సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 16 2026 7:24 AM | Updated on Feb 16 2026 7:24 AM

సోమవా

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఇళ్ల స్థలాలకు కేటాయింపులేవీ?

పేదలకు ఇళ్ల స్థలాలిస్తామని చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ఇచ్చిన హామీ ఎక్కడా అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీనికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సక్రమంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామంటూ ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చి, నమ్మించి మోసం చేశారు. రెండేళ్లవుతున్నా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. బ్యాంకు అప్పులు చెల్లించవద్దని గతంలో చంద్రబాబు చెప్పారు. దీనిపై నిర్ణయం తీసుకోపోవడంతో లబ్ధిదారులపై బ్యాంకు అధికారుల ఒత్తిడి పెరిగిపోతోంది.

– ఆవాల రాజేశ్వరి, రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, సామర్లకోట

కొత్త పెన్షన్లు లేక ఇబ్బందులు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఒక్క కొత్త పెన్షన్‌ కూడా మంజూరు చేయలేదు. దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించకపోవడం దారుణం. కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో నిరుపేదలైన దివ్యాంగులు, వితంతవులు, వృద్ధులు అనేక మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. దీనికి సిగ్గుపడాలి. ఇప్పటికై నా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. లేకపోతే పోరాటం తప్పదు.

– దాడిశెట్టి వీరబాబు, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలేశ్వరం

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement