జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Feb 15 2026 9:37 AM | Updated on Feb 15 2026 9:37 AM

జాతీయ

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

రాయవరం: జాతీయ స్థాయిలో నిర్వహించే వాలీబాల్‌ జట్టుకు రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పోలిశెట్టి భార్గవ్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల హెచ్‌ఎం వీఎస్‌ సునీత తెలిపారు. ఈ నెల 13న అనకాపల్లిలో వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా బాలురు, బాలికల 46వ సబ్‌ జూనియర్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు. ఇందులో బాలుర జట్టుకు ఎంపికై న భార్గవ్‌ ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకూ పశ్చిమ బెంగాల్‌లోని హుబ్లీలో జరిగే జాతీయ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గోనున్నట్లు ఆమె తెలిపారు. భార్గవ్‌ను, తర్ఫీదునిచ్చిన ఫిజికల్‌ డైరెక్టర్లు సీహెచ్‌ అజ్జిబాబు, కె.శ్రీనివాసులును పలువురు అభినందించారు.

దేవరపల్లి: అనకాపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెలక్షన్స్‌లో దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు బి.బాలు మహీధర్‌, ఎం.వెన్నెల ప్రతిభ చాటారని హెచ్‌ఎం ఎం.వీర్రాజు తెలిపారు. వీరు పశ్చిమ బెంగాల్‌లో జరుగనున్న జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారు.

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక 
1
1/2

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక 
2
2/2

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement