ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ

Feb 10 2026 7:52 AM | Updated on Feb 10 2026 7:52 AM

ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్

ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్

రామచంద్రపురం: సోదర వియోగంతో బాధ పడుతున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులును మాజీ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) వెంకటాయపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి సోమవారం పరామర్శించారు. త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణ చిత్రపటానికి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ త్రిమూర్తులును ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంటన సతీష్‌ కుమార్‌, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాదరావు, పాముల రాజేశ్వరి, సింహాద్రి రమేష్‌, వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌, ముద్రగడ గిరిబాబు, రామచంద్రపురం కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌, రామచంద్రపురం, మండపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గాధంశెట్టి శ్రీదేవి, పతివాడ నూక దుర్గారాణి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్‌, అత్తిలి సీతారామస్వామి, పెదపూడి ఎంపీపీ కేతా తులసీ శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటరెడ్డి, పెదపూడి మండలానికి చెందిన 14 మంది సర్పంచ్‌లు రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, వెంకటాయపాలెం సర్పంచ్‌ యర్రమల్లి సతీష్‌కుమారి, వైఎస్సార్‌ సీపీ నేత పెంటపాటి శ్రీను, అంబటి తుకారాం, ముద్రగడ క్రాంతి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌ సీపీ నేతలు త్రిమూర్తులును పరామర్శించిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement