ఫొటోషూట్‌కు ఎంతో అనుకూలం
చింతూరు, మారేడుమిల్లిలోని మన్యం ప్రాంతాలు ఫొటోషూట్ల కు ఎంతో అనుకూలంగా ఉన్నా యి. అటవీ ప్రాంతంలో మంచి లొకేషన్లు ఉండడంతో సినిమా, సీరియల్ దర్శకులు ఇక్కడ షూటింగ్‌లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో ఇప్పటివరకూ ఇక్కడ తొమ్మిది నేషనల్ లెవల్ ఫొటో వర్క్‌షాప్‌లు నిర్వహించాం.–నాగరాజు దేవర,
ఖమ్మం ఫొటోఆర్ట్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు
రిసార్టులకు గిరాకీ పెరిగింది
సినిమా, సీరియల్స్ షూటింగులతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. పొల్లూరు సమీపంలోని వాటర్‌ఫాల్స్‌తో పాటు పుష్ప సినిమా చిత్రీకరించిన ఫోర్‌బై రిజర్వాయర్, దాని సమీపంలో పవర్ కెనాల్ అక్విడెక్ట్ (వంతెన) ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఈ ప్రాంతాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
–పంచాడ నాని, రిసార్టు నిర్వాహకుడు, పొల్లూరు
ఫొటోషూట్‌కు ఎంతో అనుకూలం


