టెన్నిస్‌లో పసల జంటకు ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌లో పసల జంటకు ప్రథమ బహుమతి

Mar 12 2026 7:39 AM | Updated on Mar 12 2026 7:39 AM

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పసల పద్మరాఘవరావు, బండ్ల అంకయ్యశెట్టి జంట అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీల్లో 75 ప్లస్‌ వయస్సు విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. ఈ మేరకు బుధవారం పద్మరాఘవరావు విలేకర్లకు వివరాలు తెలియజేశారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్‌లోని జీబీఆర్‌ క్లబ్‌ కొంపల్లిలో అంతర్జాతీయ మాస్టర్స్‌ టెన్నిస్‌ పోటీలు జరిగినట్టు తెలిపారు.

అందుబాటులో స్టాంపులు

కాకినాడ లీగల్‌: కోర్టుల్లో ఏ పత్రాలు దాఖలు చేయాలన్నా, పత్రాలు పాందాలన్నా కోర్టు ఫీజు స్టాంపులు కావాలి. అవి కక్షిదారులకు, న్యాయవాదులకు అత్యవరం. కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కోర్టు ఫీజు స్టాంపులు లేకపోవడంతో మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 1, 2, 5, 10 రూపాయల కోర్టు ఫీజు స్టాంపులు లభించడం లేదు. దీనిపై వేధిస్తున్న స్టాంపుల కొరత శీర్షికన ఈనెల 7వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా రిజిస్ట్రార్‌ కె.ప్రసాదరావు స్పందించారు. దీంతో కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 1,2,5,10 స్టాంపుల అందుబాటులోకి వచ్చాయి. తుని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి రూపాయి స్టాంపులు 8వేలు, రెండు రూపాయిల స్టాంపులు 16 వేలు, ఐదు రూపాయిల స్టాంపులు 9వేలు, పది రూపాయిల స్టాంపులు 7వేల రెండు వందలు తీసుకు వచ్చామని ప్రసాదరావు తెలిపారు.

ఈ – ఫైళ్ల పరిష్కారంలో

ఎస్పీకి నాల్గవ స్థానం

కాకినాడ క్రైం: అమరావతిలో బుధవారం జరిగిన బ్యూరోకాట్‌ల రాష్ట్ర స్థాయి సదస్సులో ఎస్సీ గరికపాటి బిందుమాధవ్‌కి ప్రత్యేక గౌరవం లభించింది. ఈ – ఫైళ్ల పరిష్కారంలో ఆయనకు రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానం దక్కింది. 1,124 ఫైళ్లను సకాలంలో పరిష్కరించిన ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement