూటింగ్లో తాళ్లూరు మఠం అర్చకులు భాగస్వాములయ్యారు. సినీమా హీరో చందు చిననాటి సన్నివేశాలను దర్శకుడు ప్రభు చిత్రీకరించారు. హీరో తండ్రి చరణ్‌రాజ్ విదేశాలకు వెళుతూ తన కొడుకు ను మఠం అర్చకులకు అప్పగించే సన్నివేశాన్ని చిత్రీకరీంచారు. అనంతరం చరణ్‌రాజ్, దర్శకుడు మఠం అర్చకుడి ఫొటోలు తీసుకున్నారు. హీరో చందు చిననాటి సన్నివేశాలలో బాలనటుడు యశ్వంత్‌తో చిత్రీకరించారు. చరణ్‌రాజ్‌ను చూసేందుకు గ్రామస్తులు ఉత్సాహం చూపారు. -
ఓంకార సాధనతో ఆధ్యాత్మిక చింతన
● ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉమర్ ఆలీషా ● కొప్పవరం ప్రణవాశ్రమంలో దేశ, విదేశీ భక్తుల సమాగమం ● అలరించిన నృత్య ప్రదర్శనలు సామర్లకోట: ఓంకార సాధన ద్వారా మనిషిలో ఆధ్యాత్మిక చింతన, తద్వారా సేవాభావం అలవడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉమర్ ఆలీషా అన్నారు. మండలం కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమంలో జరుగుతున్న శివలింగ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రణవాశ్రమంలోని ప్రశాంత వాతావరణం ఎంతో హృద్యంగా ఉందని, ఈ ప్రశాంతతలో ఓంకార సాధన చేస్తే మనిషిలో మార్పు వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలి మార్పునకు ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని ఆయన సూచించారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు సుమిత్రా నంద సరస్వతి మాతా ఉమర్ ఆలీషాను సత్కరించారు. ఈ మేరకు జర్మనీ, అమెరికా, కెనాడా దేశాలల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక వేత్తలు, మునులు, పీఠాధిపతులు, భక్తులను ఉమర్ ఆలీషా సత్కరించారు. ఈ సందర్బంగా సుమిత్రానంద సరస్వతి మాత మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఎన్నో వేల సత్సంగాలు, ఎంతో మంది ‘డిప్రెషన్’లో ఉన్న వారికి ఓంకారం ద్వారా సాంత్వన చేకూర్చినట్టు తెలిపారు. అమెరికాలో ప్రతి ఏటా వివిధ రాష్ట్రలలో ఓంకారం సాధన ద్వారా అనేక మందికి మానసిక ప్రశాంతత చేకూరుస్తున్నామన్నారు. ఓకారం నినాదం కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం నిర్మాణానికి విదేశాల నుంచి వేలాది మంది భక్తులు విరాళాలు అందజేశారని, వారి ప్రోత్సాహంతో ప్రణవాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఆశ్రమం నిర్మాణం చేపట్టడం ద్వారా ఆహ్లాదకర వాతావరణంలో రాబోయే రోజులలో యువతీ, యువకులకు భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లు జీవన శైలిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో బాలికలు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టు కున్నాయి. కార్యక్రమంలో హృషికేశ్ నుంచి ఆర్ష విద్యాపీఠాధిపతి స్వామి తత్వ విద్యానంద సరస్వతి, స్వామి దుర్గానంద సరస్వతి, శివాలయ ఆశ్రమం స్వామి విజయానంద పురి మహారాజ్, స్వామి మేథానంద పురి హిమాలయన్ యోగి 110 సంవత్సరాల బాబా స్వామి సంతు సదానంద గిరి మహరాజ్, పుణ్యగిరి స్వామిజీ నిత్య తృప్తానంద సరస్వతి, కేరళ కై లాస ఆశ్రమం స్వామిని చంద్రానంద మాత, శ్రీలంక బౌద్ధ బిక్షువు డాక్టరు బోధి హీన్, తాళంకేరీ దత్త ఆశ్రమం శివస్వామి, తోటపల్లి, శాంతి ఆశ్రమం వినమ్రానంద సరస్వతి మాత, నిజామాబాద్ ప్రశాంత ఆశ్రమం నుంచి విశ్వాత్మానంద గిరి స్వామి, అరుణాచలం నుంచి శివ ప్రియానంద సరస్వతి, రాచపల్లి నుంచి రామస్వామి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు రాళ్ల దెబ్బలు!
