తొలి తిరుపతిలో పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

తొలి తిరుపతిలో పోటెత్తిన భక్తులు

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

తొలి

తొలి తిరుపతిలో పోటెత్తిన భక్తులు

స్వామివారి దర్శనానికి

40 వేల మంది భక్తులు

రూ.4.26 లక్షల ఆదాయం

పెద్దాపురం (సామర్లకోట): మండల పరిధిలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగారవల్లభ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు ఽశనివారం, మాఘమాసం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మాఘమాసం మూడవ శనివారం పురస్కరించుకొని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో శోభయామనంగా తీర్చిదిద్దారు. గొంచాల, అచ్చంపేట గ్రామం నుంచి భద్రాద్రి రామాలయం నుంచి సీతారాముల ఉత్సవమూర్తుల విగ్రహాలతో రథయాత్రగా వెయ్యి మంది తరలి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిట లాడింది. సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.80,720 అన్నదాన విరాళాలకు రూ.1,13,968, కేశ ఖండన ద్వారా రూ.6,600, తులాభారం ద్వారా రూ.350, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.24,705లతో కలిపి రూ.4.,26,343 ఆదాయం వచ్చిందని చెప్పారు. 15వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు.

తొలి తిరుపతిలో పోటెత్తిన భక్తులు1
1/1

తొలి తిరుపతిలో పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement