నెలాఖరులోగా ఇంటి పన్నుల వసూలు
కాకినాడ రూరల్: గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులను ఫిబ్రవరి నెలాఖరులోగా నూరు శాతం వసూలు చేయాలని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ నాగార్జున సాగర్ కోరారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి డీఎల్‌డీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాల కార్యదర్శులతో పీఆర్ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పన్నుల వసూలు, స్వమిత్ర, నాన్ ట్యాక్స్‌లు వసూలు గురించి సమీక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, కాకినాడ, పెద్దాపురం డీఎల్‌డీఓలు వాసుదేవరావు, శ్యామల, కాకినాడ, పెద్దాపురం డీఎల్‌పీఓలు అన్నామణి, ఎం.బాలమణి పాల్గొన్నారు.


