breaking news
Kakinada District News
-
సర్వేజనా ఆరోగ్యమస్తు..
● జిల్లాలో ఎన్సీడీ 4.0 సర్వేకు చర్యలు ● ఆరోగ్య సమాజమే లక్ష్యంగా ఇంటింటి సర్వే ● ముందస్తు గుర్తింపుతో సరైన వైద్యానికి అవకాశం రాయవరం: క్యాన్సర్.. ప్రజల ప్రాణాలను హరించే మహమ్మారి. చాలా మందికి ఆ వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే మృత్యువు సింహద్వారం వద్ద నుంచునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముుందుగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఏటా జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) ప్రోగ్రామ్‌ను చేపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని వ్యాధులను నాన్ కమ్యూనికల్ డిసీజెస్‌గా పిలుస్తారు. బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ, గుండె తదితర జబ్బులను ముందుగానే పసిగట్టడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎన్సీడీ 4.0 సర్వేకు ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. నాలుగేళ్ల నుంచి.. 2021 అక్టోబరులో తొలిసారిగా ఎన్సీడీ సర్వే చేపట్టింది. రెండో విడత 2022 అక్టోబర్ 2 నుంచి, మూడో విడత 2024 నవంబరులో నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. మూడో విడతలో.. గతేడాది జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 14,68,723 మందిలో 11,29,412(77శాతం) మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,06,666 మందికి బీపీ (18.30 శాతం), చక్కెర వ్యాధిగ్రస్థులు 1,41,508 (12.53 శాతం) మంది ఉన్నట్టు గుర్తించారు. నోటి సంబంధ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు గతంలో 215 మంది ఉండగా ఈ సర్వేలో 4,172 అనుమానిత కేసులు గుర్తించారు. అలాగే గతంలో 466 మంది రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ సర్వేలో 2,090 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా వీరిలో ముగ్గురికి మాత్రమే క్యాన్సర్ నిర్థారణ అయ్యింది. సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్‌కు గురైన వారు గతంలోనే 283 మంది ఉండగా, 1,894 మంది అనుమానిత కేసులు గుర్తించారు. నాలుగో సర్వేకు ఏర్పాట్లు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఎన్సీడీ నాలుగో సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది నిర్వహించే సర్వేలో క్యాన్సర్‌పై ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. నోటి సంబంధిత, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రధానంగా సర్వే ఉంటుంది. సర్వేలో 110 మంది వైద్యులు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరికి శిక్షణ పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 527 మంది మల్టీపర్పస్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఆగస్టు 25న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 18వ తేదీతో పూర్తికానుంది. పరీక్షలు ఇలా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల నిండిన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు, నెలసరి వివరాలు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు నమోదు చేయడం ద్వారా క్యాన్సర్ దశను ప్రాథమిక అంచనా వేస్తారు. ఈ పరీక్షలతో పాటు బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేస్తారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం అయితే ఆరోగ్యశ్రీ కింద ఇతర నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఇక బీపీ, షుగర్ తదితర వ్యాధులకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. వెలుగు చూస్తున్న వ్యాధులు ఈ పరీక్షల్లో వెలుగుచూస్తున్న సమస్యల్లో బీపీ ముందు వరుసలో, తర్వాత స్థానంలో మధుమేహం ఉంటోంది. అనుమానిత జాబితాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము, నోటి క్యాన్సర్ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోకుంటే శరీరంలో ప్రధాన భాగాలైన కళ్లు, కిడ్నీ, గుండె, నరాలు తదితర భాగాలు దెబ్బతింటాయి. అలాగే మద్యపానం, పొగతాగడం, గుట్కాలు తదితర వ్యసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలి నాన్ కమ్యూనికల్ డిసీజెస్‌ను గుర్తించేందుకు నాలుగో విడత సర్వే ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. మూడో విడత సర్వే మాదిరిగానే నాల్గవ విడత సర్వేకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ సుమలత, ఎన్సీడీ జిల్లా నోడల్ అధికారి, కోనసీమ జిల్లా ముందుగా గుర్తిస్తే నయం మారిన జీవనశైలి, ధూమ, మద్యపానాలు, పొగాకు సేవనంతో పాటుగా వంశపారంపర్యం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించి నయం చేసే అవకాశం ఉంది. సర్వే చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం.– డాక్టర్ దుర్గారావు దొర, డీఎంహెచ్ఓ, కోనసీమ జిల్లా -
ఉప్పాడ తీర ప్రాంతం పరిశీలన
కొత్తపల్లి: సముద్రపు అలలు ఉధృతి కారణంగా గ్రామంలో చొచ్చుకు వచ్చిన ముంపు నీరును తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఉప్పాడ తీర ప్రాంతం, కోతకు గురవుతున్న బీచ్‌రోడ్డును శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానికంగా ఉన్న మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలల ఉధృతితో తీర ప్రాంతంలో ఉన్న తాము భయపడుతున్నామని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మహిళలు కోరారు. ఆయన మాట్లాడుతూ సముద్రపు అలలు ఉధృతి కారణంగా తీర ప్రాంత గ్రామాలైన సుబ్బంపేట, రంగంపేట, కొత్తపట్నంలో గత రెండు రోజుల నుంచి నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనిపై ప్రత్యామ్నాయంగా ముంపు నీరు పోయేందుకు, కాలువలు తవ్వేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందన్నారు. తీరప్రాంత శాశ్వత రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బీచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉందని రోడ్డుపై రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ మల్లిబాబు, పంచాయతీరాజ్ డీఈ సిద్ది వెంకటేశ్వరావు, తహసీల్దారు చిన్నారావు, ఎంపీడీఓ లక్ష్మీరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ రమణ పాల్గొన్నారు. -
చేనేత.. సమస్యల కలబోత
చేనేతను ఆదుకోవడం సామాజిక బాధ్యత చేనేత వృత్తి పరిరక్షణ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా పరిగణించాలి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న చరిత్ర అంగర చేనేత సహకార సంఘం సొంతం. అటువంటి సొసైటీకి ఆప్కో నుంచి రూ.కోటి పైగానే బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము విడుదల కాకుంటే సంఘం మూతపడే ప్రమాదం ఉంది. – గుడిమెట్ల శివరామకృష్ణ, మాజీ చైర్మన్, శ్రీ గణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం, అంగర సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేనేత కుటుంబాలు బకాయిల గుదిబండతో చితికిపోతున్నాయి. గడచిన 10 నెలలుగా పైసా కూడా విదల్చక పోవడంతో చేనేత సహకార సంఘాలు మూత వేసుకునే దుస్థితి ఏర్పడింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ అన్ని పథకాలు అమలు చేశామంటూ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. సూపర్ సిక్స్ అమలుమాట దేవుడెరుగు కనీసం అప్పులు కూడా పుట్టక చేనేత రంగం కుదేలైందని చేనేత కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్ గద్దె నెక్కి 14 నెలలు దాటిపోయినా బకాయిలు విడుదల చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చేనేతలు చేతిలో చిల్లిగవ్వ లేక నూటికి రూ.8ల వడ్డీతో అప్పుల కోసం రోడ్డెక్కే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సంప్రదాయంగా చేనేత ఉత్పత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముందుకు వెళదామంటే నుయ్యి, వెనక్కు వద్దామంటే గొయ్యి అన్న సామెత చందంగా నేతన్నల పరిస్థితి తయారైంది. అనేక చేతివృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచి పోరాడుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఈ ప్రాంతంలో చేనేతల జీవితం కష్టాలు, కన్నీళ్లు కలబోతగా మారింది. ఈ దుస్థితికి కూటమి ప్రభుత్వం నిర్వాకం కూడా కారణమని చేనేత సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఉచిత విద్యుత్ ఉత్తిమాట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 పైబడే చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాల పరిధిలో చేనేత కుటుంబాలు ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, అంగర, పులుగుర్త, వడిశలేరు, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, ముమ్మిడివరం, క్రాపచింతలపూడి శివారు కె జగన్నాథపురం, బండార్లంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల పరిధిలో జరిగే లావాదేవీలపై సుమారు 13వేల చేనేత కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఉమ్మడి తూర్పున పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్‌లో సంఘాలు మనుగడ సాగిస్తాయనేది నిర్వివాదాంశంగా పేర్కొటున్నారు. గతంలో మాదిరిగా సంఘాలు ఇక ముందు కూడా సక్రమంగా నడవాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కలిసి సంఘాలకు రావాల్సిన రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయాలంటున్నారు. తనతోనే చేనేత రంగం ప్రగతిబాటలో పయనించిందని గొప్పలకు పోతోన్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బకాయిలు విడుదల చేసి మాట్లాడాలంటున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వినియోగం వరకు విద్యుత్ ఉచితమని చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నంగా 100 యూనిట్లకు పైబడి వినియోగించిన వారికి విద్యుత్ బిల్లులు సెప్టెంబర్ నెలలో చేతిలో పెట్టారని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. పెట్టుబడులు పెట్టే స్తోమత లేక.. ఉమ్మడి జిల్లాలో ఒకో సంఘానికి తక్కువలో తక్కువ రూ.ఏడెనిమిది లక్షల నుంచి రూ.90 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలోని ఒక్క అంగర చేనేత సహకార సంఘానికే రూ.90 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. జాతీయ స్థాయిలో రెండు పర్యాయాలు అవార్డు దక్కిన అంగర చేనేత సహకార సంఘం దుస్థితి ఇలా ఉంటే మిగిలిన సంఘాల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ సంఘాలలో సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు ఆప్కో నుంచి రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి తమ పొట్టకొడుతోందని చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయక, పెట్టుబడులు పెట్టే స్థోమత లేక, బయట మార్కెట్లో రూ.8ల వడ్డీకి అప్పులు తెచ్చే సాహసం చేయలేక చివరకు సొసైటీలను మూసేసే దుస్థితి దాపురించిందని నేతన్నలు అంటున్నారు. ఎన్నికల్లో కూటమి నేతన్నలకు ఇచ్చిన హామీ ఉచిత విద్యుత్. గద్దె నెక్కి 14 నెలలు దాటినా అమలు చేయకుండా సర్కారు దగా చేసింది. సాధారణ మగ్గాలపై ఉచిత విద్యుత్‌ను మరో 100 యూనిట్లకు పెంచుతున్నామని చెప్పారే తప్ప ఆచరణలో అమలుకునోచుకోలేదు. కానీ గత నెల7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా సెప్టెంబర్ నెలలో 100 యూనిట్లు దాటిన విద్యుత్ బిల్లులు చేతిలో పెట్టి ఉచిత విద్యుత్ అమలుచేయకుండా కూటమి సర్కార్ మోసం చేస్తోందని నేతన్నలు విమర్శిస్తున్నారు. ఈ పథకం అమలుచేయకపోవడంతో ఏడాదిగా సుమారు రూ.4కోట్ల రాయితీ ఎగ్గొట్టేసిందని చేనేత ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ముడినూలు కొనుగోలు సమయంలో చేనేత కార్మికులు 5శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఈ కారణంగా చీరల ధరలు పెంచడంతో మార్కెట్లో విక్రయాలు మందగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వమే 5శాతం జీఎస్టీ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయంలో కూడా సర్కార్ నమ్మించి మోసగించిందని, జీఎస్టీ చెల్లించలేదంటున్నారు. ఇందుకు తోడు త్రిఫ్ట్ ఫండ్ మాటే వినిపించడం లేదంటున్నారు. సహకార సంఘాల్లో నేత కార్మికుల ఆదాయంలో 8శాతం మినహాయించి సొసైటీలో జమ చేస్తుంటారు. ఆ మొత్తానికి రెట్టింపు 16శాతం ప్రభుత్వం త్రిఫ్ట్‌ఫండ్ జతచేసి మూడు నెలలకు ఒకసారి కార్మికుల ఖాతాలకు జమ చేస్తుంటుంది. ఈ త్రిఫ్ట్ ఫండ్ రూ.5 కోట్లు విడుదల చేశామని సంబంధిత మంత్రి సవిత ఆరు నెలల క్రితం ప్రకటించడమే తప్ప ఆ సొమ్ము ఎక్కడా తమ ఖాతాల్లో జమ కాలేదని సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఒక విడత నేతన్న నేస్తం రూ.24వేలు జమ అయ్యేదంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపోయినా ఏ మాత్రం లబ్ధి చేకూరకపోవడంపై చేనేత వర్గాలు మండిపడుతున్నాయి. మూసివేత దిశగా సొసైటీలు ‘బాబు’ బకాయి రూ.7 కోట్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఊసే లేదు అమలు కాని ఉచిత విద్యుత్ హామీ అప్పుల ఊబిలో కూరుకుపోతాయి చేనేత సొసైటీల బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. ఇప్పటికే కొన్ని సొసైటీలు నిర్వహించలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. ముడిసరకుపై అదనపు భారం పడుతుండటంతో చేనేత కార్మికులకు మాస్టర వీవర్స్ సొసైటీలు పడుగులు ఇవ్వడం లేదు. – గోపి హరిబాబు, చేనేత కార్మికుడు, యు.కొత్తపల్లి బకాయిలు విడుదల చేయాలి బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీ మూతే వేసే పరిస్థితి. సొసైటీలు మనుగడ సాగించేందుకు 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి. ప్రొక్యూర్మెంట్ కూడా సక్రమంగా జరగడం లేదు. – ఉప్పు అర్థనారీశ్వర బులిరాజు, ఆదివారపుపేట, రామచంద్రపురం మండలం ఎన్నికల హామీలు అమలు చేయాలి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు జరపాలి. సంఘాలకు ఎన్నికలు జరపాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7కోట్లు ఆప్కో ద్వారా సహకార సంఘాలకు బకాయిలను చెల్లించింది. – జాన జగదీష్ చంద్ర గణేష్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు, కోనసీమ జిల్లా -
జిల్లా పేరే మార్చేశారు.. స్మార్ట్‌గా!
అమలాపురం టౌన్: అత్యంత ఆధునిక, సాంకేతిక, పారదర్శకతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులతో సరుకులను పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం వాటి ముద్రణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును విస్మరించింది. జిల్లాలో పంపిణీకి సిద్ధమైన 5,31,926 స్మార్ట్ కార్డుల్లో కొన్నింటిపై జిల్లా పేరు కాకుండా తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించడం విమర్శలకు తావిస్తోంది. ఈ కార్డులపై ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని మరీ ఈ తప్పిదానికి పాల్పడడం శోచనీయం. జిల్లా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఇప్పటికి మూడేళ్లు దాటినా జిల్లా పేరుకున్న గౌరవాన్ని తగ్గించేలా ఇంకా తూర్పుగోదావరి జిల్లాగా వాటిపై ముద్రించడం శోచనీయం. ఇప్పటికే ఈ కార్డుల పంపిణీ మొదలైంది. వాటిపై జిల్లా పేరు తప్పుగా పడడం వల్ల తమకు రేషన్ ఇస్తారో లేదోనని లబ్ధిదారులు కంగారు పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడం ఇష్టం లేక తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారా అని జిల్లాకు చెందిన కొందరు ఎస్సీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే కార్డులపై తమ జిల్లా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే సమయంలో ఆధార్ ఆధారంగా ఓటీపీ లేదా బయోమెట్రిక్‌తో పొందే వీలుంటుదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.దయ భాస్కర్ చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన కొన్ని కార్డుల్లో మాత్రమే తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారని, ఈ తప్పిదాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. దీనివల్ల స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.రేషన్ కార్డుల్లో పేరు మార్పుపై లబ్ధిదారుల ఆందోళన -
బస్సులు ఆగేలా చర్యలు
గండేపల్లి: మండలంలోని నీలాద్రిరావుపేటలో బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవీవీ సత్యనారయణ తెలియజేశారు. ఉచితమని నిర్లక్ష్యమా? అనే శీర్షికన శుక్రవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురించిన కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందిచారు. శుక్రవారం ఆయన గ్రామంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే ప్రదేశాన్ని, బస్సులు ఆగుతున్నాయా..లేదా..అని పరిశీలించి గ్రామ సర్పంచ్ ములంపాక సురేష్, మండల రైతు అధ్యక్షులు చిట్యాల అప్పారావు, నేదూరి త్రిమూర్తులు, చిట్యాల బాబ్జి, ప్రయాణికులతో మాట్లాడారు. రహదారికి ఇరువైపులా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయించనున్నట్టు తెలియజేశారు. డీపీటీఓ ఎం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు పరిశీలనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారి రుక్మిణి పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తారా?
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తారా? ప్రజల గొంతుకగా నిలిచే శ్రీసాక్షిశ్రీ మీడియా గొంతును నులిమే ప్రయత్నాలను మేధావి వర్గం ముందుకు వచ్చి ఖండించాలి. శ్రీసాక్షిశ్రీ సంపాదకుడు ధనుంజయరెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి గానే దీనిని పరిగణించాలి. ఇదివరకు ఏ ప్రభుత్వంలోనూ ఇంతటి దారుణాలు చూడలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పింది. ప్రజలకు, పత్రికలకు భావప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఇది చాలా అన్యాయం. – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ -
దేవస్థానానికి చెరువుల స్వాధీనం
కాజులూరు: ఆర్యావటంలో అనధికారికంగా కొనుగోలు చేసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం భూమిని కోర్టు ఉత్వర్వుల మేరకు శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు దేవస్థానం అధికారులకు అప్పగించారు. వివరాల్లోనికి వెళ్లితే ఆర్యావటంలో పురాణ ప్రసిద్ధిగాంచిన సీతారామస్వామి దేవస్థానానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తం కేటాయించిన నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని వంశపారంపర్య అర్చకుడు 1999వ సంవత్సరంలో అనధికారికంగా ఆరుగురు వ్యక్తులకు విక్రయించారు. ఆ విక్రయాలు చెల్లవని దేవస్థానం అధికారులు కోర్టుని ఆశ్రయించగా 2006లో జిల్లా కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించగా వాదోపవాదానల అనంతరం హైకోర్టు గత మార్చి నెలలో సదరు భూమి దేవస్థానానికి చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీనిపై కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని దేవస్థానం అధికారులకు అప్పగించారు. -
పట్టాలెక్కిన ప్రసాద్ నిర్మాణాలు
అన్నవరం: రత్నగిరిపై ప్రసాద్ పథకం నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం కింద కేటాయించిన రూ.25.32 కోట్లలో రూ.18.98 కోట్లతో చేపట్టనున్న పనులకు గత మే నెలలో టెండర్లు ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా పనులు చేపట్టనున్న స్థలాలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. అతి త్వరలో ప్రతిపాదించిన నిర్మాణాలు ప్రారంభిస్తామని, వచ్చే ఆగస్టు నాలుగో తేదీకి వాటిని పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లేకుంటే ఆ నిధులు మురిగిపోతాయని వివరించారు. ఆయన వెంట ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, టూరిజం ఈఈ విజయ భాస్కరరెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రసాద్ నిధులతో అన్నదాన భవనం నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న టూరిజం సీఈ వెంకట రమణ, ఇతర అధికారులు -
అనధికార క్వారీల్లో తనిఖీలు
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల సర్వే నెంబరు 15లో అనధికారికంగా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి చేపట్టిన ఈ తనిఖీలో రెండు చోట్ల అనధికార క్వారీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు క్వారీల్లో పనిచేస్తున్న రెండు జేసీబీలు, ఒక లారీని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనధికారికంగా నల్లరాయి క్వారీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ అధికారులు సత్యతేజ, రవీంద్రలు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ అకాడమీలో గురువారం జిల్లా స్థాయిలో చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు ఉత్కంఠగా జరిగింది. ఈ జిల్లా చెస్ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించి ర్యాపిడ్ విభాగంలో బండారు నానిబాబు ప్రథమ, ద్రాక్షారపు సాత్విక్ ద్వితీయ స్థానాలు, బ్లిట్జ్ విభాగంలో ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ, పనిశెట్టి సాయి అవినాష్ ద్వితీయ స్థానాలు సాధించారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ మాట్లాడుతూ విజేతలు ఈ నెల 13 నుంచి నంద్యాలలో జరిగే రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఇద్దరి ఎంపిక రావులపాలెం: రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ అండర్–19 విభాగానికి డాన్ బాస్కో హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆర్.పవన్ కుమార్, ఎ.వినయ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జె.విద్యాసాగర్ గురువారం తెలిపారు. కర్నూలులో ఈ నెల 22 నుంచి 24 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 10న జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 బాలుర విభాగంలో జిల్లా స్థాయిలో చక్కటి ప్రతిభ చూపారన్నారు. జూదరులకు జరిమానా కిర్లంపూడి: పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వారిని గురువార ంప్రత్తిపాడు కోర్టుకు హాజరు పర్చామన్నారు. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున జరిమానా విధించారన్నారు. మరోసారి పేకాట ఆడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పనితీరుతో ఉద్యోగులకు గుర్తింపు
● పంచాయతీరాజ్ కమిషనర్ ముత్యాలరాజు ● ఈటీసీలో ఎంపీడీఓల శిక్షణ పరిశీలన సామర్లకోట: ఉద్యోగులు మంచి పనితీరుతో గుర్తింపు పొందవచ్చని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ కమిషనర్ రేవు ముత్యాలరావు అన్నారు. సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రానికి (ఈటీసీ) గురువారం ఆయన విచ్చేశారు. అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జల్లాల్లోని ఎంపీడీఓలకు జరుగుతున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రతిచోటా ఎదురయ్యే సమస్యలను నైపుణ్యంతో సమర్థంగా అధిగమించాలన్నారు. అంతకు ముందు జరిగిన ఈటీసీ నిర్వహణ కమిటీ సమావేశానికి కమిషనర్ ముత్యాలరాజు అధ్యక్షత వహించారు. ఈటీసీలో జరుగుతున్న శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కావాల్సిన అవసరాలపై ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. జీఎస్డబ్ల్యూ, వైద్యం, విద్య, ఇంజినీరింగ్ వంటి ఇతర శాఖల శిక్షణలు కూడా ఈటీసీలో జరిగేలా తీర్చిదిద్దాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అనంతరం విస్తరణ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, డీడీఓలు శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు. -
22 నుంచి పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు
శరన్నవరాత్ర ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న పీఠాధిపతి గాడ్ తదితరులు రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయదుర్గా పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు గురువారం విలేకరులకు తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం 8.19 గంటలకు గురుహోరలో కలశస్థాపన జరుగుతుందన్నారు. పీఠంలోని కొలువైన విజయదుర్గా అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. అమ్మవారు దర్శనమిస్తారిలా.. ఈ నెల 22న బాలాత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న రజిత కవచ అలంకృత విజయదుర్గాదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరీదేవి, 28న విజయదుర్గాదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్దని, 2న రాజరాజేశ్వరి అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ పీఠాధిపతి గాడ్ సమక్షంలో అడ్మినిస్ట్రేటర్ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబి తదితరులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. -
ప్లీనరీ సెషన్లో ‘ఆదిత్య’ సతీష్ రెడ్డి
గండేపల్లి: న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఈ నెల 10న జరిగిన అఖిల భారత మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 52వ జాతీయ మేనేజ్మెంట్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ప్లీనరీ సెషన్లో ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్ ఎన్.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. పారిశ్రామిక, విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మేనేజ్మెంట్, వ్యాపార రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. కార్యక్రమంలో నితిన్ ఆట్రోలే (చీఫ్ స్ట్రాటజీ, కేపీఎంజీ), సంజయ్ కుమార్ సింగ్ (డైరెక్టర్, స్ట్రాటజీ, ఎక్స్టర్నల్ రిలేషన్స్, జిందాల్ స్టీల్ లిమిటెడ్), సంజయ్ నారాయణ్ (చీఫ్ జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), తదితర ప్రముఖులు పాల్గొన్నారన్నారు. తిరుమల విద్యాసంస్థల సిబ్బంది రక్తదానం రాజమహేంద్రవరం రూరల్: తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు జన్మదినం సందర్భంగా గురువారం తిరుమల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కాతేరులోని సంస్థ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు, డాక్టర్ వైఎస్సార్ అండ్ జక్కంపూడి రామ్మోహనరావు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాలలో సుమారు 265 మంది తిరుమల సిబ్బంది రక్తదానం చేశారు. వారికి నున్న తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రక్తాన్ని డబ్బుతో కొనలేమని, వెల కట్టలేనిదన్నారు. ప్రపంచంలో మనిషి నుంచి మాత్రమే రక్తం లభిస్తుందన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో తిరుమలరావు సోదరులు నున్న కృష్ణ, నున్న సురేష్, డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ బాలిక మృతి అల్లవరం: దేవగుప్తం పంచాయతీ నల్లగుంటకు చెందిన బాలిక ఈ నెల ఒకటో తేదీన పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికి బాలిక పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పది రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు. -
కళకాలం నిలిచేలా..
● డైట్లో కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 మంది విద్యార్థుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: ఎప్పుడూ పుస్తకాల్లోని పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో సత్తా చాటి శభాష్ అనిపించుకున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణసంస్థ (డైట్)లో గురువారం కళా ఉత్సవ్ 2025 పేరిట జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. గాత్రం, వాయిద్య సంగీతం, నృత్యం అంశాల్లో సోలో, గ్రూప్ విభాగాలలో పోటీలు జరిగాయి. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 35 పాఠశాలల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. సృజనాత్మకతకు వేదిక ప్రారంభోత్సవంలో డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచి వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకుడు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిపక్వతకు, మనో వికాసానికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. శుక్రవారం సోలో(2డి), సోలో(3డి), గ్రూపు (2డి/3డి), థియేటర్ ఆర్ట్స్, సంప్రదాయ కథనాలకు సంబంధించి గ్రూపు విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. బహుమతుల ప్రదానం తొలిరోజు జరిగిన పోటీల్లో విజేతలకు ప్రిన్సిపాల్ ఆర్జేడి రాజు చేతులమీదుగా సర్టిఫికెట్లు, షీల్డ్‌లు అందజేశారు. వీరందరూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా కేటీ సుబ్బరాయన్, ఎం.నాగేశ్వరరావు, డి. రవి కిరణ్ వ్యవహరించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● గాత్రం వ్యక్తిగత విభాగంలో కె.షర్మిల, బృంద విభాగంలో ఎన్.సుమశ్రీ, ఆర్.భారతి, ఈ.నాగజ్యోతి, కె.శిరీష (అంబేడ్కర్ గురుకులం, ఏలేశ్వరం) ● వాయిద్యం వ్యక్తిగత విభాగానికి సంబంధించి స్ట్రింగ్‌లో టీవీకే దేవీ ప్రియాంక (భాష్యం స్కూల్, కాకినాడ), పెర్కషన్లో కె.కార్తికేయ హిమాన్షు (కలాం జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం). ● నృత్యం వ్యక్తిగత విభాగంలో సీహెచ్ హేమసత్య (చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాల), బృంద విభాగంలో సీహెచ్ త్రిలోచన, పి.జ్యోతి లహరి, జి.చరణ్ సాత్విక్, ఎం.పవన్ కుమార్ (గాంధీపురం మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం). -
క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు
● విద్యాశాఖ ఏఓ షరీఫ్ ● రాష్ట్ర స్థాయికి 106 మంది ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఏఓ షరీఫ్ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురువారం పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 విభాగంలో క్రీడాకారుల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) కార్యదర్శి కనకాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఏఓ షరీఫ్, గౌరవ అతిథులుగా రూరల్ ఎంఈఓ టీవీఎస్ రంగారావు, అర్బన్ ఎంఈఓ రవి హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను షరీఫ్, ఎస్జీఎఫ్ఐ జెండాను రవి ఆవిష్కరించారు. రూరల్ ఎంఈఓ టీవీఎస్ రంగారావు, చేయూత సంస్థ అధ్యక్షుడు రవి, హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్, మాజీ ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి జార్జి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీను క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో అండర్ 14, 17 విభాగంలో ఆర్చరీ, ఘట్కా, సపక్ తక్రా క్రీడల్లో నిర్వహించిన ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 350 మంది హాజరయ్యారు. వీరి నుంచి రాష్ట్ర స్థాయికి 106 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ మాజీ కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సునీల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ ప్రతినిధి మాచరరావు, ఆర్చరీ కోచ్ లక్ష్మణ్, మాజీ పీఈటీ సంఘ అధ్యక్షుడు రవిరాజు, పట్టాభి, గిరి, గాంధీ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఎంపికలను పాఠశాల క్రీడా సమాఖ్య సంయుక్త కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
మూతపడే దుస్థితికి చేనేత సంఘాలు
రామచంద్రపురం రూరల్: చేనేత సహకార సంఘాల నిధులన్నీ ఆప్కో బకాయిల రూపంలో స్తంభించిన కారణంగా సభ్యులకు ఉపాధి కల్పించలేని దుస్థితికి సంఘాలు చేరుకున్నాయని లివరీ ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్య ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. హసన్‌బాద చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లివరీ చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సత్య ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన 10 నెలలుగా బకాయిలు పేరుకు పోయాయన్నారు. బ్యాంకుల నుంచి మంజూరు కాబడిన నిధులు పూర్తిగా వినియోగించుకోలేక పోవడంతో సంఘాల బ్యాంకు ఖాతాలన్నీ ఎన్‌పీఏలోకి వెళుతున్నాయన్నారు. కొన్ని సంఘాలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆప్కోకు ఎన్నికలు నిర్వహించి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హసన్‌బాద, ఆదివారపుపేట, శివల, అద్దంపల్లి, నేలటూరు, ముమ్మిడివరం, తమ్మవరం, మురారి, నల్లూరు తదితర చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సంస్కృతుల వారధి.. సమైక్య సారథి
● దేశంలో హిందీ భాషకు ఎంతో ప్రాధాన్యం ● జాతీయ భాషగా గుర్తింపు ● ఈ నెల 14న జాతీయ హిందీ దివస్ రాయవరం: భారతదేశం వివిధ సంస్కృతులు, విభిన్న భాషలు, నాగరికతలకు నెలవు. ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునేందుకు, మాట్లాడేందుకు భాష అవసరం. ప్రతి రాష్ట్రానికి ప్రాంతీయ భాష ఉంటుంది. దాదాపు 3,372 పైగా భాషలను దేశ ప్రజలు మాట్లాడుతుండగా, వాటిలో అధికారికంగా 24 భాషలను గుర్తించినప్పటికీ జాతీయ భాషగా హిందీని భావిస్తున్నాం. 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని జాతీయ అధికారిక భాషగా గుర్తించింది. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దివస్‌గా జరుపుకొంటున్నారు. హిందీ నేపథ్యం పర్షియన్ పదం ’హింద్ ’ నుంచి హిందీ పుట్టుకొచ్చింది. ఇండస్ నది పారుతున్న నేలలో మాట్లాడే భాష అని దీని అర్థం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రెండు భాషల్లో హిందీ ఒకటి. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌త్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, న్యూజిలాండ్, యూఏఈ, ఉగాండా, గయానా, ట్రినిడాడ్, మారిషస్, దక్షిణాఫ్రికాల్లో హిందీనిగణనీయ సంఖ్యలో మాట్లాడుతారు. విశిష్ట సేవలు అందిస్తున్న ప్రచారక్‌లు హిందీ భాషపై, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగింది. ఫలితంగా అన్ని ప్రాంతాల్లో హిందీ ప్రచారక్‌లు ముందుకు వచ్చి హిందీ ప్రాథమిక స్థాయి పరీక్షల నుంచి ఉన్నత స్థాయి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులను తయారు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు సైతం ఈ కోర్సులు పూర్తి చేసి, అనంతరం ప్రభుత్వ కొలువులు పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలను జనాభాపరంగా పరిశీలిస్తే ఇంగ్లిషు, చైనా భాషల తర్వాతి స్థానం హిందీదే. ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దా హిందీ భాష ద్వారా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. దీన్ని నేర్చుకున్న చాలామంది దేశ, విదేశాల్లో ఉపాధి పొందారు. వందల మంది హిందీ ప్రచార సభ ద్వారా శిక్షణ పొంది హిందీ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. – మహ్మద్ అబ్దుల్ హమీద్, విశ్రాంత టీచర్, కేంద్ర వ్యవస్థాపక్, హిందీ ప్రచార సభ, మలికిపురం. హిందీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు హిందీ భాషతో ఉపాధి చాలా మంది పది, ఇంటర్ తరా్వాత హిందీ సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ చేస్తున్నారు. తర్వాత హిందీ పండిట్ శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. హిందీ భాషకు సంబంధించి ప్రస్తుతం ట్యూషన్ సెంటర్లు ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా ఎంతో మందితో పరీక్షలు రాయిస్తున్నాను. – పి.చిట్టి రుక్మిణి, విశ్రాత గ్రేడ్–1 హిందీ టీచర్, రామచంద్రపురం. వారసత్వ సంపద హిందీ భాష భారతీయులందరికీ వారసత్వ సంపద లాంటిది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఈ భాషకు ప్రాముఖ్యత ఉంది. ఈ భాషాభివృద్ధికి విద్యార్థి దశ నుంచే ప్రోత్సాహం అందించాలి. భాషపై ఏకాగ్రత ఉంచితే నేర్చుకోవడం చాలా సులభం. – మద్దింశెట్టి రాంబాబు, హిందీ టీచర్, పసలపూడి, రాయవరం మండలం -
ఏటీఎస్‌లు కాదు.. ఏటీఎంలు!
ప్రస్తుతం నడుస్తున్న పనిని మరింత సులభతరం చేయడానికి తద్వారా ప్రజలకు సమయం.. ఖర్చు ఆదా.. మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆధునిక పద్ధతులు అమలుచేస్తుంటాయి. ఆ పద్ధతులు లక్ష్యాలు సాధించకపోగా మరిన్ని సమస్యలకు కారణమైతే మొదటికే మోసం వస్తుంది. రవాణాశాఖలో నేడు ఇదే జరుగుతోంది. వాహనాలకు సామర్ధ్య సర్టిఫికెట్ల జారీ వ్యవహారం ఆ శాఖకు తలనొప్పులు తీసుకురావడంతో పాటు, వాహన చోదకులకు, యజమానులకు ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తోంది. గతంలో అధికారుల పర్యవేక్షణలో స్వయంగా వాహనాన్ని పరీక్షించి ఈ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. అందులో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఏటీఎస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో నేరుగా యంత్రమే వాహనాన్ని పరీక్షించి సామర్ధ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఈ పరీక్షల బాధ్యతలు అప్పగించారు. దీంతో అక్కడ ఏజెన్సీ నిర్వాహకులే సర్టిఫికెట్‌ను బట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏటీఎస్ లక్ష్యం నెరవేరడం లేదు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇటీవలే కాకినాడ సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదపుతప్పి కాల్వలోకి దూసుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఎవ్వరికీ ప్రాణనష్టం జరగకపోయినా దానికి గల కారణం ఆరాతీస్తే బ్రేకులు ఫెయిల్ అయినట్టు తెలిసింది. ఈ వాహనానికి గత జూన్ నెలలో ఏటీఏస్ సెంటర్ ద్వారా అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం. వాహనాన్ని ఎవరూ నడపకుండానే యంత్రాలతో పూర్తిస్థాయిలో పరీక్షించకుండా సర్టిఫికెట్ జారీచేశారు. ఇదే ప్రమాదానికి ఒక కారణంగా నిలుస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా జిల్లాలో దాదాపు 1,498 పాఠశాల బస్సులు ఉండగా వీటన్నింటినీ ఈ ఒక్క ఫిట్నెస్ సెంటరు ద్వారానే సర్టిఫికెట్లు జారీచేశారు. ఇలా స్కూల్ బస్సులే కాకుండా లారీలు, ట్రాక్టర్లు, క్యాబ్, కార్లు, వ్యాన్లు వంటి అన్ని రకాల వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఏటీఎస్ ద్వారానే జారీ చేస్తున్నారు. అధికారుల నుంచి తప్పించి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ఇచ్చామనుకుంటే మొదటికే నష్టం వచ్చేలా కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ నిల్.. వాహనాల ఫిట్నెస్ విధుల్లో రవాణాశాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడటంతో దీనికి చెక్ పెట్టేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఏస్) తీసుకు వస్తే ఆ విధానంలో సైతం మామూళ్ల పర్వం మొదలుపెట్టేశారు. ఫిట్నెస్ కేంద్రాల్లో వాహనాన్ని బట్టి రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలకు పిట్నెస్ పరీక్షకు రూ.వెయ్యి, సర్టిఫికెట్‌కు రూ.200, సర్వీస్ ఛార్జ్ రూ.120 కలిపి రూ.1320 అన్లైన్లో చెల్లించాలి. చిన్న తరహా వాహనాలు, కార్లు, ఆటోలు వంటివి మొత్తం 860 నుంచి 920 వరకూ చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఏటీఎస్ సెంటర్లు అన్లైన్ ఫీజుతో సంబంధం లేకుండా భారీ వాహనాలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు, చిన్న వాహనాలకు రూ.1500 వరకూ వసూలు చేస్తున్నారు. గతంలో రవాణాశాఖ కార్యాలయం ఆధీనంలో రవాణా వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహించేవారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ఏటీఏస్ సెంటర్ల ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది జవనరి నుంచి కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఏడీబీ రోడ్డులో ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సులు, నాలుగు చక్రాల వాహనాలు, లారీలు వంటివి ఎంవీఐ’ (మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్)ల ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి దాదాపు కిలోమీటర మేర డ్రైవింగ్ చేసి అన్ని సక్రమంగా ఉంటే పిట్నెస్ జారీ చేసేవారు. ఈ బాధ్యతల నుంచి వీరిని తప్పించి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడంతో ఏటీఎస్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందుతున్నారు. జిల్లా మొత్తానికి సేవలందించే బాధ్యతను ఒక ఏజెన్సీకు అందజేయడంతో కత్తిపూడి యూనిట్‌తో పాటు పెద్దాపురం యూనిట్‌కు సంబంధించి ఆయా మండలాల ఫరిధిలో ఉన్న వాహనాలు అన్నీ ఇక నుంచి కాకినాడ బీచ్‌రోడ్డులో ప్రైవేట్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి రావల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి వాహనాలకు ఫిట్నెస్ కావాలంటే వ్యయ ప్రయాసలకు గురికావడంతో పాటు సమయం ఎక్కువ వృథాకావడం ఖాయమని వాహానదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్తిపూడి పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాలు, పెద్దాపురం పరిధిలో మెట్ట గ్రామాల నుంచి కాకినాడ రావాలంటే దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు రావలసిన పరిస్థితి ఉంది. కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ లోపలి భాగంకత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై గత నెలలో జరిగిన ప్రమాదంలో నుజ్జయిన ముందుభాగంజిల్లాలో వాహనాల వివరాలు బస్సులు 489 స్కూల్ బస్సులు 1498 గూడ్స్ క్యారియర్లు 13,546 లగ్జరీ క్యాబ్‌లు 60 మ్యాక్సీ క్యాబ్‌లు 481 మోటర్ క్యాబ్‌లు 1730 ఒమ్నీ బస్సులు 46 ప్రైవేట్ సర్వీస్ వెహికల్ 237 త్రీవీలర్ (గూడ్స్) 3483 ప్యాసింజర్ ఆటోలు 13,194 ట్రైలర్ 3491 కమర్షియల్ ట్రాక్టర్లు 912 ఫిర్యాదులు వస్తున్నాయి ఫిట్నెస్ కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు బండి కండిషన్ చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇలా ఏటీఎస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో మా పాత్ర ఏమీలేదు. కేవలం వాహనానికి ఫిట్నెస్ లేకపోతే కేసు రాయడం తప్ప వాహనాన్ని తనిఖీచేసే అధికారం లేదు. – కె.శ్రీధర్, డీటీసీ, కాకినాడ ఉదయం నుంచి పడిగాపులు గతంలో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు అధికారులు వాహనాన్ని నేరుగా క్షణ్ణంగా పరిశీలించి డ్రైవింగ్ చేసి బ్రేకులు అన్నీ పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఇప్పుడు ఈ కేంద్రానికి వస్తే టోకెన్ ఇచ్చి మమల్ని బయట ఉండమంటున్నారు. వారే వాహనం తీసుకెళ్లి మళ్లీ బయటకు ఇస్తున్నారు. వాహనంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని స్వయంగా వాహన యాజ మాని తెలుసుకోనే అవకాశం లేదు. ఒక వేళ ఫెయిల్ అని వస్తే మళ్లీ మరుసటి రోజు రావాలి. ఈ కేంద్రాల పనితీరులో సమయం చాలా వృధా అవుతుంది. – ఆర్.రాజా, వాహన యజమాని, కాకినాడ వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో చేతివాటం అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ఏజెన్సీ వాహనానికి రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు తప్పుడు సర్టిఫికెట్లతో రోడ్లపై తిరిగి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు ఏమీచేయలేమని చేతులెత్తేస్తున్న రవాణాశాఖ అధికారులు -
‘సాక్షి’పె కేసులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి
ఎమర్జెన్సీని మించిన అరాచకం రాష్ట్రంలో చూస్తున్నాం. ‘సాక్షి’పై అక్రమ కేసులు పెట్టి నైతికస్థైర్యం దెబ్బతీసే ఎత్తుగడలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. చంద్రబాబు సర్కార్ అప్రజాస్వామిక చర్యలు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. సాక్షి మీడియా, ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిమైతే సంబంధిత శాఖ అధికారులు ఖండించవచ్చు. లేదా పరువునష్టం దావా వేసుకునే వీలు చట్టంలోనే ఉంది. కానీ దాడులకు తెగబడటం అవివేకం.– తోట నరసింహం, మాజీ మంత్రి, వీరవరంనేతల వార్తలు ప్రచురిస్తే అక్రమ కేసులారాజకీయ నాయకులు చేసే ప్రకటనలు వార్తగా ప్రచురిస్తే కేసులు, వేధింపులకు పాల్పడడం దుర్మార్గం. ప్రజల పక్షాన నిలిచే ‘సాక్షి’ పత్రిక సంపాదకుడు ఆర్.ధనుంజయరెడ్డిని అక్రమ కేసులతో వేధించడం తప్పే. వార్తలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వివరణ ఇచ్చుకోవాలి. లేదంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రజాస్వామ్యానికి తూట్లుపొడిచే విషసంస్కృతిని మేధావులు ప్రశ్నించాలి. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, తుని -
● సముద్రుడి ఉగ్రరూపం
● తీరంలో ఎగసిపడుతున్న అలలు ● ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు ఛిద్రం ● అప్రమత్తమైన అధికార యంత్రాంగం ● పాఠశాల ఆవరణలోకి ప్రవేశించిన నీరు కొత్తపల్లి: ఎటువంటి తుఫాను హెచ్చరికలు లేకపోయినా సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. గురువారం ఉప్పాడ తీర ప్రాంతం, బీచ్ రోడ్డుపై సముద్ర కెరటాలు విరుచుకుపడ్డాయి. దీంతో తీరప్రాంతం అతలాకుతలమైంది. ఉప్పాడ శివారు ప్రాంతాలైన సూరాడ పేట, మాయాపట్నం, జగ్గరాజుపేట, పాత బజారు, పల్లిపేట, రంగంపేట, సుబ్బంపేటలపై సముద్రం కెరటాలు విరుచుకుపడుతున్నాయి. ఎగసిపడే కెరటాలతో బీచ్ రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో పోలీసులు ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్లో ప్రయాణికుల రాకపొకలు పూర్తిగా నిలిపివేశారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగంపేటలో ఉన్న ఎంపీపీ పాఠశాలలోకి సముద్రపు నీరు చేరి మోకాలెత్తు నిలిచింది. దీంతో అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. తీరప్రాంతలో కెరటాల తాకిడికి పలు గృహాలు నేలమట్టం అవుతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. -
ఉచితమని నిర్లక్ష్యమా?
