నేలపై కూర్చొని పిల్లి సత్తిబాబు నిరసన
సమావేశంలో విలపిస్తున్న మహిళకు నచ్చచెబుతున్న నవీన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వివాదం కొత్త రంగు పులుముకుంది. ఈ పదవికి కొత్తగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు పేరు తెర మీదకు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రూరల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా రూరల్ ఇన్‌చార్జి ఎంపికపై చర్చించే ప్రయత్నం చేశారు. ఈ చర్చకు తెర లేచింది మొదలు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు మొదలై, అంతా రచ్చరచ్చయ్యింది. ఈ పదవి కోసం ఇన్నాళ్లూ ఒకవైపు పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), మరోవైపు కో కో ఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ (బాబీ) హోరాహోరీగా తలపడ్డారు. నియోజకవర్గ టీడీపీలోని రెండు బలమైన సామాజికవర్గాల మధ్య దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఈ ఇన్‌చార్జి పంచాయితీని చక్కదిద్దలేక పార్టీ అధిష్టానం సైతం వాయిదా మంత్రాన్ని జపిస్తూ వస్తోంది.
చేతులెత్తేసిన ‘బాబు’
టీడీపీ రూరల్ ఇన్‌చార్జిని నియమించడం అధినేత చంద్రబాబుకే సాధ్యం కాలేదని ఆ పార్టీ వర్గాలు బాహాటంగానే చెప్పుకునేవి. ఈ వివాదం నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే రూరల్‌లో ఆ పార్టీ పరిస్థితి నడిసంద్రంలో తెర చాప లేని పడవ మాదిరిగా తయారైంది. ఇటీవల చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ కాకినాడ వచ్చినప్పుడు కూడా రూరల్ ఇన్‌చార్జి వివాదం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారం చూపలేక పెదబాబు, చినబాబు కూడా వెనకడుగు వేశారు. సత్తిబాబు, కటకంశెట్టితో పాటు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కూడా ఈ పదవి కోసం గట్టి ప్రయత్నమే చేశారని పార్టీలో విస్తృత ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తమ్ముళ్ల మధ్య వర్గపోరు మరింత పెరిగి తాజాగా మరోసారి రోడ్డున పడింది. ఈ ముగ్గురినీ కాదని కొత్తగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు పేరు అధిష్టానం పరిశీలనలో ఉందనే అంశం మంగళవారం నాటి పార్టీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో, ఈ వివాదం ముదురు పాకాన పడింది.
సత్తిబాబు ఘ బాబీ
రూరల్ నియోజకవర్గ టీడీపీ ప్రస్తుత కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) ఈ సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో బాబీ వర్గీయులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. తమ నేత సత్తిబాబు మాట్లాడుతూండగా అర్ధాంతరంగా ఎలా వెళ్లిపోతారంటూ ఆయన వర్గీయులు బాబీ వర్గీయులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాబీ ప్రసంగ సమయంలో తామంతా ఉన్నామని, తమ నేత సత్తిబాబు ప్రసంగిస్తూంటే సభా మర్యాద లేకుండా ఎలా వెళ్లిపోతారని నిలదీశారు. దీంతో, ఇరు వర్గాలూ పెద్దగా అరుపులు, కేకలు వేసుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. బాహాబాహీకి తలపడ్డారు. కొందరు నేతలు సమావేశం నుంచి బాయ్‌కాట్ చేశారు. సత్తిబాబు టీడీపీ జిల్లా కార్యాలయంలోనే నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలో బాబీ వర్గానికి చెందిన నాగమణి అనే మహిళను సత్తిబాబు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో, ఆమె కన్నీటి పర్యంతమవుతూ తనకు తీవ్ర అవమానం జరిగిందని నవీన్ వద్ద మొర పెట్టుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
వ్యూహాత్మక వివాదమా!
అయితే, ఇన్‌చార్జి పదవికి కొత్తగా నులుకుర్తి వెంకటేశ్వరరావు పేరు రావడంతో.. సత్తిబాబు, బాబీ వర్గాలు ముందుగానే ఒక అంగీకారానిక వచ్చి, వ్యూహాత్మకంగానే వివాదానికి దిగారని చెబుతున్నారు. ఈ పదవి తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కాలే తప్ప మరొకరికి ఇవ్వడానికి ససేమిరా అంటూ నిలదీయాలని ఈ రెండు వర్గాలూ ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్టు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ వివాదం అధిష్టానం వద్దకు వెళ్లాలనే ముందుచూపుతోనే ఈ గలాటా సృష్టించారని చెబుతున్నారు. హఠాత్తుగా నులుకుర్తి పేరు తెర మీదకు రావడంతో నిన్న మొన్నటి వరకూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న రెండు వర్గాలూ ఒక్కటయ్యాయనే వాదన వినిపిస్తోంది. వివాదం పెరిగిపోవడంతో విషయాన్ని అధిష్టానం దృష్టిలో పెట్టి పరిష్కరిద్దామంటూ నవీన్ సర్దిచెప్పి వివాదానికి తాత్కాలికంగా తెర దించారు. పరిణామాలు చూస్తూంటే ఈ ఆధిపత్య పోరుకు ఇప్పట్లో తెర పడేటట్టు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
·˘ Æý‡*Æý‡ÌŒæ sîæyîlï³ÌZ B«¨ç³™èlÅ ´ùÆý‡$
·˘ Ð]l$ÆøÝëÇ ºÄ¶æ$r ç³yìl¯]l Ñ¿ôæ§éË$
·˘ ç܆¢»êº$ {ç³çÜ…WçÜ*¢…yýlV>
వెళ్లిపోయిన బాబీ వర్గీయులు
·˘ °ÌS©íܯ]l ç܆¢»êº$ Ð]lÆý‡Y…
·˘ °Äñæ*fMýSÐ]lÆý‡Y C¯ŒS^éÇjV>
కొత్తగా నులుకుర్తి పేరు
·˘ çÜõÜÑ$Æ> A…r$¯]l² Æð‡…yýl$ Ð]lÆ>YË$
·˘ ÑÐé§ýl… A«¨Úët¯]l… §ýl–íÙtMìS ÐðlâêÏÌS¯ól Æý‡^èla ^ólÔ>Æý‡…r$¯]l² ´ëÈt {Ôóæ×æ$Ë$