● మరమ్మతులకు ప్రతిపాదనలు రాళ్ల డ్రెయిన్ మరమ్మతులకు తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. సుమారు ఏడు కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటనే మెషనరీతో పనులు చేపడతాం. – రేష్మ, డ్రెయిన్స్ ఏఈ, రాజోలు ● మురుగునీటితో రైతుల అవస్థలు తీరప్రాంతాల్లోని గ్రామాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న రాళ్ల డ్రెయిన్‌కు చాలా కాలంగా మరమ్మతులు లేవు. దీనికి మరమ్మతులు త్వరగా చేపడితే రైతులకు, ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుంది. మరమ్మతులు లేకపోవడంతో మురుగు నీటితో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. – రావి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ, అంతర్వేదికర ● పూడికతీత పనుల్లో జాప్యం రాళ్ల డ్రెయిన్ పూడికతీత పనుల్లో జాప్యం వల్ల వర్షాలకు డ్రెయిన్ పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి ముంపు నీరు నిలిచి నివాసితులు అవస్థలు పడుతున్నారు. వెంటనే పనులు చేపట్టాలి. – గుండుబోగుల సూర్యనారాయణ, రైతు, అంతర్వేది దేవస్థానం ● డ్రెయిన్‌కు మరమ్మతులు లేక అవస్థలు ● మూడు గ్రామాలకు అనసంధానం ● వెనక్కు పోటెత్తుతున్న ముంపు నీరు ● మరమ్మతుల్లో జాప్యంతో అన్నదాత ఆవేదన సఖినేటిపల్లి: తీరప్రాంత గ్రామాల్లోని ఆయకట్టు భూముల్లో మురుగు నీటిని దించే రాళ్ల డ్రెయిన్ మరమ్మతుల్లో జాప్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుచూ కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో నిచిపోతున్న ముంపు నీరు దిగడానికి ఈ డ్రెయిన్ ఆధారంగా ఉండడంతో ప్రజలు సైతం నానా అవస్థలు పడుతున్నారు. ఈ డ్రెయిన్ కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం గ్రామాలకు అనుసంధానంగా విస్తరించి ఉంది. ఈ గ్రామాల మీదుగా సుమారు పది కిలోమీటర్లు మేర మైనర్ డ్రెయిన్ ప్రవహిస్తోంది. కేశవదాసుపాలెం నుంచి మొదలయ్యే ఈ డ్రెయిన్ చిట్ట చివరిగా అంతర్వేది ఏటిగట్టు వద్ద తెరుచుకుని వశిష్ట గోదావరి వైపు మళ్లుతుంది. కాగా కేశవదాసుపాలెం, అంతర్వేదికర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు భూముల్లో మురుగు నీరు దిగడానికి, ఈ రెండు గ్రామాలతో పాటు అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలకు నిలిచిపోతున్న ముంపు నీరు దిగడానికి ఈ డ్రెయిన్ ఎంతగానో దోహదపడుతుంది. డ్రెయిన్‌లో పూడిక తీయాలి కేశవదాసుపాలెం నుంచి అంతర్వేది ఏటిగట్టు వరకూ సుమారు పది కిలోమీటర్ల పొడవున డ్రెయిన్ విస్తరించి ఉంది. డ్రెయిన్ పొడవునా కిలోమీటర్ల మేర పూడిక ఉండడంతో వర్షాలకు డ్రెయిన్ పొంగి పొర్లుతోందని రైతులు చెప్తున్నారు. ఈ పూడిక మట్టిని మెషీన్ ద్వారా వెలికి తీయాల్సి ఉందని, డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టడం ద్వారా అటు రైతులకు, ఇటు ప్రజలకు మేలు చేకూరుతుందని వారు అంటున్నారు. దేవస్థానం భూమిని ఆనుకుని రాళ్ల డ్రెయిన్‌కు ఆనుకుని అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయానికి తూర్పు వైపు సమారు 35 ఎకరాల భూమి ఉంది. డ్రెయిన్ ద్వారా పోటెత్తుతున్న ఉప్పునీరు ఈ భూములను కూడా ముంచెత్తుతోంది. ఈ భూములకు రక్షణ కల్పించడానికి కూడా డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముద్రగడ అనుభవం పార్టీకి అవసరం
కిర్లంపూడి: మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం రాజకీయ అనుభవం వైఎస్సార్ సీపీకి ఎంతో అవసరం అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఆయనతో పాటు రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ పార్లమెంట్ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, తోట రామకృష్ణ ముద్రగడను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక చర్యలపై వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాలను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన అంశాలపై చర్చించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నుంచి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.