● ఆపకుండా వెళ్లిపోతున్న బస్సులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు గండేపల్లి: లబ్ధిదారులకు వినియోగపడని ఏ ప్రభుత్వ పథకమైనా వృథాయే. సూపర్ సిక్స్‌లో భాగంగా ఆర్భాటంగా ప్రారంభించిన సీ్త్రశక్తి ఉచిత బస్సు పథకం మహిళలకు చుక్కలు చూపిస్తోంది. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తుంటే అవి రావడం ఆగకుండా పోవడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. మండలంలోని నీలాద్రిరావుపేటకు చెందిన నక్కా అప్పలకొండ, దుర్గ, గౌరి, దోనాద్రి అచ్చియమ్మ, యెడల అచ్చమ్మ, తుపాకుల రాజమ్మాయి, సీంద్రపు కాసులమ్మ, కన్నాటి దుర్గ, దోనాదుల అచ్చమ్మ, తదితర మహిళలు గురువారం ఉదయం రాజమండ్రి వెళ్లేందుకు గ్రామంలో రహదారిపై వేచి ఉన్నారు. వీరంతా ఫ్రీ బస్సుకోసం ఎదురుచూస్తుండగానే బస్సులు రావడం, ఆగకుండా వెళ్లిపోవడం జరిగిపోయాయి. వాటిలో చాలా ఖాళీ ఉన్నా, ఆపమని చెయ్యి ఊపినప్పటికీ అవి వెళ్లిపోయాయని వివరించారు. ఉదయం సుమారు 8 గంటల నుంచి నిలబడి ఉన్నామని రెండు గంటలు నిలబడినా తమ ప్రయాణం ప్రారంభం కాలేదని వారు తెలిపారు. అసలే అరకొర బస్సులు ఆపై సమయపాలన పాటించవు.. ఈ పరిస్థితుల్లో తాము గమ్యస్థానాలకు ఎలా వెళ్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమ వ్యాపారాల సమాచారం ఇవ్వండి జిల్లా వాణిజ్య పన్నుల శాఖ జేసీ శ్రీలక్ష్మి కాకినాడ రూరల్: జిల్లాలో అక్రమ వ్యాపార కార్యకలాపాలను ఎదుర్కొనడంలో వాణిజ్య పన్నుల శాఖ ప్రయత్నాలకు ప్రజలు, వర్తకులు, వర్తక సంఘాలు సహకరించాలని కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ డి.శ్రీలక్ష్మి విజ్జప్తి చేశారు. అక్రమ వ్యాపార కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు తమ శాఖ చీఫ్ కమిషనర్ కాకినాడ డివిజన్‌కు సంబంధించి వాట్సాప్ నెంబరు 87126 31287ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అక్రమ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి వివరాలను వాట్సాప్ నెంబరు ద్వారా తెలియజేయాలని జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి కోరారు. ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులుగా సుధారాణి, శ్రీను నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య సంయుక్త కార్యదర్శులుగా జిల్లాకు చెందిన సీనియర్ పీడీలు కనకాల శ్రీనివాసరావు, పి.సుధారాణి నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. కనకాల శ్రీనివాసరావు వేళంగి జెడ్పీ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్నారు. 2012–13 సంవత్సరంలో కూడా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి పరిఽధిలో ఎస్జీఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేశారు. సుధారాణి సామర్లకోట మండలం పీఎం శ్రీ ఎంపీఎల్ పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ 2025–26 సంవత్సరానికి ఏజీఎఫ్ఐ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. గతంలో జిల్లాకు ఒకరే ఎస్జీఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేసేవారు. కానీ ఈ ఏడాది మారిన నిబంధనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ బాలురకు వేరుగా, బాలికలకు వేరుగా కార్యదర్శులను నియమించడంతో జిల్లా నుంచి వీరు ఇరువురికి అవకాశం లభించింది. నూతన కార్యదర్శులను మాజీ కార్యదర్శి ఎల్.జార్జి, సంయుక్త కార్యదర్శి సునీల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీను, సీనియర్ పీడీలు రంగారావు, రవిరాజు, పట్టాభి, మాచరరావు, ప్రసాద్, గిరి గురువారం అభినందించారు. నేడు ధాన్యం కొనుగోళ్లపై సమీక్షబోట్క్లబ్ (కాకినాడ సిటీ): రబీలో ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం 10.15 గంటలకు కలెక్టరేట్లో ఐదు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాశాఖ అధికారులు పాల్గొననున్నారు. -
జీవితాలతో ఆటోలాడొద్దు..
సాక్షి, అమలాపురం: జీవితాలతో ఆటలాడుతున్నారు.. సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి బ్రేక్‌లు వేశారు.. ఆటో కార్మికుల జీవితాలను కుదిపేశారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, రోజువారీ ఆదాయానికి గండి పెట్టడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీ్త్ర శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రోడ్డున పడ్డామని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆదాయం సగానికి పడిపోవడంతో పాటు పెరిగిపోతున్న ఫైనాన్స్ భారాన్ని మోయలేక రోడ్డెక్కారు. దశల వారీగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆటో కార్మికుల ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం తీసుకు వచ్చిన తరువాత కార్మికుల రోజువారీ ఆదాయానికి భారీగా గండి పడింది. గతంలో రోజుకు రూ.వెయ్యి వరకూ ఆదాయం చూసిన కార్మికులకు ఇప్పుడు రూ.300 నుంచి రూ.500 కూడా రావడం లేదు. దీనితో జిల్లాలో సుమారు 25 వేలకు మందికి పైగా ఉన్న కార్మికుల జీవనోపాధికి గండి పడినట్టయ్యింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కొంత వరకూ సర్వీసు ఉంది. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు వెళ్లని గ్రామాలకు వెళ్లే ఆటో కార్మికులకు వచ్చే ఆదాయం పెద్దగా తగ్గలేదు. ఉదాహరణకు అమలాపురం నుంచి ఉప్పలగుప్తం మీదుగా ఎన్.కొత్తపల్లి, కూనవరం, అమలాపురం మండలం సాకుర్రు, అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, ఐ.పోలవరం మండల కేంద్రానికి, మురమళ్ల నుంచి టి.కొత్తపల్లి, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేల్లంక, మలికిపురం మండలం అప్పనరామునిలంక, గుడిమెల్లంక వంటి బస్సు సర్వీసులు లేనిచోట ఆటో కార్మికులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఒకటి, రెండు బస్సు సర్వీసులు ఉన్నచోట కొంత వరకూ ఆదాయం తగ్గగా, అధిక సర్వీసులు తిరిగే అమలాపురం నుంచి రావులపాలెం, రావులపాలెం మీదుగా బొబ్బర్లంక, వాడపల్లి, రాజోలు నుంచి అమలాపురం, రాజోలు నుంచి పి.గన్నవరం మీదుగా రావులపాలెం, అమలాపురం నుంచి ముమ్మిడివరం, మురమళ్ల మీదుగా యానాం, అమలాపురం నుంచి ముక్తేశ్వరం, అమలాపురం నుంచి కాట్రేనికోన, అమలాపురం నుంచి అల్లవరం, యానాం నుంచి రామచంద్రపురం, మండపేట మీదుగా రావులపాలెం వంటి బస్సులు అధికంగా తిరిగే రూట్లలో ఆటో కార్మికుల ఉపాధి మూడొంతులు పడిపోయింది. అమలాపురం బస్టాండ్ నుంచి రావులపాలెం బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో సర్వీసులు దాదాపు నిలిపివేశామని కార్మికులు చెబుతున్నారు. ఇదే సమయంలో తనిఖీలు, ఫిట్నెస్, పొల్యూషన్ పేరుతో ఎడాపెడా ఫైన్లు రాస్తుండడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. దీనిని అమలాపురం మండలం ఎ.వేమవరంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇదొక్కటే కావడంతో రామచంద్రపురం, మండపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి వంటి సుదూర మండలాల నుంచి ఇక్కడకు వచ్చి సర్టిఫికెట్ పొందడం కూడా వారికి భారంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోక.. ప్రధాన మార్గాల్లో ఆదాయం కోల్పోవడం ఆటో కార్మికుల రోజువారీ జీవనానికి సైతం కష్టాలు వచ్చాయి. ఇతర మార్గాల్లో ఆటోలు తిప్పుతుంటే ఇతర కార్మికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. నిత్యం సర్వీసులు తిరిగే మార్గాల్లో ఆదాయం లేకుండా పోయింది. అన్ని ఖర్చులూ పోను రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వచ్చేచోట ఇప్పుడు రూ.మూడు వందలు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనితో వారు నిరసన బాట పట్టారు. ఇప్పటికే జిల్లాలో దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టారు. ఆటోలకు నల్ల జెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. మండలాల వారీగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆటోలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనందున ఈ నెల 12, 13వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. హామీ.. పట్టదేమీ! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేది. దీనివల్ల జిల్లాలో వేలాది మంది కార్మికులు రూ.కోట్ల మేర లబ్ధి పొందారు. ఆటో మరమ్మతులు, రోడ్ ట్యాక్స్, ఇతర అవసరాల కోసం వినియోగించుకునేవారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికునికి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో తాము ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆ ఊసెత్తడం లేదు. ఈ ఏడాదితో కలిపి ఒక్క ఆటో కార్మికునికి రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. అదీ ఇవ్వక, వచ్చే ఆదాయ మార్గం లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సీ్త్ర శక్తి పథకంతో రోడ్డున పడిన కార్మికులు నిరసిస్తూ రేపు, ఎల్లుండి ఆటోల బంద్ ఎన్నికల హామీని పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు ఎప్పటికి ఇస్తారో! -
మనసు కలతకు మరణం శరణం కాదు
● ఆత్మహత్య చేసుకుని సాధించేదేమీ లేదు ● సమస్యను జయిస్తే మీరే విజేతలు ● డాక్టర్ వానపల్లి వరప్రసాద్ కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో సైకియాట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్చార్జి హెచ్‌వోడీ డాక్టర్ వానపల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మేరకు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రికి వివిధ ఆరోగ్య సమస్యలపై వచ్చిన రోగులను ఉద్దేశించి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడారు. చనిపోయి సాధించేది ఏమీలేదని, బతికి ఉండి కష్టాలు ఒడ్డి జీవితంలో గెలిస్తే పలువురికి ఆదర్శవంతులమవుతామన్నారు. ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన ఒక మానసిక సమస్య అని, ఈ సమస్యకు మందు ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఇన్చార్జి సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ మెహర్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాకినాడ సిటీ నియోజవర్గానికి చెందిన పెద్ది రత్నాజీని, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం నియోజవర్గానికి చెందిన ఓరుగంటి చక్రధరుడు ( చక్రి), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా జ్యోతుల వెంకట రాజు (బాబులు), రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శిగా జవ్వాది కృష్ణమాధవరావును నియమించారు. వినియోగంలోకి ఇంక్యుబేషన్ సెంటర్ కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ రూరల్: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం త్వరలో ఇంక్యుబేషన్ సెంటరును వినియోగంలోకి తీసుకురానున్నట్టు కలెక్టరు షణ్మోహన్ పేర్కొన్నారు. సర్పవరం ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్కు ఆటోనగర్‌లోని ఐటీ సెజ్‌ను బుధవారం ఆయన సందర్శించారు. నిరుపయోగంగా ఉన్న ఇంక్యుబేషన్ టవర్‌ను పరిశీలించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఏపీఐఐసీ జోనల్ మేనేజరు రమణారెడ్డి, ఇతర అధికారులతో చర్చించారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చించి, తక్షణం తీసుకోవల్సిన చర్యలపై మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఈ టవర్‌ను వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి మలికిపురం: వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షు డు బూశి జాన్‌మోషే డిమాండ్ చేశారు. బు ధవారం ఆయన మలికిపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైద్య విద్యను దూరం చేయడానికి వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో బహుజన విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన పీపీపీ విధానం ఆయన సామాజిక వర్గానికి ప్రయోజనంగా ఉందే తప్ప, దీనివల్ల బహుజనులకు ప్రయోజనం లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరిధిలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మెడికల్ సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తుంటారని, తను క్యాబినెట్లో ఉన్న మంత్రి నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నవారికి మెడికల్ కళాశాలను ధారాద త్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు. శనైశ్చరుని హుండీ ఆదాయం లెక్కింపు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ 10,06,005 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి, సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, దేవదాయ శాఖ అమలాపురం, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం హుండీలను తెరిచారు. వారి సమక్షంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు నగదును లెక్కించారు. 8 నెలల 11 రోజులకు హుండీ ద్వారా రూ.8,80,131, అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.85,357, దేవస్థానం క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయం హుండీ ద్వారా రూ.40,517 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. మందపల్లి ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకుడు సాదు చెంచయ్య, గ్రామ కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కూటమిలో లాఠీ లడాయి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమిలోని రెండు పార్టీల మధ్య సర్కిల్ వార్ నడుస్తోంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కోసం ఇరుపార్టీల ప్రధాన నేతలు పంతం నెగ్గించుకోవాలని పట్టుబడుతున్నారు. ఒక పార్టీ నేతలు సీఐను సాగనంపాలని మరో పార్టీ నేతలు కొనసాగించాలని పంతానికి పోతున్నారు. ఈ పరిణామం కూటమి నేతల మధ్య పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ తగాదా చివరకు చినబాబు దగ్గరకు చేరి కాకినాడ కూటమిలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. గడచిన వారం రోజులుగా సర్కిల్ ఇనస్పెక్టర్ వ్యవహారం కూటమిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రాద్ధాంతానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి మోదీ తల్లిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలే కావడం విశేషం. రాహుల్ వ్యాఖ్యలపై కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, యార్లగడ్డ రామ్‌కుమార్, జ్యోతుల రాజేష్, చెక్కా రమేష్ తదితర నేతల ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ధర్నాకు, రాహుల్ దిష్టిబొమ్మ దహనానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి మూడో పట్టణ పోలీసు స్టేషన్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు ఎస్సైలు, పోలీసులు కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలను అడ్డుకోవడం కమలనాథుల ఆగ్రహానికి కారణమైంది. రాహుల్ దిష్టిబొమ్మ దహనం చేయవద్దని పోలీసులు కట్టడి చేయడం కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు. అధికారంలో భాగస్వామ్యులమైన తమపైనే దురుసుగా ప్రవర్తిస్తారా, లాఠీలు ఝుళిపిస్తారా అంటూ స్వయంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు తదితర నేతలు ఆగ్రహంతో ఊగిపోతూ సీఐ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇక్కడి నుంచి సాగనంపాల్సిందేనని ఆందోళనకు దిగారు. దీంతో ఈ వివాదం కాస్తా రోడ్డెక్కింది. పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కోసం కాకినాడ జీజీహెచ్‌కు వెళితే పోలీసులు ఏ మాత్రం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కమలనాథులు తమ పార్టీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా పార్టీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారమంటూ సీఐపై చర్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి జోక్యంతో చివరకు పోలీసులు లాఠీచార్జిలో గాయాల పాలైనట్టుగా చెబుతున్న ఆరుగురు పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ చేయక తప్పలేదు. ఎమ్మెల్సీ చేయించడంతో సీఐతో సహా పలువురు పోలీసులపై ఫిర్యాదు చేయడం ద్వారా త్రీటౌన్ సీఐను సాగనంపే విషయంలో వెనక్కు తగ్గేది లేదని బీజేపీ నేతలు తెగేసి చెప్పినట్టయ్యింది. అతన్ని బదిలీ చేయాల్సిందేనని ఆ పార్టీ అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చారు. సీఐను బదిలీచేస్తారో, వీఆర్‌కు పంపిస్తారో ఏదో ఒకటి చేయకుంటే కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేనని, పార్టీని వీడాల్సి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ద్వారా మంత్రి సత్యకుమార్ దృష్టికితీసుకు వెళ్లడంతో అది కాస్తా చినబాబు పంచాయతీకి వెళ్లింది. ఇంతలో సీఐకు ఇక్కడ పోిస్టింగ్ రావడంలో క్రియాశీలకంగా వ్యహరించిన టీడీపీ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) వర్గీయులు ఇక్కడి నుంచి పంపవద్దని పోలీసు ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టడంతో ఇరుపార్టీ నేతల మధ్య వివాదం ముదిరి పాకానపడింది. ఇరు పార్టీల నేతలతో ఒక పోలీసు అధికారి మాట్లాడి సీఐను వీఆర్‌కు పంపిస్తామని, కొంత సమయం ఇవ్వాలని పార్టీ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నంచేశారు. ఇందుకు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన సానుకూలత వ్యక్తం చేయడంతో సమస్య పరిష్కారమైందని అంతా అనుకున్నారు. తీరా ఎమ్మెల్యే అనుచరుగణం మద్దతు ఉండటంతోనే సీఐపై చర్యలకు పోలీసు అధికారులు వెనుకాడుతున్నారనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ నేతలు మరోసారి రచ్చచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగంగా బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి గాయాలపాలైనా చర్యలు లేవంటే పార్టీ కార్యక్రమాలకు బయట తిరగలేమని ఆ నేతలు ఆ పార్టీ రాష్ట్ర నేతల వద్ద పెట్టడంతో చర్యలకు సిఫార్సు చేశారంటున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినప్పటికీ జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుతగులుతున్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని కమలనాథులు గట్టిపట్టుబడుతున్నారు. సీఐ వివాదం ఇంకా కొలిక్కి రాకుండానే కూటమిలోని టీడీపీ, బీజేపీ నేతల మధ్య రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. కాకినాడ గాంధీనగర్ 40వ డివిజన్లో టీడీపీ నేతలు లేకుండా బీజేీపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన, మాజీ అధ్యక్షుడు మాలకొండయ్య, ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి తదితరులు స్మార్ట్ కార్డులను ఇటీవల పంపిణీ చేయడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణించింది. తమ పార్టీ నేతలు లేకుండా స్మార్ట్ కార్డులు ఎలా పంపిణీ చేస్తారని టీడీపీ నేతలు పౌరసరఫరాల అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రేషన్ డీలర్‌ను సస్పెండ్ చేయించారు. బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయనే సాకుతో రేషన్ డిపోపై 6ఎ కేసు నమోదుచేయించి రేషన్‌షాపును తెరవకుండా టీడీపీకి చెందిన జొన్నాడ వెంకటరమణ తదితరులు తాళం వేయించారని బీజేపీ నేతలు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. టీడీపీ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో రేషన్ షాపును సీజ్ చేస్తారా అంటూ బీజేపీ నేతలు పౌరసరఫరాల అధికారులను నిలదీయడంతో చివరకు రేషన్ షాపునకు తిరిగి అనుమతించారు. ఇలా టీడీపీ, బీజేపీ నేతల మధ్య కోల్డ్‌వార్ రచ్చరచ్చ అవుతోంది. త్రీటౌన్ సీఐ సత్యనారాయణను సాగనంపాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఈ నెల ఒకటిన ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు, కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలపై సీఐ జులుం అతనికి అండగా ‘కొండ’ంత బలం ఆయన బదిలీకి కమలనాథుల పట్టు చినబాబు చెంతకు పంచాయితీ కాకినాడలో కాక రేపుతున్న రచ్చ -
చదువుల సరస్వతి.. దుర్గాదేవి
హోమియోపతి వైద్య విద్యలో ‘ట్రిపుల్ ధమాకా’ రాయవరం: హోమియోపతి వైద్య విద్యలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన గుంటూరి దుర్గాదేవి ప్రతిభ కనబర్చింది. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్ఎంఎస్) పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో దుర్గాదేవి బీహెచ్ఎంఎస్ డిగ్రీ పూర్తి చేశారు. బీహెచ్ఎంఎస్ కోర్సు పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో మూడు అవార్డులు కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఫస్టియర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకూ ప్రథమ స్థానంలో నిలిచినందుకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్కూడెంట్ అవార్డుగా న్యాపతి వెంకట శ్రీనివాసరావు బంగారు పతకాన్ని పొందారు. ఫస్టియర్ నుంచి ఫైనలియర్ వరకూ అధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ సూరపనేని చంద్రమౌళి ఎండోమెంట్ పురస్కారం అందుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నా తల్లి బాలనాగకోటేశ్వరి ఇచ్చిన ధైర్యం, పట్టుదలతో ముందడుగు వేశాను. తండ్రి కృష్ణ చిన్న హోటల్ వ్యాపారం చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహం, గురువులు చూపిన మార్గదర్శకత్వంతోనే ఈ విజయాలు సాధించాను. ప్రస్తుతం జయసూర్య పొట్టి శ్రీరాములు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీ) కోర్సు చేస్తున్నాను. నా భర్త కొప్పినీటి మణిబాబు స్ఫూర్తితో పీజీ కోర్సును అభ్యసిస్తున్నాను. –గుంటూరి దుర్గాదేవి, బీహెచ్ఎంఎస్ -
అశ్వత్థానికి దీపపుసెగ
● నల్లగా మాడిపోతున్న రావిచెట్టు మాను ● మొదలులో తీవ్రంగా వేడెక్కిపోతున్న వైనం ● రక్షణ చర్యలు అవశ్యం అన్నవరం: రత్నగిరికి వచ్చే భక్తుల అనాలోచిత చర్యలు ఆలయ ఆవరణలోని త్రిమూర్తి స్వరూపమైన భారీ అశ్వత్థ వృక్షానికి (రావిచెట్టు) చేటు చేస్తున్నాయి. ఆలయ ఆవరణలో సుమారు 50 ఏళ్లు పైబడిన ఉన్న ఆ వృక్షం చుట్టూ భక్తులు అవునేతితో దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేస్తుంటారు. నిత్యం తెల్లవారు ఝాము నుంచి సాయంత్రం వరకు సాధారణ రోజుల్లో ఐదు వేల నుంచీ పర్వదినాల్లో 25 వేలకు పైబడి దీపాలు ఆ వృక్షం చుట్టూ వెలిగిస్తుంటారు. దీంతో సాధారణంగానే ఆ చెట్టు మాను తీవ్రంగా వేడెక్కిపోతుంది. ఈ నేపథ్యంలో దీపాలను ఆ వృక్షానికి ఇబ్బంది లేనంత దూరంలో వెలిగించుకునే ఏర్పాట్లను అధికారులు చేయాల్సి ఉంది. గతంలో మాను చుట్టూ రేకు ఏర్పాటు గతంలో దీపాల సెగ వృక్షం మానుకు తగలకుండా చుట్టూ రేకు అమర్చేవారు. అలాగే మాను మొదట్లో నీరు పోసి తడిపే వారు. ఇప్పుడు ఆ చర్యలేమీ లేవు. ఇప్పటికై నా ఆ చర్యలను పునరావృతం చేసి మానుకు వేడి తగలకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే దీపాలు కొండెక్కాక వాటిని అక్కడి నుంచి తొలగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. దీపాల ద్వారా ఆదాయం రత్నగిరిపై ఉన్న దేవతా స్వరూపంగా అలరారుతున్న రావి వృక్షానికి దీపారాధన చేస్తే మంచి జరుగుతుందని ఆలయ వర్గాలు ప్రచారం చేస్తుంటాయి. దీంతో భక్తులు దీపాలు, ఆవునెయ్యి కొనుగోలు చేయడం ద్వారా దేవస్థానానికి రూ.1.5 కోట్ల ఆదాయం వస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా దుకాణదారులు సైతం దీపాలను ఆ వృక్షానికి దూరంగా పెట్టాలని భక్తులకు సూచించడం ద్వారా చక్కని ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు
రామచంద్రపురం: కె.గంగవరం మండలం అద్దంపల్లి సమీపంలో ఈనెల 3న దారి దోపీడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ ఎం.వెంకట నారాయణ వెల్లడించారు. పట్టణంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ద్రాక్షారామకు చెందిన యండమూరి శ్రీనివాస్ ఈ నెల 3న తాను పనిచేస్తున్న నగల దుకాణాన్ని మూసివేసి సుమారు రాత్రి 11 సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అద్దంపల్లి గ్రామం దేవాంగుల శ్మశాన వాటిక సమీపానికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని ఇనుప పైపుతో కొట్టి కళ్లలో కారం చల్లారు. సుమారుగా 10 గ్రాముల పాతబంగారం, సెల్‌ఫోన్ రూ.5 వేలు, షాపునకు సంబంధించిన రశీదులు, స్కూటర్‌తో పాటు సుమారు రూ.78 వేలు విలువైన వస్తువులు దోచుకుపోయారు. దొంగలకు మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ మేరకు ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ రఘువీర్ ఆదేశాల మేరకు సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం ఏరియా బైపాస్ రోడ్డులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తాళ్లరేవు మండలం గాడిమెగ గ్రామానికి చెందిన ఓలేటి సత్తిబాబు, సంగాడి రాజు, పత్తిగొంది గ్రామానికి చెందిన కళ్లేపల్లి ప్రసాద్‌గా గుర్తించారు. -
విద్యుత్ షాక్‌తో సెంట్రింగ్ కూలీ మృతి
కపిలేశ్వరపురం: మండలంలోని టేకి గ్రామానికి చెందిన సెంట్రింగ్ కూలి వాసంశెట్టి శ్రీనివాస్ (30) పని ప్రదేశంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం పడమర ఖండ్రిక గ్రామంలో ఇంటి శ్లాబ్ సెంట్రింగ్ పనికి వెళ్లాడు. శ్రీనివాస్ ఆ భవనం కింది నుంచి ఊసను పైకి లాగుతుండగా 11 కేవీ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వి.శ్రీనివాస్, జి.శివకృష్ణలకు స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ తొలుత కపిలేశ్వరపురం సీహెచ్‌సీకి, తర్వాత రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ తెలిపారు. మోటారు సైకిల్ ఢీకొని మహిళ.. పెరవలి: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకాయమ్మ (68) మంగళవారం ఉదయం రావులపాలెంలో ఆటో ఎక్కి పెరవలి మండలం కడింపాడు సెంటర్లో దిగింది. అక్కడ రోడ్డు దాటుతున్న ఆమెను తణుకు నుంచి రావులపాలెం వైపు వెళుతున్న మోటారు సైకిల్ వేగంగా ఢీకొంది. దీంతో వెంకాయమ్మ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మైరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా వెంకాయమ్మ మృతి చెందింది. మృతురాలి కుమారుడు కొప్పిశెట్టి వీరభద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వ్యాన్ కింద పడి.. ముమ్మిడివరం: ఠానేల్లంక ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. కూనాలంకకు చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) మోటారు సైకిల్‌పై ముమ్మిడివరం వెళుతున్నాడు. రాజుపాలెం వద్ద ముమ్మిడివరం వైపు వెళుతున్న వ్యాన్‌ను తప్పించబోయి దాని కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంగరాజుకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గాలికుంటు.. తరిమికొట్టు
రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు దున్నాలన్నా, దుక్కి చేయాలన్నా ఎద్దులు, దున్నల అవసరం తప్పనిసరి. వీటితో పాటు పాడి పశువులు బాగుంటేనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అయితే ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) సోకే ప్రమాదం ఉంది. వైరస్ కారణంగా వచ్చే ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. దీని బారిన పడిన పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. తద్వారా పశు పోషకులకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. అయితే సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులు, జీవాలను ఈ వ్యాధి బారి నుంచి కాపాడుకోవచ్చని పశువైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు.జిల్లాలో పరిస్థితిడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,65,368 పశువులు ఉన్నాయి. వీటికి 7వ రౌండ్ బూస్టర్ డోస్ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ ఉచితంగా వేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి నెలాఖరు వరకు ఏడాది లోపు దూడలకు బూస్టర్ డోస్ వేస్తారు. జిల్లాకు 1.65 లక్షల డోసులు అవసరం కాగా, 1.25లక్షల డోసులు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. గతంలో 40 వేల డోసుల నిల్వలు ఉన్నాయి. -
టెన్నికాయిట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక
దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మహిళలు, పురుషుల జట్ల ఎంపిక పోటీలను మంగళవారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళల జట్టుకు గెడల హేమమాధురి, రాపాక సంస్కృతి, రాపాక సౌరిక, ఎస్కే లతిఫా, మిరియాల ప్రియదర్శిణి ఎంపికై నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు గద్దే చంద్రశేఖర్ తెలిపారు. పురుషుల జట్టుకు బోయిన చంటిబాబు, గంగుల చంద్ర మహేష్, రాపాక నవీన్, మద్దాల అజయ్, గారపాటి బాబీలను ఎంపిక చేశామన్నారు. వీరు మండపేటలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న జట్లకు రెండు రోజుల పాటు స్థానిక జెడ్పీ హైస్కూల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. క్రీడాకారులకు టెన్నీకాయిట్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గన్నమని హరికృష్ణ, వైస్ చైర్మన్ ఉప్పులూరి రాంబాబు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, దాపర్తి వెంకటేశ్వరరావు, 20 మంది పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలుగండేపల్లి: ప్రయాణికుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలలు జైలు, రూ.1000 జరిమానా విధించారని సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మురారి శివారు పోలవరం కాలువ బ్రిడ్జి సమీపంలో 2020 మే పదో తేదీ ఉదయం 7 గంటలకు లారీ డ్రైవర్ హుస్సేన్ తన లారీని అతి వేగంగా నడిపి ముందు వెళుతున్న మరో లారీనీ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గుంటూరు నుంచి విజయనగరం వెళ్లేందుకు లారీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గులివిందల సత్యనారాయణ తీవ్రంగా గాయపడగా, పిల్లలు జహ్నవి, పార్థులకు స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తర్వాత రోజు మృతి చెందాడు. అప్పటి ఎస్సై బి.తిరుపతిరావు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్. దేవీరత్నకుమారి.. డ్రైవర్ హుస్సేన్‌కు పై విధంగా శిక్ష విధించినట్టు తెలియజేశారు. -
రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు మధ్య ప్రతి రోజు అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అఽధికారులు మంగళవారం ప్రకటించారు. కాకినాడ పోర్టు – రాజమహేంద్రవరం (07523) రైలు ఈ నెల 15 నుంచి, రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు (07524) రైలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఒక రైలు రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి 4.40 గంటలకు కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. మరో రైలు కాకినాడలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు. పింక్ మూన్తో ‘నన్నయ’ ఒప్పందంరాజానగరం: పింక్ మూన్ టెక్నాలజీ సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి సంబంధించిన పత్రాలపై మంగళవారం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టెక్నాలజీ సంస్థ సీఈఓ టి.నాగమల్లేశ్వరరావు సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలోని అన్ని ఐటీ, సాఫ్ట్వేర్ ప్రక్రియలకు సాంకేతిక మద్దతు, కన్సల్టెన్సీ, పరిష్కారాలు అందిస్తుందన్నారు. వివాహిత అదృశ్యంపెరవలి: ఖండవల్లి గ్రామానికి చెందిన వనచెర్ల రాంబాబు, లక్ష్మి దంపతుల కుమార్తె పెచ్చెట్టి జ్యోత్స్న (19) అదృశ్యమైంది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోత్స్నకు ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహం జరిగింది. వినాయక చవితి పండగకు పుట్టింటికి వచ్చి, ఇక్కడే ఉంది. ఈ క్రమంలో ఈ నెల 8న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి, ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఇంట్లో జ్యోత్స్న కనిపించలేదు. బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి.. పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఆచూకీ తెలిసే 94407 96642కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
బాలికపై అత్యాచారం చేసిన యువకులను శిక్షించాలి
గోకవరం: బాలికపై అత్యాచారం చేసిన యువకులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ విజృంభణ ఆధ్వర్యంలో మంగళవారం గోకవరంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన మాగాపు గాంధీ, టీడీపీ నాయకుడి అన్నయ్య కుమారుడు గునిపే కిరణ్ ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేశారన్నారు. అధికారం చేతిలో ఉందనే అహంతో, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ఈ దుశ్చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాలిక, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాలికకు న్యాయం జరగకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. -
ఆలయాల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
కిర్లంపూడి: గొల్లప్రోలు గ్రామానికి చెందిన ముమ్మిడి వీరవెంకట రాజ్యలక్ష్మి చిల్లంగిలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి, అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తన భర్త స్వర్గీయ ముమ్మిడి రామాంజనేయులు జ్ఞాపకార్థం పెద్ద కుమారుడు వీరవెంకట సూరిబాబు, గౌరీ పార్వతి, చిన్నకుమారుడు నరసింహమూర్తి, గంగాభవానీ దంపతులతో కలిసి ఆలయాల అభివృద్ధికి విరాళం అందజేసినట్టు తెలిపారు. డీఎఫ్‌వోగా రామచంద్రరావు కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో)గా ఎన్.రామచంద్రరావు నియమితులయ్యారు. డిప్యూటీ కంజెర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాలో పనిచేసిన ఆయనను కాకినాడ జిల్లా డీఎఫ్‌వోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడ డీఎఫ్‌వోగా కొనసాగుతున్న డి.రవీంద్రనాథ్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు. ట్రంప్ సుంకాలతో ఆక్వా అతలాకుతలం అమలాపురం టౌన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో మన రాష్ట్రంలోని ఆక్వా రంగం అతలాకుతలం అవుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 11న విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతు సదస్సుకు జిల్లా నుంచి ఆక్వా రైతులు హాజరు కావాలని కోరారు. స్థానిక ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో మంగళవారం రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు ఈ విషయంపై సమావేశమయ్యారు. అనంతరం విజయవాడ ఆక్వా రైతు సదస్సుకు హాజరుకావాలంటూ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ఆక్వా రైతులను స్వయంగా కలసి మాట్లాడారు. కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ తదితరులు ఆక్వా రైతులను సదస్సుకు ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే ఈ సుంకాల విధింపుపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు రాజమహేంద్రవరం సిటీ: అరుణాచలం, రామేశ్వరం యాత్రకు రాజమహేంద్రవరం డిపో నుంచి మంగళవారం స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు 30 మంది భక్తులతో బయలుదేరి వెళ్లిందని డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. ఈ యాత్రలో 9 రోజులపాటు కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, కోయంబత్తూర్, కుంభకోణం, చిదంబరం, గురువాయూర్, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూరు వంటి 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి 18వ తేదీ రాజమహేంద్రవరం డిపోకు చేరుకుంటుందన్నారు. అయినవిల్లికి రూ.66.68 లక్షల ఆదాయం అయినవిల్లి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి రూ.66,68,257 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గ భవాని తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చవితి తొమ్మిది రోజుల్లో 1.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అన్నదాన సత్రంలో 75 వేల మంది స్వామి అన్న ప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.15,16,469 పెరిగినట్టు తెలిపారు. దేవదాయశాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ, ఆలయ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆదాయాన్ని లెక్కించారు. -
అన్నదాత పోరు సక్సెస్
యూరియా కొరత లేదని బాబు ఎలా అంటున్నారు? ఆందోళన కారులను ఎంత ఎక్కువగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా తిరుగుబాటు వస్తుంది. పోలీసులు రైతు సంఘ నాయకులను, పార్టీ నాయకులను హౌస్ అరెస్టు చేయడం, దారి పొడవునా అడ్డుకోవడం అన్యాయం. ఎంత అవరోధం కలిగించినా భారీ ఎత్తున రైతులు తరలి వచ్చారు. యూరియా కొరత లేదని చెబుతున్న ముఖ్యమంత్రి యూరియాపై సమీక్షలు చేయాలని చెప్పడం వింతగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాలు కౌలుకు చేస్తున్న రైతుకు కూడా కేవలం ఒక బస్తా మాత్రమే యూరియా ఇవ్వడం దారుణం. వైఎస్సార్ సీపీ అన్నదాతకు మద్దతు ఇవ్వడంతో కూటమి సర్కార్ దిగొచ్చి సోమవారం అత్యవసరంగా కూపన్లు ఇచ్చింది. రైతులు పండిస్తున్న ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల సమస్యలపై చెవిలో శంఖం ఊదినట్లు ప్రతిపక్ష నాయకులు ఊదితేనే గాని ఈ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పేరుకే కూపన్లు ఇచ్చి సగం కూపన్లు తెలుగుతమ్ముళ్లకు దొడ్డిదారిన ఇచ్చేస్తున్నారు. అలా తమ్ముళ్లకు వచ్చిన యూరియాను బస్తాకు రూ.100 నుంచి రూ.200 అదనంగా వేసుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, కాకినాడ ● ఆంక్షలు అధిగమించిన రైతు ఆగ్రహం ● అడుగడుగునా పోలీసుల కట్టడి ● పోటెత్తిన రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ● కాకినాడ, పెద్దాపురంలో ఆర్డీవోలకు వినతులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎరువుల కొరతతో రైతులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రైతులకు మద్ధతుగా మంగళవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన అన్నదాత పోరు విజయవంతమైంది. పార్టీ అధిష్టానం పిలుపుతో పార్టీ శ్రేణులు ఒక్కటిగా తరలివచ్చి అడుగడుగునా పోలీసు ఆంక్షలను కూడా అధిగమించి అనుకున్నట్టుగానే కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయల్లో విజ్ఞాపనలు అందచేశారు. జిల్లా అంతటా సెక్షన్–30 అమలులో ఉందని సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు సోమవారం నుంచే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తదితర నేతలకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అటు పెద్దాపురం, ఇటు కాకినాడ ఆర్డీఓ కార్యాయాలకు వెళ్లే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసేసి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. బారికేడ్లతో అడ్డగింపు మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లు తోట నరసింహం, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు వెంట రాగా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో కలిసి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వైపు పాదయాత్రగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివస్తోన్న జన సమూహాన్ని చూసి అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేతలతో పాటు తరలివచ్చిన రైతులలో ఆగ్రహం కట్టలు తెంచుకుని బారికేడ్లను తోసుకుంటూ ఒకేసారి ఆర్డీఓ కార్యాలయంలో దూసుకుపోయారు. అక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తోన్న ఇనస్పెక్టర్లు వైఆర్కే శ్రీనివాస్, ఏ కృష్ణభగవాన్ కార్యాలయ ఆవరణలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ముద్రగడ గిరిబాబు, తోట, దవులూరి తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టాలని, రైతులకు సకాలంలో అందజేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో మాధవరావుకు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ నేత ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి బెహరా రాజేశ్వరి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోటరాంజీ, యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీలు, గొల్లు దివానం, గోళ్ల కాంతిసుధాకర్, కరణం భాను, నెక్కంటి సాయి, ఒమ్మి రఘురాం, నాగం గంగబాబు, లాలం బాబ్జీ, లగుడు శ్రీను, పోతల రమణ, రామిశెట్టి లక్ష్మి పాల్గొన్నారు. 30 మందికే అనుమతి కాకినాడలో రైతుపోరుకు పార్టీ నేతలు, రైతులు పోటెత్తారు. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడసిటీ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన రైతులు వెంట రాగా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కాకినాడకు పోటెత్తారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పిఠాపురం కోఆర్డినేటర్ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆద్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు జిల్లా పరిషత్ సెంటర్‌కు చేరుకోవడంతో పోలీసులు వారిని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో వంగా గీత జెడ్పీ సెంటర్లో పార్టీ శ్రేణులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులను రోడ్డుపాల్జేసిన కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతులకు తక్షణం యూరియా అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. జెడ్పీ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వైపు వెళుతున్న రైతులు, నేతలను కాకినాడ ఎస్డీపీఓ (ఏఎస్పీ) మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో ఇనస్పెక్టర్లు చైతన్యకృష్ణ, పెద్దిరాజు, నాగదుర్గారావు, మజ్జి అప్పలనాయుడు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసులు అడ్డుకున్నారు. గీత, ద్వారంపూడి విజ్ఞప్తి మేరకు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లేందుకు 30 మందికి మాత్రమే అనుమతించారు. అనంతరం ఆర్డీఓ మల్లిబాబుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ మహిళా ప్రతినిధులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జమ్మలమడక నాగమణి, వర్థినీడి సుజాత, పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి కొప్పన శివనాధ్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్(బన్నీ), బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి చంద్రశేఖర్, ఉమ్మడి తూర్పు మైనార్టీ సెల్ సమన్వయకర్త అబ్దుల్ బషీరుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు కష్టాలపై చలనం లేని సర్కార్ రాష్ట్రంలో నాలుగైదు వారాలుగా యూరియా, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఈ సర్కార్‌కు చలనం లేకుండా పోయింది. వచ్చిన యూరియాను కాస్తా బ్లాక్ మార్కెట్లో అయినకాడికి అమ్ముకుంటున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని మొత్తుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు . కనీసం ఒక్క బస్తా కావాలన్నా రైతులు గంటల తరబడి క్యూ లో నిలబడే దుస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఏ ఒక్క సీజన్లోను రైతులు ఎరువుల కోసం ఇలా ఆందోళన చెందిన దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతమైంది. ప్రస్తుతం యూరియా కొరతను నియంత్రించడంతో పాటు బాక్ల్ మార్కెట్ అరికట్టాలి. సకాలంలో ఎరువులు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు పంటల బీమా పథకానికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందివ్వాలి. – వంగా గీత, వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ మహిళా విభాగం -
అభివృద్ధికి బ్రేక్.. ఉపాధికి షాక్
● రాజోలు దీవిలో వంద ఆయిల్, గ్యాస్ బావులు ● ఉత్పత్తులను తరలిస్తున్న ఆయిల్ కంపెనీలు ● స్థానికులకు ప్రాధాన్యం కరవు ● బయటి వారికే పెద్దపీట ● యువతకు కొరవడిన ఉపాధి మలికిపురం: రాజోలు దీవి నుంచి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలను తరలించుకు పోతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగం తాండవం చేస్తోందన్నారు. నిక్షేపాలు అధికంగా ఉన్న చోట అభివృద్ధిని సాధించాల్సింది పోయి, యువత ఉపాధి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని సుమారు 100 బావుల ద్వారా ప్రతి రోజూ 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, అదే స్థాయిలో చమురు నిక్షేపాలను ఓఎన్జీసీ, గెయిల్ తరలించుకుపోతున్నాయి. కానీ ఈ సంస్థలు ఈ ప్రాంతాల ప్రజలకు ఉపాధి చూపడంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇక్కడి వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో కూడా సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పరిశ్రమలకు దక్కని ప్రాధాన్యం రాజోలు దీవిలో గతంలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో తూర్పుపాలెంలో ఐస్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, అలాగే తూర్పుపాలెంతో పాటు కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అప్పట్లో వాటికి లోప్రెజర్ గ్యాస్‌ను తక్కువ ధరకు అందించేవారు. భవిష్యత్తులో గ్యాస్ మరింత అందిస్తారని, రాయితీ కూడా వస్తుందని నిర్వాహకులు ఆశించారు. అయితే రానురాను పరిస్థితి దిగజారింది. గ్యాస్ సరఫరాను పెంచలేదు, రాయితీ ఇవ్వలేదు సరికదా, అప్పటి వరకూ సరఫరా చేసిన గ్యాస్ ధరను అమాంతంగా పెంచేశాయి. దీంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఆయా పరిశ్రమలను యజమానులు మూసివేశారు. తూర్పుపాలెం ఐస్ ఫ్యాక్టరీతో పాటు, విద్యుత్, స్టీల్ పరిశ్రమలు, కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ మూతబడ్డాయి. దీంతో నిర్వాహకులు రూ.కోట్లు నష్టపోయారు. స్థానిక యువత ఉపాధి లేక సతమతమవుతున్నారు. స్థానిక పరిశ్రమలకు రాయితీలు, గ్యాస్ సరఫరా చేయని ఆయా సంస్థలు.. ఇతర చోట్ల పరిశ్రమలకు ఇవ్వడం దారుణమైన అంశమని స్థానికులు మండిపడుతున్నారు. లోప్రెజర్ గ్యాస్‌ను తక్కువ ధరకు నియోజకవర్గంలో పరిశ్రమలకు అందించని ఒక సంస్థ.. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి శివకోడులోని ఓ బావిని ధారాదత్తం చేయడం గమనించదగ్గ విషయం. వరస లీకేజీలు రాజోలు దీవిలో వారానికోసారి గ్యాస్, ఆయిల్ బావులు లీకవుతాయి. ప్రజలు బెంబేలెత్తి, తీవ్ర భయాందోళనలు చెందుతారు. కానీ ఆయా సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాయి. శిథిలమైన పైపులైన్లు, బావుల పరికరాలకు మరమ్మతులు చేయపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కనీసం ఓఎన్జీసీ కార్యకలాపాల పనులు, కాంట్రాక్టులు కూడా ఆయా సంస్థలో పరిచయం, పలుకుబడి ఉన్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల సంస్థలు, వ్యక్తులకే ఇస్తున్నారనే వాదన ఇక్కడ బలంగా ఉంది. అనేక నష్టాలు రాజోలు దీవిలో గ్యాస్, చమురు నిక్షేపాలను తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం గుల్లవుతోంది. ఇక్కడి భూసారంతో పాటు పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. అలాగే గ్యాస్‌ను తరలించే భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ పైపులైన్ల లీకేజీలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆయిల్ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. -
ఆటోవాలాలను రోడ్డుకీడ్చారు..
విశాఖ నుంచి అమరావతికి డ్రైవర్ పాదయాత్ర తొండంగి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఆటోవాలాలను రోడ్డుకీడ్చిందని విశాఖ కంచరపాలేనికి చెందిన ఆటోవాలా చింతకాయల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర సాగిస్తున్నాడు. అతని పాదయాత్ర సోమవారం తొండంగి మండలం జాతీయ రహదారి నుంచి సాగింది. ఈ సందర్భంగా అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉచిత పథకాలతో పాలనను భ్రష్టు పట్టించిందని ఆరోపించిన కూటమి నేతలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి ఆటోవాలాల జోవనోపాధిపై దెబ్బకొట్టారన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న యువకులు, మధ్య వయస్కులు ఎందరో ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడి ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెలా ఫైనాన్స్ చెల్లించుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్‌లు, బీమా, అప్పుడప్పుడు ఫైన్లు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ప్రస్తుతం ఆటోవాలాలంతా రోడ్డున పడ్డారన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించానని, తమ మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతానని వివరించారు. -
కొత్త కోటపాడులో డయేరియా
రంగంపేట: మండలంలోని కొత్త కోటపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పలువురు మంచాన పడ్డారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో నమోదైన డయారియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్త కోటపాడులో ప్రత్యేక వైద్య బృందంతో శిబిరం నిర్వహించి, బాధితులకు చికిత్స అందించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కేసులపై విచారణ జరిపారు. ప్రభావిత ఇళ్లలో పారిశుధ్య చర్యలు చేపట్టగా, నీటిలో క్లోరినేషన్ పనులు చేయించారు. కొత్త కోటపాడులో 234 ఇళ్లలో 973 జనాభా ఉండగా, నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి నియంత్రణలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. వినాయక చవితి ప్రసాదం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి డయేరియా వచ్చి ఉండవచ్చని చెప్పారు. -
వరద ముంచేను
ఫ గోదావరి తగ్గడంతో కోలుకుంటున్న లంకలు ఫ పంటల సంరక్షణకు జాగ్రత్తలు అవసరం ఆలమూరు: వరద వచ్చింది.. నిండా ముంచేసింది.. లంకలను అతలాకుతలం చేసింది.. చివరికి వెనక్కి తగ్గినా బురదే మిగిల్చింది.. ఈ ఏడాది గోదావరికి మూడు సార్లు వరద వచ్చింది.. లంకల్లో వందల ఎకరాల పంటలను నీట నాన్చింది. చాలాచోట్ల పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. మిగిలిన పంటలను రక్షించుకునేందుకు ఉద్యాన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గోదారమ్మ శాంతించడంతో ఇప్పుడిప్పుడే లంక భూములు కోలుకుంటున్నాయి. వరద తాకిడికి గురైన ఉద్యాన పంటలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే నష్టం తప్పదు. ఒక్కోసారి వివిధ రకాల తెగుళ్లు సోకి పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీట మునిగిన పంటను ఏవిధంగా సంరక్షించుకోవాలో వివరిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూర ల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల కూరగాయల పంటలు వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ పంట భూముల్లో వరద నీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడంతో జింక్, పొటాష్, నత్రజని పోషకాలతో పాటు ఇనుము ధాతు లోపం ఏర్పడుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఉద్యాన పంటలను కాపాడుకోవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి పీవీ రమణ వివరించారు. ● ఆకుముడత: వరదల వల్ల కూరగాయ మొక్కల ఆకులు ముడుచుకుపోతాయి. అలాగే చీడపీడలు ఆశించినప్పుడు కూడా ఈ తెగులు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ● చీడపీడలు: వరదల వల్ల పొలాల్లో తేమ పెరిగి చీడపీడలు పెరిగి పంటలు నాశనమవుతాయి. ● వేరుకుళ్లు: వరద నీరు రోజుల తరబడి పొలాల్లో ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ శిలీంధ్ర తెగులు వస్తుంది. కరవు సంభవించిన సమయంలో కూడా ఈ తెగులు ప్రభావం ఉంటుంది. ● కాండం కుళ్లు: స్ల్కీ రోషియం ఒరైజా అనే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల కూరగాయల మొక్క కాండం కుళ్లిపోయి పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ● కీటకాల వృద్ధి: వరదలు సంభవించిన తరువాత ఉద్యాన పంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పాటు అగ్ని చీమలు, దోమలు, బొద్దింకలు వృద్ధి చెందుతున్నాయి. ఈ కీటకాలు మొక్కల ఆకులను తినేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. నివారణ చర్యలు ఫ లంక భూమి వాలును అనుసరించి పొలాల్లోంచి వరద నీరు పోయే విధంగా అరడుగు వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఫ నీరు ఇంకిపోయిన తరువాత వీలైనంత మేర నేలను ఆరనివ్వాలి. ఫ జింక్ లోప నివారణకు 0.2 శాతం జింక్ సల్ఫేట్‌ను పిచికారీ చేయాలి. నత్రజని లోప నివారణకు ఒక గ్రాము కార్బన్డైజమ్ లేదా రెండు గ్రాముల కార్బన్డైజమ్తో పాటు మాంకోవెబ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఫ ఇనుము ధాతులోపం నివారణకు 0.2 శాతం పెర్రస్ సల్ఫేట్‌ను వేయాలి. ఫ పొటాష్, నత్రజని లోపాల నివారణకు పంట దశను అనుసరించి 0.5 శాతం నుంచి 1.0 శాతం పొటాష్ నైట్రేట్‌ను పిచికారీ చేయవచ్చు. దొండ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వరదల సమయంలో దొండ సాగు పట్ల ఉద్యాన రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా వరద నీరు నిల్వ ఉండటం వల్ల దొండ పాదుల్లో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా బూజు, బూడిద తెగులు ఆశించే ప్రమాదముంది. బూజు తెగులు నివారణకు మాంకోజెల్ లేదా మెటాలాక్సిల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు ట్రైడీమార్ఫ్ లేదా డైనోకాప్ ఒక మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి వేయాలి. సోకే తెగుళ్లువరద నీటిలో చిక్కుకున్న కూరగాయ పంటలకు సాధారణంగా ఆకుముడత, చీడపీడలు, వేరుకుళ్లు, కాండం కుళ్లు తదితర తెగుళ్లు సంభవించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలను సస్యరక్షణ చర్యల ద్వారా కాపాడుకోవచ్చు. -
పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఆదాయం తక్కువ ఉన్న మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన 11 నెలల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ ముస్లిం విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్కే కరీంబాషా డిమాండ్ చేశారు. ముస్లిం విభాగం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి బాషా అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రతి నెలా మౌజన్, ఇమామ్‌లకు గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2024 మార్చి వరకు గౌరవ వేతనాలు మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నాలుగు నెలలు మాత్రమే వేతనాలు చెల్లించిందన్నారు. పార్టీ ముస్లిం విభాగం సిటీ అధ్యక్షుడు కాలిద్ బిన్ వాలిద్, మాజీ వాక్స్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్, హేమంత్, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు అజ్జు, మయూరి అలీషా, చాంద్ భాషా, ఇర్ఫాన్, నౌషద్, కిషోర్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీ సాయి జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఫుట్‌బాల్ జట్టు తరఫున గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ ఛత్తీస్‌ఘడ్, నారాయణపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమెను ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కె.ప్రభాకరరావు, హెచ్ఎం పి.షాలిని సౌజన్య, ఉపాధ్యాయులు, పీఈటీ సయ్యద్ షఫీ ప్రోత్సాహమే తన విజయానికి కారణమని లక్ష్మీశ్రీసాయి తెలిపింది. సోమవారం పాఠశాల క్రీడా సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెను మెమెంటోతో సత్కరించారు. -
11న జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, పేటీఏం సంస్థలు 220 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించవచ్చన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సమన్లు జారీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ ఎస్టీ కమిషన్ సూచనల మేరకు ఢిల్లీ ఎస్సీఎస్టీ కోర్టుకు ఈ నెల 9వ తేదీన హాజరుకావాలంటూ ఉన్నత విద్య ప్రిన్సిపాల్ కార్యదర్శికి సమన్లు జారీచేసింది. గ్రంథాలయ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ హోదా ఇవ్వాలంటూ బీఆర్ దొరస్వామినాయక్ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో దీనిపై స్పందించిన కమిషన్ హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. పీజీఆర్ఎస్ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. కలెక్టర్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్ లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం 480 అర్జీలు అందాయన్నారు. తెరచుకున్న సత్యదేవుని ఆలయ ద్వారాలు అన్నవరం: చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూత పడిన సత్యదేవుని ఆలయాన్ని సోమవారం ఉదయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారి వ్రతాలు, నిత్యకల్యాణం, ఆయుష్య హోమం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, పంచహారతుల సేవ, రాత్రి పవళింపుసేవ యథావిధిగా నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు మాత్రమే స్వామివారి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వందలు జరిగాయి. అప్పనపల్లిలో దర్శనాలు పునః ప్రారంభం మామిడికుదురు: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు, నిత్య కై ంకర్యాల అనంతరం భక్తుల దర్శనాలు పునః ప్రారంభించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమం జరిపారు. స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ఆందోళనకారులు అనపర్తి : మహిళలపై దాడి చేసి గాయపరిచిన నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించకుండా అదుపులోకి తీసుకుని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ ఊలపల్లి గ్రామానికి చెందిన బాధిత వర్గానికి చెందిన వారు సోమవారం భారీగా తరలివచ్చి బిక్కవోలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నెల 6న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో మరో వర్గానికి చెందిన వారిపై అందిన ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు వారిని వదిలేశారని ఆరోపిస్తూ బాధిత వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అనపర్తి సీఐ సుమంత్ ఆందోళనకారులతో చర్చలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. -
యూరియా...ఏదయ?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సాగు ముందస్తు ప్రణాళికలో వైఫల్యం జిల్లాలో రైతుల కొంప ముంచింది. జిల్లాలో ఏ ప్రాంతంలోనూ బస్తా యూరియా దొరకడం లేదు. వ్యవసాయ శాఖాధికారులను అడుగుతుంటే ర్యాక్‌ల ఇండెంట్లు పెట్టారు, రేపు వస్తాయి, మాపు వస్తాయి అంటూ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. జిల్లాలో యూరియా లభ్యతపై అధికారులు చెప్పే లెక్కలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతన కుదరడం లేదు. జులై నెలాఖరున నాట్లు పూర్తి అయిన ఆయకట్టుల్లో ఇప్పటి వరకు రెండో విడత యూరియా వేసిన దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవానికి ఈ సరికే రెండోసారి యూరియా వేయాల్సి ఉన్నా అందుబాటులో లేక దేవుడిపై భారం వేసి వరి పంట గాలికొదిలేయాల్సి వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఏ మండలంలో ఏ ఆయకట్టులో రైతును కదిపినా కొందామంటే యూరియా లేదని ఘొల్లుమంటున్నారు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.10 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆగస్టు నెల నాటికి జిల్లాలో దాదాపు అన్ని ఆయకట్టుల్లోను వరినాట్లు పూర్తయ్యాయి. ఒకటి లేక రెండు బస్తాలే ప్రస్తుతం రైతులు ఎకరాకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా కాంప్లెక్సు ఎరువు వేస్తున్నారు. జులై నెలలో వరినాట్లు వేసిన రైతులు కూడా ప్రస్తుతం రెండవ విడత ఎరువులు వేయాల్సి ఉన్నా ఎరువుల కొరతతో అదను దాటిపోతోందని ఘెల్లుమంటున్నారు. జిల్లా అంతటా యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇతర కాంప్లెక్సు ఎరువులు అవసరానికి మించి ఉన్నాయి. రైతులకు అవసరమైన యూరియా మాత్రం అందుబాటులో లేదు. ప్రభుత్వం కనీసం యూరియా కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశారనే దానితో సంబంధం లేకుండా ఒకటి, రెండు బస్తాలు మించి యూరియా ఇవ్వడంలేదు. ఐదారెకరాలు సాగు చేసిన రైతుకు కూడా ఒకటి, రెండు బస్తాలంటే ఎలా అని రైతు ప్రతినిధులు నిలదీస్తున్నారు. అధికారుల ‘స్టాక్’ రిప్లై! జిల్లాలో రైతుల అవసరాలకు తగ్గట్టు యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయాధికారులు ఊరూవాడా ఊదరగొడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాకు కూడా జిల్లాలో ఎక్కడా ఇబ్బంది లేదని అధికారులు చెబుతుంటే ఎక్కడా చూసినా ఒక్క బస్తా మించి యూరియా ఇవ్వలేని దుస్థితిలో వ్యవసాయశాఖ ఉంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 23,360 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటే ఇప్పటి వరకూ 19,046 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో ఏ వ్యవసాయ సబ్ డివిజన్లో పరిశీలించినా గడచిన నాలుగైదు రోజులుగా యూరియా స్టాక్ లేదనే సమాధానం ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాక్‌లు బుక్ అయ్యాయి, రెండు, మూడు రోజుల్లో యూరియా వస్తుందని చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. జగ్గంపేట, గండేపల్లి మండలాలకు సంబంధించి సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారానికి కలిపి 900 టన్నుల యూరియా అవసరమని లెక్క లేశారు. ప్రస్తుతం రైతులకు 25 టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని చెబుతున్నారు. వచ్చే రెండు రోజుల్లో 200 టన్నులు వస్తుంది అని అధికారులు చెబుతున్నారు. తుని మండలానికి 1,100 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇప్పటి వరకు 750 మెట్రిక్ టన్నుల యూరియా అందజేశామని అక్కడి వ్యవసాయాధికారి చెబుతున్నారు. మరో వంద మెట్రిక్ టన్నులు శనివారం అందుబాటులోకి వస్తుందంటున్నారు. వ్యవసాయంలో ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి లేకుంటే కోలుకోలేని రీతిలో నష్టపోతామని రైతులు పేర్కొంటున్నారు. సకాలంలో ఎరువులు వేయకపోయినా చేను దుబ్బు కట్టక, దిగుబడులు తగ్గిపోతాయి. అధికారులు యూరియా కొరత లేదని ప్రకటనలు ఇస్తున్నారే కానీ, వాస్తవానికి యూరియా ఎక్కడా దొరకడం లేదు. వారం రోజుల క్రితంృ కరప మండలం జెడ్.భావారం రైతు సేవా కేంద్రానికి వచ్చిన 225 బస్తాల యూరియా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో దింపించారు. తీరా అక్కడి అధికార పార్టీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా తమ అనుచరులకు ఏకంగా 125 బస్తాలు ఇచ్చేశారు. రైతులు రోడ్డెక్కి గొడవ చేస్తే మిగిలిన 100 బస్తాలు రైతులకు ఇచ్చారు. పిఠాపురం నియోజవర్గం మొత్తానికి 4,175 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికి 3037.55 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మరో 933 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇటీవల గొల్లప్రోలు మండలంలో యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళన చేసినా వ్యవసాయశాఖ స్పందన నామమాత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.సామర్లకోట సొసైటీ వద్ద ఎరువుల కోసం రైతుల తోపులాట (ఫైల్) అదను దాటిపోతున్నా అగచాట్లే కనికరం లేని కూటమి సర్కారు లెక్కలకు, వాస్తవానికి లేని పొంతన రేపు మాపు అంటూ తిప్పుతున్న వైనం గగ్గోలు పెడుతోన్న ఖరీఫ్ రైతు దారీ తెన్నూలేని పరిస్థితి యూరియాకు దారీ తెన్నూ లేకుండా ఉంది. ఈ ఖరీఫ్‌లో నేను 18 ఎకరాల సాగు చేస్తున్నాను. కనీసం 18 బస్తాల యూరియా కావాలి. అయితే ఇప్పటి వరకు నా వరకు ఒక్క బస్తా కూడా యూరియా దక్కలేదు. గత్యంతరం లేక లిక్విడ్ యూరియాను కొనుగోలు చేసి పిచికారీ చేస్తున్నా. ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. లిక్విడ్ యూరియాపై నమ్మకం లేదు. యూరియా లభించకపోవడంతో దీనిని ఉపయోగిస్తున్నాను. అదను దాటిపోతే యూరియా వేసినా ప్రయోజనం ఉండదు. – తాటికొండ అచ్చిరాజు, రైతు, నవర, సామర్లకోట మండలం అవసరానికి అందకపోతే అనర్థమే నేను రెండున్నర ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు పంటకు యూరియా కనీసం రెండు బస్తాలు కావలసి ఉంది. అయితే యూరియా లభించకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పంట పిలకలు వేసుకునే దశలో ఉంది. ఈ దశలో తప్పనిసరిగా యూరియా వేయవలసి ఉంది. అదను దాటిపోయాక యూరియా వేయడం వల్ల దోమ ఆశించే ప్రమాదం ఉంది. పంటకు కావలసిన యూరియా కోసం డీలర్లను బతిమాలి రూ.263 ఉన్న యూరియా బస్తా రూ.350కు కొనుక్కోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి యూరియా కొరత ఏర్పడలేదు. – వెలమర్తి శ్రీనివాస్, రైతు, వీకేరాయపురం, సామర్లకోట మండలం బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లాలో యూరియా బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అనధికారికంగా నిల్వ ఉంచిన వారిపై 6ఏ కేసు నమోదు చేసి 158.8 మెట్రిక్ టన్నులు సీజ్ చేశాం. జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా శనివారం జిల్లాకు రానుంది. వివిధ మండలాలకు ఈ యూరియా పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో యూరియా రైతులకు అందుబాటులో ఉంటుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అనధికారికంగా నిల్వచేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. – షణ్మోహన్ సగిలి, కలెక్టర్ పంట నష్టపోతాం నేను ఈ ఖరీఫ్ సీజన్లో 3.50 ఎకరాలు సాగు చేస్తున్నాను. సీజన్ ప్రారంభంలో కాలువలకు సాగునీరు రావడం రెండువారాలు ఆలస్యమైంది. వర్షాలు పడక వరినాట్లు వేయడంలో ఆలస్యమైంది. ప్రారంభంలోనే యూరియా దొరకక డీఏపీ వేశాను. వరినాట్లు వేసి ఐదు వారాలైంది. చేను పిలకలు తొడిగి, దుబ్బు కట్టే దశలో ఉంది. ఇప్పుడు యూరియా, పొటాష్ ఎరువులు వేయాల్సి ఉంది. ప్రైవేటు దుకాణాలలో కానీ, రైతు సేవాకేంద్రాలలో కానీ యూరియా దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం. అవసరమైనప్పుడే ఎరువులు వేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నిబస్తాలు ఇచ్చినా ఉపయోగం ఉండదు. వర్షం పడినా, వర్షం నీటిలో ఉండే నత్రజని కొంతవరకు చేనుకు ఉపయోగపడుతుందనుకుంటే, వేసవికాలం మించిన ఎండలు కాస్తుండటంతో చేను ఎదుగుదల ఉండటంలేదు. యూరియా వస్తుందో, లేదోనని భయం వెంటాడుతోంది. – సొడగం సూరిబాబు, రైతు, అరట్లకట్ట, కరప మండలం ఒక బస్తా యూరియా కూడా ఇవ్వలేదు నాకు మొత్తం 10 ఎకరాల భూమి ఉంది. నాది జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మా భూములకు నీరు వస్తుంది. ప్రస్తుతం అది పనిచేయకపోవడంతో కేవలం వర్షాధారం మీద నాలుగు ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశాం. నాకు మొత్తం 15 బస్తాల యూరియా అవసరం. నాలుగు ఎకరాల వరి పంటకు ఒక బస్తా యూరియా కూడా ఇప్పటి వరకు వేయలేకపోయాను. బయట మార్కెట్లో గాని, రైతు సేవాకేంద్రాల్లో గాని యూరియా దొరకట్లేదు... యూరియా దొరుకుతుందో లేదో అన్న భయం పట్టుకుంది. – కర్నాకుల వెంకటరావు, రైతు, కాండ్రేగుల జగ్గంపేట మండలం ఇబ్బందులు తప్పడం లేదు ఆరు ఎకరాల వరి సాగు చేస్తున్నాను. చేను మూన తిరిగింది. రెండుసార్లు పిండి వేశాను. ఇంకో పది రోజుల్లో మరోసారి పిండి వేయాల్సి వుంది. పిండికోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత నెల 25న సొసైటీ సిబ్బంది ఊళ్లో పిండి ఇచ్చారు. ఒక ఆధార్‌కి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. పిండి కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. – ఓబిన్ని రామదాసు, తాళ్ళూరు, గండేపల్లి మండలం. -
ఆటిజం.. అవగాహనతో దూరం
● బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య ● ప్రతి వంద మందిలో ఇద్దరికి వచ్చే అవకాశం ● జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు రాయవరం: పేరు పెట్టి పిలిచినా పలకక పోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వైపు చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, మిగిలిన చిన్నారులతో కలవక పోవడం వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న చిన్నారుల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాలతో మన దేశంలో ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరు ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. కోవిడ్ తర్వాత ఆటిజం లక్షణాలు ఉన్న చిన్నారులు అధికమయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాల ఆధ్వర్యంలో ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు చేశారు. జిల్లాలో 22 మండలాల్లో ఇప్పటికే 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. వారిలోనూ నైపుణ్యాలు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలా ఉండమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్నవారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఈ చిన్నారుల్లో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. భవిత కేంద్రాల తరహాలో.. జిల్లా పరిధిలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపట్టారు. ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రాల్లో తరహాలోనే ఈ కేంద్రాల్లో ఆటిజం బాధితులకు సేవలు అందిస్తారు. బాధిత చిన్నారులను పూర్వపు స్థితికి తీసుకువచ్చి అందరిలో కలిసేలా చేసేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే వీటికి ప్రత్యేక భవనాలు నిర్మించడంతో పాటు సిబ్బందిని నియమించే అవకాశముంది. ఒక్కో భవనానికి రూ.27.75 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఈ నిధులతో రెండు గదులు నిర్మిస్తారు. ఫిజియోథెరపీ, ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. ఆటిజంతో బాధపడే చిన్నారులను తీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం(బస్టాండ్) ఉన్న ప్రదేశాలకు దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మానసిక పరిస్థితి మెరుగు ప్రస్తుతం భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడే చిన్నారులకు కూడా సేవలందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు, ఆటిజం బాధితులకు ఒకేచోట సేవలు అందించడం ఇబ్బందిగా మారడంతో ఆటిజంకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పీచ్ లాంగ్వేజ్, వ్యక్తిగత ప్రవర్తన, ఆక్యుపేషనల్, మ్యూజిక్ థెరపీ శాసీ్త్రయంగా సాధన చేయించనున్నారు. ప్రాథమిక దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఏర్పాటు చేస్తాం జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలన చేస్తున్నాం. వచ్చే చిన్నారులకు అనువుగా సెంటర్లను ఎంపిక చేయనున్నాం. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ -
సిబ్బందితో గొడవలొద్దని ఈఓకు ఆదేశాలు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని పాలన సాగించాలని, చిన్న చిన్న కారణాలతో సిబ్బందితో ఘర్షణ పడవద్దని ఈఓ వీర్ల సుబ్బారావును దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ సోమవారం ఆదేశించారు. దేవస్థానంలో ఈఓ కుటుంబ సభ్యుల జోక్యం, సిబ్బందిని అవమానించేలా ఈఓ మాట్లాడడం వంటి వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో కొందరు సిబ్బంది సెలవుకు దరఖాస్తు చేయడం, కొంతమంది వీఆర్ఎస్ తీసుకునేందుకు నిర్ణయించడం వంటివి జరిగాయి. ఆ సందర్భంగా గత ఏప్రిల్ 16వ తేదీన సాక్షి దినపత్రికలో ‘చినబాబొచ్చారు బహుపరాక్’ శీర్షికన, అదే నెల 18వ తేదీన ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తలకు స్పందించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈఓ వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని అడిషనల్ కమిషనర్ ఎస్.చంద్రకుమార్‌ను ఆదేశించారు. ఆయన ఏప్రిల్ 27న విచారణ జరిపి తన నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. విచారణలో ఈఓ వ్యవహార శైలిపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం వాస్తవమేనని తేలిందని కమిషనర్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. దేవస్థానంలో సిబ్బంది తో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బంది కలుగకుండా సేవలందించడం ఈఓ ప్రథమ కర్తవ్యమని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. సిబ్బందితో వివాదాలు లేకుండా పరిపాలన సాగించాలని ఈఓను ఆదేశించారు. -
స్కానింగ్ సెంటర్ సీజ్
కాకినాడ క్రైం: కాకినాడలోని నూకాలమ్మ గుడి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేసి కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు, ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో సీజ్ చేశామని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఓ మహిళ ఫిర్యాదుతో డీఐఓ డాక్టర్ సుబ్బరాజు బృందం తనిఖీలు చేపట్టిందన్నారు. చట్టం ఉల్లంఘించిన నేపథ్యంలో వివరణ కోరగా సమాధానం సంతృప్తికరంగా లేదని వెల్లడించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశామని డీఎంహెచ్ఓ తెలిపారు. మభ్యపెట్టి.. చోరీ చేసి ఫ ఇద్దరు నిందితుల అరెస్ట్ ఫ రూ.రెండు లక్షలు, బంగారం స్వాధీనం అన్నవరం: కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు, ఆటోలే వారి లక్ష్యం.. అందుకే సాటి ప్రయాణికుల్లా వెళ్తారు.. అందికాడకు దోచుకుంటారు.. ప్రయాణికులను మభ్యపెట్టి వారి బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను అన్నవరం పోలీసులు సోమవారం ఆరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అన్నవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 13న కత్తిపూడిలో ఆటోలో వెళ్తున్న ఓ మహిళ దృష్టి మరల్చి ఆమె బ్యాగ్ నుంచి రూ. రెండు లక్షలు అపహరించినట్టు అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే విధంగా ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళల నుంచి బంగారం దొంగిలించినట్లు ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం ఉదయం కత్తిపూడి ఫ్లైఓవర్ దిగువన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు ఆ నేరాలు చేసినట్టు అంగీకరించారని సీఐ తెలిపారు. నిందుతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని డ్రైవర్స్ కాలనీ తారకనగరానికి చెందిన తొండ శాంతి, అదే ప్రాంతానికి చెందిన ఆవుల భూలక్ష్మిగా గుర్తించారు. వీరి నుంచి రూ.రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ప్రత్తిపాడు కోర్టులో హాజరు పర్చనున్నారు. సందట్లో సడేమియా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేపథ్యంలో హడావుడిలో ఉండగా, కొందరు చేతివాటం ప్రదర్శించి ఆభరణాలు, నగదు అపహరించే వీలుందని సీఐ తెలిపారు. అందువల్ల ప్రయాణ సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు, క్రైమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమణ, శ్రీనివాస్, హోంగార్డు అన్నపూర్ణలను అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
వీధి ఆవుకు అత్యవసర శస్త్రచికిత్స
ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్ల తొలగింపు అమలాపురం టౌన్: అమలాపురంలో ఓ వీధి ఆవుకు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి సోమవారం అత్యవసర శస్త్రచికిత్స చేసి, ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. స్థానిక ఫైర్‌స్టేషన్ వద్ద ఓ వీధి ఆవు కదలేని పరిస్థితుల్లో ఉండి నోరు, ముక్కు వెంబడి తిన్న ఆహారం బయటకు వచ్చేస్తుందని గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు డాక్టర్ విజయరెడ్డికి సమాచారం అందించారు. తక్షణమే ఆయన పశువుల అంబులెన్స్–1992 వాహనంలో తన సిబ్బందితో వీధి ఆవు వద్దకు చేరుకున్నారు. ఆవు పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ విజయరెడ్డి తక్షణమే ఆవు కడుపు భాగంలో అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గో ప్రేమికులు స్వామి, పుల్లయ్య, పశు వైద్య సిబ్బంది వెంకటేష్, యశ్వంత్ తదితరులు సహకారం అందించారు. -
ఎంపీడీఓలు జాబ్‌చార్ట్‌పై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్‌చార్ట్‌పై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీలను సొంత వనరులతో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఎంపీడీఓలకు నిర్వహించే శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన 50 మందికి రెండో బ్యాచ్‌లో శిక్షణ జరుగుతుందన్నారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలను వైస్ ప్రిన్సిపాల్ పరిచయం చేసుకున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత వనరుల సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిధుల రూపంలో అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పనులు నిర్వహించే సమయంలో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలను పాటించాల్సిన పనిలేదన్నారు. ఎంపీడీఓలు విధుల నిర్వహణలో మండల పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తొలిరోజు ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, డి.శ్రీనివాసరావు, కె.సుశీల శిక్షణ ఇచ్చారు. -
రైతుపోరుకు తరలి రండి
యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలను కూటమి సర్కార్ దృష్టికి తీసుకువెళ్లేలా మంగళవారం ఆర్డీఓ కార్యాలయాల వద్ద తలపెట్టిన రైతు పోరు కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా కేంద్రం కాకినాడ ఆర్డీఒ, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందచేయనున్నారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి ఆ డివిజన్ పరిధిలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం నియోజకవర్గాలకు చెందిన పార్టీ కోఆర్డినేటర్లు, పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు కలిసి వెళ్లనున్నారు. ఇక్కడి కార్యక్రమానికి వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిర్వహించేలా నిర్ణయించారు. కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో విజ్ఞాపన అందచేసే కార్యక్రమానికి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు, పార్టీ నేతలు, రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పిఠాపురం కోఆర్డినేటర్, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజా -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా తులసీ కుమార్
పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జెడ్పీటీసీ గుబ్బల తులసీ కుమార్‌ను అనపర్తి నియోజకవర్గానికి నియమించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. -
మురళీకృష్ణంరాజుకు వైఎస్సార్ సీపీ నేతల సంఘీభావం
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ధర్మవరంలో వైఎస్సార్ సీపీ నరసాపురం నియోజకవర్గ పార్టీమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుకు ఆదివారం ప్రత్తిపాడు అసెంబ్లీ, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చిన సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గం కో–ఆర్డినేటర్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జి కర్రి జయ సరిత, నరసాపురం జిల్లా ఉపాధ్యక్షుడు జోగాడ ఉమామహేశ్వరరావు, పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు వీరా మల్లికార్జునుడు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దేవ రాజేష్, అమలాపురానికి చెందిన రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబి తదితరులు భారీ ఎత్తున తలివచ్చి మురళీ కృష్ణంరాజుకు, ఆయన తండ్రి రామరాజుకు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం రామరాజుపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జిల్లాలో ఆలయాల మూసివేత
అన్నవరం: అన్నవరం సత్యదేవుని ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పండితులు సత్యదేవుడు, అమ్మవారికి హారతి ఇచ్చి ఫలహారాలు నివేదిన చేసిన అనంతరం ఆలయ తలుపులు మూసి వేశారు. ఈఓ వీర్ల సుబ్బారావు, ఏఈఓ పెండ్యాల భాస్కర్, ఇతర అధికారులు, వైదిక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ఒంటి గంట వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కాగా సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ అనంతరం ఏడు గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తుని రూరల్: సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జిల్లాలోని పలు ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. తుని రూరల్ మండలంలోని తలుపులమ్మ ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1.30 వరకు నాలుగు వేల మంది దర్శించుకున్నారని, అనంతరం ఆలయాన్ని మూసివేశామని ఈఓ పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. తిరిగి ఆలయ సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. వివిధ మార్గాల ద్వారా మొత్తం రూ.1,32,715 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. సామర్లకోట: అలాగే పంచారామ క్షేత్రం బాలా త్రిపుర సందరి సమేత కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించినట్టు అభిషేక పండితులు వేమూరి సోమేశ్వర శర్మ తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 9 గంటలకు సంప్రోక్షణ అనంతరం తెరవనున్నట్టు ఆయన తెలిపారు. స్థానిక మాండవ్య నారాయణ స్వామి ఆలయాన్ని సైతం 12 గంటలకు మూసివేశామని, తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు తెరవనున్నట్టు అర్చకులు అనంత పద్మనాభాచార్యులు తెలిపారు. -
పాడిపోయిన సేవలు!
పిఠాపురం: పశు సేవలన్నీ గ్రామస్థాయిలోనే అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇవి అరకొర సేవలకే పరిమితమయ్యాయి. గత 15 నెలలుగా మందులు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. పశువులకు పూర్తిస్థాయిలో టీకాలు కూడా వేయడం లేదు. దాణా పంపిణీ అనేది ఒకటుండేదన్న విషయం కూడా మర్చి పోయారు. విత్తనాల కోసం పడిగాపులు, ఎరువుల కోసం ఆందోళనలు, పంటలు నష్టపోతే సాయం కోసం ఎదురు చూపులు, పశువులకు ఏ చిన్న రోగం వచ్చినా దూర ప్రాంతంలో ఉన్న పశు వైద్య కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితులు మళ్లీ వచ్చేసాయి. వ్యవసాయమే కీలకంగా ఉన్న రాష్ట్రంలో రైతే రాజు. అటువంటి రైతును శ్రీనాటకాలు ఆడుతున్నారు.. అడిగితే తాట తీస్తాశ్రీమంటున్నారు కూటమి నేతలు. చంద్రబాబు అయితే వ్యవసాయం దండగ అని నిస్సిగ్గుగా ప్రకటించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారం చేపట్టిన నాటి నుంచి ఆ కష్టాలు ఏమీ లేవు. విత్తు నాటిన నాటి నుంచి పంట డబ్బు చేతికి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ప్రతి గ్రామంలోను రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు కావాల్సిన అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతే రాజు అనే నానుడిని నిజం చేశారు. నకిలీలు, దళారులు, వడ్డీ వ్యాపారుల బాధ లేకుండా అన్నీ స్వగ్రామంలోనే అందేలా చేశాయి. అప్పట్లో ఈ ఆర్బీకేలు. వీటి పనితీరు చూసి కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించగా అనేక రాష్ట్రలు తమ రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో పాటు మన ఆర్బీకేలు ఐఎస్ఓ సర్టిఫికెట్లు సాధించాయంటే వీటి పని తీరు ఎంత గొప్పగా ఉందో అర్ధమవుతుంది. అటువంటి చరిత్ర సాధించిన రైతు సేవా కేంద్రాలను కూటమి ప్రభుత్వం చేవ లేని వాటిగా తయారు చేసిందని రైతులు విమర్శిస్తున్నారు. పశు సంరక్షణ శూన్యం ప్రధానంగా వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభంలో గేదెలు ఆవుల్లో గొంతువాపు, జబ్బవాపు మొదటి విడత టీకాలు వేయాలి. జూలైలో కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నివారణకు, గొర్రెలకు, మేకల్లో నీలి నాలుక వ్యాధి నివారణకు టీకాలు వేయాల్సి ఉంది. ఆగస్టులో సంకరజాతి ఆవుల్లో థైలీరియా వ్యాధి నివారణకు, ఆవులు, గేదెల్లో గాలికుంట నివారణ మొదటి విడత టీకాలు వేయాలి. పశువుల్లో డయేరియా వస్తే మాత్రలు, పొట్టలో పాములు పట్టకుండా డీవార్మ్ మాత్రలు, పాలు సక్రమంగా ఇచ్చేందుకు లెఫ్ట్ డీన్ మాత్రలు, గాయాలు, పుండ్లు మానేందుకు పొటాషియం పెర్మాంగనేట్ లిక్విడ్, కడుపునొప్పి కోసం సిప్రొవెట్, పాలు తీసేటప్పుడు గడ్డలు కడితే సన్న కట్టు శుభ్రపరచడానికి జెంటామైసిన్, ఆహారం అరుగుదలకు ఎట్రాఫిన్, కాళ్లు వాపులకు సోడియం సిలికేట్ మందులు వాడాల్సి ఉంది. అలాగే తరచూ వచ్చే జ్వరం, అజీర్ణం, విరేచనాలు, దగ్గు, కాళ్ల నొప్పులు తదితర రోగాలకు ఇక్కడ వైద్య సేవలు అందించాలి. దూడలకు గొంతువాపు వ్యాధి టీకాలు, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్, పందులకు స్వైన్ ఫ్లూ టీకాలు, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. కృత్రిమ గర్భధారణకు ఎద సూదులు, చూలు కట్టకుంటే పరీక్షించడం వంటి సేవలు అందించాలి. రైతు సేవా కేంద్రాల్లో ఈ సేవలేవీ పూర్తిస్థాయిలో అండడం లేదు. కానీ ఇవేమీ అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు ప్రైవేటు దుకాణాల్లో రూ.వేలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పాడి రైతులు బయట మార్కెట్లో మందులు కొనుగోలు చేసుకోవడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జ్వరం, పారుడు వ్యాధి, మేత మేయకపోవడం, నులి పురుగులు, గర్భదారణ సమస్యలు తరచూ వస్తున్నాయి. వీటి కోసం నెలలో సుమారు రూ.2 వేలు వరకూ ఖర్చు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. కాకినాడ జిల్లాలో రైతు సేవా కేంద్రాలు 408 ఆవులు 76, 502 గేదెలు 2,82,273 గొర్రెలు 1,01,870 మేకలు 1,41,229 ఆర్ఎస్కేల్లో అందించాల్సిన సేవలు.. పశుగ్రాస విత్తనాల పంపిణీ, సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ, మినరల్ మిక్సర్, పశు బీమా, పశు హెల్త్ కార్డులు, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రతి నెలా పశు విజ్ఞాన కార్యక్రమాలు, పశువులకు టీకాలు, గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు, చిటిక వ్యాధి, బ్రూసెల్లా వ్యాధి, కొక్కెర వ్యాధి, నీలి నాలుక తెగులు, వంటి వ్యాధులకు టీకాలు, డీ వార్మింగ్, నట్టల నివారణ కార్యక్రమాల నిర్వహణ. అన్ని రకాల జంతువులకు వ్యాక్సినేషన్, కృత్రిమ గర్భధారణ, నిర్ధారణ, పునరుత్పత్తి, సంతానోత్పత్తి వంటి పశు వైద్య సేవలు. పాడి రైతులకేది భరోసా? ప్రతి ఆర్ఎస్కేల్లో 108 రకాల మందులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఏ ఆర్ఎస్కేలో చూసినా పట్టుమని పది రకాల మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఏ రైతు సేవా కేంద్రంలో చూసినా 108 రకాలకు ఒకటి రెండు రకాలు మినహా మిగిలిన మందులేవీ అందుబాటులో లేవు. అలాగే పశువులకు వేసే టీకాలు కొన్నిచోట్ల కొన్ని రకాలు మాత్రమే ఉంటున్నాయి. ఏడాదిగా మందుల సరఫరా నిలిచిపోయాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మందులు అవసరమైన వారిని మండల కార్యాలయాల్లో ఉన్న పశు వైద్యశాలలకు పంపిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్లు చెబుతున్నారు. పాడి రైతులకు ఉపయోగ పడే మందులు లేకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాకినాడలో అన్య దేశపు జెండాల ప్రదర్శన
కాకినాడ క్రైం: మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శుక్రవారం కాకినాడలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో కలకలం రేగింది. మహ్మద్ ప్రవక్త 1500వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోకి నాలుగు అనుమానిత కార్లు చొరబడ్డాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, ర్యాష్‌గా వాటిని నడపడంతో పలువురు ముస్లింలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొంత దూరం వెళ్లాక, నాలుగు కార్ల నుంచి నలుగురు వ్యక్తులు అన్య దేశపు జెండాలను ప్రదర్శించి మత ఘర్షణలకు పురిగొల్పే చర్యలకు పాల్పడ్డారు. తక్షణమే అప్రమత్తమైన కాకినాడ వన్ టౌన్ పోలీసులు వాహనాలను అడ్డుకొని ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మూలాలపై ఆరా తీస్తున్నారు. దీనిలో కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఆ జెండాలతో మాకు సంబంధం లేదుబోట్క్లబ్ (కాకినాడ): మిలాద్ – ఉన్ – నబీ ర్యాలీ సందర్భంగా వేరే దేశపు జెండాలతో వచ్చిన కార్లతో తమకు సంబంధం లేదని మక్కా మసీదు సెక్రటరీ ఎండీ ఖాజామెహిద్దీన్ తెలిపారు. జగన్నాథపురంలో శనివారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మక్కా మసీదు నుంచి శాంతియుతంగా ర్యాలీ ప్రారంభించామన్నారు. కార్యక్రమానికి సంబంధం లేని కొందరు వేరే దేశపు జెండాలతో వచ్చి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం బాధాకరమన్నారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ సమాజానికి, పోలీసు యంత్రాంగానికి క్షమాపణలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. సమావేశంలో మసీద్ అజాం ఖాదర్ అలీఖాన్, ముస్లిం నాయకులు షేక్ గౌస్ మొహీద్దీన్, కుతుబుద్ధీన్, ఎండీ ఖాన్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ వృత్తి మహోన్నతం
– కలెక్టర్ షణ్మోహన్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమాజంలో ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వత్తి మహోన్నతమైనదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ జేఎన్టీయూ అల్లూమ్ని ఆడిటోరియంలో గురుపూజోత్సవం –2025 కార్యక్రమం జరిగింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 70 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ బోధనలతో ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు మానసిక దఢత్వాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థులను భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఈ సమాజానికి మూల స్తంభాల వంటి వారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ.. సమాజ ఉన్నతికి పాటుపడుతున్న ఉపాధ్యాయులందరూ ఉత్తమ గురువులేనని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు దక్కుతుందన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పూర్వం ఉపాధ్యాయ వృత్తిని బతకలేక బడిపంతులు అనే వారిని.. నేడు బతుకు నేర్పే వృత్తిగా గుర్తింపు సాధించిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ నాగార్జున, డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్న చంద్రబాబు
● జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీల్లో 10 అమ్మేయడం ఏమిటి? ● ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ భరత్‌రామ్ మండిపాటు రాజమహేంద్రవరం సిటీ: అపారమైన అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాకుండా జగనన్న తీసుకువచ్చిన 10 మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చూడటం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ ిసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి, ఏ ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని మినహాయించి, లేని ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో రాజమహేంద్రవరం వంటి ఐదు ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం కూడా క్లాసులు ప్రారంభమయ్యాయన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా 35 ఎకరాల్లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ప్రారంభిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిన్నర కాలంలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. మొదటి బ్యాచ్ పూర్తయి డాక్టర్లు బయటకు వచ్చే సమయానికి కూడా భవన నిర్మాణాలు పూర్తవుతాయన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం 99 ఏళ్లకు అమ్మేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని కాలరాయడానికి చంద్రబాబుకి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ఎవరైనా మెడికల్ కాలేజీలు పెడతామన్నా, సీట్లు పెంచుతామన్నా ఆనందంగా ముందుకు వస్తారని, అయితే చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచొద్దని లేఖ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా నిర్వీర్యం చేసి, తద్వారా పేదలకు వైద్యం అందకూడదన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఉందని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. -
ముమ్మరంగా పొగాకు నారుమడులు
● 65 హెక్టార్లలో నర్సరీలు ● దసరా నుంచి నాట్లకు సన్నాహాలు ● ట్రే నర్సరీలపై రైతుల ఆసక్తి ● 70 వేల ఎకరాల్లో పంట సాగు దేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2025–26 పంట కాలానికి పొగాకు సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన నారును నర్సరీల్లో విత్తనం వేసి పెంచుతున్నారు. బోర్డు నిబంధనల మేరకు రైతులు, వ్యాపారులు నారుమడులు కట్టి పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నారుమడి దశ నుంచి బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. నారుమడి కట్టే రైతులు తప్పనిసరిగా బోర్డులో నర్సరీని రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంది. పొగాకు పంట సాగు చేసే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు, రైతుల నుంచి నారు కొనుగోలు చేయవలసి ఉంది. నారు అమ్మిన రైతు నుంచి నారు కొనుగోలు సమయంలో రశీదు తీసుకుని బోర్డు కార్యాలయంలో మొక్క ఫారంతో పాటు అధికారులకు అందజేయవలసి ఉంది. ప్రస్తుతం పొగాకు నారుమడులు ముమ్మరంగా కడుతున్నారు. నర్సరీల విస్తీర్ణం పెరిగే అవకాశం దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు 65 హెక్టార్లలో పొగాకు నర్సరీలు వేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో సుమారు 34 హెక్టార్లు కమర్షియల్, 21 హెక్టార్లు డొమెస్టిక్ నర్సరీలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు నర్సరీల విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, దేవరపల్లి, బందపురం, యర్నగూడెం, సంగాయగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో ఎక్కువగా పొగాకు నారుమడులు కడుతున్నారు. పల్లంట్ల, దేవరపల్లి, లక్ష్మీపురం, బందపురం గ్రామాల్లో కమర్షియల్ నర్సరీలు కడుతున్నారు. కమర్షియల్ నర్సరీలు కట్టేవారిలో 90 శాతం కౌలుదారులు ఉన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు, కాపవరం, ధర్మవరం, తాళ్లపూడి మండలం మలకపల్లి, ప్రాంతాల్లో కమర్షియల్ నారుమడులు కడుతున్నారు. ఇక్కడ వేసిన నారుకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళతారు. ఎకరం విస్తీర్ణంలో పెంచిన నారు సుమారు 1,200 ఎకరాల్లో సాగుకు సరిపోతుందని రైతులు తెలిపారు. ట్రే నారుపై రైతుల ఆసక్తి ట్రేలలో పెంచిన నారుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ట్రే నారు ఆరోగ్యకరంగాను, ధృడంగా ఉండి నాటిన అనంతరం చీడపీడలను తట్టుకుంటుందని రైతులు తెలిపారు. పొగాకు సాగు చేసే రైతులంతా ట్రే నారుపై మొగ్గు చూపుతున్నారు. ట్రే నారు ధర ఎక్కువగా ఉన్నప్పటికి రైతులంతా దీనినే కొనుగోలు చేస్తారు. ఏటా దాదాపు 70 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. అధిక దిగుబడుల వంగడాలు సాగు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలను సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థలు రైతులకు సరఫరా చేస్తున్నాయి. కిలో విత్తనాలకు వంగడాన్ని బట్టి రూ.15 వేలు ధర ఉంది. ఎల్వీ–7, 1353 వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు సుమారు 10 నుంచి 13 క్వింటాళ్లు పొగాకు దిగుబడి వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు బోర్డు నిబంధనలు ఉల్లంఘించి పొగాకు నర్సరీలు వేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పంట నియంత్రణలో భాగంగా ఈ ఏడాది నర్సరీ దశ నుంచి నిబంధనలు కఠినతరం చేశాం. నర్సరీ వేసే ప్రతి రైతు బోర్డు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నర్సరీల తనిఖీకి బోర్డు బిజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ ఉన్న నర్సరీల నుంచి రైతులు నారు కొనుగోలు చేయాలి. నారు అమ్మిన వ్యాపారి నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలి. రశీదు పుస్తకాలను బోర్డు ద్వారా నర్సరీ యజమానులకు అందజేస్తున్నాం. అక్టోబర్ నుంచి పొగాకు నాట్లు ప్రారంభం కానున్నాయి. – జీఎల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
గురువుకు విగ్రహం!
గురుభక్తిని చాటుకున్న పూర్వవిద్యార్థులు రాజోలు: తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవాలు అనే మాటలను నిజం చేసి తమకు పాఠాలు బోధించిన గురువు విగ్రహాన్ని శిష్యులు గురువు ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు చింతలపల్లి గ్రామంలో స్వర్గీయ ఉపాధ్యాయుడు గుబ్బల గంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన బోధించిన పాఠాలు, వ్యక్తిత్వ వికాసాలు, జీవిత మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకున్న పూర్వ విద్యార్థులు ఆయన ఇంటి ఆవరణలో గంగారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురుభక్తిని చాటారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ గంగారావు గణిత బోధనలో గొప్పవారిగా నిలిచారన్నారు. ఆయన జ్ఞాపకార్థం శిష్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి, నాయకులు దంతులూరి చంటిబాబు, పెదబాబు, పి.గన్నవరం వైస్ ఎంపీపీ చెల్లుబోయిన గంగాదేవి, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భావోద్వేగాల బంధానికి బైబై!
15 పైసల పోస్టు కార్డు.. ఇన్లాండ్ కవర్.. కవరింగ్ లెటర్.. రిజిస్టర్డ్ పోస్టు.. టెలిగ్రాం.. ఇలా ఎన్నో సేవలు సుదీర్ఘ కాలం అందించిన తపాలా శాఖ కొన్ని బంధాలను వదిలించుకుంటోంది. కారణం.. కాలంతో పరుగులు తీయాలనుకోవడమే. సాంకేతికత రాకెట్ వేగంతో సాగుతుంటే కనీసం బుల్లెట్ ట్రైన్‌లా అయినా ముందుకు సాగకపోతే తన ఉనికికే ప్రమాదమని గ్రహించింది ఆ శాఖ. ఎస్సెమ్మెస్ మొదలైన దగ్గర నుంచి ఊపందుకున్న సాంకేతికత నేడు చాలా వేగంగా విస్తరించి అతి తక్కువ వ్యవధిలో పెద్ద పెద్ద ఫైళ్లను సైతం ఈ మెయిల్ రూపంలో చేరవేస్తోంది. ఇవన్నీ చూస్తున్న నాటి తరం కొంత నిట్టూర్పు విడుస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షణ అనంతరం తాము అందుకున్న ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులను గుర్తు చేసుకుని ఇక ఆ సేవలు కనుమరుగు కానున్నాయని తెలియడంతో కాస్త మనస్తాపానికి గురవుతున్నారు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ సేవల విస్తరణ కోసం సరి కొత్త ప్రయోగాలు చేస్తున్న పోస్టల్‌శాఖ పాత సేవలను మాత్రం ఒక్కొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దు కాగా, సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టుసేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్ రెడ్ (పోస్టల్) బాక్స్‌ను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతికతకు పోస్టల్ డిపార్టుమెంట్ అప్‌గ్రేడ్ అవుతోంది. రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం పోస్టల్‌శాఖ రిజిస్టర్ పోస్టు సేవలకు మంగళం పాడింది. తాజాగా బ్రిటీషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పోస్టు మాస్టర్లకు ఇప్పటికే శాఖాపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్టుకార్డు లేదా రిజిస్టర్డ్ పోస్టు మాత్రమే అందుబాటులో ఉండేది. సుమారు 171 ఏళ్లుగా.. పోస్టల్ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ శాఖ ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో మందుకు వస్తోంది. 1854లో అప్పటి బ్రిటిష్ అధికారి లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో సేవలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందుగా 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171 ఏళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు (డెలివరీ ప్రూఫ్) పొందడం ఒక ప్రత్యేకత, చట్ట పరంగా సైతం ఎంతో విలువైనది. స్పీడ్ పోస్టులో విలీనం రిజిస్టర్డ్ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్ పోస్టు సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఆ శాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవల క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్‌పోస్టులో రిజిస్టర్డ్ పోస్టు విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్ పోస్టు అంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్‌పోస్టులో కలపడంతో డెలివరీలు మరింత వేగవంతంగా గమ్యాన్ని చేరనున్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకే సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు. తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత.. వాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీ మెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి చాలా వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం సాగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్‌లను పరిశీలిస్తే 25 శాతం పడిపోయాయి. స్పీడ్ పోస్టు, ఇతర కొరియర్ల సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్టు డిమాండ్ అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా స్పీడ్ పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్టర్డ్ పోస్ట్ కనీస చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్ పోస్ట్‌తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం మొయకతప్పదు. రెడ్ పోస్టు బాక్స్ ఎత్తివేత ఊహగానమే.. రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రెడ్పోస్టు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో పోస్టల్ శాఖ అభిమానులు ఒకింత కలవరానికి గురవుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా.. నిశ్శబ్దంగా.. నిశ్చలంగా.. విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ఒక ఊహాగానమేనని పోస్టల్ వర్గాలు అంటున్నాయి. పోస్టల్ శాఖ ద్వారా ఎరుపు పోస్ట్బాక్సును ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంటి ముంగిట్లో సేవలందిస్తూ...ఉహాగానమే.. పోస్టుబాక్స్లు ఉండవని సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానమే. ఇప్పటి వరకు పోస్టుబాక్స్లు తొలగింపునకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కేవలం రిజిస్టర్ పోస్టు మాత్రమే నిలిపివేశారు. – దాసరి నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ తపాలా సేవలపై అయోమయం ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్ట్ సేవల నిలిపివేత తాజాగా లెటర్ రెడ్ బాక్స్ ఎత్తివేత ప్రచారం అదేమీ లేదంటున్న ఆ శాఖ అధికారులు ఈ–సేవ విస్తరణలో పోస్టల్ శాఖ నిమగ్నం -
రేపు మధ్యాహ్నం వరకే సత్యదేవుని దర్శనం
అన్నవరం: భాద్రపద పౌర్ణిమ, ఆదివారం రాత్రి 9–50 గంటలకు ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారని ఈఓ వీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం పది గంటల వరకు మాత్రమే స్వామివారి వ్రతాలు, కేశఖండన టిక్కెట్లు విక్రయిస్తారు. ఉదయం 12 గంటల వరకు మాత్రమే వ్రతాలు నిర్వహిస్తారు. స్వామివారి నిత్యకల్యాణం, వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం ఉదయం 11 గంటల లోపు పూర్తి చేస్తారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను వ్రతాలు, దర్శనాలు, ఇతర పూజా కార్యక్రమాలకు అనుమతిస్తారని తెలిపారు. ఆక్వా రంగాన్ని కాపాడండి బోట్‌క్లబ్ (కాకినాడ): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న 50 శాతం సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా, కార్మికుల తొలగింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని, సంవత్సరానికి 10 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు జిల్లా నుంచి ఎగుమతి అవుతున్నాయన్నారు. కోనపాపపేట సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన హేచరీస్, జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆక్వా ఫీడ్ తయారీ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లలో సుమారు లక్షమంది కార్మికులు ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారన్నారు. ఆక్వా సాగు యంత్రాలు, మందులు అమ్మే దుకాణాల ద్వారా మరో 50 వేలమంది పరోక్ష ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ సంక్షోభం కారణంగా అనేక చిన్న యూనిట్లు మూసివేశారని, నెక్కంటి, దేవి, అవంతి, అపెక్స్ వంటి పెద్ద యూనిట్లలో ఉత్పత్తిని 50 శాతానికి పరిమితం చేసి ఆ మేరకు కార్మికులను తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి కావలసిన విదేశీ మారకద్రవ్యం ఈ ఆక్వా ఎగుమతుల ద్వారా వస్తుందని, ఇప్పుడు అది సుంకాల ప్రభావంతో పడిపోయిందన్నారు. కోటసత్తెమ్మ ఆలయం రేపు మూసివేత నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం కోటసత్తెమ్మ అమ్మవారికి యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 4 గంటలకు మూసివేసి తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన పేర్కొన్నారు.వినాయక లడ్డూ రూ.36,500 అమలాపురం రూరల్: మండలంలో బండారులంక, మట్టపర్తివారిపాలెంలో నిలబెట్టిన సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి నవరాత్ర మహోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి 15 కేజీల మహాలడ్డూను వేలంపాటలో రూ.36,500లకు డి.రవితేజ, వెంకటలక్ష్మి, తులసి అర్జున్, దివ్య దంపతులు దక్కించుకున్నారు. పాటదారులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు సత్కరించి లడ్డూను అందించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు కడలి రాజు, కడలి రావకృష్ణ, బొంతు శ్రీనుబాబు, మట్టపర్తి అజయ్ కుమార్, మామిడిశెట్టి విష్ణు ప్రసాద్, మట్టపర్తి రాంబాబు, మట్టపర్తి కృష్ణ నాగేంద్ర, రాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లింల శాంతి ర్యాలీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రవక్త ప్రవచనాలను వినిపిస్తూ, ధార్మిక నినాదాలు చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో 40 ఏళ్లుగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది మహ్మద్ ప్రవక్త జన్మించి 1,500వ సంవత్సరం కావడం విశేషమన్నారు. -
4 వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్ల బెల్లాన్ని గురువారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని అంబాగుబా గ్రామం నుంచి కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి మినీ గూడ్స్ వేన్లో నల్లబెల్లం రవాణా జరుగుతోంది. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళికి అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తమ సిబ్బందితో వెళ్లి ధర్మవరం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ వేన్తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేన్ డ్రైవర్లు సామర్లకోటకు చెందిన తుమ్మల వీర వెంకట సూర్యతేజ, పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన నక్కా చినవీర్రాజులను అరెస్టు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి దాడి లోవరాజుపై కేసు నమోదు చేసినట్టు ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తెలిపారు. ఈదాడిలో ప్రత్తిపాడు ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్ తదతర సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరి అరెస్టు -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
తొండంగి: మండలంలోని ఒంటిమామిడి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒంటిమామిడిలో ఆగస్టు 11న బొమ్మదేవ్ సారధి ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో దుండుగులు బంగారు, వెండి నగలు, కొంత నగదు చోరీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి బుధవారం నిందితులను అనకాపల్లి జిల్లా రేవుపోలవరానికి చెందిన చేపల నాని అలియాస్ స్టైలిష్ నాని, యు.కొత్తపల్లికి చెందిన బొండు శివలను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి స్కూటీ కొనుగోలు చేయగా ఆ వాహనంతో పాటు కొంత నగదును రికవరీ చేశామన్నారు. రికవరీ సొత్తు విలువ రూ.2.4 లక్షలు ఉంటుందన్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పీసీలు సీహెచ్ మణి వీరకంఠ, సీహెచ్ దొర, పి.శివ, కేఆర్వీ సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఆర్.కిశోర్‌లను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారని తెలిపారు. -
సనాతనానికి మూల స్తంభాలు వేదాలు
● ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి ● వేద స్వస్తితో పులకించిన అమలాపురం ● ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది వేద పండితుల రాక అమలాపురం టౌన్: సనాతన సంస్కృతికి మూల స్తంభాలు వేదాలేనని తిరుపతికి చెందిన వేద పండితుడు దూవ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి అన్నారు. శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సత్య సాయి కల్యాణ మండపంలో గురువారం జరిగిన 63వ వార్షికోత్సవ వేద సభలో ఆయన ఉపన్యసించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది వేద పండితులు వచ్చి వేదాలను ఘోషించారు. వంక రామకృష్ణ విద్యాశంకర్ అధ్యక్షతన వేదసభ సాగింది. వేద పండితులు కడియాల వేంకట సత్య సీతారామ ఘనపాఠి, శృంగేరి అస్థాన విద్వాంసులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వర ఘనపాఠి, గుళ్లపల్లి విశ్వనాథ ఘనపాఠి, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాఠి, హైదరాబాద్‌కు చెందిన హరి సీతారామమూర్తి సలక్షణ ఘనపాఠి, వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి వేదికపై ఆశీనులై వేదాల విశిష్టతను వివరించారు. వేద ధ్వనితో సమాజ వికాసమే కాకుండా వాతావరణం కూడా పవిత్రం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచానికి రక్ష ధర్మమే, ఆ ధర్మానికి మూలం వేదమేనన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో నిత్యం పారే గోదావరి పాయలు వేదల్లా ఘోషిస్తున్నాయంటే అది ఆ వేదాల్లోని శక్తి వల్లేనని పేర్కొన్నారు. అనంతరం వందలాది మంది వేద పండితులు ఒకేసారి పలికిన వేద స్వస్తితో అమలాపురం పట్టణం పునీతమైంది. కోనసీమ భాష వేద ఘోష అన్నట్లుగా స్వస్తి సాగింది. అనంతరం వేద పండితులను వేద శాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్, సభ సభ్యులు శిష్టా భాస్కర్, కుమారశాస్త్రి, యేడిది సుబ్రహ్మణ్యం తదితరులు ఘనంగా సత్కరించారు. వేదాభిమానులు మండలీక ఆదినారాయణ, పుత్సా కృష్ణ కామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వేదాలను పోషించడం అభినందనీయం ఏడాదికోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేద పండితులను ఆహ్వానించి సత్కరించడం అంటే సాక్షాత్తు వేదాలను గౌరవించడమే. కోనసీమ వేద శాస్త్ర సభ వేదాలను పోషిండచం అభినందనీయం. ధర్మాన్ని మనం ఆచరిస్తే వేదాలు మన ధర్మాన్ని కాపాడుతాయి. వేదాలు ఎక్కడ పోషిస్తే అక్కడ వేదాలు శోభిల్లుతాయి. వేద భూమి కోనసీమ. ఈ సీమలో ప్రవహించే నదీ పాయలు కూడా వేదాలు ఘోషిస్తాయి. – హరి సీతారామమూర్తి, సలక్షణ ఘనపాఠి, వేద పండితుడు, హైదరాబాద్ మానవ మనుగడను నిర్దేశించేవి వేదాలే మానవ మనుగడను నిర్దేశించేవి వేదాలే. నాలుగు వేదాలతోనే ప్రపంచం నడుస్తోంది. వేదాధ్యయనం, వేదన పఠనం చేసిన పండితులు లోక కల్యాణంలో భాగస్వాములే అవుతారు. కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ వేద పండితులను వామన జయంతి నాడు సత్కరించడం, వేద స్వస్తి చెప్పించం లోక కల్యాణం కోసమే. ఈ సంస్థ వేదాలను పోషిండచం మాలాంటి వేద పండితులకు ఎంతో ఆనందం. – ఉపాధ్యాయుల కాశీ విశ్వ సోమయాజులు, టీటీడీ తెలంగాణ రాష్ట్ర సూపర్వైజర్ -
గురువుల మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి
నా తొలి గురువులు తల్లిదండ్రులు షేక్ మీరాబి, కరీమ్. చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవరచి చదువులో బాగా ప్రోత్సహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు ఎస్ఎంఎన్బీ మెమోరియల్ ఓరియంటల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు హెచ్ఎం కె.నాగేశ్వరరావు నాపై చెరగని ముద్ర వేశారు. గురువుల దయతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. టీచర్ ప్రవర్తన విద్యార్థుల జీవితాలకు స్ఫూర్తిదాయకం కావాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిత్యం మననం చేసుకుంటాను ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానమార్గంలో నడిపించడం గురువుకే సాధ్యం. గురువు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాకినాడ ఐడియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో డాక్టర్ చిరంజీవినీకుమారి చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పారు. సమాజానికి ఉపయోగపడేలా చదువుకోవాలని చెప్పిన మాటలు నేటికీ మననం చేసుకుంటాను. – దేవిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా రవాణా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వారి ప్రభావం ఎంతో ఉంది నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది. ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ పద్మజ, ప్రిన్సిపాల్ శశి ప్రభావం నాపై ఎక్కువుగా ఉంది. వారు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. వారిచ్చిన స్ఫూర్తితోనే పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది. సాంకేతికంగగా ఎంత ఎదిగినా ఉపాధ్యాయుల పాత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం -
గురువు.. తిమిరంలో తేజోమూర్తి
● బాలలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే నేర్పరి ● రేపు ఉపాధ్యాయ దినోత్సవం రాయవరం: ‘గురవంటే రెండు బెత్తం దెబ్బలు.. నాలుగు గుంజీలు తీయించడం కాదు.. కొండంత చీకటిలో తేజోమయంగా వెలిగే దీపం. గురవంటే పసిపిల్ల పెదాలపై విరిసిన నవ్వురేఖ..’ ఈ మాటలన్నది ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అజ్ఞానపు తిమిరాన్ని పారదోలి విజ్ఞాన కాంతులు ప్రసరింపజేసే మార్గదర్శకులు గురువులు. విద్యార్థిని సానబట్టి వజ్రంలా తయారు చేసే అక్షర శిల్పులు. అందుకే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కొఠారి దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్నారు. ఎంతటి శాస్త్రవేత్త అయినా, దేశానికి ప్రధాని అయినా ఒక ఉపాధ్యాయుడి వద్ద ఓనమాలు నేర్చుకున్న వారే. గురువుల స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న వేళ గురువులపై పలువురి అభిప్రాయాలతో కథనం.. గురువు పాత్ర ఎనలేనది సమాజంలో గురువు పాత్ర ఎనలేనిది. నిరంతర విద్యార్థిగా ఉంటూ తన శిష్యులను ఉన్నత స్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే సమయంలో వయోల మేడమ్ సైన్స్, ఇంగ్లిష్ బోధించేవారు. ఆమె బోధనా విధానం నన్ను ప్రభావితం చేసింది. ఉపాధ్యాయులు నేర్పిన విద్యతోనే ఈ రోజు జిల్లా అధికారిగా రాణించగలుగుతున్నాను. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, ఏపీసీ, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఊరేగింపులో ముగ్గురిపై కత్తిపోట్లు
వినాయక నిమజ్జనం సందర్భంగా ఘటన అల్లవరం: గణేష్ ఉరేగింపులో జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురైన ఘటన మండలం కొమరగిరిపట్నంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, వివరాలు ప్రకారం వినాయకచవితి సందర్భంగా గుర్రం వారి వీధిలో వినాయక విగ్రహాన్ని గురువారం ఊరేగించారు. విగ్రహం శివాలయం వద్దకు వచ్చే సరికి వారిలో వారికి ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తిక్కిరెడ్డి మోహిత్ మణికంఠ చెడీ తాళింఖానా చేసే కత్తితో సుంకర సురేష్, కొమ్మూరి శంకర్లను వెనుక నుంచి పొడిచాడు. మణికంఠ ఇద్దరిపై కత్తితో దాడి చేసిన విషయాన్ని గమనించిన తెలగరెడ్డి హరీష్ అడ్డుపడ్డాడు. దీంతో హరీష్‌పై మణికంఠ దాడి చేసి కత్తితో పోడిచాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై రక్తపు మడుగులో ఉన్న ముగ్గురినీ స్థానిక సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురంలోని కిమ్స్‌కు తరలించారు. ఈ వివాదంలో స్వల్పగాయాల పాలైన మణికంఠను కిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్సై సంపత్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కిమ్స్ ఆస్పత్రిలో బాధితుల నుంచి పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేస్తున్నారు. -
600 కిలోల గంజాయి స్వాధీనం
మలకపల్లి వద్ద కారులో పట్టివేత తాళ్లపూడి: మండలంలోని మలకపల్లి వద్ద భారీగా గంజాయి పట్టు బడింది. వైజాగ్ జోనల్ యూనిట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఇన్నోవా కారులో సుమారు 600 కేజీల గంజాయి వస్తున్నట్టు అందిన సమాచారం మేరకు వైజాగ్ నుంచి వెంబడిస్తూ మలకపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు పరారు కాగా, పట్టుబడ్డ మహారాజన్ రాజా అనే వ్యక్తిని తాళ్లపూడి స్టేషన్‌కు తరలించారు. సరకును, వాహనాన్ని, నిందితుడిని రాజమహేంద్రవరం తరలిస్తామని అక్కడి అధికారులు పూర్తి సమాచారం ఇస్తారని తెలిపారు. ఐరెన్ ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి మృతి ముమ్మిడివరం: ఇనుప ఊసలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్కు అదుపు తప్పి బొల్తా పడడంతో వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం అయినాపురం అవుట్ ఫాల్ స్లూయిస్ ఏటుగట్టుపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయినాపురం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఐరన్‌ను ట్రాక్టర్‌పై మురమళ్ల తరలిస్తుండగా ఏటిగట్టుపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న యానాం శివారు కురసాం పేటకు చెందిన కూలీ మేడిశెట్టి గోవిందు (48) ఊసలు మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సొసైటీ భవనం వేలం వాయిదా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సుమారు రూ.23 కోట్ల మేర ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన కార్గికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భవనం వేలం వాయిదా పడింది. సొసైటీ చైర్మన్ కోడి వీరవెంకట సత్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుని, వడ్డీ చెల్లించకుండా ముఖం చాటేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సొసైటీ ఆస్తులను సహకార శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆస్తులను అమ్మి ప్రజల డిపాజిట్లు చెల్లించేందుకు సహకార శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న సొసైటీకి చెందిన మూడు అంతస్తుల భవనానికి వేలం పాట వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సహకార శాఖ అధికారులు అనుకున్న మేర వేలం సొమ్ము రాకపోవడంతో తిరిగి ఈ నెల 8న సోమవారం రెండు గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్, సేల్స్ ఆఫీసర్ జె.శివకామేశ్వరరావు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ అభివృద్ధికి సత్యనారాయణ కృషి
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అభివృద్ధికి కురసాల సత్యనారాయణ విశేషంగా కృషి చేశారని, ఆయన మృతి బాధాకరమని, మాజీ మంత్రి కన్నబాబుకు తండ్రి లేని లోటు తీర్చలేనిదని పలువురు నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో గత నెల 19న మృతిచెందిన సంగతి విదితమే. కాకినాడ వైద్యనగర్‌లో సత్యనారాయణకు గురువారం దశ దినకర్మలను కుమారులు కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్‌కృష్ణ, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అనంతబాబు, పేరాబత్తుల రాజశేఖర్, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కారుమూర్తి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జెడ్పీ చైర్మ న్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు, కరణం ధర్మశ్రీ, సత్తి సూర్యానారాయణరెడ్డి, జ్యోతుల చంటిబాబు, పాముల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు, మాజీ ఎంపీ వంగా గీత, ఆధ్మాత్మిక గురురు ఉమర్ ఆలీషా, మాజీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.సంతాప సభలో పలువురు నేతలు -
లీడర్లే టార్గెట్
సర్వత్రా విస్మయం జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణపై కూటమి నేతలు జగ్గంపేట పోలీస్టేషన్లో అక్రమంగా కేసు బనాయించి వేధింపులకు పాల్పడ్డారు. అక్కడి పోలీసులు రమణను ఒక రోజంతా జగ్గంపేట పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించడాన్ని ఈ సందర్భంగా అక్కడి పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన శంఖవరం మండలం మండపంలో గత డిసెంబరు 27న వైఎస్సార్ సీపీ కార్యకర్త గుండుపల్లి నానాజీ పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా టీడీపీ నాయకులు దారి కాసి కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్త స్రావంతో బాధపడుతోన్న నానాజీని తుని ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇలా జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోను వైఎస్సార్ సీపీ నేతల్లో భయోత్పాతాన్ని సృష్టించి కట్టడి చేసే కుట్రలో భాగంగా తెలుగు తమ్ముళ్లు వేధింపులకు దిగుతూ, బనాయిస్తోన్న అక్రమ కేసులపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం చేతిలో ఉందని కూటమి నేతలు బరి తెగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా తెలుగు తమ్ముళ్లు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలక నేతలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం నేతలు వేధింపుల పర్వానికి తెర తీశారు. గద్దె నెక్కిన దగ్గర నుంచి వివిధ నియోజకవర్గాల్లో కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి అక్రమ కేసులు బనాయించడంలో ముందుంటున్నారు. వైఎస్సార్ సీపీ కోసమే పనిచేయడమే పెద్ద నేరం అన్నట్టుగా ఆ పార్టీ నేతలను బెదిరించి దారికి తెచ్చుకోవాలని కేసులతో కుట్రలు పన్నుతున్నారు. జిల్లాలోని జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, కాకినాడ...ఇలా ప్రతి నియోజకవర్గంలోను ఏదో ఒక కారణంతో పోలీసులను బలవంతం చేసి వైఎస్సార్ సీపీ నేతలపై అనేక కేసులు నమోదు చేయిస్తున్నారు. వేధింపులతో పాటు అన్యాయంగా కేసులు నమోదు చేయడం చూస్తుంటే ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని విజ్ఞులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వయోభారంతో బాధపడుతోన్న 86 ఏళ్ల ముదునూరి రామరాజుపై తాజాగా అక్కడి పోలీస్ స్టేషన్లో ఒక మహిళను అడ్డం పెట్టుకుని అక్రమ కేసు పెట్టడం వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రామరాజు తనయుడు ముదునూరి మురళీకృష్ణంరాజు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు కావడమే పాపం అన్నట్టుగా ఉంది. ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉండటం ప్రత్తిపాడు మండలంలో తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూండటం ఆ పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. ఎవరో ఒకరి సహాయం లేకుండా రామరాజు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అటువంటి రామరాజు అసభ్యంగా ప్రవర్తించారంటూ ప్రత్తిపాడులో అక్రమంగా కేసు బనాయించారని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. ముదునూరిని వైఎస్సార్ సీపీలో ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ఎత్తుగడతోనే పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. రామరాజుపై కేసు నమోదుచేసే ముందు కనీసం అతని వయసునైనా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని గ్రామస్తులు ఆక్షేపిస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలో అక్రమ కేసులు బనాయిస్తూ పోతే చూస్తూ ఉపేక్షించేదిలేదని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ముఖాల్లో సంతోషం కోసం ఇటువంటి కేసులు పెట్టడం అన్యాయమంటున్నారు. అంత వయసు కలిగిన రామరాజుపై కేసు విషయంలో టీడీపీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పై పెచ్చు రామరాజుపై కేసును సమర్థించుకునే రీతిలో టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అసభ్యంగా ప్రవర్తించడానికి వయసుతో పనేమిటంటూ వితండవాదాన్ని తమ్ముళ్లు తెర మీదకు తీసుకువచ్చారు. ఏడాదిగా ఇదే తంతు వైఎస్సార్ సీపీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించడం గడచిన ఏడాదిన్నరగా సాగుతోంది. తునిలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు సుధారాణిపై కౌన్సిలర్లను నిర్బంధించారంటూ తుని పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు బనాయించారు. ఈ వ్యవహారంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారంటూ వైఎస్సార్ సీపీ నేతలు రేలంగి రమణ గౌడ్, పోతుల లక్ష్మణ్, షేక్ క్వాజా, చింతల పండు, పామర్తి మహేష్ తదితరులపై తుని టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేయడం గమనార్హం. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లంతా సమావేశానికి వెళితే టీడీపీ నేతలు కక్ష కట్టి కిడ్నాప్ కేసు పెట్టడం అప్పట్లో సంచలనమైంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అనుచరుడనే కారణంతో తొండంగి మండలం వైస్ ఎంపీపీ నాగం గంగబాబు తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. కోటనందూరు మండలం అల్లిపూడికి చెందిన చింతకాయల చినబాబుతో పాటు మరో ముగ్గురిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ కేసు నమోదు చేశారు. తుని మండలం తేటగుంట, వెలమకొత్తూరు, ఎన్ సూరవరం గ్రామానికి చెందిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు బనాయించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రత్తిపాడులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ మహిళను వేధిస్తున్నారంటూ కేసు పెట్టారు. శరభవరం ఎంపీటీసీ అమరాధి కాశీ జగన్నాథంపై ఇదివరకే కేసులు బనాయించారు. గత జనవరిలో శరభవరం ఉపాధి హామీ సమావేశంలో అక్కడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు అమరాధి కాశీ జగన్నాథంపై స్థానిక టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కానీ తెలుగు తమ్ముళ్లు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బాధితులపైనే కేసులు నమోదు చేయించారు. గత అక్టోబర్‌లో ఉత్తరకంచి ఎంపీటీసీ సభ్యుడు ఉమ్మిడి అచ్చన్న(తాతీలు)పై భూ వివాదాన్ని సృష్టించి అక్రమంగా కేసు బనాయించి వేధింపులకు గురిచేశారు. వైఎస్సార్ సీపీ క్రియాశీలక నేతలే లక్ష్యంగా కూటమి కక్ష సాధింపు అక్రమ కేసుల పరంపర దారికి రాకుంటే వేధింపులు కేసులకు బెదిరేది లేదంటున్న శ్రేణులు 86 ఏళ్ల వృద్ధుడిపై కేసులా విస్మయం వ్యక్తం చేస్తోన్న టీడీపీ నేతలు -
క్రైస్తవులకు అండగా వైఎస్సార్ సీపీ
అమలాపురం రూరల్: క్రైస్తవులకు వైఎస్సార్ సీపీ ఎప్పడూ అండగా ఉంటూ వారి హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం పార్టీ జిల్లా సెల్ అధ్యక్షురాలు ఈదా సంధ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెస్లీ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బలోపేతానికి గ్రామాల్లోని క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు కృషిచేయాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండడంతోనా పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశ్వాసాన్ని ఉంచి పార్టీని మందుకు తీసుకెళ్లాలన్నారు. అలాగే క్రైస్తవులకు పార్టీ ఎప్పడూ అండగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా అంతా కృషిచేయాలని సూచించారు. కష్టపడిన వారికి పార్టీలో ఎప్పుడూ సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. దానికి అనుగుణంగా గ్రామస్థాయిలో కార్యకర్తలకు నియోజకవర్గ నాయకునిగా ఎదిగే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేలా అందుబాటులో ఉంటారని అన్నారు.రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ -
ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని ఏపీఎన్జీజీఓల అసోసియేషన్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫెడరేషన్ కో ఆర్డినేటర్ దడాల జగ్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు పాల్గొన్నారు. జానీ పాషా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ మార్పు చేసి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సాధించడం కోసం నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులు అంటే కట్టు బానిసలుగా భావిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలో బానిసలు కాదన్నారు. సచివాలయాల శాఖ సర్వేల శాఖగా మారిపోయిందన్నారు. సమావేశానికి హాజరైన వివిధ విభాగాల సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారు. రాజమహేంద్రవరం ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు పి.అనిల్‌కుమార్, నగర కార్యదర్శి సేవా ప్రవీణ్, కొల్లిరాజేష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
అధరకొడుతున్న కొబ్బరి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఆరు నెలలుగా రైతుల అంచనాలకు మించి ధరలు నమోదవుతున్నాయి. కురిడీ కొబ్బరి కొత్త రికార్డులు నమోదు చేస్తుండగా.. పచ్చి కాయలు సైతం ఆల్‌టైమ్ హైకి చేరాయి. తొలుత పచ్చి కొబ్బరికాయ ధర రూ.15 ఉండగా.. ఆ తర్వాత అది రూ.17కు చేరడంతో రైతులు సంబరపడ్డారు. అది కాస్తా రూ.19కి.. ఆపై రూ.20కి, రూ.22కి.. ఇప్పుడు ఏకంగా రూ.24కు చేరింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకు పలుకుతోంది. ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి. దీంతో అంబాజీపేట మార్కెట్లో జోష్ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 130 లారీల కొబ్బరికాయలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. కురిడీకి భలే డిమాండ్.. కురిడీ కొబ్బరి ధరలు కూడా భారీగా పెరిగాయి. పాతకాయలలో గండేరా రకానికి(పెద్ద కాయ) చెందిన వెయ్యి కాయల ధర రూ.31,500 ఉంది. అదే గటగటా రకం(చిన్నకాయ) రూ.30 వేలు పలుకుతోంది. ఇక కొత్తకాయలో గండేరా రకం రూ.30 వేలు.. గటగటా రకం రూ.28,500 వరకు ధర ఉంది. కోనసీమ జిల్లా నుంచి రోజుకు 40 లారీల కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు దక్షిణాదిలో ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు తగ్గాయి. కేరళలో 40 శాతం, తమిళనాడు, కర్ణాటకలో 30 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. దీంతో గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తున్నారు. అలాగే వరుస పండగలు కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే వినాయకచవితి వేడుకలు జరుగుతుండగా.. నెలాఖరు నాటికి దసరా, ఆ తర్వాత దీపావళి, ఆ వెంటనే కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొబ్బరికి ఎక్కువగా ఆర్డర్లు వస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించారు. అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేలు కురిడీ కొబ్బరి రూ.31,500కు చేరిక ఆరు నెలలుగా రికార్డు స్థాయిలో ధరలు వరుస పండగల ప్రభావం -
పట్టుగూళ్ల ఉత్పత్తిలో కీలకపాత్ర ఉష్ణోగ్రతలదే
తుని రూరల్: పట్టుగూళ్ల ఉత్పత్తిలో కీలకపాత్ర ఉష్ణోగ్రతలదేనని సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్త ఈ భువనేశ్వరి అన్నారు. గురువారం దొండవాకలో చేబ్రోలు అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టు పురుగుల్లో వివిధ దశలు, పట్టుగూళ్ల ఉత్పత్తిలో జాగ్రత్తలపై రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్త భువనేశ్వరి మాట్లాడుతూ పట్టు పురుగులు గూడు అల్లుకునే 5వ దశలో 12 మేతలకు మల్బరీ ఆకులను అందించి, స్పిన్నింగ్ దశను గుర్తించాలన్నారు. గూడు కట్టడానికి తగినంత స్థలాన్ని కేటాయించాలన్నారు. ఈ దశలో ఉష్ణోగ్రత, తేమ, వెలుతురు, పరిశుభ్రత చంద్రికలు నాణ్యమైన పట్టుగూళ్ల అల్లడంలో ప్రధాన పాత్ర వహిస్తాయన్నారు. పట్టుగూళ్లు అల్లిన తర్వాత నాలుగు రోజులకు వేరు చేయాలని, ఆరో రోజు మార్కెట్‌కు తరలించాలన్నారు. నాణ్యతగల పట్టుగూళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. సెరికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు. 7న తలుపులమ్మ దేవస్థానం మూసివేత తుని రూరల్: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల ఏడో తేదీన మధ్యాహ్నం తలుపులమ్మ అమ్మవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు గురువారం తెలిపారు. లోవ దేవస్థానంలో ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కవాట బంధనం చేసి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. అన్నవరం ఆలయ ఈఓ సుబ్బారావుకు స్థాన చలనం? అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును ఆ పదవి నుంచి తప్పించి, ఆయన మాతృసంస్థ రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఒకటి రెండ్రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. దేవదాయశాఖకు చెందిన ఆర్జేసీ స్థాయి అధికారిని ఇన్చార్జి ఈఓగా నియమించనున్నట్టు తెలిసింది. దీనిపై వివరణ కోరగా తాను దేవదాయశాఖ ఉద్యోగిని కాదని, ఏదో రోజు నా మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు వెళ్లవలసిన వాడినేనని ఈఓ సుబ్బారావు తెలిపారు. 8న ప్రభుత్వ ఐటీఐలో పీఏం అప్రెంటిస్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.జీ.వర్మ గురువారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్ కంపెనీ 300 అప్రెంటిస్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు సర్టిఫికెట్లతో ఉదయం 8గంటలకు హాజరుకావాలని సూచించారు. స్టైపెండ్ నెలకు రూ.15వేలు చెల్లిస్తారని, వివరాలకు 94404 08182 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. మళ్లీ పెరుగుతున్న నీటి ఉధృతి ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 10.50 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ రాత్రి 7గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,11,254 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. శుక్రవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.49 మీటర్లు, పేరూరులో 15.36 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.76 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 9.78 మీటర్లు, కుంటలో 18.36 మీటర్లు, పోలవరంలో 11.80 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్లు వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. -
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు
ప్రత్తిపాడు రూరల్: టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. గురువారం మండలంలోని ధర్మవరంలో ఆయన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గ్రామంలో టీడీపీ నియోజకవర్గ నేతలు మీడియా సమావేశంలో మురళీకృష్ణంరాజుపై పలు విమర్శలు చేశారు. వారి విమర్శలను మురళీకృష్ణంరాజు మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, మహిళతో అసభ్యంగా ప్రవర్తించడానికి, 86 ఏళ్ల వయస్సుకు సంబంధం లేదంటూ టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. వాటిని ప్రశ్నిస్తే టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో కలిసి.. తమ పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీఎత్తున తరలివచ్చి మురళీకృష్ణంరాజుకు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జల్లిగంపల ప్రభాకరావు, ఏనుగు శ్రీను, గొనగాల అప్పలరావు, నడిగట్ల త్రీమూర్తులు, జువ్వల బాబులు, ఉమ్మిడి తాతీలు, మాకా చంటిబాబు, తటవర్తి రామన్నదొర, బత్తుల నాగార్జున, దాడిశెట్టి చక్రధర్, సీంద్రపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు -
మర్రెడ్డిపై కన్నెర్ర..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏ ముహూర్తాన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారో కాని అప్పటి నుంచి పిఠాపురంలో జనసేన ముఖ్య నేతల మధ్య సెగ రాజుకుంటూనే ఉంది. డిప్యుటీ సీఎం ఎలాగూ ఉండని పిఠాపురంపై పెత్తనం కోసం జనసేనలోని ఒకే సామాజికవర్గం నుంచి రెండు వర్గాలు నువ్వా, నేనా అనే స్థాయిలో కుమ్ములాడుకుంటున్నాయి. రచ్చకెక్కిన వీరి విబేధాలు ఇటీవల పవన్ వద్ద పంచాయతీకి వెళ్లాయి. ఒకరి పెత్తనాన్ని మరొకరు ఒకపట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆధిపత్య పోరు చివరకు పిఠాపురంలో పవన్ కనుసన్నల్లో అన్నీ తానై ఒంటిచేత్తో చక్రం తిప్పిన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌కు మంగళంపాడే వరకు వెళ్లింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరనేందుకు ఈ రెండు వర్గాల ముఖ్యనేతలే పెద్ద ఉదాహరణగా నేతలు విశ్లేషిస్తున్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ తెర వెనుక అన్నీ తానై చక్కబెట్టారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకుని పిఠాపురానికి ఎటువంటి సంబంధం లేని ద్వారపూడికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్‌కు ఇన్చార్జి అప్పగించడంలో తంగెళ్ల పావులు కదిపారు. తొలినాళ్లలో ఈ రెండు గ్రూపులు భాయ్భాయ్ అంటూ చెట్టాపట్టాలేసుకునే తిరిగాయి. ఎటొచ్చీ తంగెళ్ల ఎంపీ, పవన్ ఉప ముఖ్యమంత్రి కావడంతో పిఠాపురంపై పెత్తనం కోసం మర్రెడ్డి, తంగెళ్ల వర్గాల మధ్య అంతర్గత పోరు పలు సందర్భాల్లో రచ్చకెక్కింది. పిఠాపురం ఇన్చార్జిగా మర్రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తొలి నుంచి ఎంపీ వర్గం బాహాటంగానే చెబుతోంది. నియోజకవర్గంలో తన కనుసన్నల్లోనే అంతా జరగాలనే స్థాయికి మర్రెడ్డి వచ్చేశారని పవన్ కల్యాణ్ వద్ద చెవిలో జోరీగలా పోరుపెడుతూనే వస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మతో మిలాఖత్ అయ్యి పార్టీ నేతలను తొక్కేస్తున్నారని రక్తికట్టించే కథ అల్లారని ఎంపీ తంగెళ్ల వర్గం పవన్‌కు చెబుతున్నారు. నియోజకవర్గ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఇటీవల పార్టీ నేతలతో పవన్ మంగళగిరిలో బేటీ అయ్యారు. నమ్మి బాధ్యతలు అప్పగిస్తే ఇలానే వ్యవహరిస్తారా అంటూ మర్రెడ్డిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారని పార్టీ నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎంపీ వర్గం వ్యూహాత్మకంగా పావులు కదిపి మర్రెడ్డికి చెక్ పెట్టిందంటున్నారు. మర్రెడ్డి స్థానే నియోజకవర్గంలో పార్టీ నిర్వహణకు ఫైవ్ మెన్ కమిటీ వేశారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మర్రెడ్డి ఒక్కరే ఇన్చార్జిగా ఉండగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్‌లతో నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటుచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీ నియామకం ద్వారా మర్రెడ్డికి నియోజకవర్గ కార్యకలాపాల్లో ప్రాధాన్యం లేకుండా చెక్ పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఇక ముందు సమన్వయ కమిటీదే తుది నిర్ణయమని, అధికారులు కూడా కమిటీ సభ్యులు చెప్పే పనులకు ఆమోదం తెలియచేయాలని మౌఖిక ఆదేశాలు కూడా వచ్చాయంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులపై మర్రెడ్డి ఇన్చార్జిగా నిర్ణయం తీసుకుని ప్రతిపాదించిన వాటిని వెనక్కు తీసుకోవడం ద్వారా మర్రెడ్డికి ప్రాధాన్యం లేదనే విషయం ప్రచారం చేయాలనే యోచనలో ఎంపీ వర్గం పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 8 జనసేన, 4 టీడీపీకి ఇప్పటికే పంపకాలు జరిగిపోయాయి. అయినా వాటన్నింటినీ ఎక్కడివక్కడే ఆపేయాలని నిర్ణయించారని పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పవన్ గెలుపు కోసం పనిచేసిన వారిని జనసేనలో కరివేపాకుల్లా వాడుకుని గాలికి వదిలేస్తారని ఇదంతా చూస్తుంటే అర్థమవుతోందని పార్టీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు అయ్యేంత వరకు పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మను పవన్, అతని సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఆకాశానికి ఎత్తేసేవారు. ఎన్నికలు పూర్తయ్యి కూటమి గద్దె నెక్కి పవన్ ఉప ముఖ్యమంత్రి, నాగబాబు ఎమ్మెల్సీ అయిపోగానే సోదర ద్వయం వర్మను కరివేపాకులా పక్కన పడేశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వర్మకు పదవి ఇవ్వాలా వద్దా అనేది ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే సరికొత్త ప్రచారాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు 14 నెలల పాటు పార్టీ కోసం పనిచేసిన తమ నేతను కూడా వర్మ మాదిరిగానే కరివేపాకులా తీసిపారేశారని మర్రెడ్డి వెంట తిరిగిన పార్టీ నేతలు మండిపడుతున్నారు. పవన్ ఇలాకా పిఠాపురం జనసేనలో రాజుకున్న ఈ కుంపటి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆధిపత్య పోరులో అధికారాలకు కత్తెర కోటరీలో చక్రం తిప్పిన ఎంపీ వర్గం ఫైవ్‌మెన్ కమిటీతో ఇన్చార్జికి చెక్ పిఠాపురంలో పెరుగుతున్న కరివేపాకులు ఎన్నికలకే పరిమితమైన వర్మ ప్రాధాన్యం గద్దెనెక్కాక గమ్మునున్న పవన్ సోదరులు -
ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం
పెరుమాళ్లపురం స్కూల్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్ తొండంగి: మండలంలోని పెరుమాళ్లపురం జెడ్పీ హైస్కూలు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ బొబ్బాది ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికై నట్టు ఆ పాఠశాల హెచ్ఎం చాట్రాతి సత్యనారాయణ బుధవారం తెలిపారు. గతంలో పాఠ్య పుస్తక రచయితగా, ఉత్తమ టీఎల్ఎం నిపుణుడిగా, ట్రైనింగ్ రీసోర్స్ పర్సన్‌గా ఆయన ఎన్నో అవార్డులు పొందారన్నారు.కాకినాడ రూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకని ఏటా నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఉత్తమ పురస్కారాలకు ఎన్నికయ్యారు. కాకినాడకు చెందిన కోటంరాజు గాయత్రి మూడు దశాబ్దాల పాటు చేసిన విద్యా సేవకు ఈ పురస్కారం దక్కింది. ఆమె ఎటువంటి దరఖాస్తు చేసుకోనప్పటికీ లీప్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఇంద్రపాలెంలో నివసిస్తున్న గాయత్రి కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలగా తయారు చేసి ఐదు ల్యాబ్‌లను, ప్లే ఫీల్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆమె కృషి చేశారు. తుని మండలం తేటగుంట జెడ్పీ హైస్కూల్లో 1995 జూన్ 29న ఉపాధ్యాయినిగా తన వృత్తిని ప్రారంభించి, 2009లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయినిగా పదోన్నతి పొందారు. 2014లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందకున్నారు. తేటగుంట, పెదపూడి మండలం ఎల్ఎన్ పురం, కాకినాడ అర్బన్ పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. గెజిటెడ్ హెచ్ఎంగా కిర్లంపూడి మండలం సోమవరం, పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో పని చేసి, 2023 నుంచి రమణయ్యపేటలో పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికై న గాయత్రిని డీఈఓ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. కొమరగిరి నుంచి రవిశంకర్ కొత్తపల్లి: రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకున్న వారిలో కొత్తపల్లి మండలం ఉప్పాడలోని కొమరగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పతివాడ రవిశంకర్ ఒకరు. గణిత అవధానిగా, పాఠ్య పుస్తక రచయితగా, మాడ్యూల్ రైటర్‌గా, స్టెమ్ ల్యాబ్ డిజైనర్‌గా పలు విద్యా సేవలు అందించడంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఏలేశ్వరం స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, స్నేహస్తం, చేయూత, లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సైతం ఆయన సామాజిక సేవ చేస్తున్నారు. గత మూడేళ్లుగా జాతీయస్థాయిలో గణిత అభ్యసన సామగ్రితో పురస్కారాలు అందుకుంటున్నారు. బోధన అభ్యసన సామగ్రి తయారు చేయడం, వాటిని ఎలా తయారు చేయాలి.. ఎలా ఉపయోగించాలనే అంశాలపై వర్క్ షాపులు నిర్వహించడం చేస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు ఆటల పాటల ద్వారా వినూత్నంగా విద్యా బోధన చేస్తున్నారు. గణిత క్రికెట్, గణిత హౌసి, టేబుల్ అంత్యాక్షరి, మ్యాజిక్ స్క్వేర్ డాన్స్ వంటి అనేక వినూత్న విధానాలతో పిల్లల ఆకట్టుకోవడమే కాక సైన్స్ ఫెయిర్లకు పిల్లలను రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకునేలా చేశారు. ఎన్ఎంఎంఎస్, ఐఐఐటీలలో సీట్లు పొందడంలో విద్యార్థులకు అండగా నిలిచారు. అంతే కాకుండా విద్యార్థులకు విజ్ఞాన, విహారయాత్రలే కాక సేవను కూడా అలవాటు చేసే లక్ష్యంతో లియో క్లబ్‌లను ఏర్పాటు చేసి సేవపై అంకితభావాన్ని తెలియజేశారు. ఏపీఎంఎఫ్ బాధ్యుడిగా ఉంటూ గణిత ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ తనకు తోచిన విషయాన్ని నలుగురికి తెలియజేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తెలియని విషయాన్ని నేర్చుకుంటూ గణిత సేవలో నిమగ్నమయ్యారు. -
విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం పశ్చిమ రాజగోపురం వద్ద రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విశ్రాంతి షెడ్డుకు బుధవారం భూమిపూజ జరిగింది. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎండీ ఎంవీవీఎస్ కృష్ణంరాజు దంపతులు భూమిపూజ చేశారు. భక్తుల కోసం లారెస్ సంస్థ ఈ షెడ్డు నిర్మిస్తుంది. కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ వి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చీటీల పేరుతో మోసం ● రూ.2.39 కోట్లు స్వాహా ● ఇద్దరు నిందితుల అరెస్టు పిఠాపురం: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో రూ.2.39 కోట్లు స్వాహా చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, పిఠాపురానికి చెందిన కొర్ర సత్యనారాయణ, పక్కుర్తి వరహాలరావు, లోకారెడ్డి భాస్కరరావు కలిసి 2014లో శ్రీసత్య శివాని చిట్‌ఫండ్ కంపెనీని పట్టణంలో మొదలుపెట్టారు. వీరు సభ్యులను చేర్చుకుని, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల చీటీలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం చీటీలు పాడుకున్న 94 మందికి డబ్బు చెల్లించకుండా మోసం చేశారు. దీంతో బాధితులు అసిస్టెంట్ జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణ అనంతరం, అసిస్టెంట్ జిల్లా రిజిస్ట్రార్ సునంద గతేడాది నవంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి 94 మందిని బాధితులుగా గుర్తించారు. నిందితులు కొర్ర సత్యనారాయణ, లోకారెడ్డి భాస్కరరావును బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. -
అంధత్వ నివారణకు కృషి
బాదం బాలకృష్ణ ఐ–బ్యాంక్‌ను 2006లో ప్రారంభించాం. తూర్పుగోదావరి, పరిసర జిల్లాల్లో అంధుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో 19 మందితో దీనిని స్థాపించి అంధత్వ నివారణకు కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు 7,584 కార్నియాలు సేకరించాం. మరణించిన వారి నేత్రాలను దానం చేసేలా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. – డాక్టర్ బాదం బాలకృష్ణ, ఐ–బ్యాంక్, కాకినాడసమాజ సేవలో రెడ్‌క్రాస్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఐ–బ్యాంక్‌ను ప్రారంభించాం. గతేడాది జనవరి 31న ప్రారంభించగా, మార్చి నుంచి కార్నియాలు సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 248 కార్నియాలు సేకరించాం. మరణానంతరం నేత్రాలు, అవయవాలు వృథా పోనీయకుండా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు రెడ్‌క్రాస్ ద్వారా కృషి చేస్తున్నాం. – వైడీ రామారావు, చైర్మన్, రెడ్‌క్రాస్ ఐ–బ్యాంక్, కాకినాడ ప్రజల్లో స్పందన జిల్లాలో అంధత్వ నివారణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నాం. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింతగా అవగాహన పెరగాల్సి ఉంది. మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చు. ప్రజల్లో కూడా నేత్రదానంపై స్పందన వస్తోంది. – డాక్టర్ శ్రీవిద్య, ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, కాకినాడ -
నాస్కామ్తో జేఎన్టీయూకే ఒప్పందం
బాలాజీచెరువు: ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఇనిషియేషన్ అమలు చేసేందుకు జేఎన్టీయూ కాకినాడ, నాస్కామ్ మధ్య బుధవారం ఒప్పందం జరిగింది. స్టూడెంట్ అఫైర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.కృష్ణమోహన్ అధ్యక్షతన వీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, నాస్కామ్ డైరెక్టర్ ఉదయ్‌శంకర్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రొఫెసర్ నైపుణ్యాలు, వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లు, హ్యాక్‌ధాన్, పరిశ్రమ లీడర్ సెషన్ కోర్సులు ఉచితంగా అందజేస్తామని వీసీ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులలో డిజిటల్ నైపుణ్యాలను శక్తివంతమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ వీవీ సుబ్బారావు, ఓఎస్డీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు సహదేవయ్య, బీటీ కృష్ణ, స్వర్ణకుమారి, పద్మజారాణి పాల్గొన్నారు. -
వివాదాస్పద ఫ్లెక్సీలపై చర్యలకు డిమాండ్
పోలీస్ స్టేషన్ వద్ద దళితుల ఆందోళన మామిడికుదురు: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పనపల్లిలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం నగరం పోలీస్ స్టేషన్ వద్ద వారు ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సినీ నటుల అభిమాన సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో నాయకులు, హీరోల పేర్లలో బాబు సీమ, కల్యాణ్ సీమ అని అన్వయించుకోవడం వివాదాలకు కారణమవుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు కొన్ని కులాలను కించపర్చేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఎ.చైతన్యకుమార్, తహసీల్దార్ పి.సునీల్‌కుమార్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం, ఎమార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుల విద్వేషాలను రెచ్చగొట్టొద్దు: సీపీఎం అమలాపురం టౌన్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కులవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా సీపీఎం కార్యాలయంలో పార్టీ నాయకులు బుధవారం సమావేశమై దీనిపై చర్చించారు. ఈ ఫ్లెక్సీ వేయించిన వారిపై, ముద్రించిన షాపుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ నాయకులు జి.దుర్గాప్రసాద్, పీతల రామచంద్రరావు, జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు తదితరులు పాల్గొన్నారు. -
7న పంచారామ క్షేత్రం మూసివేత
సామర్లకోట: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయం మూసి వేయనున్నట్టు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చంద్రగ్రహణం వీడిన తరువాత సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. భక్తులు ఈ అసౌకర్యాన్ని గమనించాలన్నారు. అలాగే అతి పురాతన విష్ణు ఆలయం మాండవ్య నారాయణస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి సోమవారం ఉదయం 9.30 గంటలకు తెరవనున్నట్టు ఆలయ ఈఓ బిక్కిన వెంకట్రాయచౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పట్టణ, మండల పరిధిలోని అన్ని దేవాలయాలను మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు మూసి వేయనున్నట్టు ఆయా ఆలయాల కమిటీ నాయకులు తెలిపారు. ఆందోళనకరంగా భూగర్భ జలాలు భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లజర్ల: మండలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి అడుగంటాయని, తక్షణం నీటి సంరక్షణ చేపట్టకపోతే ఈ ప్రాంతంలోని పంట భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందని భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమై భూగర్భ జలాల సంరక్షణ – పెంపుపై చర్చించారు. డీడీ మాట్లాడుతూ భూగర్భ జలమట్టాలు 20 అడుగుల నుంచి 50 అడుగుల లోతుకు తగ్గిపోయాయని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇక్కడ వ్యవసాయమంతా బోరుబావులపైనే ఆధారపడి జరుగుతోందన్నారు. ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో వ్యవసాయం, తోటల పెంపకంలో డ్రిప్, స్పింక్లర్లు వినియోగం పెరిగి నీటి వినియోగం తగ్గాలన్నారు. రీచార్జి పిట్లు, ఫారంపాండ్స్, రింగ్ ట్రెంచ్‌లు, చెరువుల పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉందన్నారు. డ్వామా ఏపీడీ బి.రాంప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్ల కాలపరిమితిలో ప్రణాళిక బద్ధంగా ఈ పనులు చేపట్టి, పురోగతి సాధించవచ్చన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఏ.దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు రానున్న ఐదేళ్లలో తమ పొలాల్లో ఫారంపాండ్లు, రింగ్ ట్రెంచ్‌లు ఏర్పాటు చేసుకుని, భూమిలో తేమశాతం తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం ద్వారానే జరుగుతాయని వివరించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి మల్లికార్జునరావు, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రత్నకుమారి, నీటిపారుదలశాఖ డీఈ మనోజ్ కుమార్, మండల పరిషత్ ఏఓ మహాలక్ష్మి మంగతాయారు, ఉద్యానశాఖ అధికారి బబిత, వ్యవసాయాధికారి సోమశేఖరం, ఏపీఓ త్రిమూర్తులు పాల్గొన్నారు. కాటన్ బ్యారేజీకి తగ్గిన వరద ఉధృతి ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి బుధవారం మరింత తగ్గింది. ఉదయం నుంచి క్రమేపి తగ్గుతూ వచ్చి.. రాత్రి 8 గంటలకు 10.70 అడుగులకు చేరింది. అయితే ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో మరో రెండు రోజుల పాటు కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో 11.20 మీటర్లు, పేరూరులో 15.85 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.57 మీటర్లు, భద్రాచలంలో 41.80 అడుగులు, కూనవరంలో 17.48 మీటర్లు, కుంటలో 9.40 మీటర్లు, పోలవరంలో 11.65 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.70 మీటర్ల నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!
రాయవరం: పంటలకు ఆశించిన చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేయడానికి రైతులు రకరకాల స్ప్రేయర్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట కాలంలో వాటితో పని ముగియగానే అలాగే వదిలేస్తారు. తర్వాత పంట కాలంలో అవసరం రాగానే స్ప్రేయర్లను మళ్లీ వినియోగించేందుకు యత్నిస్తే.. చాలావరకు మొరాయిస్తుంటాయి. అప్పుడు స్ప్రేయర్లను తీసుకుని మెకానిక్ షెడ్లకు పరుగులు పెట్టడం సర్వసాధారణం. డబ్బు వెచ్చించి రిపేరు చేయించడం కన్నా, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వృథా ఖర్చులు తగ్గడంతో పాటు, స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు ఆశించడంతో రైతులంతా పురుగు మందుల పిచికారీలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో స్ప్రేయర్లను భద్రపర్చే విధానాన్ని మండల వ్యవసాయాధికారి కేవీఎన్ రమేష్‌కుమార్ వివరించారు. పవర్ స్ప్రేయర్ మందుల పిచికారీ సమయం ముగియగానే మంచి నీటితో శుభ్రం చేయాలి. ట్యాంకులో పెట్రోలు లేకుండా చూసుకోవాలి. టర్బోరేటర్ గిన్నెలోనూ పెట్రోలు లేకుండా చూడాలి. ప్లగ్ తీసి శుభ్రంగా పెట్రోల్‌తో కడగాలి. పిస్టన్‌పై 5–6 చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్‌ను బిగించాలి. ఇలా చేస్తే పిస్టన్ పాడైపోకుండా ఉంటుంది. మళ్లీ అవసరం వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ అవుతుంది. తైవాన్ ట్యాంకులో ఐదు లీటర్ల మంచినీరు పోయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. ఇలా చేయడం వల్ల పైపుతో పాటు, నాజిల్లో మలినాలు లేకుండా శుభ్రమవుతుంది. ట్యాంకులో పెట్రోలు లేకుండా తీయాలి. ప్లగ్‌ను తీసి పిస్టన్‌పై ఐదారు చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్ బిగించాలి. పంపు భాగాలన్నింటినీ శుభ్రంగా తుడిచి భద్రపర్చుకోవాలి. రీచార్జబుల్.. పనులు పూర్తయిన వెంటనే మూడు లీటర్ల నీటిని ట్యాంకులో పోసి బయటకు పంపాలి. ప్రతి 15 రోజులకు ఓసారి గంట పాటు చార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ డ్రెయిన్ కాకుండా ఉంటుంది. అన్నదాతలు ఆయా విషయాలు పాటించి తమ పంపు స్ప్రేయర్లను భద్రపర్చుకోవచ్చు. ఏడాది తర్వాత తీసినా.. మందుల పిచికారీ పూర్తి కాగానే శుభ్రమైన నాలుగు లీటర్ల మంచినీటిని ట్యాంకులో పోసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తద్వారా స్ప్రేయర్ గొట్టం(ఇత్తడి) తీసి, దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్‌లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు రాకుండా ఉంటుంది. ఏడాది తర్వాత తీసి వాడినా బాగా పనిచేస్తుంది. హైటెక్.. ట్యాంకులో మూడు లీటర్ల నీటిని పోసి శుభ్రంగా నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తర్వాత స్ప్రేయర్ గొట్టం తీసి దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్‌లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు పట్టదు. పరికరాలను భద్రపర్చాలంటున్న వ్యవసాయ నిపుణులు నెలల తరబడి వదిలేస్తే.. మొండికేసే అవకాశం డబ్బు, సమయం వృథా చిన్న జాగ్రత్తలతో రైతులకు మేలు -
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
శంఖవరం: చదువుపై దృష్టి సారించడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కృష్ణాలయం వీధిలో కనిగిరి వర లక్ష్మీ అపర్ణ(16) మంగళవారం రాత్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అన్నవరం అడిషనల్ ఎస్సై ఎల్ ప్రసాద్ వివరాల మేరకు, స్థానిక ఆదర్శ పాఠశాలలో అపర్ణ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం కళాశాలకు వెళ్లొచ్చిన ఆమె ఇంటి వద్ద చదువుపై దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అపర్ణ తన తల్లిదండ్రులు పడుకున్నాక, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిర్జీవంగా ఉన్న కు మార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అపర్ణ మృతికి పాఠ శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..
● రెండేళ్ల బిడ్డతో తల్లి ఆత్మహత్య ● జూలైలో భర్త బలవన్మరణం కాకినాడ రూరల్: సాఫీగా సాగే వారి పచ్చని సంసారాన్ని అప్పుల సుడిగుండం ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల మగ బిడ్డకు పుట్టినరోజును స్తోమతకు మించి ఘనంగా చేశారు. ఆ అప్పు భారంగా మారడంతో, ఈ ఏడాది జూలై నెలలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటిన్నర నెలలు తిరక్కుండానే బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబానికి విషాదాంతమే మిగిలింది. సర్పవరం పోలీసుల వివరాల మేరకు, కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని భావనారాయణపురం గాంధీనగర్‌కు చెందిన జనపల్లి ఆకాంక్ష(25) తన బిడ్డ సార్విక్(2)కు పురుగు మందు పట్టించి, తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లికి చెందిన ఆకాంక్షకు, సర్పవరం గ్రామానికి చెందిన జనపల్లి గోపితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్‌గా గోపి పనిచేసేవాడు. జూలైలో బిడ్డ సార్విక్ రెండో పుట్టిన రోజును ఘనంగా జరిపారు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక గోపి జూలై 22న మద్యంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆకాంక్ష మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజులు పుట్టింటి వద్ద, కొంతకాలం అత్తింటి వద్ద ఉండేది. భర్తపై బెంగతో గత నెల 31న మధ్యాహ్నం సర్పవరంలోని ఇంట్లో సోడాలో పురుగు మందు కలిపి బిడ్డకు పట్టించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఇద్దరూ మృతి చెందారు. ఆకాంక్ష తల్లి డోనం శాంతికుమారి ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం సర్పవరం భావనారాయణపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
రత్నగిరిపై 30 శాతం భక్తుల అసంతృప్తి
అన్నవరం: రత్నగిరికి వచ్చే భక్తుల అసంతృప్త స్థాయి అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. భక్తు సేవలందించడంలో ఆగష్టు నెలలో కూడా దేవస్థానం పాలకవర్గం విఫలమైనట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. ఆగస్టు నెలలో సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల్లో దాదాపు 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జూలై 26 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలలో భక్తులకు అందుతున్న సేవలపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన సర్వేలో శ్రీకాళహస్తి ప్రధమస్థానంలో నిలవగా అన్నవరం దేవస్థానం ఐదో స్థానంలో నిలిచింది. కాగా కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది. భక్తుల సంతృప్తి శాతం ఇలా.. ● సత్యదేవుని దర్శనం విషయంలో జూన్ నెలలో 73 శాతం మంది, జూలై నెలలో 74 శాతం, ఆగస్టులో 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● మౌలిక వసతుల కల్పనలో జూన్‌లో 66 శాతం, జూలైలో 65 శాతం, ఆగస్టులో లో 64.9 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ● స్వామివారి గోదుమ నూక ప్రసాదం నాణ్యతపై జూన్‌లో 77 శాతం, జూలైలో 78 శాతం, ఆగస్టులో 76.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● పారిశుధ్య చర్యలలో జూన్‌లో 70 శాతం, జూలైలో 68 శాతం, ఆగస్టులో 66.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దసరా, కార్తికమాసాల నాటికి చక్కదిద్దాలి ఈ నెల 22 నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. ఆ రోజు నుంచి పది రోజుల పాటు దసరా నవరాత్రులలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాగే అక్టోబర్ 22 నుంచి కార్తికమాసం రద్దీ ఉంటుంది. ఈ లోపుగా దేవస్థానంలో భక్తుల అసంతృప్తి తగ్గేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. జూలై 26 నుంచి ఆగస్టు 25 వరకు వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ సర్వే -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
దేవరపల్లి: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మండలంలోని కృష్ణంపాలెం వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా మేజిక్ డ్రైవర్ నాని(28) మృతి చెందగా, వాహనంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం గోపాలపురం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న లారీని కంటైనర్ ఢీకొంది. అదే సమయంలో డ్యాన్సర్లతో వస్తున్న టాటా మేజిక్ వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరానికి చెందిన డైవర్ నాని(28) మృతి చెందగా, డ్యాన్సర్లు చరణ్ ఢిల్లీరావు, హరిసంతోష్, కరిష్మా తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి నెల్లూరుకు ప్రోగ్రాం కోసం 8 మంది వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు నాని కూడా డ్యాన్సరేనని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడికి ఇటీవల నిశ్చితార్థమైంది. రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గోపాలపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. కుమార్తెను చూసేందుకు వెళ్తూ.. అయినవిల్లి: సడన్ బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడిన ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందాడు. ఎస్సై హరికోటిశాస్త్రి వివరాల ప్రకారం, బుధవారం చింతనలంక చిన రామాలయం వీధికి చెందిన గోసంగి తనుకులు(75) ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని తన కుమార్తెను చూసేందుకు బయలుదేరాడు. ముక్తేశ్వరంలో ఆటో ఎక్కి అమలాపురం వెళ్తుండగా, రావిగుంట చెరువు వద్ద ఆటోడ్రైవర్ అతివేగంగా వెళ్తూ సడన్ బ్రేక్ వేశాడు. ఆటో బోల్తా పడడంతో తనుకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతడి కుమారుడు అంజికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వర్షంలో ప్రయాణిస్తూ.. అమలాపురం టౌన్: కిమ్స్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్రంగి మేసీ్త్ర మరణించాడు. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్‌బాబు వివరాల మేరకు, అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామానికి చెందిన వడ్రంగి మేసీ్త్ర గోడ ఫణికుమార్(32) వర్షం కురుస్తున్న సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. అమలాపురం వైపు వస్తున్న ట్రాక్టర్ అతడిని వెనుక నుంచి ఢీకొంది. మరో బైకిస్ట్‌ను కూడా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అతనూ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు. -
సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
లాఠీచార్జి దారుణమన్న బీజేపీ నేతలు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై త్రీటౌన్ సీఐ సత్యనారాయణ లాఠీచార్జి చేయడం దారుణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు మంగళవారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బీహార్‌లో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ, ఆమె తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వెళ్లగా, త్రీటౌన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తమను అడ్డుకున్నారన్నారు. తమ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన సీఐ.. కర్రలతో రౌడీల్లా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులను నియంత్రించలేదన్నారు. లాఠీచార్జిలో తమ కార్యకర్తలకు గాయాలు కాగా, స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. తాము కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులన్న సంగతి మరిచి, పోలీసులు ఇలా దౌర్జన్యం చేయడం తగదన్నారు. కోడికత్తులతో దాడి కేసులో నలుగురి అరెస్టు గోకవరం: కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో గత ఆదివారం వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహిస్తున్న ఓజుబంద గ్రామానికి చెందిన ఇద్దరిపై కోడికత్తులతో దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. నిమజ్జనం ఊరేగింపు వెళుతుండగా గోకవరం గ్రామానికి చెందిన గేదెల శివనందు, రాయి అచ్చారావు, పోనసానపల్లి నాగవెంకటసాయి పవన్కామేష్, మహిపాల్ వీరవెంకట దుర్గాప్రసాద్ రెండు బైక్‌లపై వచ్చి, ఊరేగింపులో ఉన్న భరత్, రాజేష్‌పై కోడికత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. స్నేహభావంతో పండగల నిర్వహణ బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా నిర్వహించే ర్యాలీలు ప్రశాంతంగా, స్నేహపూ ర్వక వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఏఎస్పీ మనిష్ పాటిల్ దేవరాజ్, డీఆర్వో వెంకటరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయా మతపెద్దలతో జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, మత్స్య, అగ్నిమాపక శాఖల అధికారులు హాజరయ్యారు. వినాయక విగ్రహాల నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 25 నిమజ్జన ప్రదేశాలను గుర్తించామని, నిమజ్జనాలు జరిగే ప్రదేశాల వద్ద స్టేజ్, విద్యుద్దీపాలు, క్రేన్లు, బోట్లు, గజ ఈతగాళ్లు, ఇతర సదుపాయాలను సంబంధిత అధి కారులు కల్పించాలన్నారు. వైద్యారోగ్య శాఖ ద్వా రా నిమజ్జన ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించి, జల కాలుష్యం అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల ఐదున జరిగే మీలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా ముస్లింలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు. -
అవగాహన కల్పిస్తున్నాం
ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో ప్రాజెక్టులను ఎంపిక చేయడానికి జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటు యాప్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశాను. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాజెక్టుల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికై నా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తొందరపడాలి. – జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిర్లక్ష్యం చేయడం తగదు ఇన్స్పైర్ మనాక్ నామినేషన్లకు సంబంధించి అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్పందించాలి. సైన్స్ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని నామినేషన్లను త్వరితిగతిన పూర్తి చేయాలి. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు నామినేషన్లు వచ్చేలా చూడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
నన్నయ వర్సిటీ నిర్ణయం సరికాదు
● ఎంపీ పొలిటికల్ సైన్స్ గ్రూపు కొనసాగించాలి ● విద్యార్థి, యువజన, దళిత, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ఉద్యమిస్తామని నేతలు స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, కేవీపీఎస్, దళిళ సంఘాలు, ఎస్సీ,ఎస్టీ సంఘాలు, ఎస్ఎస్యూఐ, రెల్లి సంఘం, జనచైతన్య వేదిక వంటి పలు సంఘాలు పాల్గొని చర్చ నిర్వహించాయి. నాయకులు మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజమహేంద్రవరం క్యాంపస్‌లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకుని నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాల్సిన యాజమాన్యం ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో దశలవారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిరణ్, ఏఐఎస్ఎఫ్ కోనసీమ జిల్లా కార్యదర్శి జి.రవికుమార్, ఏఎస్ఎఫ్ నాయకులు తాడేపల్లి విజయ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, దళిత సంఘం నాయకులు కోరుకొండ చిరంజీవి, ఎస్సీ,ఎస్టీ సంఘాల నాయకులు పి.వేణుగోపాల్, జే.సుబ్బారావు, ఎస్.విజయ్‌కుమార్, ఎన్ఎస్యూఐ నాయకులు తారకేష్ , రెల్లి సంఘం నాయకులు నీలం వెంకటేశ్వరరావు, దళిత ప్రజా సంఘం నాయకులు నక్క వెంకటరత్నం, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు టి. అరుణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణిమ రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై.భాస్కర్ ఎస్ఎఫ్ఐ నాయకులు కె.లహరి, కే.జ్యోతి, టి.సౌమ్య పాల్గొన్నారు. -
నీట మునిగి వదినామరదళ్ల మృతి
● ఏలేరు కాలువలో దుర్ఘటన ● మృతులు మందుల కాలనీకి చెందినవారు ● ఇసుక అక్రమ తవ్వకాలే కారణమంటున్న స్థానికులు ఏలేశ్వరం: నీటి లోతు అవగాహన లేకపోవడంతో ఏలేరు కాలువలో దిగిన ఇద్దరు వదినామరదళ్లు మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు, మందుల కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మి(38), పెండ్ర కుమారి(13) వరుసకు వదినామరదళ్లు. వీరు గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి తల వెంట్రుకలకు అల్యూమినియం పాత్రలు ఇచ్చే వ్యాపారం చేస్తుంటారు. ఇలాఉండగా, వీరిద్దరూ కలిసి వంట కోసం పుల్లలు ఏరుకునేందుకు ఏలేరు కాలువ వద్దకు వెళ్లారు. దాహం వేయడంతో కాలువలోకి దిగి.. గోతులు ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి సంఘటన ప్రదేశంలో మునిగిపోయిన ఇద్దరినీ వెలికితీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు లక్ష్మీకి భర్త అప్పన్న, కుమారైలు భవాని, జ్యోతి, కుమారులు హరి, అశోక్ ఉన్నారు. మృతురాలు కుమారికి తల్లిదండ్రులు సత్తిబాబు, అంకమ్మ, సోదరుడు రాజు, సోదరి శ్యామల ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మందుల కాలనీలో విషాద ఛాయలు ఎప్పుడు కలిసి తిరిగే లక్ష్మి, కుమారి ఏలేరు కాలువలో మునిగి మరణించడంతో మందుల కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ చలాకీగా కళ్ల ముందే తిరిగే వారిద్దరూ శాశ్వతంగా దూరం కావడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. తిరిగి రాని లోకానికి వెళ్లిపోయిందంటూ లక్ష్మి కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కలిచివేసింది. అక్రమ తవ్వకాలు పాలకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేసిన ఇసుక అక్రమ తవ్వకాలు రెండు నిండుప్రాణాలను బలిగొన్నాయి. ఏలేరు కాలువలో ఎటువంటి అనుమతులు లేకుండా, పొక్లెయిన్లతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. కొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుండగా.. మరికొందరు వాటికి బలవుతున్నారు. స్థానిక కప్పలచెరువు సమీపంలోని శశ్మానం మీదుగా ఏలేరు కాలువలో రాత్రుళ్లు ట్రాక్టర్లు, లారీలతో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి ఏలేరు కాలువలో ఇసుకతో పాటు, మట్టినీ అక్రమంగా తవ్వేస్తున్నారని చెబుతున్నారు. గోదావరి నదిలో వృద్ధుడి గల్లంతు మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామానికి చెందిన ఒలుపు కార్మికుడు రవణం సాయిబాబు (78) మంగళవారం వైనతేయ గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఒలుపు ఒలిచేందుకు వెళ్లిన సాయిబాబు.. బహిర్భూమికి వెళ్లి, అదుపుతప్పి గోదావరి నదిలో పడి కొట్టుకుపోయాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. గల్లంతైన సాయిబాబు ఆచూకీ కోసం రెండు బోట్ల సహాయంతో గోదావరి నదిలో రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై సాయిబాబు కుమారుడు పల్లంరాజు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.యువకుడిని రక్షించిన పోలీసులు అమలాపురం టౌన్: వినాయక విగ్రహాన్ని గోదావరిలో నిమజ్జనం చేస్తున్నప్పుడు అదుపుతప్పి నదిలో పడి కొట్టుకుపోతున్న యువకుడిని పట్టణ పోలీసులు కాపాడారు. బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై ఉన్న వంతెన వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామం పల్లపువీధి నుంచి గణేశ్ విగ్రహాన్ని వైనతేయ నదిలో నిమజ్జనం చేసేందుకు గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లారు. నిమజ్జనం సమయంలో అదే గ్రామానికి చెందిన చిలకలూరి చినసాయికృష్ణ (27) అదుపుతప్పి నదిలో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడిని స్థానికులు తాడు సాయంతో కాపాడేందుకు విఫలయత్నం చేశారు. అక్కడ బందోబస్తులో ఉన్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వీవీ శ్రీనివాసరావు స్పందించి.. మత్స్యకారుల సహకారంతో యువకుడిని పడవలో ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రెండో రోజు పవిత్రోత్సవాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సారథ్యంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ పర్యవేక్షణలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయంలోని పురాతన కల్యాణ మండపంలో ఉన్న ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు
● పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి నేడు శ్రీకారం ● రూ.2.5 కోట్లతో నిర్మించనున్న ఫార్మా సంస్థ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి మూడేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మార్గంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి బుధవారం ఉదయం శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులను గమనించిన అప్పటి ఈఓ చంద్రశేఖర అజాద్ 2023లో ఈ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహాన్ని కూల్చి, దాని స్థానంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు లారెస్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2023 అక్టోబర్‌లో ఇక్కడ సత్రాన్ని కూల్చేశారు. అదే ఏడాది విజయదశమి నాడు భూమిపూజ జరిగింది. తర్వాత ఈఓ చంద్రశేఖర అజాద్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ఇక్కడ విశ్రాంతి షెడ్డు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో పలు కథనాలు వెలువడ్డాయి. స్పందించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు లారెస్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున విశ్రాంతి షెడ్డు నిర్మించేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేసినట్టు దేవస్థానం ఈఈ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో 12 కౌంటర్లు, స్టెయిన్లెస్ స్టీల్ లైన్లు, మూడు హెలికాప్టర్ ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేయనున్నారు. ఈ ఖర్చంతా లారెస్ సంస్థ భరించనుందని ఈఈ తెలిపారు. రెండు నెలల్లో పూర్తి ● విశ్రాంతి షెడ్డు నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని లారెస్ సంస్థను కోరినట్టు ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. ● అక్టోబర్ 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతున్నందున అప్పటికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరామన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ రాజగోపురం వైపు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. -
ఎలుకలుకలు
కొత్తపేట: వరిలో ఎలుకల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా వరి పంటను మూషికాలు నాశనం చేస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆకుమడి దశ నుంచి కుప్పల వరకు రైతులకు ఈ సమస్య తప్పడం లేదు. దీంతో అధికంగా నష్టపోతున్నారు. పంట చేతికందే వరకు ఎలుకల బెడద ఉంటోంది. వీటిని సమర్థంగా అరికట్టేందుకు రైతులంతా సామూహిక నిర్మూలన చర్యలు చేపట్టడం వల్లే సాధ్యమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరితో పాటు, ఉద్యాన పంటలైన కొబ్బరి, అరటి, కూరగాయల తోటలకు ఎలుకల బెడద ఎదురవుతోంది. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసి, పిలకలు వేసే దశలో ఉంది. ఈ దశలో ఎలుకల వల్ల కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఎలుకలు నీటి మట్టానికి 6 సెంటీమీటర్ల ఎత్తులో వరి పిలకలను కొరికేస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఇలా గుర్తించవచ్చు ఎలుకలు సంచరించే పొలం గట్లపై బొరియలు ఉంటాయి. పొలంలో కొరికి వేసిన వరి పిలకలు, దుబ్బులు పడి ఉంటాయి. పొలంలోని బురదలో ఎలుకల పాదముద్రలు కనిపిస్తాయి. ఎలుకల విసర్జనాల ద్వారా వాటి ఉనికిని సులభంగా గుర్తించవచ్చు. నివారణ చర్యలు ముందుగా రైతులు తమ పొలం గట్లపై కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి. రైతు భరోసా కేంద్రాల్లో బ్రొమోడయోలిన్ అనే ఎరను రైతులకు ఉచితంగా లభిస్తుంది. 480 గ్రాముల నూకలు, 10 గ్రాముల బ్రొమోడయోలిన్ మందు, 10 గ్రాముల నూనెతో 500 గ్రాముల ఎరను తయారు చేసుకోవచ్చు. ఈ ఎర 50 బొరియలకు సరిపోతుంది. తొలి రోజు బొరియలను మట్టితో కప్పేయాలి. రెండో రోజు ఆ బొరియలు తెరుచుకుని కనిపిస్తాయి. ఈ బొరియల వద్ద 10 గ్రాముల బ్రొమోడయోలిన్ ఎర పొట్లాలను ఉంచాలి. ఆ ఎరను తిన్న ఎలుకలు చనిపోతాయి. రెండో విధానంలో వేటగాళ్లతో ఎలుక బుట్టలు వేయించి, వాటిని అరికట్టవచ్చు. ఈ విధానంలో వేటగాళ్లు ఎలుకకు రూ.60 వరకు తీసుకుంటారు. మరో విధానంలో బొరియలో పొగ పెట్టి ఎలుకలను చంపుతారు. ఇలా చేస్తే ఒక్కో ఎలుకకు రూ.100 తీసుకుంటారు. రెండు విధానాలు అధిక ఖర్చుతో కూడినది కావడంతో, రైతులు బ్రొమోడయోలిన్ ఎర ద్వారానే నివారణ సులభమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రెండు సబ్ డివిజన్లలో.. ప్రస్తుత సీజన్లో కోనసీమ జిల్లాలో 1.94 లక్షల ఎకరాలు వరి, బంజరు భూములు ఉండగా, 79,475 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటలను ఎలుకల బారి నుంచి రక్షించేందుకు వ్యవసాయ శాఖ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని తలపెట్టింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్లకు 776 కిలోల బ్రొమోడయోలిన్ మందు చేరినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 22 మండలాల్లో 415 గ్రామాలకు పంటల విస్తీర్ణాన్ని బట్టి మందును సరఫరా చేశారు. ముందుగా ఆలమూరు సబ్ డివిజన్లోని ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం సబ్ డివిజన్లోని రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో బుధవారం సామూహిక నిర్మూలన కార్యక్రమం చేపట్టనున్నారు. మిగిలిన సబ్ డివిజన్లలో ఈ నెల 4న లేదా 9న కార్యక్రమం నిర్వహించనున్నారు. సామూహికంగానే చేపట్టాలి సార్వా పంటకు ఎలుకల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎవరికి వారు ఎలుకలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. సామూహికంగా బ్రొమోడయోలిన్ మందును బొరియల్లో పెట్టడం ద్వారా మాత్రమే సమర్థంగా అరికట్టవచ్చు. దీనిపై రైతులకు ఏటా అవగాహన కల్పించి, మందును ఉచితంగా అందిస్తున్నాం. ప్రస్తుత తొలకరి సీజన్లో ఎలుకలను అరికట్టడానికి అవసరమైన బ్రొమోడయోలిన్ మందు త్వరలోనే రైతు భరోసా కేంద్రాలకు వస్తుంది. గ్రామాల వారీగా, వరి ఆయకట్టుల వారీగా రైతులతో మందు ఎరను చేనుల్లో పెట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట ఏటా సార్వాలో రైతులకు తప్పని బెడద వరి పిలకలను కొరికేస్తుండడంతో తీవ్ర నష్టం నేడు ఆలమూరు, రామచంద్రపురం సబ్ డివిజన్లలో సామూహిక నివారణ -
ఉచిత బస్సుతో ఆటోరడైవర్ల ఉపాధికి గండి
● నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనలు ● కార్యాచరణ ప్రకటించిన కోనసీమ జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని ఆంధ్ర ఆటోవాలా కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆటో డ్రైవర్లు నల్ల బ్యాఢ్జీలు ధరించి, ఆటోలకు నల్ల జెండాలు తగిలించి నిరనస తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో మంగళవారం డివిజన్ ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. దీనిపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. త్వరలోనే 48 గంటల పాటు ఆటోలు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపడతామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం డివిజన్ ఆటో డ్రైవర్లతో బుధవారం నిర్వహించే సమావేశంలో ఆ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 25 శాతం ఆటోలు విద్యాసంస్థలకు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఆ ఆటోల డ్రైవర్లు 48 గంటల నిరాహార దీక్షకు రెండు రోజుల ముందు ఆయా విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశం సూచించింది. తక్షణమే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆటోవాలా జిల్లా శాఖ కార్యదర్శి ఊటాల వెంకటేష్ నిరసన తీర్మానాలు సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు మోకా శ్రీను, వాసంశెట్టి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్పైర్ అయ్యేనా..!
● ఇన్స్పైర్ మనాక్ దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ● 2025–26 జిల్లా నామినేషన్ల లక్ష్యం 1,780 ● ఇప్పటి వరకు నమోదైనవి కేవలం 140 మాత్రమే.. రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ సాంకేతికతను పెంపొందించి.. భావి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు లభించే అరుదైన అవకాశం ఇన్స్పైర్ మనాక్. దీనిపై ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల సైన్స్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఇన్స్పైర్ మనాక్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శాసీ్త్రయ ప్రయోగ పోటీలకు ఆశించిన మేర స్పందన కరవైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 334 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కలిపి ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టుల చొప్పున 1,780 ప్రాజెక్టులను యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 48 పాఠశాలలకు సంబంధించి 140 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. అన్ని యాజమాన్యాల పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇందులో భాగస్వాములు కావాల్సి ఉంది. ఆ దిశగా వారు అంతగా చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్స్పైర్ మనాక్ నామినేషన్లు నమోదు చేసుకునేందుకు సంబంధించిన గడువు ఈ నెల 15వ తేదీతో ముగుస్తుంది. ఇన్స్పైర్ మనాక్ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మినహా లక్ష్యం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఇన్స్పైర్ మనాక్ వివరాలు జిల్లా మొత్తం నమోదు నమోదు స్కూళ్లు అయినవి కానివి కాకినాడ 331 40 291 తూర్పుగోదావరి 352 34 318 కోనసీమ 334 48 286 -
ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ
ఆరుగురికి గాయాలు ఏలేశ్వరం: జాతీయ రహదారిపై యర్రవరం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు, ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న బస్సు జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న డ్రైవర్‌తో పాటు, ఐదుగురికి గాయాలయ్యారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళన కాకినాడ రూరల్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ బ్రెయిన్ డెడ్ అయిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. మృతురాలి బంధువుల వివరాల ప్రకారం, రమణయ్యపేట గైగోలుపాడుకు చెందిన మహిళ మేడిశెట్టి దుర్గాభవాని(38)కి భర్త వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 30న సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ డెంటల్ ఆస్పత్రిలో దంత వైద్యానికి వెళ్లింది. దంతాలు తొలగించే క్రమంలో అధిక రక్తస్రావం కావడంతో, అదే రోజు మెరుగైన చికిత్సకు ఆమెను మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు చెప్పడంతో, ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. బోన్ మేరో క్యాన్సర్‌తో మెదడులో రక్తస్రావం కారణంగా బ్రెయిన్ డెడ్ అయినట్టు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
నేటి నుంచి ఎలుకల మందు ఉచిత పంపిణీ
కరప: జిల్లావ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో బుధవారం నుంచి బ్రోమోడయోలిన్ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు జేడీఏ విజయ్‌కుమార్ వెల్లడించారు. వాకాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని రైతులందరూ ఒకేసారి పొలాల్లో ఈ మందును వాడాలని రైతులకు సూచించారు. రైతులకు టార్పాలిన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వారు ఆర్ఎస్కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం యూరియా కొరత ఎక్కడా లేదన్నారు. అవసరం మేరకే రైతులు యూరియాను తీసుకెళ్లాలన్నారు. యూరియా స్థానే నానో యూరియా లిక్విడ్ కూడా అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై వాహనాలు, యంత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. డ్రోన్లు 80 శాతం సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. సకాలంలో తొలకరి నాట్లు వేసి, రబీ తర్వాత మూడో పంటగా అపరాలు వేసేందుకు రైతులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేడీఏ సామూహిక ఎలుకల నివారణ కరపత్రాలను విడుదల చేశారు. సామాజిక భద్రత, న్యాయమే లక్ష్యం సామర్లకోట: సుస్థిర లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి గ్రామంలోను సామాజిక భద్రత, సామాజిక న్యాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు 11 జిల్లాల్లోని ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి టీఓటీలుగా ఇచ్చే శిక్షణను మంగళవారం స్థానిక ఈటీసీలో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు 130 మందిని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, గ్రామంలోని పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి, వారి ఆర్థిక, ఆరోగ్య సంబంధ జీవన విధానాన్ని గుర్తించి, వారి అవసరాలు తీర్చేలా చేయాలన్నారు. వృద్ధాప్య, దివ్యాంగత్వం, నిరుద్యోగం, వ్యాధి, ప్రమాదం, మరణం వంటి సందర్భాల్లో వ్యక్తి, ఆ కుటుంబాలకు సామాజిక న్యాయం చేయడానికి పంచాయతీ పరిధిలోనే కృషి జరగాలన్నారు. కోర్సు డైరెక్టర్లుగా కె.సుశీల, ఎస్ఎస్ శర్మ వ్యవహరించారు. ఫ్యాకల్టీలు రామకృష్ణ, శ్రీనివాసరావు, ఎం చక్రపాణిరావు, కేఆర్ నిహారిక శిక్షణ ఇచ్చారు. ఐసీటీసీలో సేవలు మెరుగుపర్చాలి కేంద్ర బృందం తనిఖీ పెద్దాపురం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఐసీటీసీ విభాగంలో మంగళవారం కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డీడీ యూబీ దాస్, నాకో కన్సల్టెంట్లు రాహుల్ ఆహూజా, డాక్టర్ జస్వందర్ సింగ్, ఏపీ స్టేట్ సొసైటీకి చెందిన డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. ఐసీటీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఐసీటీసీలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీటీసీ భాగస్వామి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీటీసీ, సంపూర్ణ సురక్ష కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సోచ్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐసీటీసీలోని రికార్డులను పరిశీలించి, ఇక్కడి సేవలపై కౌన్సెలర్ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట అదనపు పీడీ డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
మహానేతకు నీరాజనం
● మరుపురాని మహా మనిషి రాజన్న ● జన హృదయ నేతకు ఘన నివాళి ● జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు ● వైఎస్సార్ సీపీ శ్రేణుల శ్రద్ధాంజలి సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట తప్పని, మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని.. దివికేగిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను జిల్లా గుర్తుకు తెచ్చుకుంది. రాజన్న అసువులు బాసి 16 ఏళ్లయిన సందర్భంగా వైఎస్ అభిమానులు జిల్లా అంతటా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లాలో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అనేక కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు, పార్టీరహితంగా వైఎస్ అభిమానులు సైతం వర్ధంతిని పురస్కరించుకుని అనాథలు, రోగులు, నిరుపేదలకు తమకు తోచిన రీతిలో సాయం అందించారు. వాడవాడలా ఉన్న రాజన్న విగ్రహాలను స్థానికులు, వైఎస్సార్ సీపీ నేతలు రంగులతో అలంకరించి, పూలమాలలతో ముంచెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్ జిల్లాకు చేసిన మేలును గుర్తు చేసుకుని ఘనమైన నివాళులర్పించారు. ● జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయనతో పాటు, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రాంజీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేట క్యాంప్ కార్యాలయం, బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయం నుంచి పార్టీ నేత బండారు రాజా ఆధ్వర్యంలో జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో చంటిబాబు పాల్గొన్నారు. ● పార్టీ పిఠాపురం కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిఠాపురం పట్టణం, రూరల్, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. గొల్లప్రోలులో అన్న సమారాధనలో పాల్గొన్నారు. ● సామర్లకోట జగనన్న కాలనీలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో రాజీవ్ గృహకల్ప, ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద వైఎస్సార్ విగ్రహాలకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా పెద్దాపురం మున్సిపల్ సెంటర్, సినిమా సెంటర్, కాండ్రకోట, సిరివాడ, ఉలిమేశ్వరంల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. అలాగే గుడివాడ, కట్టమూరు, ఆర్బీ కొత్తూరు గ్రామాల్లో వైఎస్సార్ చిత్రపటాలకు పార్టీ నేతలు, వైఎస్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ● ప్రత్తిపాడు నియోజకవర్గంలో వాడవాడలా పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో వైఎస్సార్‌కు పార్టీ శ్రేణులు ఘనమైన నివాళులర్పించారు. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, సి.రాయవరం గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు గిరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెట్ట ప్రాంత రైతులకు మహానేత చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రత్తిపాడు కేంద్రంతో పాటు, ప్రత్తిపాడు రూరల్, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం నగర పంచాయతీ, ఏలేశ్వరం మండలంలోని గ్రామాల్లో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. కాగా, పార్టీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ● తుని నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుడు యనమల కృష్ణుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తుని శ్రీరామ సెంటర్లో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటనందూరు మండలం బిల్లనందూరులో ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. తుని పట్టణంతో పాటు, రూరల్, తొండంగి, కోటనందూరు మండలాల్లో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ● కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాకలపూడిలో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరీంబాషా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్లో వైఎస్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందించారని ప్రస్తుతించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ, ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి, అభివృద్ధికి రాజకీయాలు చొప్పించకుండా, విలువలతో కూడిన పాలన అందించారన్నారు. పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, బీసీ, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు, రాగిరెడ్డి అరుణ్‌కుమార్(బన్నీ) తదితరులు పాల్గొన్నారు. -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ల ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్మీనాకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌగోళికంగా కాకినాడకు అతి సమీపంలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కోనసీమ జిల్లాకు రామచంద్రపురం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి ఉండడం వల్ల ఏ అవసరమైనా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. యానం మీదుగా తిరిగి వెళ్లాల్సి రావడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానీష, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిపై విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డుల మంజూరు, కార్డులలో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూ వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యంపై అర్జీలు వచ్చాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్లైన్ సమస్యలపై మొత్తం 517 అర్జీలు అందాయి. అనంతరం విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ నిధులతో 9 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.45 వేల ఖరీదైన ల్యాప్‌టాప్‌లు అందించారు. జిల్లాలో 2,72,497 మందికి పింఛన్ల పంపిణీ పెదపూడి: ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. రామేశ్వరంలో పేదలకు సేవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో వీరపాండ్యన్‌తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 2,72,497 మందికి రూ.117.66 కోట్ల విలువైన సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, డీఎంహెచ్ఓ జె.నరసింహనాయక్, ఎంపీడీఓ కొవ్వూరి నరేంద్రరెడ్డి, తహసీల్దార్ పీవీ సీతాపతిరావు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ కమిషనర్ సస్పెన్షన్ ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం.సత్యనారాయణను సోమవారం సస్పెండ్ చేశారు. ఇటీవల ఏసీబీ అధికారులు చేసిన దాడిలో కమిషనర్ నగదుతో దొరికిపోవడంతో రాజహేంద్రవరం ఏసీబీ కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించారు. ప్రస్తుతం ఏఈ పి.సూర్యప్రకాశరావు ఇన్చార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కాయకల్ప తరువు
● ఆరోగ్య ప్రదాయిని.. కొబ్బరి ● నీటి నుంచి ఆయిల్ వరకు ప్రతిదీ ఔషధమే.. ● నీరు, ముక్క, పాలు ఇలా ఎన్నెన్నో! ● అన్నింటా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో సాగు ● నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి ఒక్క ఉమ్మడి తూర్పులోనే 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే కొబ్బరి ఔషధాల గని. కొబ్బరి ఉత్పత్తుల ద్వారా రైతులు, వ్యాపారులు, కార్మికులు ఉపాధి పొందుతుంటే.. ఆయా ఉత్పత్తుల ద్వారా సామాన్యులు సైతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. లక్షలాది మంది ప్రజలకు ఔషధాలను అందిస్తూ కొబ్బరి ఆరోగ్య వర ప్రదాయినిగా పేరొందింది. సెప్టెంబర్ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. కొబ్బరి చెట్టును చూస్తే గోదారమ్మ ఒడిలో ఒదిగిన అందాల బిడ్డలా కనిపిస్తుంది. ప్రకృతి అందాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అదనపు అందాలు అద్దే కొబ్బరి చెట్టు చూసి ముచ్చట పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తోటల్లో పంటగానే కాదు వరిచేను.. చెరువులు.. రోడ్లు.. కాలువలు.. నదీపాయల వెంబడి.. ఇళ్ల చుట్టూ కనిపించే కొబ్బరి చెట్టు గోదావరి వాసుల నుదుటిన ప్రగతి తిలకం దిద్దుతూ ఇక్కడ వారి జీవనంలో పెనవేసుకుపోయింది. కన్న కొడుకుగా పిలుచుకుంటారంటే.. వారి జీవనంలో కొబ్బరికి ఎంత ప్రాముఖ్యమో అవగతమవుతుంది. మధుమేహ రోగులకు కొబ్బరి కల్పరస కొబ్బరి జ్యూస్ (కల్లు–కల్పరసా) ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఫెర్మంటేషన్ ఆవకుండా ఉత్పత్తి చేసే కొబ్బరి జ్యూస్ (నీరా) నేరుగా తాగినా, దీనిని నుంచి ఉత్పత్తి చేసే పంచదార, బెల్లం, తేనెను ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇందులో గైసమిక్ ఇండెక్స్ 25 శాతం మాత్రమే. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
వంటకు కొబ్బరి నూనె శ్రేష్ఠం
కొబ్బరి నూనె ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శక్తి పెరిగి, చర్మానికి తేమ అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హార్మోన్ల స్థాయిలను స్థిరంగా ఉంచి, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెను తలకు పట్టించి.. మర్దన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. -
ఆదాయం.. గణనీయం
● అన్నవరం దేవస్థానంలో హుండీల లెక్కింపు ● 32 రోజులకు రూ.1.69 కోట్లు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి శ్రావణమాసం సిరులు కురిపించింది. 32 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,69,06,902 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. ఇందులో నగదు రూ.1,59,69,547 కాగా, చిల్లర నాణేలు రూ.9,37,355 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. 32 రోజులకు సరాసరిన హుండీల ఆదాయం రూ.5.28 లక్షలుగా నమోదైంది. శ్రావణమాసం కావడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడంతో హుండీం ఆదాయం పెరుగుదలకు కారణమైందని అధికారులు తెలిపారు. ఈ హుండీల ద్వారా 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి వచ్చింది. విదేశీ కరెన్సీ కూడా... సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికా డాలర్లు 170, ఇంగ్లాండ్ పౌండ్లు 25, సింగపూర్ డాలర్లు ఐదు, ఆస్ట్రేలియా డాలర్లు పది, సౌదీ రియల్స్ పది, యుఏఈ దీరామ్స్ 455, ఖతార్ రియల్స్ 20, కెనడా డాలర్లు ఐదు లభించాయి. మూడు నెలలుగా పెరుగుదల మూడు నెలలుగా స్వామివారి హుండీల ఆదాయం గణనీయంగా పెరిగింది. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నెలకు రూ.1.20 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకూ మాత్రమే వచ్చేది. భక్తుల రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ఈ ఆదాయం రూ. కోటి లోపు ఉండేది. అటువంటిది గత మూడు నెలల నుంచి స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జూన్‌లో హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు, జూలైలో రూ.1.57 కోట్లు వచ్చింది. గత నెల రూ.1.69 కోట్లు వచ్చింది. గత ఏడాది ఈ మూడు నెలల హుండీ ఆదాయంతో పోల్చితే ఈ హుండీ ఆదాయం సుమారు 20 శాతం పెరిగింది. లెక్కింపులో దేవస్థానం చైర్మన్, ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆదాయాన్ని స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
సహజ వనరులు ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణికాకినాడ రూరల్: రాష్ట్రంలో విలువైన సహజ వనరులను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుందని, ఇందులో భాగంగానే కోస్టల్ కారిడార్‌ను దోచిపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. కాకినాడ 49వ డివిజన్ కొత్త గైగోలుపాడులో తన నివాసం వద్ద సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో పలు ఖనిజాలు వేరు చేసి ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు. నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకూ సుమారు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు కనుగొన్నారన్నారు. తీరంలో లభించే ఇసుకలో విలువైన ఇటాలియన్ ఖనిజాలు 8 రకాలుగా లభ్యమవుతాయని శాస్త్రవేత్తలు తేల్చారన్నారు. దేశంలోని బడా కంపెనీల కన్ను వీటిపై పడిందని, భీమిలి ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దాదాపు 900 ఎకరాలు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 90 ఎకరాల్లో సముద్రపు ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కేవలం రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రైవేట్‌కు తక్కువకే కట్టబెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం విరమించుకుని గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల భారం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా కేవలం 8 శాతానికి పరిమితమవ్వడం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని భావించాల్సి వస్తుందన్నారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు, గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి స్థానికంగా ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చలేదన్నారు. గుజరాత్‌కు గ్యాస్, చమురు తరలిపోగా, బ్లో అవుట్ ఇబ్బందులను స్థానికులు చవిచూశారన్నారు. ఇప్పుడు సముద్రపు ఇసుక ప్రొసెస్ వల్ల వచ్చే అధిక వేడితో స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. -
ఆత్మీయ నేస్తం.. అమృత హస్తం
● జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్రవేసిన రాజన్న ● ఆనాడే పరుగులు పెట్టిన ‘పుష్కర’ ● మెట్టలో జల‘తాండవ’ం ● నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి రాజన్న.. ఆత్మీయ నేస్తం అయ్యారు.. అమృత హస్తం అందించారు.. జిల్లాలో సంక్షేమం పరవళ్లు తొక్కించారు.. అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు.. ప్రతి మదిలోనూ సుస్థిరమయ్యారు.. ‘వైఎస్’ పేరు చెబితేనే పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా కొనియాడుతున్నారు. ఆయన మన మధ్య లేకున్నా, చేసిన మేలు ఇప్పటికీ పదిలం చేసుకున్నారు.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంతో పరుగులు పెట్టించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఫలాలను నెమరు వేసుకుంటున్నారు. మంగళవారం రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడమాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతిగా, పేదల పెన్నిధిగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రగతి జన హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తన సుదీర్ఘ పాదయాత్రతో జిల్లాలో ప్రజల కష్టాలు, మెట్టప్రాంత రైతుల కన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా వారి కష్టాలు గట్టెక్కించారు. ఆయన వేసిన అభివృద్ధి జాడలు ఇప్పటికీ చెక్కుచెదరని ఫలాలను అందిస్తున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంత రైతుల కడగండ్లు తీర్చిన నేతగా జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం మెట్ట ప్రాంత పంటలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందించారు. సాగు.. భలే బాగు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు పంటలు సాగై రైతులు ఆనందంగా ఉంటున్నారంటే, ఆనాడు రాజశేఖరరెడ్డి సాకారం చేసిన ప్రాజెక్టులే కారణం. ఇప్పటికీ అవి పదిలంగా ఉన్నాయి. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని తదితర నియోజకవర్గాల్లో వర్షాధారమైన పంట పొలాల్లోకి సాగునీరు పరుగులు పెట్టించారు. వర్షాలే ఆధారంగా దుక్కిదున్ని పంటలు సాగు చేసే పొలాల్లోకి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందించి సిరులు కురిపించారు. అటు తుని నుంచి ఇటు జగ్గంపేట నియోజకవర్గం వరకూ బీడు భూములు కాస్తా సాగు భూములై బంగారం పండుతుందటంటే నాడు రాజన్న చేసిన మేలేనని రైతులు ఆనందంగా చెబుతున్నారు. వైఎస్ తమ కుటుంబాల్లో వెలుగులు నింపారంటూ చాలామంది తమ ఇళ్లలో వైఎస్ ఫొటోలు పెట్టుకుని అభిమానం చాటుతున్నారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన పుష్కర ఎత్తిపోతల పథకం వ్యవసాయం దిశ, దశనే మార్చేసిందంటే అది నాడు వైఎస్ చలవేనంటున్నారు. సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించి వేలాది మంది రైతుల కడగండ్లు తీర్చిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్ రూ.600 కోట్లు వెచ్చించి రైతుల కలను సాకారం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మెట్ట రైతులకు రాజశేఖరరెడ్డి అపర భగీరథుడిగా నిలిచారు. ఆనంద‘తాండవ’ం సుమారు 30 వేల ఎకరాలకు పైగా ప్రయోజనం కల్పించే తాండవ ప్రాజెక్టును పూర్తి చేసి తుని పరిసర ప్రాంతాల రైతుల్లో ఆనందం నింపారు. రూ.52 కోట్లతో తాండవను ఆధునీకరించి కుడి, ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఇది తమ జీవితాలకు సిరుల పంట తెచ్చిందని కర్షకులు అంటున్నారు. తుని పరిధిలో తాండవ నదిపై భూమి, ముఠా మినీ ఆనకట్టలను రూ.5 కోట్లతో నిర్మించారు. తుని పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. బీడు నుంచి సాగుకు.. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందంటే, అది ఆనాడు మహానేత వైఎస్ చలవే. ఆ పది వేల ఎకరాల్లో ఏటా రెండు పంటలు సాగు చేసుకుంటున్నామని ఆ ప్రాంత రైతులు సంతోషంగా చెబుతున్నారు. జలయజ్ఞంతో ఏజెన్సీలోని రంపచోడవరంలో ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా గోకవరం మండలంలో ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారు. 2004లో ఎన్నికలకు ముందు గోకవరం వ చ్చిన వైఎస్ రైతుల కడగండ్లు చూసి చలించిపోయా రు. సీఎం అయ్యాక 22 వేల ఎకరాలకు నీరందించాలనే సంకల్పంతో రూ.205 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు పనులు దాదాపు 80 శాతం పూర్తి చేశారు. ఆధునీకరించి.. చెరగని ముద్ర వేసి 2009లో రూ.132 కోట్లతో ఏలేరు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. అపరిష్కృతంగా ఉన్న పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌ను రూ.120 కోట్లతో ఆధునీకరించి తమ హృదయాల్లో చెరగని ముద్రవేశారని పిఠాపురం రైతులు పేర్కొంటున్నారు. కాకినాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి నాడు మహానేత సినిమా రోడ్డులో తీసుకువచ్చిన ఫ్లై ఓవర్ దోహదం చేసిందని గుర్తు తెచ్చుకుంటున్నారు. 2004లో సీఎంగా వైఎస్ తొలిసారిగా నగర బాటకు శ్రీకారం చుట్టింది కూడా కాకినాడ నగరంలోనే కావడం విశేషం. కాకినాడలో వేలాది మంది నిరుపేదల సొంతింటి కలను రాజీవ్ గృహకల్పతో సాకారం చేశారు. అందుకే రాజన్న ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. క‘న్నీళ్లు’ తుడిచి.. పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం జంట మున్సిపాలిటీల్లో లక్ష మంది దాహార్తిని తీర్చిన ఘనత దివంగత రాజశేఖరరెడ్డిదే. సుమారు రూ.15 కోట్లతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టులు ఆయన దార్శనికతకు నిలువుటద్దం. రూ.12 కోట్లతో పెద్దాపురం రాజీవ్ గృహకల్ప, రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణానికి 13 ఎకరాలు కొనుగోలు చేసి మహానీయుడు అయ్యారు. వరద సమయంలో ముంపు, నీటి ఎద్దడి సమయంలో కరవుతో కటకటలాడిన ఏలేరు రైతుల కష్టాలు గట్టెక్కించిన రాజశేఖరరెడ్డి తమ హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగానే నిలిచిపోతారని ప్రజలు కొనియాడుతున్నారు. -
సమయం తెలియదు
అక్వేరియంలో చేపల పెంచడం అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తుంటే కాలం తెలియదు. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. – పేకేటి వీరబాబు, వ్యాపారి, రాయవరం అక్వేరియం కల్చర్ పెరిగింది గత 28 ఏళ్లుగా అక్వేరియంలకు ఫిష్‌ల ను అమ్ముతున్నాను. సింగపూర్, మలే షియా, థాయ్‌లాండ్, చైనా దేశాల నుంచి చైన్నెకి దిగుమతి అవుతుంటా యి. ఇటీవల కాలంలో అక్వేరియం కల్చర్ పెరిగింది. – సత్యవోలు శ్రీనివాసరావు, అక్వేరియం షాపు యజమాని, రామచంద్రపురం -
ఆనందమీనందమాయె..
● మనసు దోచుకుంటున్న అక్వేరియం కల్చర్ ● ఇంటి అలంకరణలో ప్రత్యేక స్థానం ● వాస్తు నమ్మకాలూ ఓ కారణం రాయవరం: ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడు ఇంటి అలంకరణలో అక్వేరియంలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంటీరియల్ డెకరేషన్లో భాగంగా అక్వేరియం ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా సంస్కృతీ సంప్రదాయాలను పాటించేవారు, వాస్తుపరమైన నమ్మకంతో తమ సంపాదనను వృద్ధి చేసుకునే వారు, సుఖ సంతోషాలను పొందాలని నమ్మేవారు ఇప్పుడు చేపలను గాజు తొట్టె (అక్వేరియమ్స్)లో ఉంచుతున్నారు. వ్యాపార సంస్థల్లోనూ.. అక్వేరియంలను ఇంటితో పాటు వ్యాపార సంస్థల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం వ్యాపారులు అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, ఇళ్లల్లో స్థలానికి అవసరమైన ప్రమాణంలో అక్వేరియంలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అందంతో పాటు, ఆదాయం వృద్ధి చెందుతుందని, వాస్తు దోషాలకు విరుగుడుగా ఉంటుందని నమ్మే వారు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు నీటిలో తిరిగే చేపలను చూడడానికి ఇష్టపడతారు. ఇంట్లో చిన్నపిల్లల కోరికను తీర్చేందుకు కూడా వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఆసక్తి అక్వేరియం ఏర్పాటు వెనుక కొన్ని వాస్తు నమ్మకాలు దాగున్నాయి. చైనీస్ వాస్తు ప్రకారం చేపలు అదృష్టానికి, నీరు సంపదకు గుర్తుగా భావిస్తారు. ఈ రెంటినీ కలిపి ఒకే చోట (అక్వేరియంలో) ఉంచుకుని సంపద వృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. చేపలు ఎప్పుడూ కళ్లు తెరిచే స్వభావాన్ని కలిగి ఉండడంతో మనకు జరగబోయే ఆటంకాలను ముందుగా గ్రహించి కదలికలతో సమాచారం అందిస్తాయనే నమ్మకం ఉంది. అధిక లాభాలను ఆర్జించవచ్చనే నమ్మకంతో వ్యాపార సంస్థలు సైతం అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అక్వేరియంల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా స్వదేశీ, విదేశీ చేపలు నేడు మార్కెట్లో లభిస్తున్నాయి. దేశంలోని చైన్నె, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల చేపలను కూడా వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. ఉపాధికి మార్గంగా.. అక్వేరియంలో ఉంచేందుకు పలు రకాల చేపలను మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. స్కాట్ఫిష్, గోల్డ్‌ఫిష్, అరోవనా, రెడ్‌క్యాప్, గుప్పీస్, వైట్ ఏంజల్, బెలూన్ఫిష్, బ్లాక్‌గోల్డ్ ఫిష్, బ్లాక్ షార్క్, ఫ్లోరాస్, క్రోకడైల్ ఫిష్ వంటి 40 రకాల చేపలు లభిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.20 వేల వరకు వివిధ ధరల్లో పలు రకాల చేపలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు పలు రకాల మోడళ్లలో అక్వేరియంలు కూడా లభ్యమవుతున్నాయి. -
కొనసాగుతున్న వరద ఉధృతి
● ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.10 అడుగుల నీటిమట్టం ● 11.79 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. సోమవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.10 అడుగులకు నీటి మట్టం చేరింది. అక్కడి నుంచి రాత్రి వరకు అదే స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఆ ప్రభావం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం కనిపించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి సోమవారం రాత్రి 11,79,236 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు సంబంధించి 13,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.64 మీటర్లు, పేరూరులో 14.16 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.49 మీటర్లు, భద్రాచలంలో 43.40 అడుగులు, కూనవరంలో 19.53 మీటర్లు, కుంటలో 10.77 మీటర్లు, పోలవరంలో 12.69 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.46 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఇరిగేషన్ ఎస్ఈ కూరెళ్ల గోపీనాథ్ తెలిపారు. వరద ఉధృతి ఈ నెల ఆరో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. గత నెల 30న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. నదీ పరీవాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గణేశ్ నిమజ్జనోత్సవాల సమయంలో నదిలోకి వెళ్లకుండా, ఒడ్డు నుంచే నిమజ్జనాలు చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద ఇరిగేషన్, ఇతర శాఖల ద్వారా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు మర పడవల్లో రేవులు దాటేటప్పుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. అక్టోబర్ చివరి వరకు వరద సీజన్ కొనసాగే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని ఏఆర్టీ/ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఎటువంటి చికిత్సా కేంద్రాలు నడపరాదన్నారు. నియామావళి ప్రకారమే సేవలు అందించాలన్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడంలో ఏఆర్టీ, ఐవీఎఫ్, సరోగసీ ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన, రిజిస్ట్రేషన్ కలిగిన ఆస్పత్రులు/కేంద్రాల్లోనే చికిత్స పొందాలన్నారు. అనుమతి లేని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవడం వల్ల ప్రమాదాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రజలు ఆయా విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికార/నమోదు కాని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవద్దని సూచించారు. ఏఆర్టీ లేదా సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలు దంపతుల చట్టబద్ధ సంతానం అవుతారని స్పష్టం చేశారు. వాణిజ్య సరోగసీ (డబ్బు కోసం) పూర్తిగా నిషేధించబడిందన్నారు. లింగ నిర్ధారణ, గర్భకణాల అమ్మకాలు కఠినంగా నిషేధించబడ్డాయని తెలిపారు. చట్ట ఉల్లంఘన చేసిన వారికి జైలుశిక్ష, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాల అమలుతో పారదర్శకత, న్యాయం, రక్షణ అన్నీ సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా అవగాహనతో ఉండి, నిబంధనలు పాటించే కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇతర వివరాలకు 81255 67830 నంబరులో సంప్రదించాలన్నారు. -
స్వదేశానికి క్షేమంగా చేరిన మహిళ
మస్కట్ నుంచి రప్పించిన కోనసీమ మైగ్రేషన్ అధికారులు అమలాపురం రూరల్: మస్కట్ దేశంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు క్షేమంగా స్వదేశానికి రప్పించారు. తమ తల్లిని స్వదేశానికి రప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను పది రోజుల క్రితం ఆశ్రయించింది. కేంద్రం ప్రతినిధులు స్పందించి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మన్యం నాగమణిని ఇండియాకు రప్పించినట్టు డీఆర్వో, కేంద్రం నోడల్ అధికారి కొత్త మాధవి సోమవారం తెలిపారు. ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య తల్లి నాగమణి ఉపాధి కోసం 9 నెలల క్రితం మస్కట్ దేశానికి వెళ్లింది. కొంతకాలం నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేక, ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెను ఇండియాకు రప్పించడానికి కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. ఆమెను పంపించిన ఏజెంట్‌ను అడిగితే రూ.1.60 లక్షలు కడితే కానీ ఆమెను రప్పించలేమని స్పష్టం చేశాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, డబ్బు సర్దుబాటు కుదరలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ కలెక్టరేట్లో ప్రత్యేకించి వలసదారుల కోసం సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఏర్పాటు చేశారని, విదేశాలకు వెళ్లే వారికి అండగా ఉంటోందని తెలుసుకుని ఈ కేంద్రాన్ని దివ్య ఆశ్రయించింది. కేంద్రం అధికారులు సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి, సమస్యను పరిష్కరించి.. నాగమణిని క్షేమంగా మస్కట్ నుంచి రప్పించే ఏర్పాట్లు చేశారు. సోమవారం నాగమణి హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. స్వగ్రామానికి మృతదేహంఅంబాజీపేట: పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కాగిత అర్జమ్మ ఉపాధి కోసం బెహరాన్ దేశం వెళ్లి పదేళ్లుగా అక్కడే పని చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో ఆమె అక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు రూ.3 లక్షల ఖర్చవుతుండడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) అండగా నిలిచింది. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో కలిసి ఈ సంస్థ ఖర్చులు భరించి, అర్జమ్మ మృతదేహాన్ని సోమవారం ఇంటి వద్ద బంధువులకు అప్పగించారు. ఇందుకు కృషి చేసిన ఆయా సంస్థల ప్రతినిధులకు మృతురాలి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాడైన పంటల పరిశీలన
పెరవలి: గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి చనిపోయిన విషయమై సాక్షిలో జల దిగ్బంధం శీర్షికన సోమవారం వెలువడిన కథనానికి ఉద్యానవన అధికారులు స్పందించారు. వివిధ ప్రాంతాల్లో పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ, దిగువ లంకల్లో పంటలు పూర్తి పాడైపోయాయని, నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలంటే వరద పూర్తిగా తగ్గాలన్నారు. ఆ తర్వాత పంటలు పరిశీలించి అంచనాలు రూపొందిస్తామన్నారు. ఇందుకు మరో వారం ఆగాల్సి ఉంటుందన్నారు. సోమవారం కానూరు నుంచి కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం వరకు పంటలను పరిశీలించామన్నారు. వరద తగ్గాక అంచనాలు తయారు చేయాలని వీఆర్వోలు, ఉద్యానవన అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల రైతులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి కొయ్యలగూడెం: అదుపు తప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని కన్నాపురం గ్రామ శివారున సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపూడి సత్యనారాయణ (60) ద్విచక్ర వాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కన్నాపురం శివారున వాహనంతో చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
ఆలమూరు: లంచం డిమాండ్ చేసినట్టు రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. రైతు నుంచి రూ.28 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన రైతు జి.సుబ్రహ్మణ్యానికి చెందిన 1.37 ఎకరాల భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కె.విమల సరోజినీకుమారి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడగా, రూ.28 వేలకు అంగీకరించారు. దీంతో రైతు ఆ మొత్తం తీసుకువస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం దాడి చేసింది. సబ్ రిజిస్ట్రార్ విమల సరోజినీకుమారి తన కారు డ్రైవర్ దాసరి దుర్గారావుతో కలిసి రైతు నుంచి రూ.28 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెతో పాటు, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, అదనంగా రూ.35 వేల నగదు గుర్తించారు. ఆ మొత్తాన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సీఐలు వాసుకృష్ణ, భాస్కరసతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలలతో భిక్షాటన చేయించడం నేరం
కాకినాడ రూరల్: బాలలతో భిక్షాటన చేయించడం నేరమని జిల్లా బాలల సంక్షేమాధికారి సీహెచ్ వెంకట్రావు అన్నారు. వీధి బాలల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట గ్రామ శివారు కొత్తూరు వద్ద నలుగురు వీధి బాలలను శనివారం సాయంత్రం గుర్తించారు. బాలల తల్లిదండ్రులు పల్నాడు జిల్లా వినుకొండగా గుర్తించారు. ప్లాస్టిక్ సామగ్రి ఏరుకుంటూ, గ్యాస్ స్టౌవ్‌ల రిపేరు చేస్తూ జీవనోపాధి పొందుతున్న తల్లిదండ్రులు పిల్లలను భిక్షాటనకు ప్రోత్సహించడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు వెంకట్రావు తెలిపారు. ఇద్దరు పిల్లలను అంగన్వాడీ సెంటరులో, ఒకరిని ఎంపీపీ స్కూల్, మరోకరిని జెడ్పీ స్కూల్లో చేర్చామన్నారు. ఐసీడీఎస్ సీడీ లక్ష్మి సహకారంతో వీధి బాలల గుర్తింపు కాకినాడ పరిసరాలలో చేపడుతున్నట్టు తెలిపారు. -
విద్యార్థిని అదృశ్యం
రంగంపేట: కళాశాలకంటూ వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై శివప్రససాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, రాజానగరం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల నూతలపాటి షెలాశియా రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం దివాన్‌చెరువులో ఆర్టీసీ బస్సు ఎక్కి, రంగంపేటలో దిగి కళాశాలకు వెళ్లింది. కళాశాల ముగిశాక సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు తెలిసిన చోట్లా, బంధువుల ఇళ్ల వద్దా ఆచూకీ కోసం యత్నించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో.. శనివారం రాత్రి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. విద్యార్థిని ఆచూకీ తెలిసిన వారు రంగంపేట పోలీస్ స్టేషన్‌కు, లేదా 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
మహిళను కాపాడిన కానిస్టేబుల్
ఐ.పోలవరం: గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ కాపాడిన సంఘటన మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యానాం – ఎదుర్లంక వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేందుకు యానాం గోపాల్‌నగర్‌కు చెందిన దుర్గ ఆదివారం ప్రయత్నించింది. అటుగా వెళ్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజు గమనించి ఆమెను నలుగురి సాయంతో రక్షించారు. వివరాలు అడిగి తెలుసుకుని.. భర్త, పిల్లలకు సమాచారం అందజేశారు. కాగా, దుర్గ యానాంలో ఇంటి పనులు చేస్తుండగా, భర్త ఆటోను నడుపుతున్నట్టు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదమే కారణమని తెలుసుకుని ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చి, బంధువులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన నాగరాజును స్థానికులతో పాటు, పోలీసులు అభినందించారు. -
సత్యదేవుని హుండీ నేడు లెక్కింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షిస్తారు. దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గత నెల 30న లెక్కించారు. మరలా 32 రోజుల తర్వాత సోమవారం లెక్కించనున్నారు.బాల్ బ్యాడ్మింటన్‌లో జాహ్మవి, శ్రీలక్ష్మికి తృతీయ స్థానంసీతానగరం: చినకొండేపూడికి చెందిన విద్యార్థిని జాహ్నవి రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో తృతీయ స్థానం కై వసం చేసుకుంది. ఆదివారం ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన ఈ పోటీల్లో చినకొండేపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బచ్చు జాహ్నవి, సీనియర్స్ విభాగంలో జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఎం శ్రీలక్ష్మి తృతీయ స్థానం సాధించారు. వీరిని స్కూల్ హెచ్ఎం ఎస్ ఉషారాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.హైవేపై లీకై న ఆయిల్ వాహన చోదకులకు ఇక్కట్లురాజమహేంద్రవరం రూరల్: జాతీయ రహదారిపై హుకుంపేట జైహింద్నగర్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. దీంతో పలువురు వాహనచోదకులు అదుపుతప్పి కిందపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఆయిల్ పడిన ప్రాంతంలో ఇసుక వేసి, దానిపై నుంచి వాహనాలు వెళ్లకుండా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయిల్‌పై వేసిన ఇసుకను, స్టాప్ బోర్డులను తీసేశారు. వాహనాలు రాకపోకలకు అనువుగా మారడంతో వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు.సూర్యదేవునికి ప్రత్యేక పూజలుపెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన ఉషా, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యదేవుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, వ్రత పూజలు నిర్వహించారు. -
దేవాలయ భూముల్లో చెట్ల నరికివేత!
కొత్తపల్లి: మండలంలోని గోర్స గ్రామానికి చెందిన పురాతన సీతారామస్వామి దేవాలయ భూముల గట్లపై ఉన్న చెట్ల నరికివేత చర్యలను ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ భూముల్లో ఎటువంటి వ్యవసాయ పనులు చేపట్టరాదని న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం, కొమరగిరి గ్రామంలో సర్వే నంబరు 121, 122లో గోర్స దేవాలయానికి సుమారు 20 ఎకరాల భూమి ఉంది. దీనిపై ఆక్రమణదారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం న్యాయస్థానంలో ఉంది. ఇలాఉంటే ఆక్రమణదారులు ఇందులో వ్యవసాయ పనులు చేపట్టేందు కు ఆదివారం సిద్ధమయ్యారు. గట్టుపై చెట్లను నరికించడంతో.. సర్పంచ్ రొంగల వీరబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకుని, తహసీల్దార్ చిన్నారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్వో కిషోర్ ఆక్రమణదారులు, చెట్లను నరికిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
సుజల ప్రాప్తిరస్తు..
● వర్షపు నీటిని ఒడిసిపట్టి.. రీ సైక్లింగ్ ● తొలిసారిగా అన్నవరం దేవస్థానంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ● లక్ష లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మాణం ● సంతృప్తి వ్యక్తం చేసిన దేవదాయ శాఖ కమిషనర్ ● అన్ని దేవస్థానాల్లో నిర్మించాలని ఆదేశం అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సాంకేతిక పరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి, ట్యాంకులో నింపి, అదే నీటిని తిరిగి ఉపయోగించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్.. 2023–24 మధ్య అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసినప్పుడు ఈ మేరకు ప్రణాళిక రూపొందించగా.. ఇప్పుడది కార్యరూపం దాల్చుతోంది. అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై నిర్మించిన 135 గదుల శివసదన్ సత్రంపై శ్లాబు మీద కురిసిన వర్షపు నీటిని పైపుల ద్వారా సేకరిస్తారు. సత్రం దిగువన నిర్మించిన లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులోకి ఆ నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆ ట్యాంకులో వర్షపు నీరు ఎంత మేర ఉందో తెలిపే మీటరు కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షపు నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్(శుద్ధి) చేసే ప్రక్రియ కూడా ఈ ట్యాంకులో అమర్చారు. ఈ ట్యాంకు నిండినపుడు ఆ నీటిని మరలా శివసదన్ సత్రం పైన ఉన్న వాటర్ ట్యాంకుకు పంపించేలా మోటార్లు ఏర్పాటు చేశారు. సత్రం ఆవరణలో మొక్కల పెంపకానికీ ఈ నీటిని ఉపయోగించుకునే వీలుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్‌గా దీనిని పిలుస్తున్నారు. కమిషనర్ సంతృప్తి గత నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ ట్యాంకును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ట్యాంకు నిర్మాణం, ఇతర వివరాలను అన్ని దేవస్థానాలకు పంపాలని ఆదేశించారు. దేవస్థానంలోని హరిహర సదన్, ప్రకాష్ సదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాల వద్ద కూడా ఇటువంటి వాటర్ ట్యాంకులు నిర్మించి, వర్షపు నీటిని పైపుల ద్వారా మళ్లించి, ఆ నీటిని ఫిల్టర్ చేసి వినియోగించుకునేలా చేయాలని కమిషనర్ నిర్దేశించినట్టు ఈఓ తెలిపారు. రూ.20 లక్షల ఖర్చు ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో ఈ ట్యాంకు దాదాపుగా నిండిపోయింది. దీంతో ఈ నీటిని మరలా వాటర్ ట్యాంక్‌కు పంపడమో.. లేక మొక్కల పెంపకానికి ఉపయోగించడమో చేస్తామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఈ ట్యాంకు, పైపులైన్, ఇతర నిర్మాణాలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశామని వివరించారు. సాధారణంగా లక్ష లీటర్ల నీరు భూమి నుంచి సత్రం పైకి పంపించేందుకు చాలా విద్యుత్ అవసరమవుతుంది. సత్యగిరి కొండ ప్రదేశం కావడంతో బోర్లు వేసే అవకాశమూ తక్కువే. ఈ పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎప్పటి కప్పుడు ఈ నీటిని తిరిగి వాటర్ ట్యాంక్‌కు పంపించడం ద్వారా నీటిని సద్వినియోగం చేయడంతోపాటు, విద్యుత్‌నూ ఆదా చేయవచ్చని తెలిపారు. రీ సైక్లింగ్‌కు ఏర్పాట్లు చేశాం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు శివసదన్ సత్రం టెర్రస్‌పై కురిసిన లక్ష లీటర్ల వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసే ట్యాంకు నిర్మించాం. ఇందులో నిల్వ అయ్యే నీటిని తిరిగి సత్రం అవసరాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. దేవదాయ శాఖలో ఈ విధమైన నీటి ట్యాంకు నిర్మించడం ఇదే ప్రఽథమం. అలాగే దేవస్థానంలో ఐదు చోట్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ఇంజెక్షన్ వెల్స్ నిర్మించాం. దీనివల్ల భూమిలోకి నీరు ఇంకి, సత్యగిరి, రత్నగిరిల్లో మొక్కలకు సమృద్ధిగా నీరు అందుతుంది. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
పెట్టుబడి పెన్షన్.. బతుకు టెన్షన్
● ‘ఉమ్మడి’లో 30 వేల సీపీఎస్ ఉద్యోగులు ● నేడు విజయవాడలో మహా సభ రాయవరం: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో చనిపోతే కుటుంబానికి తోడ్పాటు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగికి సామాజిక భద్రతగా పెన్షన్ ఉంటుందనేది ఒకప్పటి మాట. సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం ఈ మేరకు భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో.. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్ దశాబ్ద కాలంగా వినిపిస్తోంది. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వివిధ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక(ఫ్యాఫ్టో) ఇప్పటికే మద్దతు పలికింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ ఉద్యోగులు కలిపి 30 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులున్నారు. పదవీ విరమణ అనంతరం అందించే పింఛన్లు భారమవుతుందని భావించి 2003–04 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) విధానం అమలు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పేరుతో అమల్లోకి తీసుకొచ్చింది. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నారు. నేడు విజయవాడలో మహాసభ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్ ఉద్యోగులు సోమవారం విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు వెళ్లే వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఐదు వేల మంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాట నిలబెట్టుకోవాలి సీపీఎస్ ఉద్యోగుల పోరాటం ద్వారా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్ష న్ సాధించుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగి హక్కుగా ఉన్న సర్వీస్ పెన్షన్ సాధించుకోవడమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకూ మా పోరాటాన్ని దశలవారీగా ఉధృతం చేస్తాం. – చింతా నారాయణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీసీపీఎస్ఈఏ, కాకినాడ తీవ్రంగా నష్టపోతున్నాం సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగికి ప్రాథమిక హక్కులైన పెన్షన్, సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్ విధానం వల్ల రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. – గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీసీపీఎస్ఈ అసోసియేషన్, అంతర్వేది, సఖినేటిపల్లి మండలం -
టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు
● స్వామివారిని దర్శించిన పది వేల మంది భక్తులు ● రూ.15 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించి పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, ఆదివారం సుమారు పది వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. తరువాత రావిచెట్టు వద్ద ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.15 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
ఏలేరులో పెరిగిన నీటినిల్వలు
ఏలేశ్వరం: ఏలేరులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆదివారం ప్రాజెక్టులోకి 1.708 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1.050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 80.74 మీటర్లు, 24.11 టీఎంసీలకు 14.26 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1500, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు. అన్నదానం, గో సంరక్షణకు రూ.2.5 లక్షల విరాళం అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేస్తున్న కర్రి సూర్యనారాయణ (నాని) తన కుమారుడు సత్యగౌరీ ఉదయ్ శర్మకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సత్యదేవుని నిత్యాన్నదాన పధకానికి రూ.లక్ష, గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్‌కు ఆదివారం అందచేశారు. ఏటా ఆషాఢ బహుళ ఏకాదశి నాడు, అన్నదానం, గోపూజ చేయాలని కోరారు. ఆకట్టుకున్న పురాతన నాణేలు కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్ వద్ద బోట్‌క్లబ్ ఉద్యానవరంలో గ్రంథాలయం వద్ద వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో వద్దిపర్తి రాజేశ్వరరావు పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను ఆదివారం ప్రదర్శించారు. దేశంలో 18, 19 శతాబ్దాల నాటి వెండి నాణేలు, దమ్మిడీలు, చిల్లు కాసులు, రాగి నాణేలు, అర్ధణాలు, అణాలు, బేడలు, పావలా నాణేలతో పాటు 72 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాణేలు సేకరణ కర్త రాజేశ్వరరావు మాట్లాడుతూ నాణేల సేకరణను అలవాటుగా మార్చికున్నట్టు తెలిపారు. దేశంలో వినియోగించి ప్రస్తుతం వినియోగంలో లేని నాణేల పట్ల నేటి యువతకు అవగాహన కల్పించడం తన ముఖ్య ఉద్దేశమన్నారు. ఎఫ్‌సీఐ మాజీ జీఎం ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్ ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలన్నారు. -
వేదాలతో లోకం సుభిక్షం
అమలాపురం రూరల్: ఇందుపల్లి అరవగరువు గణపతి మందిరంలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ వార్షిక వేదశాస్త్ర మహాసభ జరిగింది. కోనసీమ వ్యాప్తంగా వేద పండితులు పాల్గొని వేదలను ఘోషించారు. వారు మాట్లాడుతూ వేదాలతో లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ వేదాలకు పుట్టినిల్లు కోనసీమ అని అన్నారు. ఇందుపల్లిలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ ఆధ్యర్యంలో ఏటా వార్షిక వేదశాస్త్ర మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి, వడ్లమని సుబ్రహ్మణ్య ఘనపాఠి, దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు తదితరులు వేదాల గొప్పదనం గురించి వివరించారు. బాలభక్త గణపతి సేవా సంఘ అధ్యక్షుడు తాతకాశీ విశ్వనాథ్ స్వాగత ఉపన్యాసం చేశారు. వేద పండితులను పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు కర్ర సోమసుందరం (దత్తు), ముష్టి వెంకట రాజేశ్వరశర్మ సత్కరించారు. -
విలక్షణానికి ప్రతీకలు మువ్వురు తల్లులు
● శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ ● సదనంలో సరస్వతీ సపర్యా మహోత్సవాలు సీటీఆర్ఐ: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు మూడు రకాల స్వభావాలకు ప్రతీకలుగా నిలుస్తారని శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ అన్నారు. ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో జరుగుతున్న సరస్వతీ సపర్యా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు అయిన కౌసల్య, సుమిత్ర, కై కేయిలపై ప్రసంగించారు. వారి విలక్షణ స్వభావాలను వివరిస్తూ విశ్వనాథ అనేక విశేషణాలను వాడారని అన్నారు. కై కకు రాముడిపై అపరిమిత వాత్సల్యం ఉండేదని, రాముడికి బాల్యంలో విలువిద్య నేర్పింది కై కయేనన్నారు. తదనంతర కాలంలో రాముడి వనవాసాన్ని కోరిన కారణంగా పైకి మంథర దుర్బోధగా కనపడినా, అసలు కారణం దైవ ప్రేరణగా భావించాలని వివరించారు. నన్ను సవతి తల్లిని చేశావు.. అని రామునితో కైక అన్న మాటల్లో ఆమె క్రోధం కన్నా, బాధ ఎక్కువగా ధ్వనిస్తుందని విశదీకరించారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వలక్ష్య సంగ్రహం, వ్యాకరణ, ఛంద ప్రయోగాల్లో ఆయన వివిధ రకాల ప్రయోగాలను చేశారన్నారు. నా భక్తి రచనలు నావిగాన.. అని చెప్పుకొన్న ధీశాలి విశ్వనాథ అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.అన్నపూర్ణ మాట్లాడుతూ, ప్రాచీన కవుల మూల గ్రంథాలను అనువదించేటప్పుడు తర్వాత తరం కవులు స్వతంత్ర ధోరణులు అవలంబించడం, మూలంలోని అంశాలను విస్తరించడం, పరిహరించడం పరిపాటి అన్నారు. కళాశాల అధ్యాపకులు సత్యశిరీష, శ్రీదేవి, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ బులుసు అపర్ణను ఘనంగా సత్కరించారు. సోమవారం అవధాన శేఖర రాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రబంధ కవుల సరస్వతీసపర్య అనే అంశంపై ప్రసంగిస్తారు. -
ఆగని జలగాటం..
● లంకల్లోకి మళ్లీ నీళ్లు ● నీట మునిగిన కాజ్‌వేలు, పంటలు ● పడవలపైనే రాకపోకలు సాక్షి, అమలాపురం: గోదావరి వరద వదలనంటోంది.. జిల్లాలో లంక ప్రాంతాలను మళ్లీ ముంచెత్తుతోంది.. కాస్త తగ్గిందనుకునే లోపే తిరిగి ఉధృతంగా మారుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, లంక గ్రామాల్లో ఇప్పటికే కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాల రోడ్లపైకి ముంపునీరు చేరింది. దీంతో లంక వాసులు ప్రత్యామ్నాయ విధానాల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సోమవారానికి ముంపు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ప్రభావం పెరుగుతుండడంతో దిగువకు జలాల విడుదల ఆదివారం మరింత పెరిగింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు. ఉదయం ఆరు గంటలకు 10,81,115 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, తొమ్మిది గంటలకు 10,94,575 క్యూసెక్కులు, మధ్యాహ్నం 12 గంటలకు 11,16,464 క్యూసెక్కులు, మూడు గంటలకు 11,24,472 క్యూసెక్కులు, సాయంత్రం ఆరు గంటలకు 11,35,249 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి వరద నిలకడగా ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో దిగువన కూడా వరద తగ్గుతోంది. ఎగువన తగ్గుతున్నా దిగువన లంకల్లో మాత్రం వరద ముంపు పెరుగుతోంది. జిల్లాలో పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సోమవారం నుంచి వరద ప్రభావం పెరగనుంది. ఎక్కడెక్కడ ఎలా అంటే.. ● మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే నీట మునిగింది. దీనిపై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాజ్వే మీదుగా రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. లంక వాసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ● పి.గన్నవరంలో వరద ఉధృతి మరింత పెరిగింది. తాజాగా మానేపల్లి నుంచి శివాయలంకకు వెళ్లే రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నీట మునిగింది. తాము రాకపోకలు సాగించేందుకు వీలుగా ట్రాక్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనకాయలంక కాజ్వే మరింత ముంపు బారిన పడింది. ● అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద ఎదురుబిడెం కాజ్వే నీట మునిగింది. దీంతో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక వాసులు పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పాడి రైతులు, విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని లంక పొలాల్లోకి వరద నీరు చేరింది. ● ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్తో పాటు, రాఘవేంద్ర వారధి, ఎదుర్లంక వారధి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎదుర్లంక, జి.మూలపొలం, గుత్తెనదీవిల వద్ద ఏటిగట్టు దిగువన ఉన్న లంకల్లోకి వరద చొచ్చుకు వస్తోంది. దిగువన లంకల్లో నీరు ప్రవహిస్తోంది. ● ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనాలంకల్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. గురజాపులంకకు వెళ్లే రహదారి నీట మునగనుంది. కాట్రేనికో న మండలం పల్లంకుర్రు రేవు, భైరవపాలెం లంకల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వస్తోంది. నేడు పాఠశాలలకు సెలవు పి.గన్నవరం: వరదల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు ఎంఈఓ కోన హెలీనా తెలిపారు. అలాగే పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాలతో పాటు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వస్తున్న 327 మంది విద్యార్థులకు కూడా సెలవు ఇచ్చారన్నారు. లంక గ్రామాల నుంచి విద్యార్థులను నదీ పాయలు దాటి బయటకు పంపవద్దని, ఆయా రేవులను పర్యవేక్షిస్తున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు హెలీనా తెలిపారు.మూడోసారి వచ్చి.. ముంచి గోదావరికి గడిచిన రెండు నెలల్లో మూడో సారి వరద వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని పంట చేలు, తోటలు ముంపు బారిన పడుతున్నాయి. దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి, కోకో, పోక వంటి పంటలకు నష్టం లేకున్నా అరటి, బొప్పాయి, కంద, పసుపుతో పాటు కూరగాయ పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. జూలైలో ఒకసారి, ఆగస్టులో రెండుసార్లు వరద వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, బొప్పాయి, కూరగాయ పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని అంచనా. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత వరకూ ప్రభుత్వం నుంచి పరిహారంపై ప్రకటన విడుదల కాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రిప్‌పాటు ప్రమాదం!
రిప్ కరెంటు అలలు (ఫైల్)పిఠాపురం: గణపతి నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక నిమజ్జనాలే తరవాయి. ఈ నేపథ్యంలో ఉప్పాడ సాగరతీరం నిమజ్జనాలతో హోరెత్తనుంది. గతంలో సంభవించిన ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. చీలిక ప్రవాహాలతో విద్యుదావేశం సాగరతీరంలో కనిపించని, కడలి మాటున వేటు వేసే రాకాసి అలులు రిప్ కరెంట్ (చీలిక ప్రవాహాలు) ఎందరో ప్రాణాలను కాటేస్తున్నాయి. అలల మాటున పొంచి ఉండి ఒక్క సారిగా దాడి చేసి పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెప్ప పాటులో సముద్రంలోకి లాగేస్తుంటాయి. ఆగస్టు అక్టోబర్ నెలల మధ్య ఈ రిప్ కరెంట్ వెలువడే అలులు ఎక్కువగా తూర్పు తీరంలో సంభవిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఎక్కువ మంది వీటి వల్ల మృత్యువాత పడినట్లు గుర్తించారు. ఉప్పాడ తీరంలో గతంలో సంభవించిన పెను ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన రిప్ కరెంట్‌తో వచ్చే దుర్ఘటనలను గుర్తుచేస్తోంది. రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకై న ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్క సారిగా లోతైన ప్రదేశంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో ఏర్పడిన గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి. తీరానికి వచ్చే సరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్క సారిగా తీరాన్ని తాకినప్పుడు సము ద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహంగా ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రవాహంలో ఎవరు ఉన్నా వారు కనురెప్ప కాలంలో కడలిలో కలిసిపోతారు. ఎంత గజ ఈతగాడైనా దీని నుంచి తప్పించుకోలేరు. తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి. తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్ కరెంట్ అంటారు. కరెంట్ షాక్ తగిలితే ఎంత తొందరగా ప్రాణాలు పోతాయో దానికంటే ఎక్కువగా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది అందుకే దీనిని రిప్ కరెంట్ అంటారు. ఎక్కువగా రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎక్కు ప్రాంతాల్లో ఉప్పుటేరులు, కాలువలు కలిసే చోట్లు ఎన్నో ఉన్నాయి. వాటి దగ్గర ఇవి అనుకోకుండా ఏర్పడుతుంటాయి. రిప్ కరెంట్ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఇది గజ ఈతగాళ్లను, టన్నుల బరువు ఉండే వాటిని లోపలకు లాగేసేంత బలమైనవి. ఇప్పటి వరకు రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో సుమారు 370 మంది వరకు ఈ ప్రమాదానికి గురై మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రిప్ కరెంట్‌ను కనుగొనడానికి ఆంధ్రా యూనివర్సిటీ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తోంది. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్ కరెంట్ ఎక్కడ ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆదమరపు వద్దు గతంలో ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యే ప్రాంతమే. ఎందుకంటే అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అక్కడ కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి, అటు నుంచి ఒకే సారి కెరటాలు వచ్చి పరస్పరం ఢీ కొనడం వల్ల రిప్ కరెంట్ (స్క్వేర్ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక నిమజ్జనానికి దిగిన వారు విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, దానికి తోడు సముద్ర అలలు ఒక్క సారిగా పెరగడంతో రెండూ కలిసి రిప్ కరెంట్‌గా మారి ప్రాణాలను తీసేసే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అక్కడ నిమజ్జనాలను అనుమతి లేదని పోలీసులు ప్రకటిస్తున్నారు. జిల్లాలో నిమజ్జన ప్రాంతాలివే జిల్లాలో కాకినాడ బీచ్, ఉప్పాడ సాగరతీరం, పీబీసీ, ఏలేరు, సామర్లకోట, గోదావరి కాలువల్లో నిమజ్జనాలు నిర్వహిస్తుంటారు. ఎక్కువగా కాకినాడ బీచ్, ఉప్పాడ సాగరతీరంలో వందల విగ్రహాలు నిమజ్జనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 7వ తేదీన చంద్ర గ్రహణం ఉండడంతో తొమ్మిది రోజులు పూర్తి కాగానే అన్ని విగ్రహాల నిమజ్జనాలు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో వందల విగ్రహాలు ఒకే సారి తరలించే అవకాశం ఉండడంతో పోలీసులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్ కడలి కెరటాల్లో పొంచి ఉన్న కరెంట్ అలలతో ఆటలాడితే ప్రాణాపాయమే వినాయక నిమజ్జనాల వేళ అప్రమత్తం గతంలో ముగ్గురు యువకుల మృతి ఏలేరు, పీబీసీ కాలువల్లోనూ ప్రమాదాలు ఈ ఏడాది ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్న అధికారులు గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో నిమజ్జనాలకు అనుమతి నిరాకరణ ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి అనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం అని గుర్తించాం. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. అక్కడ ఈ ఏడాది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఉప్పుటేరులు సముద్రంలో కలిసే చోట అలలు తక్కువగా ఉన్నా క్షణాల్లో ప్రమాదకరంగా మారుతుంటాయి. అందుకే కాకినాడ శివారు లైట్‌హౌస్ నుంచి కొత్తపల్లి మండలం కోనపాపపేట వరకు ఉన్న ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. మూలపేట, సుబ్బంపేటల్లో నిమజ్జనానికి ప్రాంతాలను సిద్ధం చేసాం అక్కడే నిమజ్జనాలు చేయాలి. – జి శ్రీనివాస్, సీఐ, పిఠాపురం -
ఎరుకల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంగడాల పిఠాపురం: ఎరుకల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ కోరారు. కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ విమోచన దినోత్సవాన్ని పిఠాపురంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు అనుభవిస్తున్న వివిధ సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఎరుకల జాతి వారు బాగా వెనకబడిన తెగల్లో ఉన్నారని, వాళ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం కార్యదర్శి భారతి మాచరయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాడ దుర్గ, జిల్లా ట్రెజరర్ అమలదాసు వెంకట లచ్చన్న, ముఖ్య సలహాదారు సింగం రవి, గౌరవ అధ్యక్షుడు భారతి నాగేశ్వరావు, కాకినాడ జిల్లా మీడియా కన్వీనర్ గాడా సత్తిబాబు, పిఠాపురం మండల అధ్యక్షులు అమలదాసు నాగేశ్వరావు, భారతి గంగరాజు, అమలదాసు సత్యనారాయణ, భారతి మంగతాయారు, అమలదాసు దుర్గ, భారతి దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
శృంగార వల్లభుని ఆదాయం రూ.2.36 లక్షలు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అర్చకుడు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామికి రూ.2,36,023 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 3500 మంది భక్తులకు ప్రసాద వితరణ అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విశ్రాంతి షెడ్డుకు 3న శంకుస్థాపన అన్నవరం: స్వామివారి దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం ముందు గల ఖాళీ ప్రదేశంలో విశ్రాంతి షెడ్ నిర్మాణానికి వచ్చేనెల మూడో తేదీ ఉదయం 10.52 గంటలకు ‘లారెస్’ సంస్థ యాజమాన్యం శంకుస్థాపన చేయనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం తెలిపారు. ఆ స్థలాన్ని దేవస్థానం ఈఈ రామకృష్ణ ఆధ్వర్యంలో చదును చేయించి సిద్ధం చేసినట్లు ఈఓ తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇక్కడ వంద అడుగుల వెడల్పు, 125 అడుగుల పొడవుతో విశ్రాంతి షెడ్డు నిర్మించనుంది. సుమారు రూ.1.5 కోట్లు వ్యయంతో 12,500 చదరపు అడుగుల స్థలంలో టెన్సిల్ షెడ్డు ( తెలుపు ప్లాస్టిక్ క్లాత్ తరహా షెడ్డు) నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గణపతికి 108 వంటకా నివేదన తాళ్లపూడి: వినాయక చవితి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా కొలువుదీరిన గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రక్కిలంక గ్రామంలోని కాపుల వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 108 రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. -
క్రమంగా పెరుగుతూ..
● మళ్లీ గోదావరికి వరద నీరు ● నీట మునిగిన కనకాయలంక కాజ్వే ఐ.పోలవరం/ పి.గన్నవరం: వరద మళ్లీ పెరుగుతోంది.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున దిగువకు వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం పెరిగిన వరద తరువాత సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. తిరిగి శనివారం ఉదయం నుంచి పెరుగుతూ వస్తోంది. తెల్లవారు జామున మూడు గంటల నుంచి వరద క్రమేపీ పెరుగుతోంది. మూడు గంటలకు బ్యారేజీ నుంచి దిగువకు 7,52,579 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇది ఉదయం ఆరు గంటల సమయానికి 7,93,608 క్యూసెక్కులకు, మధ్యాహ్నం 12 గంటలకు 8,60,262 క్యూసెక్కులకు, మూడు గంటలకు 8,98,113 క్యూసెక్కులకు, రాత్రి ఎనిమిది గంటలకు 9,75,286 క్యూసెక్కులకు చేరింది. పడవలపైనే ప్రయాణం జిల్లాలోని లంక గ్రామాలపై వరద ప్రభావం పడింది. పి.గన్నవరం మండల పరిధిలో జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేటలకు ఇప్పటికీ పడవలపై రాకపోకలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వరద పెరగడంతో మండలాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక కాజ్వే నీట మునిగింది. దీంతో ఇక్కడ పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అలాగే పెదమల్లంక, సిర్రావారిలంక, ఆనగారిలంకలకు సైతం పడవలపై వెళ్తున్నారు. మరోసారి వరద పెరగడంతో ఇక్కడ లంక రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ఇక్కట్లు మొదలయ్యాయి. లోతట్టు ప్రాంతాలను తాకుతూ.. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్‌ను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ మండలంలో మురమళ్ల, కేశనకుర్రు పంచాయతీ పరిధిలోని పొగాకులంక, పల్లిపాలెం, ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేల్లంక, గురజాపులంక, కూనాలంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం వంటి లోతట్టు ప్రాంతాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే ఈ లంక గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశముంది.ప్రయాణం.. ప్రమాదం వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో జిల్లాలోని పలు రేవుల వద్ద లైఫ్ జాకెట్లు లేకుండా పడవలపై ప్రయాణాలు సాగిస్తుండడం గమనార్హం. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం రేవులో ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఉపయోగించకుండా ప్రయాణికులను రేవు దాటిస్తున్నారు. వరదల సమయంలో రేవు ప్రయాణాలపై అధికారులు నిఘా పెట్టాల్సి ఉన్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రమాదం జరిగితేకాని అధికారులు స్పందించరా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. -
గోదావరి ఉరకలు
● ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురస్తున్న వర్షాలతో గోదావరి ఉప నదులైన మంజీర, ఇంద్రావతి, శబరి పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. ఆ ప్రభావంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం క్రమేపీ పెరిగింది. ఉదయం 10.30 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రి 8.35 గంటలకు 11.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఆదివారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో గోదావరిలో పడవల రాకపోకలను నిషేదించారు. శనివారం రాత్రి 9 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.80 అడుగులకు చేరింది. 10,01,410 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 11,700 క్యూసెక్కులు విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.56, పేరూరులో 16.76, దుమ్ముగూడెంలో 12.90, కూనవరంలో 18.97, కుంటలో 10.20, పోలవరంలో 12.22, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.85 మీటర్లు, భద్రాచలంలో 47.70 అడుగుల నీటి మట్టాలు కొనసాగుతన్నాయి. -
భజే విఘ్నేశ్వరా..
అయినవిల్లి: గణపతి నవరాత్రుల్లో భాగంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి శనివారం లక్ష దూర్వార్చన పూజ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపారు. స్వామివారికి పంచ హారతులు ఇచ్చారు. స్వామివారిని మూషిక వాహనంపై ఉంచి వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం గ్రామోత్సవం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని పర్యవేక్షించారు. -
జ్వరాలు వైరల్!
● ప్రతి ఇంటా జ్వర బాధితులే ● దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో సతమతం ● వస్తే తగ్గడానికి వారం రోజుల సమయం ● ప్రతి ఒక్కరికీ రూ.6 వేలకు పైగా ఖర్చు ● ప్లేట్లెట్లు పడిపోతే రూ.50వేల నుంచి రూ.70 వేల వ్యయం ● జ్వరాలకు వర్తించని ఆరోగ్యశ్రీ ● అప్పులు చేసి బిల్లులు కడుతున్న రోగులు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క జ్వరాల సీజన్ కాగా మరో పక్క దోమల దండయాత్రతో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. దీంతో ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు పోరాడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అరకొర నివారణ చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అనేక ప్రాంతాల్లో దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పారిశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడంతో దోమల కార్ఖానాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువైపోయాయి. జిల్లాలో 22 లక్షల జనాభా ఉండగా, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 62 ఆరోగ్య సచివాలయాలు, 40 సామూహిక ఆరోగ్య కేంద్రాలు, 23 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వంద మంది వైద్యులు, 1049 మంది పారా మెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. దోమల నియంత్రణకు అధికారులు అరకొరగానే చర్యలు చేపడుతున్నారు. ఒకపక్క వర్షాలు కురిస్తే ఇంటి ఆవరణలోనే పూల కుండీలు, నీటి ట్యాంకులు ఇంటిపై ఉన్న ఖాళీ స్థలాలలో నీరు ఎక్కువగా నిలబడి దోమలు విజృంభిస్తున్నాయి. వీధులు, కాలనీలు, శివారు ప్రాంతాలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువుగా ఉంటోంది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం చాలా అధ్వానంగా తయారైంది. దీంతో జ్వరాల బాధితులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో సరిపడినన్ని నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కాలువలు కూడా శుభ్రం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. బ్లీచింగ్ ముగ్గు, ఫినాయిల్ వంటి పిచికారీ చేయాలంటే డబ్బులు అవసరం కాగా పంచాయతీల ఖజానాలు దాదాపు ఖాళీ అయిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రావలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించి రోజురోజుకూ దోమలు పెరిగిపోవడం వల్ల ప్రజలు రోగాలను బారిన పడుతున్నారు. కాకినాడ జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు ప్రతి నిత్యం 30 నుంచి 40 మంది జ్వరం బాధితులు వస్తున్నారు. కరప మండలంలోని కరప, వేళంగి పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిత్యం 60 నుంచి 70 మంది జ్వరం, తదితర వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. పిఠాపురం మండలం చేబ్రోలు పీహెచ్సీలో ప్రతిరోజు 70 నుంచి 100 మందికి పైగా జ్వరం బారిన పడినవారు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. పెద్దాపురం మండలం పులిమేరు, కాండ్రకోట ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో 70 నుంచి 80 మంది ప్రతి రోజు జ్వరం బాధితులు వైద్యానికి వస్తున్నారు. ఇక కాకినాడ జీజీహెచ్‌కు నిత్యం 500 మందికి తక్కువ కాకుండా జ్వరం బాధితులు వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే రూ.5 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. రక్త పరీక్షలు, సైలెన్ పెట్టి రూ.6 వేలకు తక్కువ కాకుండా బిల్లు చేతిలో పెడుతున్నారు. దీంతో రోగులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రోగికి కానీ డెంగీ, మలేరియా వచ్చి ప్లేట్లెట్లు గానీ పడిపోతే రూ.50 వేల నుంచి రూ.60 వేలు గుంజేస్తున్నారు. ఈ బిల్లులు చెల్లించలేక సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు వారు అప్పుల పాలవుతున్నారు. డబ్బులు కడితేనే వైద్యం జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్లినా తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే అక్కడ ప్లేట్లెట్లు పడిపోయాయని రోగులను భయపెట్టి మరీ డబ్బులు గుంజేస్తున్నారు. పోనీ దీనికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చేయాలన్నా ఆయా ప్రైవేట్ ఆసుపత్రులలోని సిబ్బంది ఆరోగ్యశ్రీ దీనికి వర్తించదని డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. రోగులు అప్పులు చేసి మరీ ఆసుపత్రులు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. అరకొరగానే అవగాహన కార్యక్రమాలు జ్వరాల సీజన్ వచ్చినా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో రోగులు భయపడి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి దోమల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటివేవీ సక్రమంగా జరగడం లేదు. పట్టణ గ్రామీణ ప్రజలు ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకపక్క మలేరియా మరో పక్క డెంగీ కేసులు నిత్యం నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ రావడంతో రూ.70 వేల బిల్లు కట్టా నాకు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో పిఠాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాను. వారు రూ.80 వేల బిల్లు వేశారు. అంత కట్టలేనని చెప్పడంతో రూ.10 వేలు తగ్గించారు. విధిలేక ఆ మొత్తాన్ని చెల్లించి బయటకు రావాల్సి వచ్చింది. ఐదు రోజులు ఆసుపత్రిలో ఉన్నదానికి ఇంత పెద్ద మొత్తం డబ్బులు చెల్లించాలంటే చాలా ఇబ్బంది పడ్డాను. – మేడిశెట్టి దొరబాబు, కొండెవరం, యుకొత్తపల్లి మండలం. -
తిరుచ్చి వాహనంపై ఊరేగింపు
అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని శనివారం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్టించి పూజల అనంతరం అర్చకులు ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితుల మంత్రాల నడుమ మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు. ఆలయ అర్చకుడు కంచిభట్ల రామ్‌కుమార్, వేదపండితులు వేదుల సూర్యనారాయణ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, సంతోష్ పాల్గొన్నారు. స్వామిని దర్శించిన 25 వేల మంది భక్తులు శనివారం సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు. నేడు టేకు రథంపై ఊరేగింపు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయప్రాకారంలో ఊరేగించనున్నారు. రూ.2,500 టిక్కెట్‌తో ఈ సేవలో పాల్గొనే నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, స్వామివారి కండువా, జాకెట్టుముక్క, ప్రసాదం అందజేస్తారు. సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు -
ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో విజేతలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోటీల్లో స్ట్రాంగ్ మెన్ విన్నర్‌గా కె.దుర్గా శివకుమార్ (కాకినాడ), రన్నర్‌గా కె.మోహన్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమెన్ విన్నర్‌గా డి.అఖిలదేవి (రామచంద్రపురం), రన్నర్‌గా వై.ఇందిర (అమలాపురం), స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్‌గా డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్‌గా బి.అప్పన్న (అమలాపురం) టైటిల్స్‌ను గెలుచుకున్నారు. అలాగే వుమెన్ విభాగంలో 66 కేజీల కేటగిరీలో ఎస్.స్పందన (రాజోలు), 74 కేజీల కేటగిరీలో పి.దీవెన (కాకినాడ), 83 కేజీలో కేటగిరీలో డి.అఖిలదేవి (రామచంద్రపురం), బాలుర సబ్ జూనియర్ విభాగంలో 53 కేజీల కేటగిరీలో పి.వీరేంద్ర (కాకినాడ), 59 కేజీల కేటగిరీలో జె.జితేంద్రదొర (అమలాపురం), 66 కేజీల కేటగిరీలో కె.సాయి మణికంఠ (కాకినాడ), 74 కేజీల కేటగిరీలో ఎంఎస్ విన్ (జగ్గంపేట), మెన్ విభాగంలో 59 కేజీల కేటగిరీలో వై.రాజు (రాజమహేంద్రవరం), 66 కేజీల కేటగిరీలో ఎం.రాహుల్ బాబు (అమలాపురం), 74 కేజీల కేటగిరీలో కె.దుర్గా సాయికుమార్ (కాకినాడ), 83 కేజీల కేటగిరీలో కె.మోహన్ (కాకినాడ), 93 కేజీల కేటగిరీలో కె.సుధీర్ (మలికిపురం), 105 కేజీల కేటగిరీలో బి.అనూష్బాబు (మురమళ్ల), మాస్టర్స్ విభాగంలో 83 కేజీల కేటగిరీలో డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), 93 కేజీల కేటగిరీలో బి.అప్పన్న (అమలాపురం) ప్రథమ స్థానాలు సాధించారు. విజేతలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, నగభేరి కృష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు దాదాపు 200 మంది పవర్ లిఫ్టర్లు పాల్గొని బరువులెత్తి సత్తా చాటారు. -
బరువులెత్తారు...పతకాలు పట్టారు
● అమలాపురంలో ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ● 200 మంది క్రీడాకారుల హాజరు అమలాపురం టౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో 4వ యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 200 మంది పవర్ లిఫ్టర్లు హాజరై బరువులెత్తి సత్తా చాటారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీఎస్ సురేష్‌కుమార్‌ను సత్కరించి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. సబ్ జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) విభాగాల్లో 30 కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ఒలింపిక్ పతకాలు, చాంపియన్ షిప్ ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. బెంచ్ ప్రెస్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌కు అనుబంధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు ఉత్కంఠగా జరిగాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డి.సత్యనారాయణ, ఎంవీ సముద్రం, వి.నరేష్, డీఆర్కే నాగేశ్వరరావు, డి.గణేష్‌బాబు, బి.జోసఫ్, ఎస్కే వలీ సాహెబ్ వ్యవహరించారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కల్వకొలను బాబు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు పాల్గొన్నారు. -
బాగానే బొక్కుతున్నారు!
