తొలి తిరుపతి భక్తజన జలధి
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసి ద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రా మంలో వెలసిన శృంగారవల్లభ స్వామి ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం కిటకిటలాడింది. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,86,540, అన్నదాన విరాళాలు రూ.1,23,817, కేశఖండన ద్వారా రూ.4,640, తులాభారం ద్వారా రూ.800, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.23,595 కలిపి దేవస్థానానికి రూ.4,39,392 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు వివరించారు. సుమారు 14 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు.


