● ఫుట్‌పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కానీ ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కూర్చోవడానికి సీటు కోసం చూసే స్థాయి నుంచి నిలబడే స్థలం దొరికితే చాలనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫుట్‌పాత్‌పై నిలబడితే ప్రమాదమని చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం కనిపించిన ఈ చిత్రం దానికి నిదర్శనంగా నిలుస్తోంది.
– ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్,
రాజమహేంద్రవరం