తాళ్లరేవు: సముద్ర సంరక్షణిగా పేరుగాంచిన అతిపెద్ద చేప బొక్కు సొర (రింకోడాన్ టైపస్) క్రమక్రమంగా కనుమరుగవుతోంది. సుమారు 65 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చేప అత్యంత శక్తివంతమైన సాధుజీవి. సముద్ర తీరం వెంబడి అభివృద్ధి చెందుతున్న ఏడు సెక్టార్ల కారణంగా ఈ గంభీరమైన చేప అంతరించిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. దీని పరిరక్షణకు భారత ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో విస్తరించి ఉన్న ఈ చేపను కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమైన నేపథ్యంలో ఏటా ఆగస్టు 30వ తేదీన బొక్కుసొర దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందమైన చర్మం కలిగిన ఈ చేప సుమారు 13 మీటర్లు (42 అడుగులు) పొడవు ఉండి, 20 నుంచి 25 మెట్రిక్ టన్నులకుపైగా బరువు పెరుగుతోంది. సముద్రంలో హానికర జలాలను తీసుకుని శుభ్రం చేయడంతో పాటు ఆరోగ్యకర వాతావరణాన్ని కలుగజేస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకమైన మొప్పల ద్వారా నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలను, జీవులను వడకట్టి తింటాయి. సముద్రంలో 1500 మీటర్ల లోతుకు వెళ్లగలిగే ఈ చేప సుమారు వెయ్యి కిలోమీటర్ల నుంచి 13 వేల కిలోమీటర్ల వరకు వలస వెళ్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కోస్తాతీర ప్రాంతం ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండడంతో మన ప్రాంతానికి ఈ చేపలు వస్తుంటాయి. ఒక చేప 300 పిల్లలకు జన్మనిస్తుందని, వందకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుందని అంచనా. ఈ చేపల వల్ల మానవాళికి ఎటువంటి హాని ఉండకపోవడం విశేషం. బొక్కుసొర వాటి రెక్కలు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైనవి కావడంతో వీటి వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. మత్స్యకారులకు సరైన అవగాహన లేక వీటిని పట్టుకోవడం వల్ల వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతోంది. అంతే కాకుండా తీరం వెంబడి విస్తరిస్తున్న ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, టూరిజం, పోర్ట్ అండ్ షిప్పింగ్, ఉప్పు మడులు, ఫెర్టిలైజర్స్, ఆక్వా కల్చర్, మత్స్య పరిశ్రమల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో 1978లో వైల్డ్ లైఫ్ సాంక్చురీలను ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.సంరక్షణకు చర్యలు చేపడుతున్నాంసముద్ర జలాలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే బొక్కు సొరల సంరక్షణకు అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధానంగా ప్రపంచ బొక్కు సొర దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు బోటు యజమానులకు విద్యార్థిని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ ఎస్ఐఎఫ్టి (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ)లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అలాగే వారోత్సవాలు నిర్వహించి మత్స్యకార గ్రామాలతో పాటు ప్రధాన మార్కెట్ల వద్ద జాలర్లకు ప్రజలకు ఈ చేపపై అవగాహన కల్పించాం. ఈ చేప పట్ల మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వాటిని వేటాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ చేపలు వలలో పడినట్లయితే వలలను ధ్వంసం చేసి సముద్రంలో వదిలి పెట్టేలా అవగాహన కల్పిస్తున్నాం. ధ్వంసమైన వలలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపకరించే బొక్కు సొరలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.– ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజర్,కోరింగ అభయారణ్యంవాటిని వేటాడితే ఏడేళ్ల జైలుబొక్కుసొర సంరక్షణలో భాగంగా భారీ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారతదేశంలో బొక్కుసొర చేపలను పెద్ద పులలతో సమానంగా రక్షిస్తున్నారు. అక్రమంగా బొక్కుసొరను చంపినా, వాటి శరీర భాగాలను వ్యాపారం చేసినా 1972 వన్య సంరక్షణ చట్టం కింద ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.చేపను కాపాడుదాం ఇలా...సముద్రంలో ఉన్న ఈ గంభీరమైన చేపను సంరక్షించేందుకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం పలు సూచనలు చేస్తోంది. చేపల వేటకు వెళ్లినపుడు మత్స్యకారులు సాధు స్వభావం గల బొక్కుసొరను పట్టడం లేదా వాటికి హానికలిగించడం చేయరాదని అవగాహన కలిగిస్తున్నారు. తూర్పుతీరం వెంబడి బొక్కుసొర తరచుగా వచ్చే ప్రదేశాలను మత్స్యకారులు, రక్షణాధికారులు అటవీశాఖ వారికి తెలియజేసి సంరక్షించాలని కోరుతున్నారు.గ్రామాల్లో అవగాహన సదస్సులుపర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి ఎంతగానో సహకరించే అతిపెద్ద చేప మనుగడ కోసం అటవీశాఖ అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. ప్రధానంగా మత్స్యకార గ్రామాలతో పాటు, జాలర్లు అధికంగా ఉండే ప్రాంతాలు, మార్కెట్ల వద్ద ప్రజలకు అటవీ సిబ్బంది చేప నమూనాలతో పాటు పోస్టర్లతో అవగాహన కల్పిస్తున్నారు. -
రత్నగిరికి మూడు హెచ్వీఎల్ఎస్ ఫ్యాన్ల సమర్పణ
అన్నవరం: రత్నగిరి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.ఆరు లక్షల విలువైన మూడు హెచ్వీఎల్ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను శుక్రవారం అందచేశారు. వీటిలో రెండింటిని స్వామివారి వార్షిక కల్యాణమండపంలో అమర్చారు. మరో ఫ్యాన్‌ను షాపింగ్ కాంప్లెక్స్ ముందు గల మండపంలో ఏర్పాటు చేయనున్నారు. ఏడు మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తుంటారు. ఈ ఫ్యాన్ గాలి సుమారు 20 అడుగుల వరకు వ్యాపిస్తుంది. -
పాఠశాలలో మత ప్రచారంపై ఆందోళన
● పాఠశాల పైఅంతస్తులో చర్చిని తొలగించాలని డిమాండ్ ● పోలీసుల హామీతో ఆందోళన విరమణ కపిలేశ్వరపురం: మండలంలోని కోరుమిల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ గోదావరి గట్టు వంతెన నుంచి గ్రామ వీధుల మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ పరిస్థితిని సమీక్షించారు. సమస్య మూలాలపైనా, గ్రామంలోని శాంతి భద్రతలపైనా ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజులతో చర్చించారు. ఆందోళనకు కాకినాడకు చెందిన హైందవ పరిరక్షణ సమితి నాయకులు మద్దతు పలికారు. సమితి నాయకులు సీహెచ్ గవరయ్య, కె.తులసి మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానాన్ని పంచాల్సిన పాఠశాలలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాఠశాలపై అంతస్తులో చర్చి నిర్వహించడంపై పంచాయతీ, విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పాఠశాల నుంచి చర్చిని వేరు చేసే చర్యలు ప్రారంభించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ చర్చి నిర్వహణకు ఉన్న పత్రాలతో వారం రోజుల్లో హాజరుకావాలంటూ నోటీసు జారీ చేస్తానని, ఆ లోగా సమాధానం రానిపక్షం ఉన్నతాధికారులకు సమస్యను నివేదిస్తానని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. అంగర ఎస్సై హరీష్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు. -
అంతర్జాతీయ సమావేశాలకు నిర్కా డైరెక్టర్ మాగంటి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ స్వీడన్ స్టాక్‌హోమ్‌లో పొగాకు ఉత్పత్తులపై జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ అంతర్జాతీయ సమావేశాలలో ఐఎస్వో/టీసీ–126లో పాల్గొనే భారత బృందంలో ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పర్యటన ప్రధానం పొగాకు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రామాణీకరణ ప్రక్రియలలో భారతదేశం క్రియాశీల పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగుతోందని ఆయన తెలిపారు. పొగాకులో పరీక్షా పద్ధతులు, భద్రతా ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించి కొత్త అంతర్జాతీయ ప్రమాణాల అభవృద్ధి, సవరణపై ఆయన అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. పొగాకు ఉత్పత్తుల పరీక్షలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి శీల సమీక్షలో పాల్గొని, అభివృద్ధి చెందుతున్న భారత జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కృషి చేయనున్నారు. అదే విధంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రయాణీకరణ సంస్థ సమర్పించే సాంకేతిక నివేదికలు, స్థితిగతుల పత్రాలను సమీక్షించి, భారతదేశం గ్లోబల్ ప్రమాణాల అభివృద్ధిలో మాధవ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్వీడన్‌కు బయలుదేరనున్న ఆయనను నిర్కా శాస్త్రవేత్తల బృందం పుష్పగుచ్ఛంతో అభినందించింది. -
యూరియా కోసం పడిగాపులు
గండేపల్లి: కొంతకాలం నుంచి యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు యూరియా వచ్చిందనే తెలిసిన తక్షణమే రైతులు పరుగులు తీస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో యూరియా దక్కకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మండలంలోని మల్లేపల్లి సొసైటీలో యూరియా ఉందని సమాచారం తెలుసుకున్న రైతులు శుక్రవారం సొసైటీ వద్ద బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసారు. కొందరు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందకపోవడంతో సిబ్బంది ఇచ్చిన ఒక్క బస్తాను తీసుకుపోయారు. మల్లేపల్లి, కె గోపాలపురం గ్రామాల రైతులు ఈ సొసైటీ నుంచే ఎరువులు తీసుకెళతారు. అయితే సొసైటీలో 225 యూరియా బస్తాలు స్టాక్ ఉన్నప్పటికి 113 మంది రైతులకు మాత్రమే సిబ్బంది అందజేశారు. ఆధార్, పాస్‌బుక్ జిరాక్స్ తెచ్చుకున్న రైతులకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తామని సొసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. ఒక దశలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కె గోపాలపురం రైతు కర్రి రామకృష్ణ పొలం జగ్గంపేట మండలంలో మల్లిశాలలో ఉండటంతో శుక్రవారం మల్లేపల్లి సొసైటీకి యూరియా కోసం వచ్చాడు. అయితే అతనికి యూరియా ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పడంతో రైతు వాపోయాడు. మల్లేపల్లి సొసైటీలోనే గతంలోను ఎరువులు తీసుకువెళ్లానని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా పంపిణీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ సిబ్బంది తమకు కావాల్సినవాళ్లకే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సొసైటీలో 225 బస్తాల యూరియా స్టాక్‌ను కేవలం 113 మంది రైతులకు పంచయేడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గోదావరి పరవళ్లు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 10.30 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 7,88,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అనంతరం స్వల్పంగా తగ్గి రాత్రి 10 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ముందుగా ప్రకటించిన విధంగా నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరలేదు. అయితే శుక్రవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతుండటంతో శనివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 6,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.33 మీటర్లు, పేరూరులో 16.65 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.63 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 17.01 మీటర్లు, కుంటలో 9.85 మీటర్లు, పోలవరంలో 11.31 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.40 మీటర్లు నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జీఎన్ఎం సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న కాపీయింగ్ ఆరోపణలపై శుక్రవారం విచారణ జరిగింది. డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి సహా ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో ఆర్ఎంసీ డైనింగ్ ప్రాంగణంలో విచారణ జరిగింది. జీఎన్ఎం సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ చోటు చేసుకుందా, చేసుకుంటే కారణాలేమిటి, అందుకు తగ్గ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారించారు. 29 మంది ఇన్విజిలేటర్లతో పాటు జీఎన్ఎం నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, సంబంధిత సీటు గుమస్తా, సీనియర్ అసిస్టెంట్ ఏసుబాబును విచారించారు. విచారణ అనంతరం నివేదికను డీఎంఈకి పంపారు.పొగాకు నారుమడికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి– బోర్డు అధికారి హేమస్మితదేవరపల్లి: పొగాకు నారుమడులు కట్టే ముందు రైతులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సీహెచ్ హేమస్మిత రైతులకు సూచించారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో కట్టిన పొగాకు నారుమడులను పరిశీలించి, రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ ఏడాది పొగాకు బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు క్షేత్రస్థాయి అధికారి కీర్తికుమార్ ఆధ్వర్యంలో బృందం పనిచేస్తుందన్నారు. నారుమడులను పరిశీలించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారని ఆమె చెప్పారు. బృందం శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని పల్లంట్లలో యలమాటి సుధాకర్ పొగాకు నర్సరీలను తనిఖీ చేసినట్టు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా నారుమడులు కడితే చర్యలు తీసుకొంటామన్నారు. రిజిస్ట్రేషన్ గల నారుమడుల్లోనే రైతులు నారు కొనుగోలు చేయాలని, నారు కొనుగోలు చేసిన నారుమడి రైతు ఇచ్చిన రశీదును నాట్లు వేసే సమయంలో మొక్కఫారంతో పాటు జత చేసి వేలం కేంద్రంలో అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని నారుమడుల నుంచి నారు కొనుగోలు చేస్తే పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలో 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందన్నారు.వేలం కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 96 మంది రైతులు నారుమడులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. వీరంతా నారు వ్యాపారస్తులేనని చెప్పారు. -
కెనరా బ్యాంకు కార్యకలాపాల అడ్డగింపు
– గోల్డ్‌లోన్ బాధితుల ధర్నా తుని రూరల్: తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోల్డ్‌లోన్ బాధితులు తేటగుంట కెనరా బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. శుక్రవారం బాధిత మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో బ్యాంకు గేటు వద్ద షామియానా వేసి ధర్నా నిర్వహించి, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ దశాబ్దంగా బ్యాంకులో ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నామని, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను జనవరి నెలలో విడిపించుకునేందుకు రాగా నగలు మాయమయ్యాయన్నారు. దీనిపై నిలదీస్తే ఆభరణాలు తారుమారయ్యాయని, కొన్ని నగలు గోల్మాల్ అయినట్టు బ్యాంకు అధికారులు పేర్కొన్నట్టు బాధితులు తెలిపారు. ఆ తర్వాత అప్రైజర్ మోసం చేశాడని, మేనేజరుతో సహ మరో ఇద్దరిని ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారన్నారు. రుణగ్రస్తులందరికీ బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇస్తానన్న ఆభరణాలు ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి నెలలో ఆందోళన వ్యక్తం చేయగా నెలరోజుల్లో నగలు లేదా నగదు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అప్పటి నుంచి తిరుగుతున్నా తమ ఆభరణాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగలు ఇవ్వకుండానే గోల్డ్లోన్దారులతో డబ్బు కట్టించుకున్నారు. దీంతో నగలతో పాటు నగదు నష్టపోయామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి బాధితులు బ్యాంకు వద్దే ధర్నా చేయడంతో బ్యాంక్ తలుపులు తెరవలేదు. ఉన్నత అధికారులకు గోల్డ్‌లోన్ బాధితుల ఆందోళన విషయాన్ని తెలియజేసినట్టు సిబ్బంది పేర్కొన్నారు. -
దయనీయ బాల్యంపై వాత్సల్యం
● మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకంతో ఆర్థిక సాయం ● బాలల భవిత, భద్రత, ఆరోగ్యం కోసం ● అనాథలు, దీన బాలలు అర్హులు ● కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ● దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ● అవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోని వైనం కాకినాడ క్రైం: దయనీయ బాల్యంపై వాత్సల్యం కురిసింది. మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం దయనీయ స్థితిలో ఉన్న నిస్సహాయ బాలలకు చేయూతనిస్తోంది. వారిని బాధ్యతగా చూసుకుంటున్నవారికి తన వంతు సాయమందిస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా వందలాది మంది బాలలు ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉన్నా, అవగాహన లేక పథక ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఏంటీ పథకం... మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనుబంధ జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అర్హులైన బాలలకు ఈ పథక ప్రయోజనాలను అందిస్తోంది. బాలల భవిత, భద్రత, ఆరోగ్యంతో పాటు కుటుంబ అనుబంధాలన్నీ ఆఽస్వాదించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. తమ వారికి దూరం చేయకుండా అక్కడే ఉంచి సాయం అందిస్తున్నారు. బాలల పోషణ చూస్తున్న సహాయకులు, సంరక్షకులకు సాయమందిస్తూ బాలల ఉన్నతికి తోడ్పాటునివ్వడమే ఈ పథక ఉద్దేశం. కలెక్టర్ చైర్‌పర్సన్‌గా కమిటీ అర్హులైన బాలల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉంది. ఈ కమిటీని స్పాన్సర్షిప్ అండ్ ఫోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ (ఎస్ఎఫ్సీఏ) అంటారు. కలెక్టర్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, మెంబర్లుగా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) మెంబర్ లేదా చైర్పర్సన్, బాలల సంరక్షణ కోసం పనిచేసే ఎన్జీవో ప్రతినిధి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి(డీసీపీవో), జిల్లా బాలల పరిరక్షణాధికారి(పీవో ఎన్ఐసీ), శిశుగృహ మేనేజర్ మెంబర్లుగా ఉంటారు. అర్హులైన బాలల్ని ఎంపిక చేయడంలో వీరిదే తుది నిర్ణయం. అర్హులెవరు తొలి ప్రాధాన్యత తల్లి, తండ్రిని కోల్పోయిన పూర్తి స్థాయి అనాథలకు ఇస్తారు. కోవిడ్ వేళ తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలు, హెచ్ఐవీ బారిన పడిన బాలలు, తల్లిదండ్రులకు హెచ్ఐవీ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న పిల్లలు, పోక్సో బాధిత బాలలు, పాక్షిక అనాథలు, రక్షణ, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలు స్పాన్సర్ షిప్ పథక ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. కేవలం మైనర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి నెలా రూ.4 వేలు స్పాన్సర్ షిప్ పథకం ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున పిల్లల ఖాతాలు లేదా వారి సంరక్షకులతో ఉమ్మడిగా ఉన్న జాయింట్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని వారి సంరక్షకులు... పిల్లల చదువు, ఆరోగ్యం అవసరాలకు, పిల్లల రోజు వారీ అవసరాల నిర్వహణకు తప్ప మరే రకంగానూ వెచ్చించకూడదు. అంగన్వాడీ వర్కర్లు, గ్రామ మహిళా పోలీసుల ద్వారా ఇటువంటి పిల్లల్ని గుర్తిస్తారు. బాలల వాస్తవ స్థితిని స్వయంగా ఇంటికి వెళ్లి నిర్దారిస్తారు. సంరక్షకులు లేదా తల్లి లేదా తండ్రి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను అంగన్వాడీ సూపర్వైజర్లు సీడీపీవోలకు అందిస్తారు. వీటిని నిర్ధారించి సీడీపీవోలు డీసీపీయూ విభాగానికి పంపిస్తారు. ఈ యావత్ ప్రక్రియ ఐసీడీఎస్ పీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడం అంతా ఆఫ్‌లైన్ విధానంలోనే. కావలసిన ధ్రువీకరణలు బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, గ్రామాల్లో నివసిస్తే ఆదాయం ఏడాదికి రూ.72 వేలకు మించకూడదు. అర్బన్ అయితే రూ.96 వేల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డు, తల్లిదండ్రులు ఇద్దరూ లేదా వారిలో ఒక్కరు మరణించినట్లయితే సంబంధిత మరణ ధ్రువీకరణ పత్రాలు, బాలలు లేదా తల్లిదండ్రులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ రిపోర్టులు, పోక్సో బాధితులు అయితే కేసు పత్రాలు, బాలుడు లేదా సంరక్షకులతో కూడిన జాయింట్ అకౌంట్ వివరాలు, సంరక్షకులు మాత్రమే ఉంటే వారి ఆధార్ కార్డు, వారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.కాకినాడ జిల్లాలో గడచిన మూడేళ్లలో మొత్తం 1,626 మంది బాలలకు మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం ద్వారా ప్రయోజనం అందింది. 2022–23 ఏడాదిలో 683 మంది, 2023–24లో 440 మంది, 2024–25 లో 503 మంది దీన బాలలకు నెలకు రూ.4 వేలు చొప్పున సహకారం అందింది.18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ పథకం జిల్లాలో డీసీపీ యూనిట్ పరిధిలో డీసీపీవో వెంకట్ పర్యవేక్షణలో పీవో ఎన్ఐసీ కె.విజయ ఆధ్వర్యంలో అమలవుతోంది. బాలలు ఏ వయసులో దరఖాస్తు చేసుకున్నా వారికి 18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ ప్రయోజనం అందుతుంది. బాలలు కచ్చితంగా చదువుతుండాలి. హాస్టళ్లలో ఉంటే వర్తించదు. సింగిల్ పేరెంట్, అనాథ బాలలు, వ్యాధిగ్రస్త బాలలు, వ్యాధి ప్రభావిత పిల్లల్ని ఎవరినైనా చేరదీస్తే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు స్థానిక అంగన్వాడీ కార్యకర్తను సంప్రదించాలి. కుటుంబ జీవితానికి పిల్లల్ని దూరం చేయకుండా వారి భవితకు భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. – చెరుకూరి లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్ -
ఆటోవాలా లబోదిబో
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజంతా కష్టపడి ఆటో నడుపుతూ పొట్టపోసుకుంటోన్న వేలాది కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డున పడేశారు. ఆటో నడిస్తేనే జీవన చక్రం తిరిగే కుటుంబాలు నేడు దిక్కులు చూస్తున్నాయి. ప్రయాణికులు రాక, కిరాయిలు లేక రోజు గడవక ఆటోవాలాలు నానా పాట్లు పడుతున్నారు. పూట గడవడమే గగనమైపోతోందని లబోదిబోమంటున్నారు. ఒకప్పుడు ఆడుతూ, పాడుతూ సాగిపోయిన కుటుంబాలు కాస్తా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రీ బస్సు పథకంతో అష్టకష్టాల పాలవుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 25వేల మంది ఆటో కార్మికుల కుటుంబాలకు దిక్కుమొక్కూ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి తమ నోటికాడ కూడు లాగేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్లు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. నిమ్మకు నీరెత్తినట్టుగా... అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ఇప్పుడు కిరాయిలు లేక నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక ఆటో కార్మికులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని గడచిన ఆరేడు నెలలుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి కనీసం కనికరం లేదంటున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పులు వేస్తూ ఈఎంఐ చెల్లించేయగా రూ.1,000 రూ.1,200 ఇంటికి తీసుకువెళ్లే ఆటో కార్మికులకు ఫ్రీ బస్సు వచ్చిన దగ్గర నుంచి రూ.అయిదారు వందలు కూడా చేతికి రావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సుతో జీవనోపాధి కోల్పోతామని తెలిసినా కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆటో యూనియన్లు తప్పుపడుతున్నాయి. ఎన్నికల వేళ కూటమి నేతలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన రోజు నుంచి తమకు జరుగుతోన్న అన్యాయంపై వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోరుబాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోతుందా అనే ఆశతో జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, పెద్దాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం పెద్దాపురం పట్టణంలో ఆటో కార్మికులు దర్గా సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా చంద్రబాబు ఇస్తామన్న రూ.15,000 ఆర్థికసాయం అందించి భభరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కున చేర్చుకున్న జగన్ సర్కార్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టి వారి ఉపాధికి భరోసాగా నిలిచింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10 వేలు వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ ఈ పథకం ద్వారా క్రమం తప్పకుండా సాయం అందించి ఆటో కార్మికులను ఆదుకుంది. వారి కుటుంబాల్లో చిరునవ్వులు చిందించేలా తోడ్పాటు అందించింది. ఏకపక్షంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆటో కార్మికుల ఉపాధికి గండి దిక్కుతోచని స్థితిలో 23 వేల కుటుంబాలు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ ఆందోళన రూ.15 వేల ఊసెత్తని సర్కారు కనీస కనికరం చూపని వైనం ఆ కుటుంబాల జీవనం ఎలా? కాకినాడ జిల్లాలో సుమారు 20 వేల మంది ఆటోలు నడుస్తున్నాయి. తగిన విద్యార్హత ఉన్నా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లేక విద్యావంతులు కూడా ఫైనాన్స్‌పై ఆటోలు తీసుకుని నడుపుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. తగిన స్థోమత లేకపోయినా ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని నెలనెలా ఈంఐలు చెల్లిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంతో ఈంఐలు చెల్లించడమే కష్టమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. జిల్లాలోని కాకినాడ నగరంతో పాటు తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలతో పాటు జగ్గంపేట, గోకవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, కరప, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి, కోటనందూరు తదితర మండల కేంద్రాలల్లో సైతం ఆటోలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ ఫ్రీ బస్సు పథకంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పులు తీర్చలేకపోతున్నాం మహిళలకు ఉచిత బస్సు పథకం మా పొట్టకొడుతోంది. ఈ విషయంలో చాలా ఆందోళనగా ఉన్నాం. ఆటోలు ఎక్కే ప్రయాణికుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ట్రిప్పులు లేక ఆదాయం లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరి ఏదైనా ఆదాయ మార్గాన్ని చూపించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – తుమ్మల గంగాధర్, ఆటో ఓనర్ కం డ్రైవర్ ఒక ట్రిప్పు వేయడమే గగనమైపోతోంది నా పేరు ఆళ్ల గంగాధర్. నేను ఆటో డ్రైవర్ని. తుని–కోటనందూరు మధ్య ఆటో నడుపుతాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసినప్పటి నుంచి ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో రోజూ మూడు ట్రిప్పులు వేసి వెయ్యి రూపాయల వరకూ సంపాదించే వాడిని. ఇప్పుడు రోజూ ఒక ట్రిప్పు వేయడమే కష్టంగా మారింది. రోజూ రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాను. ఆటోకు నెలవారీ ఈంఐలు కట్టడం, కుటుంబం గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. – ఆళ్ల గంగాధర్, ఆటోడ్రైవర్, కోటనందూరు ఆదాయం పడిపోయింది నా పేరు సుబ్రహ్మణ్యం. మాది పెద్దాపురం మండలం తిరుపతి గ్రామం. నేను ఐదేళ్లుగా ఆటో ఆధారంగా బతుకుతున్నాను. నాకు, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను గతం వరకు ప్రతి రోజు పిఠాపురం– దివిలి, సామర్లకోట–దివిలి మధ్య 10 ట్రిప్ లు తిరిగితే రూ.1,500 వచ్చేవి. రూ.500 ఆయిల్‌కి పోగా రూ.1,000 వస్తే నెలకు రూ.10వేలు ఆటో వాయిదా చెల్లించి మిగిలిన డబ్బులతో జీవనం సాగించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టాక కనీసం ఐదు ట్రిప్‌లు కూడా వెయ్యలేని పరిస్థితి. మా బతుకులు అప్పుల పాలై వడ్డీలు చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలి. – సుబ్రహ్మణ్యం, తిరుపతి, పెద్దాపురం -
రైతులు రోడ్డెక్కుతున్నా... ‘కూటమి’కి చీమకుట్టినట్టయినా లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ మంత్రి, వైసస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. గురువారం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పక్షం రోజులుగా ఎరువుల కొరతతో రైతులు నరకం చూస్తున్నారని ఆక్షేపించారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇటువంటి దుస్థితి రైతులు ఎదుర్కోలేదన్నారు. ఎప్పుడూ లేనిది ఎక్కడా చూడనిది ఒక రైతుకు ఒక బస్తా కోటాగా ఇవ్వడం అన్యాయమని, స్థానిక నాయకులు సిఫారసు ఉంటేనే యూరియా ఇచ్చే పరిస్థితి చూస్తున్నామని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి కూటమి సర్కారు కారణమని ఆరోపించారు. ఐదు ఎకరాలు సాగు చేసుకుంటున్నా రైతుకు ముష్టిపడేసినట్లు ఒక బస్తా యూరియా ఇస్తే పంట సాగు ఎలా చేస్తాడని రాజా ప్రశ్నించారు. కూటమి నేతలు ఎరువుల వ్యాపారులతో కుమ్మకై ్క బ్లాక్ మార్కెట్లో ఎరువులు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు ఉండి కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం తదితర నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు గంటల తరబడి ఎండలో ఎదురుచూస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఎరువుల కొరత లేదని నిస్సిగ్గుగా చంద్రబాబు చెబుతున్నారని, అసలు ఈ ప్రభుత్వానికి రైతులపై జాలి, దయ ఉన్నాయా అని రాజా నిలదీశారు. ప్రభుత్వానికి రైతులంటే అంత కక్ష సాధింపు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అయిదేళ్లు రైతే రాజు అనే నినాదంతో రైతు భరోసా పథకం పక్కాగా అమలు చేశారన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రైతులకు సాయం అందించడంలో కూడా నిలువునా మోసం చేశారని రాజా మండిపడ్డారు. -
విద్యుత్ చార్జీల భారాలు రద్దు చేయాలి
● ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి ● వామపక్ష నాయకుల డిమాండ్ బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ చార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడుతామని వామపక్షాల నాయకులు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు. తొలుత 2000 ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామిల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ప్రజలపై భారీగా విద్యుత్ భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించాయన్నారు. ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా 2000 ఆగస్టు 28న హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల్లో అమరులైన వారి స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ చార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, సెకీ ఒప్పందం, టైం ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం ఆపాలన్నారు. సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు సీహెచ్ నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అదానీతో 20 సంవత్సరాల పాటు లక్ష కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొందన్నారు. ప్రజలకు అత్యవసరమైన విద్యుత్ అవసరాన్ని అవకాశంగా తీసుకుని భారాలు వేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోదీ, అదానీ వైపు ఉంటుందా, రాష్ట్ర ప్రజల వైపు ఉంటుందా తేల్చుకోవాలన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సీపీఐఎం లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘ నాయకులు వల్లూరి రాజబాబు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు. -
నేడు జాబ్‌మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్, న్యూలెర్న్ ఎడ్యుటెక్, అపోలో ఫార్మశీ సంస్థలు 133 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఫార్మశీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావవచ్చని, వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించవచ్చన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో ముగ్గురికి చోటు బోట్‌క్లబ్ (కాకినాడి సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు కల్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉయ్యూరి వీర ప్రసాద్ (నాని), ముమ్మిడి శ్రీనివాస్‌ను, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా గుళ్ల ఏడుకొండలును నియమించారు. పారదర్శకంగా ధ్రువపత్రాల పరిశీలన పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ పరిశీలించగా మిగిలిన విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఈ పరిశీలనంతా అభ్యర్థులు ఆన్లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 1,351 మంది సర్టిఫికెట్లు పరిశీలించాల్సి ఉండగా తొలి రోజు గురువారం 1,029 మంది తమ సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో గురువారం రాత్రి 10 గంటలకు 750 పైగా పూర్తయ్యాయి. మిగిలినవి పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారి సర్టిఫికెట్లు శుక్రవారం పరిశీలించనున్నారు. ఆయన వెంట డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు, ఎంఈఓ 2 శివప్రసాద్, మల్లం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు గాజుల మురళి భాస్కర్ గొల్లప్రోలు ఎస్సై నౌడు రామకృష్ణ తదితరులున్నారు. నేడు ఐటీఐ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ అడ్మిషన్ల కన్వీనర్ ఎంవీ వేణుగోపాల్‌వర్మ గురువారం తెలిపారు. అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 8 గంటలకు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ప్రైవేట్ ఐటీఐలకు దరఖాస్తు చేసుకున్నవారు శనివారం హాజరుకావాలని, వివరాలకు 0884–2348182 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
ఎరువు.. కరవు
● ఖరీఫ్ రైతుకు కష్టకాలం ● నిల్వలున్నాయంటున్న అధికారులు ● ఒక రైతుకు ఒకే బస్తా ● ఆయకట్టు అంతా ఇదే దుస్థితి ● కళ్లు తెరవని కూటమి సర్కార్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్ రైతులు పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అసలే మెట్ట ప్రాంతం అఽధికంగా ఉన్న కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో సాగునీరు కోసం రైతులు నరకం చూశారు. అదను దాటిపోతుందనే ఆందోళనలో ఉన్న సమయంలో కనాకష్టం మీద రెండు వారాలు ఆలస్యంగా సాగునీరు అందించారు. నారుమళ్లకు స్వస్తి పలికి వెదజల్లే విధానంతో 70 శాతం ఆయకట్టులో రైతులు గట్టెక్కారు. ఆ సమస్య తీరిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఎరువుల కొరతతో రైతులు కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు. కూటమి సర్కార్‌కు ముందుచూపు కొరవటమే ఎరువుల కొరతకు ప్రధాన కారణమని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. తప్పని కుస్తీలు మునుపెన్నడూ చూడని ఎరువుల కొరత జిల్లాలో ఖరీ్‌ఫ్ రైతులను వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు పడుతున్న పాట్లు చెప్పనలవికాదు. జిల్లాలో రైతులకు కావలసిన ఎరువులు అందివ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక రైతుకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్న ప్రభుత్వ నిర్వాకంపై రైతులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఖరీఫ్ సీజన్లో కాకినాడ జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లాలో 13,055 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైతులకు అవసరమైన ఎరువులు దొరకడం గగనంగా ఉంది. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఇలా కోటా మాదిరిగా ఇస్తుండడంతో రైతుసేవా కేంద్రాల వద్ద కొట్లాటలకు దిగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘తాంబూలం ఇచ్చాం..తన్నుకు చావండన్న’ చందంగా ఐదారు వందల బస్తాలు అవసరమైన ప్రాంతానికి 100 లేదా 150 బస్తాలు యూరియా తీసుకువచ్చి మమ అనిపిస్తున్నారు. దీంతో రైతులు కుస్తీపోటీలకు వచ్చినట్టు తొక్కిసలాడుకుంటున్నారు. కోటా ప్రకారం ఇచ్చే ఒక్క బస్తా తప్ప అదనంగా రైతు అవసరానికి తగ్గట్టు ఒక్క కేజీ ఎరువు కూడా ఇవ్వలేని ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే బస్తా జిల్లాలో ఏ రైతు సేవాకేంద్రం లేదా, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా, డీఏపీ బస్తాల కోసం గంటల తరబడి క్యూ లో నిరీక్షించి విసుగెత్తిపోయి రైతులు చివరకు ఇళ్లకు తిరిగివెళ్లిపోతున్నారు. జిల్లాలో సుమారు 300 పీఏసీఎస్‌లు ఉన్నా 10 శాతం చోట్ల కూడా ఎరువులు విక్రయించడం లేదు. ఇటీవల పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద కొట్లాటకు దిగిన ఉదంతాలు ఉన్నాయి. వరి సాగు జిల్లాలో దాదాపు 90 శాతం పూర్తి అయ్యిందని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక రైతుకు ఒక బస్తా అనే విధానంలో అరకొరగా ఎరువులు పంపిణీ చేస్తోంది. ఒక ఎకరా సాగుచేసిన రైతుకు, ఐదు ఎకరాలు సాగు చేసిన రైతుకు ఒకే బస్తా చొప్పున ఇస్తున్నారు. ఇలా అయితే ఖరీఫ్ సాగు ఎలా ముందుకు వెళుతుందని రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా ఎరువులు సరఫరా చేయలేకపోవడంతో గత్యంతరం లేక బయట మార్కెట్లో అధిక ధరలకు కొనుక్కోవాల్సివస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 అదనంగా చెల్లించి కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం చూపినవారికే అమ్మాలి ఖరీఫ్‌లో ఎకరాకు బస్తా డీఏపీ (డై అమ్మోనియం ఫాస్పేట్), బస్తా యూరియా (నత్రజని), 15 కిలోలు పొటాష్(మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వంతున రసాయనిక ఎరువులు వినియోగించాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఇవేమీ పట్టించుకోని రైతులు రెండు బస్తాల యూరియా, డీఏపీ రెండు బస్తాలు వినియోగిస్తారు. పీఏసీఎస్‌లలో, రైతు సేవాకేంద్రాలలో ఆధార్‌కార్డు తీసుకొచ్చిన వారికి ఎరువులు విక్రయించడంతో అసలైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కూటమి నేతలు దొడ్డిదారిన రైతులు కానివారిని ఆధార్‌కార్డుతో పంపించి యూరియా బస్తా కొనుగోలు చేసి బయట బస్తాకు రూ.50 నుంచి రూ.100 ఎక్కువకు అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధార్‌కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదార్ పాస్ పుస్తకం చూసి ఎరువులు విక్రయించాలని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు. యూరియాకు పొటాష్‌తో లింకు యూరియా బస్తా కావాలంటే పొటాష్ తప్పనిసరిగా రూ.1,700 పెట్టి కొనుగోలు చేయవలసిన పరిస్థితి. 10 ఎకరాల భూమిని సాగు చేస్తున్నా. ఈ పది ఎకరాలకు సుమారు ఐదు బస్తాలు యూరియా కావలసి వచ్చింది. యూరియా కావాలంటే పొటాష్ కొనుగోలు చేయాలని ప్రాథమిక సహకార సంఘంలోనే నిబంధన పెట్టడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండిన ధాన్యం అమ్ముకోవడంలోనే కాకుండా ఖరీఫ్ సీజన్లో పంట పండించుకోవడానికి ఎరువుల కోసం కూడా రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. – మోరంపూడి రమేష్, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం. పది ఎకరాలు సాగు చేస్తున్నా.. నేను పది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఒకసారి కూడా పొలానికి పిండి వేయలేదు. గత పదిరోజులుగా పిండి కోసం తిరుగుతున్నాను. ఈ రోజు రైతు భరోసా కేంద్రానికి యూరియా వచ్చింది. ఒక్క బస్తా ఇస్తానంటున్నారు. నాకు 10 బస్తాలు యూరియా కావాలి. ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్లు ఫీలవుతోంది. రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉంది. – వీరచక్రవాసు, రైతు, సామర్లకోట మండలం చాలా ఇబ్బంది పడుతున్నాం గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎరువులు కావాల్సినా ఇచ్చేవారు. ప్రస్తుతం ఎరువుల కోసం రోజుల తరబడి ఇక్కడే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. పదిరోజులుగా యూరియా కోసం వేసిచూస్తే ఒక్క బస్తా మాత్రమే ఇస్తామంటున్నారు. నేను ఐదు ఎకరాలు వరి సాగు చేస్తున్నాను. ఒక బస్తా పట్టుకొని ఏ పొలంలో చల్లాలో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల బాధలు తెలియడం లేదు. – తుమ్మల చిట్టిబాబు, రైతు, చంద్రపాలెం, సామర్లకోట మండలం ఏమీ పట్టని కూటమి నేతలు ఎరువుల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు జిల్లాలో పాలక పక్ష నేతలకు బొత్తిగా పట్టడంలేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే ఎంత ఆయకట్టులో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎంత ఎరువు అవసరం అవుతుందో గుర్తించే బాధ్యత జిల్లా వ్యవసాయ అధికారులదే. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం జిల్లాకు కేటాయింపులు చేసి గోదాంలలో ఎరువులు నిల్వ చేయాల్సి ఉంది. ఇదివరకు ఎప్పుడూ వ్యవసాయశాఖ యంత్రాంగం ప్రణాళికా వైఫల్యం చూడలేదంటున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయించకూడదని, ఎరువుల అమ్మకాలకు గుళికలు, ఇతర మందులను లింక్ పెట్టవద్దనే ఆదేశాలు గాలిలో కలిసిపోయి రైతులను కష్టాల్లోకి నెట్టేశారు. హోల్‌సేల్ డీలర్లు లింక్‌పెట్టి ఇస్తుంటే రిటైల్ అమ్మకాల్లో రైతులకు లింక్‌పెట్టి అమ్ముకోకపోతే తాము వాటిని ఎలాభరిస్తామని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వమే కంపెనీలరె పర్యవేక్షిస్తూ లింక్ పెట్టకుండా ఎరువులు సరఫరా చేయాలన్న నిబంధన అమలుచేస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయాలు జరుపుతామని డీలర్లు అంటున్నారు. కంపెనీవాళ్లే ఎరువులను ఎమ్మార్పీ ధరలకు డీలర్లకు ఇచ్చి, ధవళేశ్వరం నుంచి తెచ్చుకోమంటున్నారని చెబుతున్నారు. ధవళేశ్వరం నుంచి బస్తాకు రూ.35 రవాణా వ్యయమై ఎమ్మార్పీకి మించి బస్తాకు రూ.30 నుంచి రూ.40 ఎక్కువకు అమ్మకపోతే నష్టపోతామని డీలర్లు పేర్కొంటున్నారు. కంపెనీలపై ప్రభుత్వం పర్యవేక్షణ పక్కాగా ఉంటే బ్లాక్‌ను అరికట్టవచ్చు. ఇదివరకు కాకినాడలో ఎన్ఎఫ్సీఎల్ ఉన్నప్పుడు ఎరువుల కొరత అనేది ఉత్పన్నమయ్యేదే కాదంటున్నారు. -
క్రీడాకాశంలో తూరుపు మెరుపులు
కపిలేశ్వరపురం: ఆటలు మానసిక, శారీరక ఉల్లాసాన్నే కాకుండా దేశ కీర్తి ప్రపంచ వ్యాప్తం చేస్తాయి. సాధించిన ప్రగతి పది కాలాల పాటు దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది. క్షేత్ర స్థాయిలో పాఠశాల స్థాయి నుంచే ప్రభుత్వాలు క్రీడలకు సరైన సదుపాయాలు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జాతీయ క్రీడా దినోత్సవం నేపథ్యమిదీ... ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జన్మదినం ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను శ్రీమేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారంశ్రీగా నేటి మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదిలో అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఆ పురస్కారాన్ని అందుకోవడం ఉమ్మడి ‘తూర్పు’ జిల్లాకు గర్వకారణం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రీడలకు మహర్దశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023–28 క్రీడా పాలసీ ద్వారా ఆడుదాం ఆంధ్రా క్రీడల సంబరాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల సచివాలయాల పరిధిలో మూడు లక్షల మ్యాచ్‌లను నిర్వహించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనంతగా విజేతలకు నగదు బహుమతులను అందజేసింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 9 క్రీడా అంశాలపై పోటీలు నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో ప్రగతి ఇదీ.. ● ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ జట్టు ప్రతిభ కనబరచగా, 15 మంది జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారే. ● ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్తాన్ అల్వార్‌లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్‌లో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. ● అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన గిరిజన క్రీడాకారిణి కుంజా రజిత మేలో ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పరుగు పోటీలో స్వర్ణం సాధించింది. ● ఈ ఏడాది జనవరి 6 నుంచి 9 వరకూ సింగపూర్‌లో నిర్వహించిన ఏషియన్ యోగా పోటీల్లో దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన ఇమ్మణి అర్మిత భవానీ చౌదరి ప్రతిభ కనబర్చింది. ● ఈ ఏడాది జూలైలో అమలాపురం మండలం సవరప్పాలేనికి చెందిన సత్తి అక్షయ కర్ణాటక ఒపెన్ చెస్ చాంపియన్‌షిప్ గెలుచుకుని జాతీయ స్థాయికి ఎంపికై ంది. ● ఈ నెల 1 నుంచి 12 రోజుల పాటు కాకినాడ డీఎస్ఏ మైదానంలో 15వ జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్‌షిప్–2025 నిర్వహించారు. 2026–27 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు 30 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేశారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ● ఈ ఏడాది జనవరి 14 నుంచి 17 వరకూ రామచంద్రపురంలో నిర్వహించిన 14వ ఆలిండియా బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించారు. ● 2024 డిసెంబర్ 28న వైజాగ్ ఆర్కే బీచ్‌లో ప్రారంభమై సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ స్విమ్మర్ గోలి శ్యామల 2025 జనవరి 3 కాకినాడ బీచ్‌కు చేరుకుని అరుదైన రికార్డును సాధించారు. ● ఈ ఏడాది జూలైలో రాజోలుకు చెందిన బండారు అయ్యప్ప, గుడాల దుర్గా శ్రీనివాస్ సురేష్‌కుమార్‌లు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ఎంపికయ్యారు. ● ఈ ఏడాది మార్చి 23న చైన్నెలో కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ పెన్మత్స వెంకట సత్యనారాయణరాజు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ● అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన కొండా శివేంద్ర, పితాని రాఘవేంద్ర, సాధనాల శ్రీసంతోష్ చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్ సాధించారు. ● ఈ ఏడాది జనవరి 7 నుంచి 9 వరకూ మండల స్థాయిలోనూ 22 నుంచి 24 వరకూ అమలాపురంలో జిల్లా స్థాయిలోనూ కోనసీమ క్రీడోత్సవం పేరిట విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో శివరాత్రి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించింది. న్యాయ నిర్ణేతలుగా.. ఈ ఏడాది జూలైలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ కమిషన్ సభ్యులుగా రాజమహేంద్రవారానికి చెందిన జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి యండమూరి లలితాదేవి ఎన్నికయ్యారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 9–13 మధ్య ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలకు న్యాయ నిర్ణేతగా కాకినాడ జిల్లాకు చెందిన నాగం సతీష్ నియమితులయ్యారు. ● ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వరకూ నిర్వహించిన నేషనల్ గేమ్స్‌లో బాల్ బ్యాడ్మింటన్ అంపైర్లుగా అమలాపురం మండలానికి చెందిన అడపా శ్రీనివాస్, గొల్లకోటి శ్రీనివాస్ నియమితులయ్యారు. దిగ్భ్రాంతి కలిగించిన ప్రముఖుల మృతి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న మృతి చెందారు. సాత్విక్ ఫిబ్రవరి 21న దిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకునే కార్యక్రమానికి బయలుదేరిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మే 1న దిల్లీలో కేంద్ర మంత్రి మాండవీయ చేతులు మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోగా ఆ ఘట్టాన్ని తల్లి రంగనాయకి స్వయంగా వీక్షించారు. అమలాపురానికి చెందిన వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు బిళ్ళ వీర్రాజు (74) అనారోగ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న మృతి చెందారు. ఆటల్లో మేటిగా గోదావరి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఉమ్మడి జిల్లా అదే స్థాయిలో పతకాల కై వసం నేడు జాతీయ క్రీడా దినోత్సవంకూటమి పాలనలో తూతూ మంత్రంగా .. సుమారు ఏడాదిన్నర కూటమి పాలనలో క్రీడలను విస్మరించారు. క్షేత్ర స్థాయిలో మైదానాలను మెరుగుపరచలేదు. 2024 నవంబర్ 20న నూతన క్రీడా విధానం– 2024ను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అథ్లెట్లు సాధన చేసేందుకు సింథటిక్ ట్రాక్, కోచ్ సదుపాయాలు లేకపోవడం ప్రోత్సాహలేమికి ఉదాహరణ. -
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫీజులు, పుస్తకాల పేరుతో ఇప్పటికే రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నాయి. వీటిని అడ్డుకునేవారు లేకుండా చేయడం కోసం అడ్డగోలు జీఓలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై స్పందించేవారు లేకపోతే అధికారులు, ప్రభుత్వం ఎలా చేసినా అడిగేవారు లేకుండా పోతారు. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంక్షలు ఎత్తేయాలి విద్యారంగంలోని సమస్యలపై ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి హక్కులను కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేయడం దుర్మార్గం. విద్యను వ్యాపారం చేస్తున్న కళాశాలలపై గళం విప్పితే ఆంక్షలు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. తక్షణం విద్యార్థి సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి. – బి.సిద్దూ, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థి సంఘాలపై ఆంక్షలు దుర్మార్గం కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇచ్చిన హామీల అమలుకు విద్యార్థి సంఘాలు నిలదీశాయి. ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో వసతులపై గళం విప్పాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఆంక్షల పేరుతో విద్యాసంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం. – పి.రవితేజ, నిరుద్యోగ జేఎసీ కన్వీనర్ ●